
ఖమ్మం, సాక్షి: సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు. హుటాహుటినా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. గుండె పోటుతో అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
కూసుమంచి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ అనే యువకుడు టోర్నమెంట్‌లో భాగంగా ఆడుతున్నాడు. ఉన్నపళంగా అతను ఒక్కసారిగా గ్రౌండ్‌లో కింద పడిపోవడంతో.. నిర్వాహకులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతని ప్రాణం పోయింది. పరీక్షించిన వైద్యులు గుండెపోటు కారణంగానే చనిపోయాడని నిర్ధారించారు. దీంతో.. స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు విజయ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments
Please login to add a commentAdd a comment