Devotee
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి ఆరు కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు. ఇక, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి ఎనిమిది గంటల సమయంలో పడుతోంది. అలాగే, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఆరు కంపార్టుమెంటుల్లో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 80,871గా ఉంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్లు కాగా, నిన్న తల నీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,257గా ఉంది. -
తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠద్వార దర్శనాలు
సాక్షి, తిరుమల: తిరుమలలో శనివారం (జనవరి 18) 9వ రోజు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. గత ఎనిమిది రోజులలో తిరుమలేశుని వైకుంఠ ద్వారం ద్వారా మొత్తం 5లక్షల 36 వేల 277 మంది దర్శించుకున్నారు. ఇలా ఉండగా ఆదివారం(జనవరి 19)తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది. శనివారం అర్ధరాత్రి వరకు 75,931 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 25,717 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.40 కోట్లు సమర్పించారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. నేడు విఐపీ దర్శనాలు రద్దు -
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. భక్తుల రద్దీ ఇలా..
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయానికి వైకుంఠ ద్వారా దర్శనాలు కొనసాగుతున్నాయి. రేపటితో వైకుంఠ ద్వారా దర్శనం ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు సర్వదర్శనానికి టోకెన్ల కేటాయింపు రద్దు చేశారు. మరోవైపు.. స్వామి వారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతానికి భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది.తిరుమలలో నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 61,142 మంది ఉంది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. రూ.300 టికెట్ ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 19,736 మంది కాగా.. స్వామివారి హుండీ ఆదాయం 3.51 కోట్లు. మరోవైపు.. టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతిస్తోంది టీటీడీ. రేపటి వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతి ఉంది. ఆదివారంలో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో రేపు సర్వదర్శనానికి టోకెన్ల కేటాయింపును టీటీడీ రద్దు చేసింది. అలాగే, 20వ తేదీన సర్వ దర్శనంలో మాత్రమే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతి ఇచ్చింది. ఇక, 20 తేదీన వీఐపీ దర్శనాలను రద్దు చేసినట్టు టీటీడీ తెలిపింది.ఇక, శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఏప్రిల్ నెల కోటా విడుదల చేయనుంది టీటీడీ. నేడు ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ ఆన్లైన్ లక్కీ డిప్ కోటా విడుదల చేయనున్నారు. సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం జనవరి 18 నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. జనవరి 21న ఆర్జిత సేవా టికెట్ల, వర్చువల్ సేవల కోటా విడుదల. జనవరి 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు. జనవరి 23 ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల, 23 మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల. జనవరి 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల. తిరుమల, తిరుపతిలలో ఏప్రిల్ నెల గదుల కోటాను జనవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి -
ప్రచారం పీక్స్.. తొక్కిసలాట ఎలా జరిగిందో చెప్పిన ప్రత్యక్ష సాక్షి
-
నా చావు కళ్ళ ముందే కనిపించింది.. ఆ దేవుడే కాపాడాడు
-
అయ్యయ్యో! నా ఐఫోన్ మురుగా..
సేలం(తమిళనాడు): ఆలయ హుండీలో పొరపాటుగా ఏది పడినా అది దేవుడికే సొంతమని పలు సినిమాల్లో సన్నివేశాలు మనం చూసి ఉంటాం. అలాంటి సంఘటనే ఒకటి తమిళనాడులోని తిరుపూర్‌లో చోటుచేసుకుంది. తిరుపోరూర్లోని మురుగన్ ఆలయానికి గత రెండు నెలల క్రితం చెన్నై అంబత్తూరుకు చెందిన దినేష్ దర్శనానికి వెళ్లాడు. ఆ సమయంలో దినేష్ హుండీలో కానుకలు వేస్తున్న సమయంలో పొరపాటుగా ఆయన చేతిలో ఉన్న ఐఫోన్ కూడా హుండీలో పడిపోయింది. ఈ విషయంగా ఆయన హిందూ దేవదాయ శాఖకు ఫిర్యా దు చేయగా, హుండీ లెక్కింపు సమయంలో తె లుపుతామని నిర్వాహకులు చెప్పి పంపించారు. ఈ స్థితిలో గురువారం ఆలయ హుండీని తెరి చారు. iPhone accidentally fell into the temple's hundi..The temple administration refused to return it the owner, saying it belonged to the temple.pic.twitter.com/4VgfcRk0Ib— Vije (@vijeshetty) December 20, 2024ఈ సందర్భంగా దినేష్‌కు సమాచారం ఇవ్వడం తన ఫోన్ తీసుకోవచ్చని ఎంతో ఆశగా ఆలయానికి వెళ్లాడు. హుండీ తెరిచిన ఆలయ నిర్వాహకులు దినేష్‌కు ఐఫోన్ చెందదని, హుండీలో ఏది పడినా మురుగనార్పణమేనని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందాడు. తర్వాత చేసేది లేక తన ఐఫోన్లో సిమ్‌కార్డును తీసుకుని, స్వామిని దర్శించుకుని నిరాశతో వెళ్లిపోయాడు. Year Ender 2024: ముఖ్యాంశాల్లో మహిళా నేతలు -
కృష్ణభక్తురాలిగా ఐపీఎస్ అధికారిణి .. పదేళ్ల సర్వీస్ ఉండగానే..
మనం పురాణాల్లో భక్త కబీర్, రామదాసులాంటి వాళ్లు భక్తులుగా ఎలా మారారో కథల్లో చదివాం. వారి భక్తి పారవశ్యంతో దైవానుగ్రహాన్ని ఎలా పొందారో కథలు కథలుగా చదివాం. అయితే అలాంటి సఘటనే రియల్‌గా చోటు చేసుకుంది. అచ్చం ఆ భక్తాగ్రేసుల మాదిరిగా మారిపోయి సాధు జీవితాన్ని గడిపోతుంది. అంతటి అత్యున్నత సివిల్ సర్వీస్‌లో ఉన్న ఆమె అన్నింటిని పరిత్యజించి ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేసింది. ఆమె చెబితే గానీ తెలియనంతగా ఆహార్యం, జీవన విధానం మారిపోయింది. ఇంతకీ ఎవరామె..? ఆధ్యాత్మికత వైపుకి ఎలా ఆకర్షితురాలైంది అంటే..ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షలో విజయం సాధించడమంటే మామాలు మాటలు కాదు. మంచి ర్యాంకుతో ఐఏఏస్ లేదా ఐపీఎస్లాంటివి దక్కితే ఆ రేంజ్, హోదానే వేరెలెవెల్. ఎంతటి వారైనా వారి ముందు నిల్చొక తప్పదు. అంతటి ఐపీఎస్ అత్యున్నత పదవిని అలంకరించింది భారతి అరోరా. 1998 బ్యాచ్‌కి చెందిన ఈ మాజీ అధికారిణి హర్యానాలోని పలు జిల్లాల్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సేవలందించింది. అలాగే కర్నాల్‌లో ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా పనిచేశారు. ఆమె కెరీర్ మొత్తం బాబు పేలుళ్లకు సంబంధించిన కేసులను చాకచక్యంగా చేధించింది. అంతేగాదు ఎస్పీగా ముక్కుసూటి వైఖరితో.. ప్రముఖ రాజకీయ నాయకుడుని అరెస్టు చేసి వార్తల్లో నిలిచారు. సాహసోపేతమైన నిర్ణయాలతో నాయకులకే చెమటలు పట్టించిన చరిత్ర ఆమెది. నేరాలను అదుపు చేసేందుకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవడానికైనా.. వెనుకడుగు వేయని ధీర వనిత భారతి అరోరా. అలాంటి ఆమె అనూహ్యంగా ఆధ్యాత్మికత వైపుకి ఆకర్షితురాలైంది. భక్తురాలిగా మార్పు ఎలా అంటే..2004లో బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్లారు భారతి. అక్కడే ఆమెకు కృష్ణ భక్తిపై అమితమైన మోహం ఏర్పడింది. అలా ఆ పరంధామునిపై అమితమైన భక్తిని పెంచుకుంది. అదే ఏ స్థాయికి చేరుకుందంటే..సర్వం పరిత్యజించి కృష్ణునికి అంకితమైపోవాలన్న భక్తిపారవశ్యానికి లోనైంది. ఆ నేపథ్యంలోనే ఇంకా పదేళ్ల సివిల్ సర్వీస్ ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసి కృష్ణ భక్తురాలిగా మారిపోయింది. చెప్పాలంటే అచ్చం మీరాభాయిలా కృష్ణుడుని ఆరాధిస్తూ..సాధువులా జీవితం గడుపుతోంది మాజీ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా. (చదవండి: 75 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా నటుడు నానా పటేకర్...ఇప్పటికీ ఆ అలవాటు..!) -
ఉపమన్యుడి వృత్తాంతం
ఉపమన్యుడి పసితనంలోనే అతడి తండ్రి వ్యాఘ్రపాదుడు కన్నుమూశాడు. వ్యాఘ్రపాదుడి అకాల మరణంతో అతడి భార్య కొడుకు ఉపమన్యుడితో పాటు పుట్టింటికి చేరుకుంది. మేనమామల ఇంట ఉపమన్యుడికి ఆదరణ కరవైంది. మేనమామల పిల్లలు రుచికరమైన పదార్థాలు భుజిస్తుండేవారు. పుష్కలంగా పాలు తాగుతుండేవారు. ఉపమన్యుడికి ఆకలి వేసినప్పుడు తగినన్ని పాలు కూడా దొరికేవి కాదు. ఉపమన్యుడు మేనల్లుడే అయినా, అతడి తల్లి తమ తోబుట్టువే అయినా, వారు అనాథలు కావడంతో మేనమామలు వారిని తగిన విధంగా ఆదరించేవారు కాదు.ఒకనాడు ఉపమన్యుడు పాలకోసం తల్లి వద్ద మారాం చేశాడు. కొడుకు అవస్థకు కన్నీళ్లు పెట్టుకున్న ఆ తల్లి తన కన్నీళ్లలోనే కాసింత పేలపిండిని కలిపి, అవే పాలు అని ఇచ్చింది. ఒక్క గుక్క తాగగానే అవి పాలు కాదని గ్రహించిన ఉపమన్యుడు, వాటిని తోసిపుచ్చాడు. పట్టరాని దుఃఖంతో, ఉక్రోషంతో ఏడుపు లంకించుకున్నాడు.నిస్సహాయురాలైన ఆ తల్లి అతడిని రకరకాలుగా లాలించింది. తన పరిస్థితిని వివరించింది. దుఃఖం నుంచి తేరుకున్న ఉపమన్యుడు తల్లి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ‘అమ్మా! నన్ను దీవించి పంపించు. శివుడి కోసం తపస్సు చేసి, పాల సముద్రాన్నే తెచ్చుకుంటాను’ అని ఆవేశంగా పలికాడు. సరేనన్న ఆ తల్లి అతడికి శివ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించింది. ‘నాయనా! మన శైవులకు పంచాక్షరి మంత్రమే మహాయుధం. దీనినే అఘోరాస్త్రం అంటారు. ఎంత ఘోరమైన ఆపదనైనా తప్పిస్తుంది’ అని చెప్పి, తన భర్త నుంచి సంక్రమించిన విరజా భస్మాన్ని కొడుకు చేతికిచ్చింది. తపస్సు చేసుకోవడానికి అనుమతిస్తూ, శీఘ్రసిద్ధి కలగాలంటూ ఆశీర్వదించి సాగనంపింది.తల్లి అనుమతితో ఇల్లు విడిచిన ఉపమన్యుడు అడవుల బాట పట్టాడు. కాలినడకన కొన్నాళ్లకు ఒక దట్టమైన కీకారణ్యానికి చేరుకున్నాడు. ఒక చెట్టు కింద కూర్చుని, పంచాక్షరి జపం మొదలుపెట్టాడు. జపం క్రమంగా ధ్యానంగా మారింది. ధ్యానం తపస్సుగా మారింది. అడవిలో ఉన్న రాకాసి మూక అతడిని భయపెట్టి, తపస్సుకు భంగం కలిగించడానికి ప్రయత్నించింది. ఉపమన్యుడు చలించలేదు. అతడిని జయించలేక రాకాసులందరూ అతడికి కింకరులుగా మారిపోయారు.ఉపమన్యుడి తపస్సు ఊపందుకుంది. నానాటికీ తపస్సులో ఉగ్రత పెరగసాగింది. అతడి తపస్సు వేడిమి స్వర్గం వరకు ఎగబాకింది. దేవతల అరికాళ్లు చుర్రుమన్నాయి. ఈ పరిణామానికి హడలెత్తిన దేవతలు విష్ణువును వెంటబెట్టుకుని, పరమశివుడి వద్దకు చేరుకున్నారు. ‘పరమేశ్వరా పాహిమాం! పాహిమాం! ఆ బాలుడు నీ కోసమే తపస్సు చేస్తున్నాడు. వెంటనే వెళ్లి అతడికి ప్రత్యక్షమై, కోరిన వరాలను అనుగ్రహించు. అతడి తపస్సును విరమింపజేయి. నువ్వు జాప్యం చేస్తే, అతడి తపస్సు పుట్టించే తాపానికి మేమంతా తప్తమైపోకుండా కాపాడు’ అని మొరపెట్టుకున్నారు.‘సరే’నని దేవతలకు మాట ఇచ్చాడు శివుడు.అయితే, ఉపమన్యుడిని పరీక్షించదలచాడు. ఇంద్రుని రూపంలో అతడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.‘కుమారా! ఏం వరం కావాలో కోరుకో, తప్పక ఇస్తాను’ అన్నాడు.‘నేను శివుడి కోసం తపస్సు చేస్తుంటే, నువ్వొచ్చావేమిటి దేవేంద్రా? నీ వరాలేవీ నాకు అక్కర్లేదు. సాక్షాత్తు పరమశివుడే నా ముందు ప్రత్యక్షం కావాలి. అతడే నా మనోరథాన్ని ఈడేర్చాలి. ప్రయాసపడి వచ్చావుగాని, నువ్వు దయచేయవచ్చు’ అన్నాడు ఉపమన్యుడు.ఇంద్రుడి వేషంలో ఉన్న పరమశివుడు ఉపమన్యుడికి తన పట్ల గల అచంచల భక్తికి పరమానందం చెందాడు. నిజరూపంలో పార్వతీ సమేతంగా సాక్షాత్కరించాడు. పార్వతీ పరమేశ్వరులు తన కళ్లెదుట కనబడగానే ఉపమన్యుడు పారవశ్యంతో తబ్బిబ్బయ్యాడు. అతడికి నోట మాట పెగలలేదు. ఉపమన్యుడు నోరు తెరిచి అడగకపోయినా, పరమశివుడు అతడికి పాల సముద్రాన్ని, పెరుగు సముద్రాన్ని ధారాదత్తం చేశాడు. ‘నువ్వు నా బిడ్డవురా!’ అంటూ అతడిని చేరదీసి, ముద్దాడి గణాధిపత్యం కూడా ఇచ్చాడు.‘నాకు మాత్రం బిడ్డ కాడా’ అంటూ పార్వతీదేవి కూడా ఉపమన్యుడిని ఎత్తుకుని ముద్దాడింది. తన ఒడిలో కూర్చోబెట్టుకుని లాలించింది. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఉపమన్యుడికి నిత్య కుమారత్వం సిద్ధించింది.‘పరమేశ్వరా పాహిమాం! పాహిమాం! ఆ బాలుడు నీ కోసమే తపస్సు చేస్తున్నాడు. వెంటనే వెళ్లి అతడికి ప్రత్యక్షమై, కోరిన వరాలను అనుగ్రహించు. అతడి తపస్సును విరమింపజేయి. ∙సాంఖ్యాయన -
