
కేరళకు చెందిన పూర్ణకు టాలీవుడ్‌లో భారీగానే ఫ్యాన్స్ ఉన్నారు.

2016లో తొలి సినిమా 'జయమ్ము నిశ్చయమ్మురా'లో ఆమె బ్యూటీకి ఫిదా అయ్యారు.

దశాబ్ద కాలం పాటు తెలుగు ప్రేక్షకులను మెప్పించిన పూర్ణ తన పెళ్లి తర్వాత కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. కథ నచ్చితే మాత్రం కాదనకుండా అలరిస్తుంది.

గుంటూరు కారం మూవీలోని కుర్చీ మడతపెట్టి పాటలో ఆమె చాలా బొద్దుగా కనిపించారు. దానికి కారణం.. డెలివరీ తర్వాత ఆమె చాలా బరువు పెరిగిపోవడమే.

సాంగ్ విడుదల తర్వాత సోషల్ మీడియాలో తన ఫోటోలు చూసినవాళ్లు పూర్ణ ఏంటి..? పందిలా తయారైంది.. అని చులకనగా కామెంట్లు చేసేవాళ్లని ఆమె బాధపడ్డారు.

గుంటూరు కారం సాంగ్ వల్ల వచ్చిన కామెంట్లకు చాలా బాధపడ్డానని పూర్ణ చెప్పారు. ఇలా నోటికి ఏదొస్తే అది వాగేవాళ్లు ఒక తల్లిని తిడుతున్నామని ఎందుకు గ్రహించరో..? అని ఆమె ప్రశ్నించారు.

ఆశ్చర్యమేంటంటే.. తన పర్ఫామెన్స్ మెచ్చుకున్నవాళ్లే ఎక్కువ అయ్యారని, తన కెరీర్‌లోనే బెస్ట్ సాంగ్‌గా నిలిచిపోయింది అన్నారు.

సరిగ్గా సంవత్సరం తర్వాత ఇప్పుడు తాజాగా ఆమె పంచుకున్న ఫోటోలు చాలా గ్లామర్‌గా ఉన్నాయి.

గుంటూరు కారం సాంగ్ ఫోటోలతో ఇప్పటి ఫోటోలను మ్యాచ్ చేస్తూ పూర్ణపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

