సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయానికి వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటితో వైకుంఠ ద్వారా దర్శనం ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు సర్వదర్శనానికి టోకెన్ల కేటాయింపు రద్దు చేశారు. మరోవైపు.. స్వామి వారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.
తిరుమలలో నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 61,142 మంది ఉంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. రూ.300 టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,736 మంది కాగా.. స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లు. మరోవైపు.. టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. రేపటి వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఉంది. ఆదివారంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సర్వదర్శనానికి టోకెన్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. అలాగే, 20వ తేదీన సర్వ దర్శనంలో మాత్రమే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చింది. ఇక, 20 తేదీన వీఐపీ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది.
ఇక, శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఏప్రిల్ నెల కోటా విడుదల చేయనుంది టీటీడీ. నేడు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ ఆన్‌లైన్ లక్కీ డిప్ కోటా విడుదల చేయనున్నారు. సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం జనవరి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. జనవరి 21న ఆర్జిత సేవా టికెట్ల, వర్చువల్ సేవల కోటా విడుదల. జనవరి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు. జనవరి 23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల, 23 మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల. జనవరి 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల. తిరుమల, తిరుపతిలలో ఏప్రిల్ నెల గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి
Comments
Please login to add a commentAdd a comment