అమ్మవారికి నాలుక సమర్పించిన భక్తుడు
భింద్: దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో భక్తులు అమ్మవారికి కానుకలు చెల్లించుకోవడంతో పాటు, తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. అయితే ఒక భక్తుడు అమ్మవారికి తన నాలుకను సమర్పించి, తన భక్తిని చాటుకున్నాడు.మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలో గల రతన్‌గఢ్ దేవి ఆలయానికి వచ్చిన ఒక భక్తుడు తన నాలుకను కోసుకుని, దానిని అమ్మవారి సమర్పించాడు. ఈ విషయం తెలియగానే స్థానికులు ఆలయానికి తండోపతండాలుగా తరలివచ్చారు. రతన్గర్ దేవి ఆలయం భిండ్‌లోని లాహర్ నగర్లో ఉంది. ఈ ఆలయాన్ని 2015లో నిర్మించారు.నవరాత్రుల సందర్భంగా ఆలయానికి వచ్చిన రామ్‌శరణ్ భగత్ తన నాలుకను తెగ్గోసుకుని, అమ్మవారికి సమర్పించాడు. తరువాత ఆ రక్తాన్ని ఆలయం వెలుపల ఉంచిన పాత్రలో పోశాడు. దీనిని చూసిన అక్కడివారంతా తెగ ఆశ్చర్యపోయారు. నాలుకను సమర్పించాక ఆ భక్తుడు ఆలయంలోనే కాసేపు నిద్రించాడు. ఇది కూడా చదవండి: బలి తంతు లేకుండా జరిగే 'పూల తల్లి ఆరాధన'..! ఇక్కడ దసరా.. -
కనకదుర్గమ్మకు వజ్ర కిరీటం సమర్పించిన అజ్ఞాత భక్తుడు (ఫొటోలు)
-
Tirumala: శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్మెంట్లు నిండాయి. కృష్ణతేజ అతిథిగృహం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 78,690 మంది స్వామివారిని దర్శించుకోగా 26,086 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.18 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 9 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు, దర్శనానికి 5 గంటల సమయం. టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలైన్లో అనుమతించారని తెలుపుతున్నారు. -
Kedarnath: మట్టిపెళ్లల్లో కూరుకుపోయి నలుగురు మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ యాత్రా మార్గంలో పెద్ద ప్రమాదం జరిగింది. సోన్‌ప్రయాగ్ -గౌరీకుండ్ మధ్య మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. వీటి కింద పలువురు కూరుకుపోయారు. ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురిని ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షించింది. ఈ ప్రమాదం గురించి తెలియగానే ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. మట్టిపెళ్లల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు. నాలుగు మృతదేహాలను వెలికి తీశారు. పలు విపత్తుల కారణంగా యాత్రకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాగా పరిస్థితులు కాస్త అనుకూలించడంతో యాత్ర మళ్లీ వేగం పుంజుకుంది. అయితే తాజా ఘటన తర్వాత అధికార యంత్రాంగం మరోసారి అప్రమత్తమైంది. స్థానిక పోలీసులు కూడా సంఘటనా స్థలంలో ఉంటూ, సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. -
ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
బీహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మృతిచెందారు. 35మందికిగాపై గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల్ని రక్షించేందుకు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. అయితే ఈ దుర్ఘటన ఆలయంలో భక్తుల్ని అదుపు చేసే ప్రయత్నం కారణంగా జరిగినట్లు తెలుస్తోంది.ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బరావర్ కొండలపై ఉన్న బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం వద్ద ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలకు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తుంటారు. ఎప్పటిలాగే బాబా సిద్ధేశ్వర్ నాథ్ దర్శనార్థం భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు దేవాలయం నిర్వహణ సభ్యులు ఎన్సీసీ క్యాడెట్లకు బాధ్యతలు అప్పగించారు.అయితే పూల విక్రయదారుడితో ఘర్షణ చెలరేగడంతో వాలంటీర్లు లాఠీచార్జి చేశారని ఆలయం వద్ద ఉన్న ఒక భక్తుడు తెలిపారు. ఇది తొక్కిసలాటకు దారితీసిందని, ఆ సమయంలో పోలీసులు ఎవరూ లేరని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని ఆరోపించారు. మరోవైపు జనాన్ని నియంత్రించడానికి ఎన్సీసీ క్యాడెట్లు లాఠీలను ఉపయోగించడాన్ని జెహనాబాద్ సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్‌డిఓ) వికాష్ కుమార్ ఖండించారు. ‘అలాంటిదేమీ జరగలేదు. ఇది దురదృష్టకర సంఘటన. కట్టుదిట్టమైన నిఘా ఉంది. ఎన్సీసీ క్యాడెట్లు,సివిల్ డిప్యూటేషన్లు మెడికల్ టీమ్‌లతో సహా తగిన ఏర్పాట్లు చేయబడ్డాయి. పోస్ట్‌మార్టం తర్వాత మరిన్ని వివరాలను అందిస్తాని చెప్పారు.#WATCH | Bihar: Divakar Kumar Vishwakarma, SHO Jehanabad says, "DM and SP visited the spot and they are taking stock of the situation...A total of seven people have died...We are meeting and inquiring the family members (of the people dead and injured)...We are trying to identify… https://t.co/yw6e4wzRiY pic.twitter.com/lYzaoSzVPH— ANI (@ANI) August 12, 2024ఘటన జరిగిన మఖ్దూంపూర్లోని బాబా సిద్ధనాథ్ ఆలయ ప్రాంతాన్ని జెహనాబాద్ జిల్లా కలెక్టర్ అలంకృత పాండే సందర్శించారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. అలంకృత పాండే పీటీఐతో మాట్లాడుతూ,తొక్కిసలాటకు కన్వారియాల మధ్య జరిగిన వివాదం గొడవకు దారితీసిందని చెప్పారు. -
TTD: తిరుమలలో నేటి భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట బాట గంగమ్మ గుడి వరకు క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 24 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 7 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(గురువారం) 62,756 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అందులో 31,510 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లుగా లెక్క తేలింది.తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం. నేటితో జ్యేష్ఠాభిషేకం ముగింపు. నేడు ఉత్సవమూర్తులకు బంగారం కవచాలు అలంకరణ చెయ్యనున్న అర్చకులు. -
ఒకటిన్నర కేజీల బంగారు కంకణంతో తిరుమలలో కనిపించిన భక్తుడు.. ఫోటోలు వైరల్
-
నేడు ‘జగన్నాథ్’ కారిడార్ ప్రారంభం.. ప్రత్యేకతలివే!
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ సన్నాహాల నడుమ ఒడిశాలో జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. దీనిని శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప్ (ఎస్ఎస్పీ) లేదా జగన్నాథ టెంపుల్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ అని పిలుస్తారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టును బుధవారం (జనవరి 17) ప్రారంభించనున్నారు. కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభం సందర్భంగా ఒడిశాలోని పూరీ ప్రాంతాన్ని వివిధ రకాలపూలు, రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించారు. మకర సంక్రాంతి రోజున ప్రారంభమైన ‘మహాయాగం’ మంగళవారం రెండో రోజు కూడా కొనసాగగా, బుధవారం మధ్యాహ్నం గజపతి మహారాజు దిబ్యాసింగ్ దేబ్ నిర్వహించే ‘పూర్ణాహుతి’తో ముగుస్తుంది. అనంతరం ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయనున్నారు. జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు, జగన్నాథుని దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుని దర్శనం కోసం భక్తులు నేటి ఉదయం నుంచే బారులు తీరారు. హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి 80 ప్లటూన్ల పోలీసు బలగాలను (ఒక ప్లాటూన్‌లో 30 మంది పోలీసులు) మొహరించినట్లు శ్రీ జగన్నాథ ఆలయ హెరిటేజ్ కారిడార్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) తెలిపారు. దాదాపు 100 మంది సూపర్వైజరీ అధికారులు, 250 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారులు కూడా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కింద రూ. 800 కోట్ల వ్యయంతో జగన్నాథ ఆలయంలోని మేఘనాద్ పచేరి (బయటి గోడ) చుట్టూ భారీ కారిడార్లు నిర్మించారు. ఇది 12వ శతాబ్దపు ఆలయాన్ని ఒక క్రమ పద్ధతిలో సందర్శించడానికి భక్తులకు సహాయపడుతుంది. పూరీని ప్రపంచ వారసత్వ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం వేల కోట్ల రూపాలయ వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. పూరీలో శ్రీ జగన్నాథ్ పరిక్రమ ప్రాజెక్ట్ ప్రారంభం రోజున అంటే జనవరి 17న ప్రభుత్వ సెలవు దినంగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. కారిడార్ ప్రాజెక్ట్‌లో పార్కింగ్ స్థలం, శ్రీ సేతు, పుణ్యక్షేత్రం, జగన్నాథ ఆలయ యాత్రికుల రాకపోకలకు కొత్త రహదారి, టాయిలెట్లు, క్లాక్ రూమ్‌లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దేశవ్యాప్తంగా గల 90 ప్రముఖ ఆలయాల ప్రతినిధులను శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలనా విభాగం ఆహ్వానించింది. -
భక్త విజయం - ‘సుషేణుడి తపస్సు’
