హాలీవుడ్ సినిమాలో శ్రీదేవి..!
అందాల తార శ్రీదేవి ఆస్కార్ అవార్డు విజేత మెరిల్ స్ట్రీప్తో కలసి ఓ హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశముంది. ఈ చిత్రం పేరు 'కౌబాయ్స్ అండ్ ఇండియన్స్'. ఈ సినిమాలో నటించే విషయంలో సంప్రదింపులు జరుగుతున్నట్టు స్వయంగా శ్రీదేవి వెల్లడించారు. కాగా నిర్ణయం తీసుకోలేదు.
బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన శ్రీదేవి సుదీర్ఘ విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఆమె నటించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' చిత్రం గతేడాది విడుదలైంది. ఇటీవల అభిషేక్ కపూర్ సినిమా 'ఫితూర్'లో నటించే అవకాశం వచ్చినా తిరస్కరించారు. నెగిటీవ్ రోల్ కావడమే దీనికి కారణం.