వానర యోధుల్లో ముఖ్యులైన వారిలో సుషేణుడు ఒకడు. సుషేణుడు వానరరాజు సుగ్రీవుడికి మామ. వరుణుడి కొడుకైన సుషేణుడు వానర వైద్యుడు. అతడి ఔషధ పరిజ్ఞానం అనన్యసామాన్యం. రామ రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు నాగాస్త్రానికి రామలక్ష్మణులు బంధితులై కుప్పకూలిపోయినప్పుడు, రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధానికి లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు సుషేణుడి సూచనల మేరకే హనుమంతుడు సంజీవని పర్వతానికి చేరుకున్నాడు. సుషేణుడు తనకు సూచించిన ఓషధులను హనుమంతుడు గుర్తించలేక ఏకంగా సంజీవని పర్వతాన్నే పెకలించుకుని వచ్చాడు. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువస్తే, సుషేణుడు దానిపైనున్న మొక్కలలో సంజీవకరణి, విశల్యకరణి వంటి ఓషధీ మూలికలను గుర్తించి, వాటితో రామలక్ష్మణులను స్వస్థులను చేశాడు. యుద్ధంలో మరణించిన వానరయోధులను తిరిగి బతికించాడు. గాయపడిన వారి గాయాలను నయం చేశాడు. రామ రావణ యుద్ధంలో శ్రీరాముడి ఘన విజయానికి సుషేణుడు తనవంతు తోడ్పాటునందించాడు. రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు. అయోధ్యలో జరగబోయే శ్రీరామ పట్టాభిషేకాన్ని తిలకించడానికి సుగ్రీవ, అంగద, హనుమదాది వానర వీరులు, విభీషణుడు కూడా పుష్పక విమానంలో బయలుదేరారు. మార్గమధ్యంలో సుమంచ పర్వతం మీద శ్రీరాముడు తన పరివారంతో విడిది చేశాడు. సుమంచ పర్వతం మీదనున్న వృక్షసంపదలో అంతులేని ఓషధీమూలికలను అందించే మొక్కలు, చెట్లు చూసి వానర వైద్యుడు సుషేణుడు అమితానంద భరితుడయ్యాడు. ఓషధీమూలికలతో నిండిన పర్వతం, చుట్టూ చక్కని మహారణ్యం ఉన్నా సుమంచ పర్వతప్రాంతంలోని ప్రజలు రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉండటం చూసి కలత చెందాడు. ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తనవంతుగా వైద్యసేవలు అందించాలని, తన శేషజీవితాన్ని ఈ పర్వతం మీదనే జపతపాదులతో గడపాలని నిర్ణయించుకున్నాడు. శ్రీరాముడికి తన మనోగతాన్ని తెలిపాడు. ‘శ్రీరామా! యుద్ధం పరిసమాప్తమైంది. నీకు ఘనవిజయం సాధ్యమైంది. అయోధ్యకు వెళ్లి పట్టాభిషిక్తుడవై, నీ ప్రజలను జనరంజకంగా పరిపాలించు. నేను ఇక్కడే ఉండి శేషజీవితాన్ని జపతపాదులతో గడపాలని, పరమశివుడు అనుగ్రహిస్తే, బొందితో కైలాసం పోవాలని భావిస్తున్నాను. అద్భుతమైన మూలికలతో నిండిన ఈ పర్వత పరిసర ప్రాంతాల్లోని ప్రజలు రోగపీడితులుగా ఉన్నారు. వారికి సేవలందిస్తాను. ఇందుకు అనుమతించు’ అని కోరాడు. ‘సరే, నీ మనోభీష్టం ప్రకారమే కానివ్వు’ అని పలికాడు రాముడు. సుషేణుడిని ఆశీర్వదించి పరివారంతో కలసి అయోధ్యకు పయనమయ్యాడు. సుషేణుడు సుమంత పర్వతంపైనే ఉంటూ శివుని గురించి ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. కొంతకాలానికి శ్రీరాముడికి సుషేణుడు గుర్తుకొచ్చాడు. సుషేణుడి యోగక్షేమాలను తెలుసుకుని రమ్మని హనుమంతుడికి చెప్పాడు. రాముడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు సుమంచ పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఏ అలికిడీ వినిపించలేదు. దట్టమైన చెట్ల మధ్య వెదుకులాడుతూ హనుమంతుడు కొంత దూరం ముందుకు సాగాడు. ఒకచోట చెట్టు కింద సుషేణుడి కళేబరం కనిపించింది. అప్పటికే అది పూర్తిగా అస్థిపంజరంగా మారింది. తపస్సులోనే సుషేణుడు శివసాయుజ్యం పొంది ఉంటాడని భావించిన హనుమంతుడు, అక్కడే ఒక గొయ్యి తవ్వి, సుషేణుడి కళేబరాన్ని అందులో పూడ్చిపెట్టాడు. అక్కడ దొరికిన మల్లెలను కోసి తెచ్చి, సుషేణుడిని పూడ్చిన చోట ఉంచి, గుర్తుగా దానిపై కృష్ణాజినాన్ని కప్పాడు. హనుమంతుడు అక్కడి నుంచి నేరుగా అయోధ్యకు చేరుకుని, రాముడికి సుషేణుడి నిర్యాణ వార్త చెప్పాడు. వెంటనే రాముడు సీతా లక్ష్మణ సమేతంగా హనుమంతుడితో కలసి సుమంచ పర్వతానికి బయలుదేరాడు. పర్వతం మీదకు చేరుకున్నాక, సుషేణుడిని తాను పూడ్చిపెట్టిన చోటుకు వారిని తీసుకువెళ్లాడు హనుమంతుడు. సుషేణుడి కళేబరాన్ని చూపించడానికి పైన తాను కప్పి ఉంచిన కృష్ణాజినాన్ని తొలగించాడు. ఆశ్చర్యకరంగా అక్కడ సుషేణుడి కళేబరం లేదు. దానికి బదులుగా ఒక శివలింగం కనిపించింది. శివలింగం మీద మల్లెపువ్వులు ఉన్నాయి. అభీష్టం మేరకు సుషేణుడు శివసాయుజ్యం పొందాడని వారికి అర్థమైంది. సమీపంలోని కొలనులో సీతా రామ లక్ష్మణ హనుమంతులు స్నానమాచరించి, శివలింగానికి పూజించడం ప్రారంభించాడు. పూజ ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రచండ వేగంతో గాలులు వీచసాగాయి. ఔషధ మూలికల పరిమళాన్ని నింపుకున్న ఆ గాలులు సోకినంత మేర ఆ ప్రాంతంలోని రోగపీడితులకు ఆశ్చర్యకరంగా రోగాలు నయమయ్యాయి. పూజ కొనసాగిస్తుంటే, శివలింగం క్రమంగా పెరగసాగింది. అక్కడ శివాలయాన్ని నిర్మిద్దామని శ్రీరాముడు అనుకున్నా, శివలింగం పరిమాణం పెరుగుతూ ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు. సుషేణుడు నిర్యాణం చెందిన ప్రదేశంలో ఆవిర్భవించిన శివలింగంపై మల్లెపూలు, కృష్ణాజినం ఉండటంతో అక్కడ వెలసిన శివుడు మల్లికాజినస్వామిగా ప్రఖ్యాతి పొందాడు. మల్లికాజునస్వామి వెలసిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్‌లో టెక్కలి సమీపంలోని రావివలస గ్రామంలో ఉంది. - సాంఖ్యాయన -
Ayodhya Ram Mandir: రామాలయం కోసం 30 ఏళ్లుగా మౌనవత్రం!
నాడు శబరిలోని విశ్వాసం.. శ్రీరాముడు స్వయంగా ఆమె గుడిసె వద్దకు వచ్చేలా చేసింది. నేడు జార్ఖండ్‌కు చెందిన సరస్వతీదేవిలోని అపార నమ్మకం.. రామాలయం కల సాకారమయ్యేందుకు దోహదపడింది. శ్రీరాముడు తన భక్తురాలైన సరస్వతి కోరిక నెరవేర్చాడు. అందుకే ఆమె జనవరి 22న అయోధ్యకు చేరుకుని, తన 30 ఏళ్ల మౌన వ్రతాన్ని విరమించనుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ పరిధిలోని కరమ్‌తాండ్‌లో ఉంటున్న 85 ఏళ్ల సరస్వతి అగర్వాల్ 30 సంవత్సరాల క్రితం మౌనవ్రతం చేపట్టింది. అయోధ్యలో రామమందిరం నిర్మించే వరకు తాను ఎవరితోనూ మాట్లాడబోనని ఆమె శపథం చేసింది. జనవరి 22న అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన రోజున ఆమె 'రామ్, సీతారాం' అంటూ మౌన దీక్ష విరమించనుంది. శ్రీరాముని స్మరణకే తన జీవితాన్ని అంకితం చేసిన సరస్వతి అగర్వాల్ ఇకపై అయోధ్యలోనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ఆమె సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ‘నా జీవితం ధన్యమైంది. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు బాలరాముడు నన్ను ఆహ్వానించాడు. నా ఇన్నాళ్ల తపస్సు సఫలమయ్యింది. 30 ఏళ్ల తర్వాత నా మౌనం వీడనుంది. మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమానికి వెళ్లి అక్కడే ఉండాలనుకుంటున్నాను’ అని ఆమె మీడియాకు తెలిపింది. సరస్వతి అగర్వాల్‌కు అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దీంతో సరస్వతీ దేవి సోదరులు ఆమెను ఇప్పటికే అయోధ్యకు తీసుకువచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ శిష్యులు మనీష్ దాస్, శశి దాస్ సరస్వతి తదితరులు ఆమెను అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్లో స్వాగతించారు. ఆమె 4 నెలల పాటు స్వామీజీ ఆశ్రమంలో ఉండనున్నారు. సరస్వతి అగర్వాల్ 1992 మేలో అయోధ్యకు వెళ్లారు. అక్కడ ఆమె రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్ నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. ఆయన ఆశీర్వాదంతో ఆమె కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేశాక చిత్రకూట్‌లో ఏడున్నర నెలల పాటు కల్పవాసంలో ఉండిపోయారు. రోజూ 14 కిలోమీటర్ల కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేశారు. 1992, డిసెంబర్ 6న ఆమె తిరిగి నృత్య గోపాల్ దాస్‌ను కలిశారు. ఆయన స్ఫూర్తితో మౌన వ్రతం మొదలుపెట్టారు. రామాలయ నిర్మాణం పూర్తయ్యాక మౌన వ్రతం వీడాలని ఆమె నిశ్చయించుకున్నారు. సరస్వతీదేవి ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. ఆమె భర్త ఆమెకు అక్షర జ్ఞానం అందించారు. ఆమె రామ చరిత మానసతో పాటు ఇతర గ్రంథాలను రోజూ చదువుతారు. రోజుకు ఒకసారి సాత్విక ఆహారం తీసుకుంటారు. ఆమె భర్త 35 ఏళ్ల క్రితం మృతి చెందారు. వారికి ఎనిమిదిమంది సంతానం. ఆమె మౌన దీక్ష చేపట్టినప్పుడు వారంతా ఆమెకు సహకరించారు. -
నిండు పున్నమిలోనూ బాలరాముని దర్శనం
అయోధ్యలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకూ బాలరాముని దర్శనం చేసుకునే అవకాశం ఉన్న భక్తులు.. ఇకపై చంద్రుని చల్లని వెన్నెలలోనూ స్వామివారిని దర్శించుకునే అవకాశం కలగనుంది. అయోధ్యలో నూతన రామాలయం ప్రారంభమై, బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగిన అనంతరం స్వామివారి దర్శన వ్యవధిని పొడిగించనున్నట్లు రామాలయ ట్రస్ట్ తెలిపింది. అలాగే మంగళ, శయన హారతులను కూడా ప్రారంభించనున్నారు. రానున్న కాలంలో అయోధ్యలోని నూతన రామాలయ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరగనున్న దృష్ట్యా పూజల ప్రక్రియను విస్తృతం చేసేందుకు ట్రస్ట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఆలయంలో శ్రీరాముని దర్శనం ఉదయం 7 గంటల నుంచి 11 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 వరకు ఉంటోంది. రాత్రివేళ ఈ సమయాన్ని మరింత పొడిగించాలని ట్రస్టు యోచిస్తోంది. దీంతో భక్తులు చల్లని వెన్నెలలోనూ బాలరాముడిని దర్శించుకోగలుగుతారు. సాధారణ రోజుల్లో రోజుకు 20 వేల మంది భక్తులు శ్రీరాముని దర్శించుకుంటున్నారు. ఏకాదశితో పాటు పండుగ రోజులలో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింతగా పెరుగనుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం రోజుకు లక్షన్నర మంది భక్తులు దర్శనానికి వస్తారనే అంచనాలున్నాయి. -
తప్పక చూడాల్సిన అద్భుతమైన శివాలయాలు (ఫొటోలు)
-
భక్తుడికి ఆహారం భక్తే
యోగరతోవా భోగ రతోవా/ సంగ రతోవా సంగ విహీనః/ యస్య బ్రహ్మణి రమతే చిత్తం/ నందతి నందతి నందత్యేవ... చెరుకు గడను తీసుకొచ్చి కత్తితో నరికినా, మరలోవేసి తిప్పినా, నోటితో కొరికినా... ఎంత హింసించినా తియ్యటి రసాన్ని ఒలికించడం తప్ప అది మరో విధంగా స్పందించదు. కారణం – త్యాగం దాని లక్షణం. ఏ వాగ్గేయకారుడి జీవితం చూసినా ప్రతివారి జీవితంలో ఈ ప్రశాంతత, ఈ కారుణ్యం, ఈ ద్వంద్వాతీత స్థితి, అందరినీ ప్రేమించగల, అనుగ్రహించగల శక్తి కనపడుతుంటాయి. వాళ్ళు కూడా అంత గొప్పగా ఆ సంగీతంతోనే ఎదిగారు. ఆ సంగీతంతోనే మనల్ని ఉద్ధరించారు. త్యాగరాజ స్వామి జీవితం వడ్డించిన విస్తరేమీ కాదు. మహారాజుగారు అన్ని కానుకలు పంపితే ‘నిధి చాల సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగబల్కు మనసా..’’ అంటూ వాటిని తీసుకెళ్ళి చెత్తదిబ్బలో పారేస్తాడా ... అని తోడబుట్టిన అన్నగారికే నచ్చలేదు తమ్ముడి పద్ధతి. ‘ఎప్పుడూ ఆ విగ్రహాలు పట్టుకుని కూర్చుంటాడు. తమ్ముడు కనుక రాజుగారి కొలువులో పాడితే ఎంత హాయిగా జీవించవచ్చు...’ అనే భావన అన్నగారిది. కాదు... సంగీతం మోక్ష సామ్రాజ్యాన్ని ఇవ్వగలదు. ఇది ఇవ్వగలిగిన ఆనందం వేరొకటి ఇవ్వలేదు. వాగ్గేయకారులకు ఉన్నది సంగీతసాహిత్యాలు మాత్రమే కాదు. నేను పాట రాస్తాను, బాణీ కడతాను, అంటే ఎవడూ వాగ్గేయకారుడై పోడు. సంగీతసాహిత్యాల్లో అంతర్లీనంగా భక్తి ప్రవహించాలి. అది ఎటువంటి భక్తి ...అంటే నువ్వు ఏమయిపోతున్నా... నమ్ముకున్న వాడి చరణాలు వదలలేనిది అది.. అచంచలమైనది... అదే భర్తృహరి మాటల్లో చెప్పాలంటే... నిను సేవింపగ ఆపదల్ పొడమనీ, నిత్యోత్సవం బబ్బనీ,/జనమాత్రుండననీ, మహాత్ముడననీ, సంసార మోహంబు పై/కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ/చ్చిన రానీ... అంటాడు. ఏది ఏమయిపోయినా ఆ భక్తిలో పరమానందాన్ని పొంది ఎప్పటికప్పుడు లోపల ఈశ్వర గుణానుభవాలు పెరిగి అవి కీర్తనలుగా వెలువడుతుంటే ఆయన వాగ్గేయకారుడు. అంటే భక్తి ప్రధానం. భక్తుడికి భక్తి అమ్మలాంటిది. పసిబిడ్డకు పాలు ఎలాగో, భక్తుడికి భక్తి అలా ఆహారం. భగవంతుడి పాటలు వింటూ, తాను పాడుకుంటూ, రచన చేస్తూ, స్వరపరుస్తూ, శిష్యులకు చెబుతూ, ఏదీ ఆశించకుండా, ఏది లభిస్తే అది తింటూ, పరమ పవిత్రమైన జీవనాన్ని గడుపుతూ ఆఖరికి తన అవసరం లేదనుకున్నప్పుడు గహస్థాశ్రమాన్ని విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకారం చేసి... భగవంతుడిలో ఐక్యమవుతాడు. భక్తుడిని వేరొకరు రక్షింపనక్కర లేదు..‘‘వాడిని నా కొరకు రక్షింపవలయు..’’ అంటాడు శ్రీమన్నారాయణుడు భాగవతంలో. వాడిని నేను రక్షించేది వాడి కోసం కాదు, నా కోసం..అంటున్నాడు. నన్ను నమ్ముకున్న వాడినే రక్షించకపోతే ఇక నేను ఉన్నానని లోకం ఎందుకు నమ్ముతుంది? అందుకని నేనున్నానని జనులు నమ్మడం కోసం.. నాకోసం వాడిని రక్షిస్తున్నా... అంటున్నాడు. భక్తుని స్థితి అలా ఉంటుంది. వాగ్గేయకారుల అనుభవాలు కూడా ఇవే. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
హర హర ‘మా’హా దేవా!
హరిద్వార్‌లో ఒక యువ భక్తుడు ఒక భుజాన తల్లిని, మరోభుజాన గంగానది జలం ఉన్న బిందెలను మోసుకువెళుతున్న వీడియో వైరల్ అయింది. కన్వర్ యాత్రలో భాగంగా భక్తులు గంగాజలాన్ని మోసుకు వస్తారు. దేశంలోని జ్యోతిర్లింగాలకు ఈ పవిత్రమైన నీటితో జలాభిషేకం చేస్తారు. పదకొండు సెకండ్ల ఈ వీడియో క్లిప్‌ను చూస్తూ కొందరు పురాణాలలోని శ్రవణకుమారుడిని గుర్తు తెచ్చుకున్నారు. ‘ఈ కాలంలో ఇలాంటి దృశ్యం చూడడం అపురూపంగా ఉంది’ ‘కడుపులో నవ మాసాలు మోసిన తల్లిని భుజాన మోయడం అదృష్టం’... ఇలా రకరకాలుగా స్పందించారు నెటిజనులు. -
మంచి మాటల ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
దయచేసి మనసు విప్పి మీతో మీరు మమేకం కండి లేదా ఇతరులతో అయినా మంచిగా మాట్లాడండి. నిజానికి మనుషులకు ఆ తీరికే లేదు. సెల్ఫోన్లు వచ్చాక..ఆ ఫోన్ చూసుకుంటూనే ఆఫీస్‌కి వెళ్తారు. మళ్లీ అలానే ఇంటికి వచ్చేస్తారు. ఆఖరికి ఇంటి దగ్గర అదే పని. దేన్ని ఎంతవరకు వాడాలో తెలియదో లేక వస్తువుల వ్యామోహంలో పిచ్చెక్కి మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు. కానీ కాసేపు మన తోటి వారితో ఇరువురికి ఉపయోగపడే మంచి మాటాల మాట్లాడితే అవి ఎంతగా ప్రభావంతంగా పనిచేస్తాయో తెలుసా!. వాటి ప్రాముఖ్యత ఏంటో తెలుసా! ఐతే ఒక్కసారి ఈ కథ వినండి. ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరూ అనేక విషయాలపై మాట్లాడుకున్నారు. వశిష్ఠునికి వీడ్కోలు పలుకుతూ విశ్వామిత్రుడు కలకాలం గుర్తుండేలా ఒక విలువైన కానుక సమర్పించాలని భావించి, తన వెయ్యేళ్ల తపశ్శక్తిని ఆయనకు ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు. కొన్నాళ్లకు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకలోపచారాలు చేశాడు. పుణ్యానికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలపై మాత్రమే ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరకు విశ్వామిత్రునికి వీడ్కోలు పలుకుతూ వశిష్ఠుడు, అప్పటి వరకు తాము మాట్లాడుకున్న మంచి విషయాల పుణ్య ఫలాన్ని బహుమానంగా ఇస్తున్నట్టు చెప్పాడు. దీంతో విశ్వామిత్రుడు చిన్నబోయాడు. తాను కానుకగా ఇచ్చిన వెయ్యేళ్ల తపోఫలానికి ఒక్క పూట సమయంలో మాట్లాడుకున్న మంచి మాటల పుణ్య ఫలంతో ఏవిధంగా సాటి వస్తుందని అనుకున్నాడు. అదే విషయాన్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడిని అడిగాడు కూడా. తపోఫలం? సత్సాంగత్య ఫలం? రెండింటిలో ఏది గొప్పదో తెలుసుకోవడానికి ఇద్దరూ బ్రహ్మ వద్దకు వెళ్లారు. ఆయన విష్ణువు వద్దకు వెళ్లమన్నాడు. విష్ణువు, దీనికి పరమశివుడే సరిగ్గా సమాధానం చెప్పగలడని చెప్పి ఆయన వద్దకు పంపాడు. ఆయనేమో పాతాళంలో ఉన్న ఆదిశేషుడు తప్ప మరెవరూ ఏ ఫలం గొప్పదో చెప్పలేరని తేల్చాడు. ఇద్దరూ కలిసి అక్కడకూ వెళ్లారు. వారిద్దరి సందేహం విన్న ఆదిశేషుడు సమాధానం చెప్పడానికి కొంత వ్యవధి కావాలని అడిగాడు. అప్పటివరకు తాను మోస్తున్న ఈ భూలోకాన్ని మీ ఇద్దరూ మోయాలని షరతు కూడా పెట్టాడు. తలపై పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కాబట్టి ఆకాశంలో నిలబెట్టి ఉంచండని సలహా ఇచ్చాడు. దీంతో విశ్వామిత్రుడు వెంటనే 'నా వేయి సంవత్సరాల తపోఫలాన్ని ధారపోస్తాను. ఆ తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుతుంది’ అన్నాడు. అయితే భూమిలో ఏ చలనం లేదు. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు ‘ఒక్క పూట సమయంలో మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్య ఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను’ అన్నాడు. వశిష్ఠుడు అలా అనగానే, ఆదిశేషుని తలపై ఉన్న భూమి చటుక్కున ఆకాశాన నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై పెట్టుకుని మీ ఇద్దరూ ఇక వెళ్లవచ్చు అని అంటాడు. అడిగిన దానికి బదులివ్వకుండా వెళ్లమంటే ఎలా? అని ఇద్దరూ ఆదిశేషుడిని నిలదీస్తారు. మీ ఎదురుగానే రుజువైంది కదా! ఏ తపోఫలం గొప్పదో? ఇక వేరే తీర్పు చెప్పడానికి ఏముంది?’ అని ఆదిశేషుడు బదులిచ్చాడు. వేయి సంవత్సరాల తపశ్శక్తి ధారపోసినా కదలని భూమి ఒక్క అరగంట పాటు మాట్లాడుకున్న మంచి మాటల వలన కలిగిన పుణ్య ఫలాన్ని ధారపోయడం వలన ఇట్టే ఆకాశంలో నిలబడిందన్న విషయాన్ని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు గ్రహిస్తారు. చూశారుగా! మంచి మాటల ప్రభావమెంతో? ఇప్పుడు ఈ భూమిపై జీవిస్తున్న మన మధ్య మంచి మాటలు తగ్గిపోతున్నాయి. ఒంటరిగా ఉన్నా..ఏ ఇద్దరు కలిసినా సెల్ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. నిజానికి దానితోనే పుణ్య కాలం కాస్తా గడిచిపోతోంది. ఇక మనం మనసు విప్పి మనతో మనం, ఇతరులతో మనం మంచి మాటలు ఎప్పుడూ మాట్లాడతామో కదా!. (చదవండి: స్నానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు.. నీరు లేకుండా స్నానం చేయొచ్చని తెలుసా!) -
ప్రమాదాన్ని ముందే పసిగట్టిన గజరాజు.. గోవిందరాజు స్వామి ఆలయంలో ఏం జరిగింది?
సాక్షి, తిరుపతి: గోవిందరాజు స్వామి ఆలయ ఆవరణలో అపశ్రుతి చోటు చేసుకుంది. సాయంత్రం కురిసిన గాలి వానకు ఆలయ ధ్వజస్తంభం వద్ద ఉన్న పురాతన రావి చెట్టు కూలిపోయింది. ఈ ఘటనలో ఒక భక్తుడు మృతి చెందగా, ముగ్గురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు కడపకు చెందిన డాక్టర్ గుర్రప్పగా పోలీసులు గుర్తించారు. టీటీడీ ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది. వందల ఏళ్ల నాటి రావి చెట్టుగా స్థానికులు చెబుతున్నారు. స్వామివారి ఉత్సవాలకు సిద్ధం చేసిన గజరాజు అప్రమత్తతతో పెను ప్రమాదమే తప్పింది. చెట్టు కూలిపోవడానికి ముందుగానే పసిగట్టిన గజరాజు ఘీంకరించడంతో అప్రమత్తమై పరుగులు తీశామని భక్తులు అంటున్నారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా సంఘటన ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. మృతుడు గుర్రప్ప కుటుంబానికి ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి టీటీడీ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తిరుమల శ్రీవారి ఆలయంలో వీడియో చిత్రీకరణపై టీటీడీ విచారణ
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వీడియో రికార్డు చేయడం కలకలం రేపింది. మూడు అంచెల భద్రతను దాటి మరీ ఓ భక్తుడు మొబైల్ ఫోన్‌తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. మొబైల్ ఫోన్‌తో వెళ్లిన సదరు భక్తుడు శ్రీవారి ఆలయంలో హల్చల్ చేశాడు. ఆలయంలో నలువైపుల నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్‌తో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆనంద నిలయం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని ద్వారా వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుంచి భక్తుడు వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే భక్తుడు శ్రీవారి ఆలయంలో ఇంకేమైనా చిత్రికరించాడా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ విచారణ చేపట్టింది. ఆలయం లోపలి సీసీ కెమెరా విజువల్స్‌ను పరిశీలిస్తున్నారు. ని కాగా శ్రీవారి ఆలయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ లోనికి అనుమతిస్తుంటారు. సెల్‌ఫోన్, కెమెరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంత పకడ్భందీగా భద్రత ఉన్నప్పటికీ ఓ భక్తుడు ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లడమే కాకుండా.. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి ఆలయంలో మొబైల్ ఫోన్‌తో తిరిగినా.. సీసీ కెమెరాల సిబ్బంది గుర్తించని పరిస్థితి నెలకొనడం గమనార్హం. చదవండి: మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్‌కు తెలుగు విద్యార్థులు -
ఏనుగు విగ్రహం కింద ఇరుక్కొని నానా అవస్థలు
-
గుడిలోనే భక్తుడి కష్టాలు.. ఏనుగు విగ్రహం కింద ఇరుక్కొని నానా అవస్థలు
సాధారణంగా కష్టాలు తొలగించి మంచి జీవితాన్ని అందించమని దేవుడిని ప్రార్థిస్తుంటారు. దైవానుగ్రహం కోసం తరచుగా పుణ్యక్షేత్రాలను సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. దేవుడిని స్మరిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే భగవంతుడి ఆశీస్సులు ఉండాలని గుడికి వెళ్లిన ఓ వ్యక్తికి దేవాలయంలోనే ఓ వింత కష్టం ఎదురైంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆలయంలో ఓ ఏనుగు విగ్రహం ఉండగా.. ఆచారంలో భాగంగాఆ విగ్రహం కింద నుంచి పడుకొని బయటకు వస్తే మంచి జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతుంటారు. ఆ వ్యక్తి కూడా అలాగే నమ్మి ఏనుగు విగ్రహం కిందకు వెళ్లాడు. కానీ ముందుకు వెనక్కి రాలేక విగ్రహం మధ్యలో చిక్కుకుపోయాడు. కొంత సేపటి వరకు అలాగే ఇరుక్కుపోయి నానా అవస్థలు పడ్డాడు. శరీరాన్ని ఇటు ఇటు తిప్పుతూ ఉక్కిరిబిక్కిరైపోయాడు. బయటకు రావడానికి చాలా ప్రయత్నించినా వీలు పడలేదు. అతని బాధలు చూసిన తోటి భక్తులు, పూజారి సలహాలు సూచనలు కూడా చేశారు. కానీ ప్రయోజనం లేదు. Any kind of excessive bhakti is injurious to health 😮 pic.twitter.com/mqQ7IQwcij — ηᎥ†Ꭵղ (@nkk_123) December 4, 2022 దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సదరు వ్యక్తి విగ్రహం నుంచి బయట పడేందుకు పడుతున్న కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చివరికి ఆ వ్యక్తి మరి విగ్రహం నుంచి బయటకు వచ్చాడా అనేది తెలియరాలేదు. వీడియో అక్కడికే ముగియడంతో సస్పెన్స్‌గా మిగిలిపోయింది. కాగా 2019లో అదే విగ్రహం కింద ఓ మహిళ ఇరుక్కుపోయింది. విగ్రహం నుంచి బయటకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరికి పలువురు ఆమెకు సాయం చేయడం ద్వారా సురక్షితంగా బయటపడింది. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. చదవండి: ఒకే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన కవలలు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్ -
350 సార్లు తిరుమల మెట్లు ఎక్కిన శ్రీవారి భక్తుడు
శ్రీకాకుళం కల్చరల్: ఏడుకొండల వారిని ఒక్క క్షణం కళ్లారా చూడాలని కోట్లాది మంది మొక్కుతుంటారు. రెండు ఘడియల పాటు స్వామిని చూసే అవకాశం వస్తే జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. అలాంటిది ఆయన 350 సార్లు తిరుమల మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. ప్రతి మెట్టు పరిచయమే అన్నట్లు ప్రతినెల కాలినడకన తిరుపతి కొండ ఎక్కడం అలవాటుగా మార్చుకున్నారు. తాను వెళ్లడమే కాదు 780 మందితో తిరుమలకు పాదయాత్ర కూడా చేసి గోవిందుడి ఆశీస్సులు పొందారు. పాదయాత్రలకు గాను ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాదించుకున్నారు. ఆయన పేరు మహంతి శ్రీనివాస్. ఊరు శ్రీకాకుళం. గోవింద వరల్డ్‌వైడ్ వాట్సాప్ గ్రూపు.. శ్రీకాకుళానికి చెందిన మహంతి శ్రీనివాస్‌కు తిరుమలేశుడంటే ఎనలేని భక్తి. ఇప్పటివరకు 350 సార్లు తిరుపతి మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నారు. సెప్టెంబరు 6వ తేదీ ఏకాదశి పర్వదినాన 780 మందితో గ్రూపుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకోసం ‘గోవింద వరల్డ్‌వైడ్’ వా ట్సాప్ గ్రూపును రూపొందించారు. అందులో వివిధ రాష్ట్రాలకు చెందిన వారు సభ్యులుగా చేరారు. ఈ గ్రూపులో జూన్ 25లోగా సెప్టెంబరు 6న మెట్ల మార్గం ద్వారా పాదయాత్రకు ఆసక్తి ఉన్న వారు తమ సమ్మతిని తెలపాలని కోరారు. సమ్మతి తెలిపిన వారు తిరుమలకు 5వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు హాజరు కావాలని సూచించారు. దీంతో కర్నాటక, ఆంధ్రా, తెలంగాణ, ఒడి శా రాష్ట్రాల నుంచి 780 మందితో పాదయాత్ర కన్నుల పండువగా సాగింది. ఆ రోజు సాయంత్రం గోవిందరాజస్వామి దర్శనాలు, శ్రీపద్మావతి అమ్మ వారి దర్శనాలు చేసుకున్నాక, రాత్రి తిరుపతిలో బస చేసి, 6వ తేదీ ఉదయం 6 గంటలకు మెట్ల మార్గం ద్వారా పాదయాత్ర ప్రారంభించారు. 2388 మెట్లను 150 నిమిషాలు నడచి తిరుమల చేరుకున్నారు. ఇది ఆయన 350వ పాదయాత్ర. ఆ దారిలోనే.. తిరుమల వెళ్లే భక్తులు సాధారణంగా ముందుగా తిరుమల వరకు నేరుగా వెళతారు. కానీ దానికి కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయని శ్రీనివాస్ అంటారు. తిరుమల వెళ్లే భక్తులు ముందుగా పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నాక.. కొండపైకి చేరుకొని తలనీలాలు సమర్పించి, పుష్కర స్నానం చేసి ఆ తర్వాత వరాహ నరసింహ స్వామి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాత శ్రీవారి దర్శనం చేసుకోవాలి. అలాగే కొండపై ఉన్న 6 ముఖ్యమైన ప్రదేశాలను దర్శించుకున్న తర్వాత యాత్ర పూర్తి అవుతుందని ఆయన చెబుతుంటారు. 350 సార్లు ఇలా.. 1996లో మొదటిసారిగా పాదయాత్ర ప్రారంభించారు. 1996 నుంచి 2016 వరకు 85 సార్లు వెళ్లారు. 2017లో ఆయన వయసు 50 ఏళ్లు ఆ ఏడాదే 50 సార్లు పాదయాత్ర చేశారు. 2018లో 71 సార్లు, 2019లో 50 సార్లు, 2020లో రెండు సార్లు(ఆ సమయంలో కరోనాతో గుడి మూసివేశారు). 2021లో 52 సార్లు, 2022లో 8 సెప్టెంబరుæ వరకు 40 సార్లు పాదయాత్ర నిర్వహించారు. మొత్తంగా 350 దఫాలు మెట్ల మార్గం గుండా వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. ఇలా ఒకరోజులో ఒకసారిగా వెళ్లింది 193 సార్లు, ఒకరోజులో 2 సార్లు నడచింది 142సార్లు, ఒక రోజులో మూడుసార్లు నడిచింది 15 సార్లు కావడం విశేషం. ఆయనతో పాటు ఆయన భార్య కూడా 59 సార్లు, కుమారుడు కూడా 30 సార్లు పాదయాత్ర చేశారు. ఇప్పటికి 2వేల మంది భక్తులను తనతో పాటుగా తీసుకువెళ్లారు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం తిరుమలలో పనిచేసిన జిల్లాకు చెందిన ఉన్నతాధికారి రుంకు అప్పారావు స్ఫూర్తితో శ్రీనివాస్ ఈ పాదయాత్రలు చేశారు. రుంకు అప్పారావు 108 సార్లు మెట్ల ద్వారా పాదయాత్ర చేసినందుకు గాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డు పొందారు. అయితే శ్రీనివాస్ 2019 జనవరి 27 వరకు 205 పర్యాయాలు మెట్ల యాత్ర చేశాక ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించి యోగ్యతాపత్రాన్ని, గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సర్టిఫికేటును అప్పటి ఈఓ అనిల్ సింఘాల్ చేతుల మీదుగా అందుకున్నారు. తిరిగి తన యాత్రను కొనసాగిస్తూ 258 పర్యాయాలు పూర్తి చేసినందుకు గాను 2020 మే8న ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు. అలాగే టీటీడీ నిర్వహిస్తున్న సప్తగిరి మాస పత్రికలో శ్రీనివాస్‌పై వ్యాసం కూడా ప్రచురించారు. ప్రతి నెలా వెళ్తా.. నేను ప్రతి నెల తిరుమల వెళ్లి మెట్ల దారి నుంచి స్వామి దర్శనం చేసుకుంటాను. ఇప్పటి వరకు 350సార్లు పాదయాత్ర చేశాను. తిరుమల అంటే సాక్షాత్తు వైకుంఠధామమే. తిరుమల యాత్ర ఏవిధంగా చేయాలో అందరికీ చెబుతాను. ఎప్పటికప్పుడు తిరుమలలో జరిగే తాజా మార్పులను వాట్సాప్ గ్రూపు ద్వారా అందరికీ చేరవేస్తుంటాను. స్వామిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. – మహంతి శ్రీనివాస్, శ్రీకాకుళం -
యూపీలో దేవతకు నాలుక సమర్పణ
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో భక్తి పారవశ్యంలో మునిగిన ఓ భక్తుడు ఏకంగా నాలుక తెగ్గోసుకున్నాడు! కౌషాంబికి చెందిన 38 ఏళ్ల సంపత్.. మెహందీగంజ్లోని మాతా శీతలాదేవి మందిరానికి భార్యతో కలిసి వెళ్లాడు. ఆలయదర్శనానికి ముందు గంగానదిలో పుణ్యస్నానం చేశాడు. తర్వాత బ్లేడుతో తన నాలికను కత్తిరించుకుని ఆలయ ద్వారం వద్ద సమర్పించాడు. నాలుక తెగడంతో కొద్దిసేపటికే సంపత్ పరిస్థితి దారుణంగా తయారైంది. వెంటనే అతడిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కరా ధామ్ పోలీస్‌స్టేషన్ స్టేషన్ ఆఫీసర్ అభిలాష్ తివారీ చెప్పారు. ఇంత పని చేస్తాడనుకోలేదంటూ భార్య వాపోతోంది. చదవండి: అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ -
భక్తురాలిపై అఘాయిత్యం... దేవతే అలా చేసిందని బుకాయింపు
ఇటీవల కాలంలో స్వామిజీ పేరుతో భక్తులపై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు కోకొల్లలు. అయినా ప్రజల్లో కూడా మార్పు రావడం లేదు. ఈ డిజిటల్ యుగంలో పిచ్చి బాబాలు, స్వామీజీల మాయలో పడి కోరి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ స్వామీజీని నమ్మీ జీవితాన్ని నాశనం చేసుకుంది. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మధ్యప్రధేశ్లో ఒక వ్యక్తి తనను దేవుడిగా ప్రకటించుకుని స్వామి వైర్యాగ్యనంద గిరిగా పబ్లిక్‌లో చెలామణి అవుతున్నాడు. ఈ మేరకు ఒక మహిళ తనకు చాలా ఏళ్లుగా పిల్లలు కలగకపోవడంతో ఈ వైర్యాగ్యనంద స్వామిని కలిసినట్లు పోలీసులుకు తెలిపింది. కొన్ని పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని నమ్మబలికి ఒక ప్రసాదం ఇచ్చాడని చెప్పింది. సదరు మహిళ ఆ ప్రసాదం తిని స్ప్రుహ కోల్పోయాననని, ఆ తర్వాత ఆ వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది. ఐతే తనకు మెలుకువ వచ్చిన తర్వాత ఆ వైరాగ్యానంద స్వామీ.. దేవత నీపై అత్యాచారం చేసిందని చెబుతున్నాడని వాపోయింది. ఆ బాధిత మహిళ వెంటనే ఆ స్వామీజీ పై ఫిర్యాదు చేయలేకపోయింది. ఎందుకంటే ఆ స్వామిజీకి రాజకీయ పార్టీల అండదండ ఉంది. పైగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీకి మద్దతుగా నిలబడటమే కాకుండా ఒక సీనియర్ నాయకుడి గెలుపు కోసం యజ్ఞం చేశాడు. పైగా అతను గెలవకపోతే సమాదిలోకి వెళ్లిపోతానంటూ ప్రగల్పాలు కూడా పలికాడు. ఆ వ్యక్తికి సమాజంలో కాస్త పలుకుబడి ఉండడంతో భయప్డడానని చెప్పుకొచ్చింది సదరు బాధితరాలు. ఈ మేరకు పోలీసులు అతని పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. (చదవండి: లాలు యాదవ్ కుమార్తె ట్వీట్... బలపడనున్న 'గత బంధం') -
నవాబ్ చేసిన తప్పేంటి? ఎందుకీ డ్రామా?
మహాభారత స్వర్గారోహణ పర్వంలో.. యుధిష్ఠిరుడు(ధర్మరాజు) వెంట మేరు పర్వతం శిఖరాగ్రానికి చేరుకుంటుంది ఓ శునకం. అయితే ఇంద్రుడు మాత్రం శునకం అపవిత్రమైందని దాని ప్రవేశానికి అడ్డుపడతాడు. విశ్వాసానికి మారుపేరు.. పైగా ఎలాంటి లాభాపేలేకుండా నిస్వార్థంతో తన వెంట నడిచిన శునకానికి అనుమతి ఇవ్వాలంటూ ధర్మరాజు వేడుకుంటాడు. ఆపై ఆ శునకం యమధర్మరాజు పెట్టిన పరీక్షగా తేలడం.. చివరకు ధర్మమే నెగ్గుతుందని చెప్పడంతో ఆ ఘట్టం ముగుస్తుంది. ఇప్పుడు ఈ సందర్భం ఇప్పుడు ఎందుకు అంటారా?.. కేధార్నాథ్ యాత్రలో ఓ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్ దృష్టిని ఆకట్టుకుంటోంది. అదే సమయంలో అభ్యంతరాలు.. ప్రతి విమర్శలు దారి తీసింది అది. నవాబ్ అనే ఓ శునకం.. తన ఓనర్‌తో కలిసి కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో కలియ దిరగడమే ఇందుకు ప్రధాన కారణం. నోయిడాకు చెందిన వికాస్ త్యాగి(33) అనే వ్యక్తి.. ఎక్కడికి వెళ్లినా తన పెంపుడు కుక్క నవాబ్ వెంటపెట్టుకెళ్లడం అలవాటు. ఈ క్రమంలో చార్ధామ్ యాత్రకు వెళ్లిన వికాస్ కూడా నవాబ్‌ను తీసుకెళ్లాడు. View this post on Instagram A post shared by Nawab Tyagi Huskyindia0 (@huskyindia0) కేదార్నాథ్ పుణ్యక్షేత్రం నంది విగ్రహం దగ్గర దాని పాదాలను ఉంచి, నుదుట కుంకుమ కూడా పెట్టాడు. ఈ వీడియో కాస్త ఇన్స్టాగ్రామ్, ఇతర ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యింది. అయితే బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ మాత్రం ఈ వీడియోపై మరోలా రియాక్ట్ అయ్యింది. సదరు భక్తుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బుధవారం ఒక ఫిర్యాదు చేసింది. ఆ విజువల్స్ మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ వాదించింది. అంతేకాదు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది. అయితే వికాస్ మాత్రం తన చర్యను సమర్థించుకుంటున్నాడు. గత నాలుగేళ్లలో నవాబ్ తనతో పాటు దేశంలో ఎన్నో గుడులు తిరిగాడని, అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయని, కానీ, ఇప్పుడు ఈ డ్రామాలు ఎందుకని ప్రశ్నిస్తున్నాడు. ఈ కుక్క కూడా దేవుడి సృష్టిలో భాగమనే అంటున్నాడు. View this post on Instagram A post shared by Nawab Tyagi Huskyindia0 (@huskyindia0) 20 కిలోమీటర్ల ట్రెక్కింగ్ తర్వాత ఆయాలనికి చేరుకున్నాం. దారి పొడువునా ఎంతో మంది భక్తులు.. నవాబ్‌ను దగ్గరికి తీసుకున్నారు. దానితో ఫొటోలు తీసుకున్నారు. ఆ భక్తగణానికి లేని అభ్యంతరం.. కమిటీ వాళ్లకే వచ్చిందా? అని ప్రశ్నిస్తున్నాడు వికాస్. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో వికాస్‌కే విపరీతమైన మద్దతు లభిస్తోంది. స్వర్గారోహణలో యుధిష్ఠిరుడు వికాస్ అయితే.. వెంట వెళ్లిన శునకం నవాబ్ అని పోలుస్తున్నారు. కడకు ధర్మమే నెగ్గుతుందని కామెంట్లు చేస్తున్నారు చాలామంది. చదవండి: అయ్యా ఎమ్మెల్యే సారూ అదేం పని.. వీడియో -
89 ఏళ్ల వయస్సులో కర్ణాటక భక్తురాలి సాహసం
సాక్షి (గద్వాల)మహబూబ్‌నగర్: పర్వత మల్లన్న దంపతుల దర్శనం కోసం వయస్సును సైతం లెక్క చేయక పాదయాత్ర చేస్తోంది కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీశైల మల్లన్న భక్తురాలు బోరమ్మ. పాదయాత్రలో భాగంగా గురువారం మండల కేంద్రానికి చేరుకుంది. 44 ఏళ్లుగా పాదయాత్రగా వెళ్తున్నట్లు వృద్ధురాలు తెలిపింది. స్వగ్రామం కర్ణాటకలోని జవరిగి ప్రాంతానికి చెందిన 89 ఏళ్ల బోరమ్మ ఇప్పటికి పాదయాత్ర కొనసాగిస్తోంది. కరోనా కారణంగా మధ్యలో రెండేళ్లు విరామం తర్వాత ఇప్పుడు తిరిగి కొనసాగిస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాంత వాసులతో అందరిని ఆప్యాయంగా పలుకరించుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఇళ్ల వారి నుంచి తీపి (చక్కెర) తీసుకుని శ్రీశైల మల్లన్నకు నైవేద్యంగా సమర్పిస్తుంది. ఉగాది పండుగ రోజున మల్లన్నను దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతున్నట్లు తెలిపింది. ప్రాణం ఉన్నంత వరకు పాదయాత్ర చేస్తూనే ఉంటానని, తనను మల్లన్ననే నడిపిస్తున్నారని చెప్పారు. కర్ణాటకకు చెందిన మరో భక్తుడు కాళ్లకు కర్రలను కట్టుకుని పాదయాత్ర చేస్తూ, శ్రీశైలంకు గట్టు మీదుగా వెళ్లాడు. చదవండి: ‘సిటీ’జనులకు షాక్..! బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు -
భక్తులు భారీగా..
ఎస్ఎస్ తాడ్వాయి: ములుగు జిల్లా మేడారం జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దాదాపు 50 వేలకు పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన భక్తులు తరలివచ్చి.. జంపన్నవాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఉదయం 11 గంటల వరకే గద్దెలపైకి భక్తులను అనుమతించిన పోలీసులు ఆ తర్వాత గ్రిల్స్‌కు తాళాలు వేశారు. అనంతరం భక్తులు బయటి నుంచే అమ్మవార్లకు మొక్కుకున్నారు. ప్రైవేటు వాహనాల్లో భక్తులు తరలి రావడంతో అక్కడ క్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కా గా.. మేడారం వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి జంపన్న వాగు వద్ద ఫిట్స్‌తో మృతి చెందాడు. -
‘టిప్పు సుల్తాన్ పిలిస్తే పలికిన... రంగనాథుడు!’
సాక్షి, మద్దికెర (కర్నూలు): మండల పరిధిలోని పెరవలి గ్రామంలో ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథుడు పిలిస్తే పలికే దేవుడిగా నిత్యం పూజలందు కుంటున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున భక్తులకు ఒకరోజు మాత్రమే మహా విష్ణువును ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుంటా రు. అయితే పెరవలి శ్రీరంగనాథుడు సతీసమేతంగా 365 రోజులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే భాగ్యం ఈ ఆలయ ప్రత్యేకత. ఇక్కడ స్వామి వారిని దర్శించుకుంటే వైకుంఠంలోని శ్రీమహావిష్ణువును దర్శించుకున్నంత పుణ్యం కలుగుతుందని ప్రతీతి. ఈ నెల 13 తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉత్తర ద్వార దర్శనం చేసుకోనున్నారు భక్తులు. అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకు గరుఢ వాహనంపై స్వామివారు శ్రీదేవి, భూదేవి సతీసమేతంగా గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈఓ మల్లికార్జున, దేవాలయ కమిటీ చైర్మన్ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆలయ చరిత్ర : స్వతహా వైకుంఠ ద్వారం కలిగిన ఈ ఆలయంలో రంగనాథస్వామి, శ్రీదేవి, భూదేవి సతీసమేతుడై పూజలందుకుంటూ నిత్యం ఉత్తరద్వార దర్శన మిస్తున్నారు. స్వామివారు ద్వాదశ అళ్వారులతో వెలిసిన వైష్ణవ క్షేత్రం. తపమాచరించిన రుషుల దర్శనార్థం శ్రీ మన్నారాయణుడే కపిల మహర్షి అవతారమెత్తి ఇచ్చట సాల గ్రామం ఇచ్చట ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. తదుపరి విజయనగరరాజులు హరిహరరాయలు, బుక్కరాయలు క్రీ.శ. 1336–37 సంవత్సరంలో దేవాలయం నిర్మించడంతోపాటు ఆలయ నిర్వహణకు వెయ్యి ఎకరాల మాన్యం ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు : ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఏటా ఫల్గుణ శుద్ధ ద్వాదశి నుంచి బహుళ సప్తమి వరకు బ్రహోత్సవాలు జరుగుతాయి. కర్ణాటకలోని శ్రీరంగ పట్టణం రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్న టిప్పు సుల్తాన్ దండయాత్రలు చేసుకుంటూ ఒకరోజు ఇక్కడి వచ్చారని నానుడి. ఆలయాన్ని ధ్వంసం చేయబోయిన టిప్పు సుల్తాన్‌కు స్వామివారు శక్తిమంతుడని ప్రజలు చెప్పారట. ఈ మేరకు స్వామివారిని పరీక్షించేందుకు ఆయన శ్రీరంగనాథా అని పిలువగా ఓయ్ అంటూ పలికారని నానుడి. దీంతో టిప్పు సుల్తాన్ స్వామివారిని దర్శించుకుని తన అశ్వం ఎంతవరకు పరిగెడితే అంతవరకు స్వామివారికి భూమి ఇచ్చాడనే కథ కూడా ప్రచారంలో ఉంది. -
రంగ రంగ వైభవం.. 19 ఏళ్లకు ఓ సారి
‘రంగ.. రంగ’ నామస్మరణతో శ్రీరంగం పులకించింది. భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథస్వామి ఆలయంలో మంగళవారం వేకువజామున వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. సాక్షి, చెన్నై(తమిళనాడు): 108 వైష్టవ క్షేత్రాల్లో రంగనాథ స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 19 ఏళ్లకు ఓ సారి వైకుంఠ ఏకాదశి వేడుకలు మార్గశిర మాసంలో కాకుండా కార్తిక మాసం ఏకాదశిలో నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది మనవాళ మహామునుల నియమావళి ప్రకారం తైపూసంలో వార్షిక ఉత్సవాలను సైతం ముగించాల్సి ఉంది. దీంతో కార్తిక మాసంలో అధ్యయన ఉత్సవం వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. ఈ నెల 3వ తేదీ నుంచి అత్యంత వేడుకగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో ముఖ్యఘట్టం వైకుంఠ ద్వార ప్రవేశం మంగళవారం కనుల పండువగా జరిగింది. బారులు తీరిన భక్తులు సోమవారం నుంచి ఆలయంలో విశేష పూజలు జరుగుతున్నాయి. స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళవారం వేకువజామున ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజల అనంతరం 4.45 గంటలకు వైకుంఠ ద్వారం తెరిచారు. మూల స్థానం నుంచి స్వామివారు ప్రత్యేక అలంకరణలో పరమపద మార్గం వైపుగా ముందుకు సాగారు. రంగ .. రంగ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అయితే స్వామివారి స్వర్గ ద్వార ప్రవేశం సమయంలో ఆలయ అధికారులు, అర్చకులు మాత్రమే ఉన్నారు. భక్తులను అనుమతించ లేదు. బయట ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. దేవదాయ శాఖ మంత్రి శేఖర్ బాబు, తిరుచ్చి జిల్లా కలెక్టర్ శివరాసులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉదయం 7 గంటల అనంతరం భక్తులను స్వామివారి దర్శనార్థం అనుమతించారు. అప్పటికే కి.మీ కొద్ది భక్తులు ఆలయ పరిసరాల్లో బారులు తీరారు. కరోనా నిబంధనలను అనుసరించి భక్తులను అనుమతించారు. -
Vijayawada: దుర్గమ్మకు కానుకగా డైమండ్ నెక్లెస్
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం భువనగిరికి చెందిన భక్తుడు బి.పూర్ణచంద్రుడు రూ.2.50 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను కానుకగా అందజేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసిన పూర్ణచంద్రుడు దంపతులు ఆలయ పర్యవేక్షకులు బలరామ్‌ను కలిసి నెక్లెస్‌ను అందజేశారు. సుమారు 17 గ్రాముల బంగారం, చిన్న డైమండ్స్‌తో రూపొందించిన ఈ నెక్లెస్‌ను ఉత్సవాలలో అమ్మవారికి అలంకరించాలని దాతలు కోరారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దాతలతోపాటు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యుడు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి తదితరులున్నారు. (సప్తగిరులపై ‘స్నో’యగాలు.. కృష్ణమ్మకు ‘ఇంద్ర’హారం) -
కుడి చేతిలో గద, ఎడమ చేతిలో ‘అరటిపండు’..
జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి): భారతదేశంలోనే విశిష్టమైన హనుమ దివ్యక్షేత్రం. శిఖరం లేని ఆలయం. తెల్ల మద్ది చెట్టే శిఖరం. స్వయంభూ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామిహనుమ కుడి చేతిలో గద, ఎడమ చేతిలో అరటిపండు ఉండి అడుగు ముందుకు వేసినట్టు ఉండటం విశేషం. గద భక్తునికి అభయం, అరటిపండు ఫలప్రదం, ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగా భక్తుల అనుభవం. స్వామి శిరస్సుపై ఐదు శిరస్సుల సర్పరాజంగా మద్దిచెట్టు తొర్ర. భక్తుల పాలిట కొంగుబంగారం మద్ది హనుమ. మద్ది అంజన్న దర్శనం తోనే జన్మ లగ్నాత్ శనిదోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు పోతాయి అని భక్తుల విశ్వాసం మరియు నమ్మిక. మంగళవారం, శనివారం ప్రదక్షిణలు విశేష ఫలప్రదం. మూడు యుగాలతో ముడిపడిన స్థలపురాణం. గర్గ సంహిత, శ్రీమద్ రామాయణం, పద్మ పురాణంలో స్థలపురాణ అంశాలు. భక్తుడి దివ్యకధకు రూపం. భక్తవరదుడై అనుగ్రహించిన అంజన్న కోరికలు తీర్చే కొంగుబంగారం. ఇలా ఎన్నో, ఎన్నెన్నో విశిష్టతలు తో కూడిన ఆంజనేయ సన్నిధి శ్రీమద్దిఆంజనేయస్వామి వారి ఆలయం. జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో ఎర్రకాలువఒడ్డున పచ్చని పొలాల మధ్య అర్జున వృక్షం (తెల్లమద్ది చెట్టు) తొర్రలో కొలువైఉన్న ఆంజనేయస్వామివారి సన్నిధి శ్రీమద్ది ఆంజనేయస్వామి వారి దివ్యాలయం. ఆలయానికి వెళ్లే మార్గం : పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన నగరం ఏలూరు నుండి జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గం లో 48 కిలోమీటర్ల దూరంలో జంగారెడ్డిగూడెం పట్టణానికి 4 (నాలుగు)కిలోమీటర్ల ముందు ఈ క్షేత్రం ఉంది. పశ్చిమగోదావరి జిల్లా వాణిజ్య రాజధాని తాడేపల్లిగూడెం నుండి 56 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఆలయం తెరుచు వేళలు: ప్రతీ రోజూ ఉదయం 6:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు తిరిగి మధ్యాహ్నం 3:00 నుండి రాత్రి 8:30 వరకు, ప్రతీ మంగళవారం మాత్రం వేకువజామున 5:00 గంటల నుండి స్వామివారి దర్శనం భక్తులకు లభిస్తుంది స్థలపురాణం : ఆలయ స్థలపురాణం ప్రకారం మూడు యుగాలకు అనుబందంగా స్థలపురాణం చెప్పబడింది త్రేతాయుగం: రావణుని సైన్యంలోని మద్వా సురుడు అనే రాక్షసుడు సాత్విక చింతనలో రాక్షస ప్రవృత్తిలో కాక ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. సీతామాతను అన్వేషిస్తూ హనుమ లంకను చేరినప్పుడు హనుమ పరాక్రమం ప్రత్యక్షంగా దర్శించి హనుమకు భక్తుడయ్యాడు. రామరావణ యుద్ధంలో రాముని వైపు పోరాడుతున్న హనుమను దర్శించి మనస్సు చలించి అస్త్రసన్యాసం చేసి హనుమా అంటూ తనువు చాలించారు. ద్వాపరయుగంలో : ద్వాపరంలో మధ్వకుడు అనే పేరుతో జన్మించి కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నిలిచి యుద్ధం చేస్తూ అర్జనుని రధం పైనున్న ’జండా పై కపిరాజు’ (ఆంజనేయస్వామి వారు)ను దర్శించి తన గతజన్మ గుర్తుకొచ్చి స్వామిని త్వరితగతిన చేరే క్రమంలో అస్త్రసన్యాసం చేసి ప్రాణత్యాగం చేసుకున్నారు. కలియుగంలో : కలిలో మద్వుడు అనే పేరుతో జన్మించి హనుమ అనుగ్రహం కోసం తపస్సు చేయాలన్న సంకల్పంతో ఎర్రకాలువ ఒడ్డున కుటీరం ఏర్పాటు చేసుకుని ప్రతీ దినం కాలువలో దిగి స్నానం చరించి ఇలా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తున్న సందర్భంలో ఒకరోజు రోజూ లాగునే ఎర్రకాలువలో ఉదయం స్నానం చేసి పైకి వస్తున్న క్రమంలో జారి పడబోయినవుడు, ఎవరో ఆపినట్టు ఆగిపోయారు. ఒక కోతి చేయి అందించి పడకుండా ఆ క్షణంలో ఆపింది. అంతేకాక ఒక ఫలం ఇచ్చి వెళ్ళింది. తన ఆకలి తీర్చడం కోసం ఫలం ఇచ్చిన ఈ వానరం ఎవరో అని మహర్షి ఆలోచించలేదు. అదే క్రమంలో నిత్య అనుష్ఠానం కొనసాగించడం ప్రతీ రోజూ కోతి వచ్చి ఫలం ఇవ్వడం దానిని మద్వమహర్షి స్వీకరించడం జరిగేది. ఒకరోజు తనకు రోజూ ఫలం ఇస్తున్న వానరం హనుమగా గుర్తించి ఇన్నాళ్లు మీతో సపర్యలు చేయించుకున్నానా ! అని నేను పాపాత్ముడను, జీవించి ఉండుట అనవసరం అని విలపించి బాధపడిన సందర్భంలో స్వామి హనుమ ప్రత్యక్షమై మద్వా ఇందులో నీతప్పు ఎంతమాత్రమూ లేదు నీ స్వామి భక్తికి మెచ్చి నేనే నీకు సపర్యలు చేశాను. ఏమి వరం కావాలో కోరుకోమన్నట్టు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. వరప్రదానం :– మీరు ఎల్లప్పుడూ నా చెంతే ఉండాలి స్వామి అని మద్వమహర్షి కోరగా మద్వా నీవు అర్జున వృక్షానివై (తెల్లమద్దిచెట్టు)ఇక్కడ అవతరించు. నేను నీ సమీపంలో శిలారూపంలో నేను స్వయం వ్యక్తమవుతాను.నీ కోరిక ప్రకారం ఎల్లప్పుడూ నీ చెంతే ఉంటూ మన ఇరువురి నామాలతో కలిపి మద్ది ఆంజనేయుడుగా కొలువైవుంటాను అని వరం ఇచ్చి ఇక్కడ వెలిశారు అన్నది స్థలపురాణం. స్వప్నదర్శనం: అనంతర కాలంలో 1966 నవంబర్ 1న ఒక భక్తురాలికి స్వప్నదర్శనం ఇచ్చి తాను ఇక్కడ చెట్టు తొర్రలో ఉన్నట్టు స్వామి చెప్పడంతో పాటు శిఖరం లేకుండా చెట్టే శిఖరంగా ఉత్తరోత్తరా ఆలయ నిర్మాణం చేసినా ఏర్పాటు చేయాలని చెప్పినట్టు స్థానికుల నుండి తెలిసిన స్వప్నవృత్తాంతం. చిన్నగా గర్భాలయం: ముందు కేవలం స్వామి చుట్టూ చిన్న గర్భాలయం నిర్మించారు అనంతరం 40 సంవత్సరాల క్రితం మండపం మరియు ఆలయం నిర్మించారు. తర్వాత విశేష సంఖ్యలో భక్తుల రాకతో ఆలయం పునర్నిర్మాణం జరిగి సకల సౌకర్యాలు ఏర్పాటుచేయబడ్డాయి. మద్ది ఒక దివ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. హనుమద్ దీక్షలు: ప్రతీ సంవత్సరం భక్తులు హనుమద్ దీక్షలు మండల కాలం చేసి స్వామి సన్నిధిలో హనుమద్ వ్రతం రోజు ఇరుముడి సమర్పిస్తారు.ఈ రీతిగా ముందుగా దీక్షా స్వీకారం చేసి హనుమ కృపతో దీక్షను భక్తితో పూర్తిచేస్తారు.మద్దిక్షేత్రంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది. ప్రతిష్ఠితమూర్తులను భక్తులు దర్శించవచ్చు. ప్రదక్షిణలు: స్వామి హనుమ సన్నిధిలో ప్రదక్షిణలు విశేషంగా భక్తులు ఆచరించే ధార్మిక విధి. వివాహం కానివారు,వైవాహిక బంధం లో ఇబ్బందులు ఉన్నవారు,ఆర్ధిక ఇబ్బందులు,వ్యాపారం లో నష్టాలు,ఉద్యోగంలో ఉన్నతి లేనివారు ఇలా ఒకటేమిటి అనేక ఈతిబాధలు ఉండి ఏ పని చేసినా కలిసిరాని వారు ముందుగా స్వామిని దర్శించి తమ కోరికను స్వామికి మనస్సులో విన్నవించి 7 మంగళవారాలు 108 చొప్పున ప్రదక్షిణలు చేసి వారి కోరిక యొక్క తీవ్రతను బట్టి అర్చకస్వాములు సూచించిన విధంగా కొన్నివారాలు ప్రదక్షిణలు చేసి కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం ఇక్కడి భక్తుల నిత్యఅనుభవం. శనిదోషాలు,గ్రహదోషాలు నివారణకు శనివారం పూజ ఇక్కడి విశేషం. అంగారక, రాహు దోషాలు తో పాటు ఎటువంటి దోషాలు అయినా స్వామి పూజలో తొలగుతాయి అన్నది భక్తుల నమ్మిక. ఆధ్యాత్మిక వైభవం :– సువర్చలా హనుమ కల్యాణం ప్రతీ నెలా పూర్వాభాద్ర నక్షత్రం రోజు, పంచామృతాభిషేకం ప్రతీ శనివారం, 108 బంగారు తామలపాకుల పూజ ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో, 108 వెండి తమలపాకుల పూజ ప్రతీ మంగళ, శుక్ర, శనివారాల్లో, ఇంకా నిత్యపూజలు, విశేష పర్వదినాల్లో ప్రత్యేకపూజలు, అష్టోత్తర సేవ జరుగుతాయి. కార్తీకమాసంలో నెలరోజులూ వైభవమే: కార్తిక శుద్ధ పాడ్యమి నుండి కార్తిక అమావాస్య వరకూ కార్తికం లో ప్రతీ మంగళవారం విశేష ద్రవ్యాలతో పూజలు చూసి తరించవలసిందే వర్ణించ వీలుకాని వైభవం. అలాగే హనుమద్జయంతి 5 రోజులు పాంచహ్నిక దీక్షగా నిర్వహిస్తారు. వైశాఖ బహుళ నవమి నుండి వైశాఖ బహుళ త్రయోదశి వరకూ జరుగుతుండగా, పవిత్రోత్సవాలు భాద్రపద శుద్ధ నవమి నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి వరకూ జరుగుతాయి. ప్రవచనాలు, భజనలు, శోభాయాత్ర, తెప్పోత్సవం ఇలా ఒకటేమిటి ప్రతీదీ ప్రత్యేకమే. -
Kurnool: నయనాలప్ప క్షేత్రాన్ని చూసొద్దాం రండి..
కోవెలకుంట్ల (కర్నూలు): కోరిన కోర్కెలు తీరుస్తూ ఓం కారేశ్వరుడు భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచారు. సహజసిద్ధ ఎర్రమల కొండల్లో వెలసిన ప్రముఖ శైవ క్షేత్రమైన నయనాలప్ప క్షేత్రంలో ప్రతి ఏటా కార్తీక మాస సోమవారాన్ని పురస్కరించుకుని ఉత్సవాలు, తిరుణాళ్లను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నయనాలప్ప క్షేత్ర చరిత్ర: కర్నూలు జిల్లాలోని కోవెల కుంట్ల నుంచి జమ్మల మడుగుకు వెళ్లే రహదారిలో సంజామల మండలంలోని అక్కంపల్లె సమీపంలో కొండలో వెలసిన నయనాలప్ప క్షేత్రానికి ప్రత్యేక చరిత్ర ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రానికి చెందిన చెన్నబసప్ప అనే శివభక్తుడు ఈప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ ప్రకృతి సౌందర్యము, కొండగుహలను చూసి ముగ్దుడై కుటుంబసమేతంగా వచ్చి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ స్థిరపడ్డాడు. ఒకరోజు రాత్రి నిద్రిస్తుండగా ఓం అను ప్రణవ శబ్ధం వినబడటంతో లేచి ఆ శబ్ధం ఈశ్వరతత్వమని గ్రహించి శివున్ని ధ్యానించి ఇక్కడ శివాలయం నిర్మించ కోరిక కలదని భార్య శివాంబతో చెప్పారు. ఆలయ నిర్మాణం ఖర్చుతో కూడుకున్నదని ఆలోచన విరమించుకోవాలని భార్య చెప్పగా ప్రశాంత వాతావరణంలో ఆలయం నిర్మించడం వల్ల శివభక్తులను ఉపయోగకరంగా ఉంటుందని శివాలయాన్ని నిర్మించ తలపెట్టారు. శివాలయ నిర్మాణంపై ఏమాత్రం దిగులు చెందాల్సిన అవసరం లేదని, పక్కనే ఉన్న అక్కంపల్లె గ్రామస్తులు మహా భక్తులని, వారిని ఆశ్రయించిన దేవాలయ నిర్మాణం సులభతరమవుతుందని ఓంకారేశ్వరునిగా ఆలయంలో ప్రతిష్టించాలని ఒక రోజు రాత్రి శివుడు కలలో కన్పించి చెప్పడంతో ఈ విషయాన్ని భార్యకు తెలియజేశారు. శివుడు చెప్పినట్లు చేయాలని భార్య సలహా ఇవ్వడంతో చెన్నబసప్పా అక్కంపల్లె చేరుకుని శివుడు కలలో ఆజ్ఞాపించిన విషయాన్ని గ్రామస్తులకు వివరించగా వారు దేవాలయ నిర్మాణానికి చేయూత నిస్తామని చెప్పడంతో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బసప్పా తన దగ్గర ఉన్న ఎద్దులసాయంతో రాళ్లను పైకి చేర్చి ముందుగా తాను పూజిస్తున్న గర్భగుడికి సరిగా కింద భూమిలో నేలగుహ అను పేరుతో పై ఆలయములోకి వచ్చునట్లుగా సోపానములను అమర్చారు. శివ మహిమతో నేల గుహ ఇప్పటికి ఎయిర్ కండీషన్ గదిలా ఉంది. రాత్రి సమయాల్లో శివ మహిమతో రాళ్లు పైకి చేరుతుండటమేకాక, పగలు నిర్మించిన కట్టడాలు సరిగా లేని పక్షంలో చక్కగా సరిదిద్దబడేవని చరిత్ర. ఒక రోజురాత్రి నిద్రిస్తున్న సమయంలో శివాంబ శివాలయ ప్రాంతంలో అలికిడి విని లేచి చూడగా పరమేశ్వరుడు శివగణంబులతో శివాలయ నిర్మాణ విశేషములను తిలకించి వాటికి కావాల్సిన సద్దుబాట్లు చేయించుకున్న దృశ్యాలను చూసి నిశ్చేష్ఠురాలైంది. ఈ విషయాన్ని భర్తను లేపగా శివుడు అదృశ్యమయ్యాడు. శివుని ప్రత్యక్షంకోసం పర్వతం కింద కఠోర తపస్సు చేయగా తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షం కాకుండా అదృశ్యవాణితో బసప్పను దీక్ష విరమించి భార్య, కుమారుడు సుజాతప్పను కలుసుకోవాలని, త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి ఓంకారేశ్వరునిగా తనను ప్రతిష్ఠింపచేసి కాశీ క్షేత్రానికి వెళ్లి అక్కడి నుంచి కాశీ జలాన్ని తెచ్చి అభిషేకించాలని, అప్పుడు దర్శనభాగ్యం కలుగునని పలికెను. దీక్షను విరమించి ఇంటికి చేరుకున్న బసప్ప కాశీ విషయాన్ని భార్యకు చెప్పి మునీశ్వరుల వెంట కాశీకి బయలు దేరాడు. భర్త వెళ్లే సమయానికి శివాంబ రెండు నెలల గర్బవతి. భర్త కాశీకి వెళ్లడంతో ఆమె ప్రతి రోజు పరమేశ్వరుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేది. ఆవుపాలు, నెయ్యితో వీబూది ముద్దలుగా చేసి గదిలో భద్రపరిచేది. శివాంబకు అచ్చం తన పోలికలతో కూడిన కుమార్తె జన్మించడంతో శరణమ్మనామకరణం చేసి 16 సంవత్సరాల పాటు కఠోరంగా శివున్ని ప్రార్థించింది. ఒక రోజు శివాంబ బిక్షాటనకై అక్కంపల్లె గ్రామానికి వెళ్లగా ఆ సమయంలో కాశీ నుంచి బసప్ప ఇంటికి చేరుకున్నాడు. ఆయన రాకను చూసిన మునులు మీ తండ్రి కాశీ క్షేత్రం నుంచి వచ్చాడని చెప్పడంతో శరణమ్మ కలశంతో నీటిని తెచ్చి తండ్రి పాదములు కడుగుటకు ఎదురుగా వచ్చింది. బపస్ప కాశీ క్షేత్రానికి వెళ్లే సమయానికి భార్య గర్భవతని, తనకు కుమార్తె పుట్టిన విషయం తెలియకపోవడంతో బసప్ప కలశంతో నీళ్లు తెచ్చిన శరణమ్మ తన భార్యగా భావించి ముసలితనంలో ప్రాయం వచ్చనా అన్న మాటలు అనడంతో వెంటనే తండ్రి మనోభావాన్ని గ్రహించిన కుమార్తె తండ్రి వద్దకు వెళ్లి నేను నీ కుమార్తెనని తెలిపింది. దీంతో బసప్ప కుమార్తెను అక్కున చేర్చుకుని తాను పొరబడ్డానని బాధించి ఓంకారేశ్వరుని సన్నిధికి చేరుకుని నయనములు కల్గి ఉండుటవల్లే ఈ తప్పిదం జరిగిందని, ఈ నయనములు ఉండటానికి వీల్లేంటూ రెండు కళ్లూ పీకి శివసన్నిధిని ఉంచారు. భార్య, పిల్లలు ఎంత చెప్పినప్పటికీ వినకుండా అంధత్వ జీవితం భరించుట సాధ్యం కాదని, జీవసమాధి అయ్యారు. కొంతకాలానికి ఎద్దులు కూడా మృతి చెందటంతో బసప్ప పక్కనే వాటిని సమాధి చేశారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలైన శ్రీశైలం, మహానంది తర్వాత అంతటి ప్రాధాన్యత నయనాలప్ప క్షేత్రానికే ఉంది. ఓంకారేశ్వర ఆలయంలో బసప్ప పూజలు నిర్వహించిన నేలగుహ ఇప్పటికి చెక్కు చెదరలేదు. నేలగుహలో ప్రతిష్టించిన శివలింగానికి బసప్ప పూజలు చేసేవారు. శివమహిమతో ఉన్న ఈ గుహను అలాగే ఉంచి దానిపై ఆలయాన్ని నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఆలయం ఉన్న గర్భగుడిలో నేలగుహ ఎయిర్‌కండీషన్ గదిని పోలి ఉంది. ఇది నయనాలప్ప క్షేత్రంలో ఉన్న ప్రత్యేకత. ఓంకారేశ్వర క్షేత్రంలో కార్తీక కడసోమవార ఉత్సవాలు: ప్రతిఏటా కార్తీక మాసంలో ఓంకారేశ్వరస్వామి క్షేత్రంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కార్తీకమాస కడ సోమవారాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో మూడు రోజులపాటు తిరుణాల ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది శుక్రవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండగా కడ సోమవారాన్ని పురస్కరించుకుని క్షేత్రంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం, ధ్వజరారోహణ నిర్వహిస్తారు . అదేవిధంగా.. స్వామివార్ల గ్రామోత్సవం, కోలాటాలు, హరిభజనలు, భక్తిరసపూరిత కార్యక్రమాలు, హరికథా కాలక్షేపం, నాటకాలు, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా నుంచేకాక కడప, అనంతపురం జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు క్షేత్రాన్ని చేరుకుని ఓంకారేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు. నయనాలప్ప క్షేత్రానికి ఇలా చేరుకోవాలి: కర్నూలు జిల్లా కేంద్రం నుంచి బేతంచెర్ల, బన గానపల్లె, కోవెలకుంట్ల, మాయలూరు మీదుగా సంజామల మండలం అక్కంపల్లె గ్రామ శివారు నుంచి నయనాలప్ప క్షేత్రానికి చేరుకోవచ్చు. నంద్యాల నుంచి గోస్పాడు, కోవెలకుంట్ల మీదుగా, ఆళ్లగడ్డ నుంచి పెద్దముడియం మీదుగా, వైఎస్ఆర్ జిల్లా నుంచి భక్తులు జమ్మలమడుగు, ఉప్పలపాడు, నొస్సం మీదుగా నయనాలప్ప క్షేత్రానికి చేరుకోవచ్చు. -
TTD: టీటీడీ సేవలన్నింటికీ ఒకే యాప్
సాక్షి, తిరుమల(చిత్తూరు): తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అందించే సేవల వివరాలన్నీ ఒకే యాప్‌లో పొందు పరిచేందుకు జియో సంస్థతో దేవస్థానం అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. తిరుమల అన్నమయ్య భవన్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సమక్షంలో అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, జియో ప్రతినిధి అనీష్ ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీచేయడంతో ఒకేసారి లక్షలాది మంది భక్తులు ప్రయత్నించడంతో టీటీడీ సర్వర్లలో సమస్యలు తలెత్తాయని చెప్పారు. వీటిని అధిగమించేందుకు జియో సంస్థ సహకారం తీసుకున్నామన్నారు. టీటీ డీకి సంబంధించిన సమస్త సేవలు, సమాచారం ఒకేచోట లభించేలా జియో ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేయడానికి ముందుకొచ్చిందని ఆయన తెలిపారు. ఇందులో భక్తులకు అవసరమైన వసతి, దర్శనం లాంటి సకల సేవలు అందుబాటులో ఉంటాయ న్నారు. రాబోయే వైకుంఠ ఏకాదశి రోజున ఈ యాప్‌ను ఆవిష్కరించేలా ఏర్పాటు చేయాలని చైర్మన్ కోరారు. ఐదేళ్లుగా టీటీడీకి ఉచితంగా సాంకేతిక సహకారం అందిస్తున్న టీసీఎస్ సమన్వ యంతో జియో సంస్థ ఉచితంగా టీటీడీ ఐటీ విభాగానికి మెరుగైన సేవలు అందిస్తోందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
Vijayawada: ఉత్సవాలపై ‘పచ్చ’విషం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు రోజుకో దుష్ప్రచారాన్ని తెరపైకి తెస్తున్న విపక్ష టీడీపీ చివరికి పవిత్ర ఉత్సవాలను సైతం విడిచి పెట్టలేదు. దసరా ప్రాశస్త్యం, భక్తుల మనోభావాలను గాయపరుస్తూ అపచారానికి తెగించింది. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకల కోసం అమ్మవారి ఆలయానికి చేసిన విద్యుద్దీపాలంకరణ ఫొటోలను మార్ఫింగ్ చేసి తనకు అలవాటైన రీతిలో దుష్ప్రచారానికి పాల్పడింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే దసరా ఉత్సవాల్లో కూడా విపక్షం ఇలా వ్యవహరించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. పోలీసు శాఖ ఫ్యాక్ట్ చెక్ ఈ కుట్రను బట్టబయలు చేసింది. మార్ఫింగ్ ఫొటోలతో దుష్ప్రచారం.. ఇంద్రకీలాద్రిపై విద్యుద్దీపాలంకరణ దృశ్యాలంటూ టీడీపీతోపాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు గురువారం ఓ ఫొటోను సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చాయి. కనకదుర్గమ్మ ఆలయం చుట్టూ కేవలం నీలం రంగు విద్యుద్దీపాలనే అలంకరించినట్లుగా ఆ ఫొటోలో ఉంది. ‘వైఎస్సార్ పార్టీ కార్యాలయం అనుకునేరు.. కాదు... విజయవాడ కనకదుర్గమ్మ గుడి’ అంటూ ఆ ఫొటోపై వ్యాఖ్యను జోడించింది. ఇంద్రకీలాద్రిని వైఎస్సార్సీపీ కార్యాలయంగా మార్చేశారంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటోను వైరల్ చేశారు. వాస్తవం ఏమిటంటే... ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. కనకదుర్గమ్మ ఆలయంతోపాటు ఇంద్రకీలాద్రి మొత్తాన్ని రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించించింది. ఆలయ స్వర్ణ గోపురం శోభాయమానంగా భాసిల్లుతుండగా ప్రాకారం చుట్టూ అలంకరించిన విద్యుద్దీపాలు సప్తవర్ణ శోభితంగా కాంతులీనుతూ కన్నుల పండుగ చేస్తున్నాయి. అన్ని రంగుల విద్యుద్దీపాలూ వరుస క్రమంలో(సీరియల్ లైట్లు) వెలుగుతూ సముద్రతీరంలో కెరటాలను తలపించే రీతిలో కాంతి తరంగాలను ప్రసరింపజేస్తూ అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక శోభను కలిగిస్తున్నాయి. ఇందులో ఏ ఒక్క రంగూకు ప్రత్యేక ప్రాధాన్యమంటూ లేదు. ఏ ఒక్క రంగూ స్థిరంగా ఉండదు. అన్ని రంగుల్లోనూ విద్యుద్దీపాలు కాంతులీనుతూ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలను మరింత శోభాయమానం చేస్తున్నాయి. ‘ఫ్యాక్ట్ చెక్’ ఏం తేల్చింది? టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చిన ఫొటోను గుర్తించిన కొందరు భక్తులు నిజానిజాలు తెలుసుకునేందుకు చొరవ చూపారు. పోలీసు శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి ఈ విషయాన్ని నివేదించడంతో వెంటనే స్పందించింది. ఫ్యాక్ట్‌చెక్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిశితంగా పరిశీలించగా అవి మార్ఫింగ్ చేసిన ఫొటోలని నిగ్గు తేలింది. ఇంద్రకీలాద్రిపై సీరియల్ లైట్లతో విద్యుద్దీపాలంకరణలో ఏ ఒక్క రంగుకూ ప్రాధాన్యమివ్వలేదని, సప్త వర్ణాల విద్యుద్దీపాలతో అలంకరించారని వెల్లడైంది. అదే విషయాన్ని పోలీసు శాఖ సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడించింది. దుష్ప్రచారంపై విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
TTD: 25 నుంచి ఆన్లైన్లో శ్రీవారి సర్వ దర్శన టికెట్లు
సాక్షి, చిత్తూరు: ఈనెల 25వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి సర్వ దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తీసుకువస్తేనే అనుమతి ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8 వేల సర్వ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. సర్వదర్శనం టోకెన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 26 నుంచి తిరుపతిలో ఆఫ్‌లైన్ సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయనున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లను సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం వస్తుండడంతో కరోనా వ్యాప్తి అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ కానీ, దర్శనం సమయానికి మూడు రోజుల ముందు కరోనా పరీక్ష చేయించుకుని తెచ్చుకున్న నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి. కోవిడ్ నియంత్రణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయానికి భక్తులు సహకరించాలని వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. అక్టోబరు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు సెప్టెంబరు 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని ఛైర్మన్ తెలిపారు. చదవండి: ‘పరిషత్’ పీఠాలలో మహిళలకు అగ్రాసనం ఈ నెల 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ ద్వారా సర్వ దర్శనం టికెట్లను విడుదల చేయనున్నాము. https://t.co/eUEh5QGKZN ద్వారా ఆన్లైన్లో టికెట్లు పొందవచ్చును. అక్టోబర్ నెల కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ 300 టికెట్లను సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తాము. — Y V Subba Reddy (@yvsubbareddymp) September 22, 2021 -
Varalaxmi Vratham: మహిళల ప్రత్యేక పూజలు
సాక్షి,ఖమ్మం: శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. ఈరోజు వీలుకాకపోతే వచ్చే శుక్రవారాల్లో కూడా వ్రతాన్ని ఆచరించవచ్చని అర్చకులు చెబుతున్నారు. ఈ మేరకు మహిళలు పూలు, ఇతర పూజా సామగ్రి కొనుగోలు చేస్తూ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇక ఆలయాల్లో ప్రత్యేక పూజలు , వ్రత నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళకరం... ఇళ్లలో వరలక్ష్మి వ్రతం ఆచరించే మహిళలు పూజా మందిరంలో ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి చిత్రపటాన్ని అమరుస్తారు. ఆ తర్వాత వ్రతం ఆచరించి చుట్టుపక్కల మహిళలను పిలిచి వాయినాలు ఇస్తారు. ఇళ్లలో కుదరని వారు దేవాలయాల్లో జరిగే సామూహిక వ్రతాల్లో పాల్గొంటారు. ఇందుకోసం ఖమ్మం నగరంలోని పలు ఆలయాల్లో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తితో వేడుకుంటే కోరిన వరాలను ప్రసాదించే కల్పవల్లి వరలక్ష్మీదేవి అని నమ్మిక. ఏ నియమాలు, మడులు అవసరం లేకుండా నిర్మలమైన మనస్సు, నిశ్చలమైన భక్తి, ఏకాగ్రతతో ఈ వ్రతం ఆచరించొచ్చని అర్చకులు చెబుతున్నారు. సకల శుభాల కోసమే కాకుండా దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలని మహిళలు ఈ వ్రతం ఆచరిస్తుంటారు. -
పూజారిపై మండిపడ్డ తహశీల్దార్.. ఎందుకంటే..
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): బెళగావి జిల్లా కాగవాడ తాలూకా ఐనాపురలో అమ్మవారు కన్ను తెరిచారని ప్రచారం జరగడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కొన్ని స్థానిక టీవీ చానెళ్లలో కూడా ప్రచారం సాగడంతో జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. ఆశ్చర్యపోయిన కాగవాడ తహశీల్దార్ ప్రమీళా దేశ్‌పాండే ఈ కాలంలో దేవి కన్ను తెరవడం ఏమిటని ఐనాపురకు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. పూజారి విగ్రహంపై అంటించిన కన్ను రూపాన్ని తహసీల్దార్ తీసేయించారు. దేవుని పేరుతో ప్రజలను మభ్యపెట్టవద్దని పూజారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: వామ్మో.. మాయ మాటలు చెప్పి ఎంత పనిచేశాడు.. -
Photo Story: కుండపోత వాన, పర్యాటకుల సందడి, ఆరుద్ర ఆగమనం
వర్షాల కోసం భీంసన్ దేవుడికి పూజలు బేల(ఆదిలాబాద్): మండలకేంద్రంలోని ఆదివాసీ పర్దాన్లు వర్షాలు సమృద్ధిగా పడాలని ఆదివారం భీంసన్ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక ఇందిరా నగర్‌కాలనీలో భీంసన్ దేవుడికి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించారు. కుండపోత వర్షం వేములవాడ : వేములవాడలో ఆదివారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలుల కారణంగా సెస్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. పలు గ్రామాల్లో పత్తి చెళ్లలో వర్షపు నీరు నిలిచింది. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు–కందికట్కూర్ గ్రామాల మధ్య ఉన్న సుద్ద ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు నిలిచిపోయాయి. కుంటాల జలపాతం వద్ద పర్యాటకుల సందడి వరుసగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. లాక్డౌన్ కారణంగా పర్యాటకులను అనుమతించకపోవడంతో ఇన్ని రోజులు నిర్మానుష్యంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, ఆదివారం కలిసి రావడంతో హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం వద్ద స్నానాలు చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ ఆరుద్ర.. ఆగమనం ఏడాది మొత్తంలో ఆరుద్రకార్తెలో మాత్రమే ఆరుద్ర పురుగులు దర్శనమిస్తాయి. ఆరుద్ర కార్తెకు రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పురుగుల ఆగమనాన్ని అన్నదాతలు శుభసూచకంగా భావిస్తారు. ఆదివారం నెన్నెల శివారులోని చేన్లలో ఆరుద్ర పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడి, పంటలు బాగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. – నెన్నెల విరబూసిన ‘బ్రహ్మ కమలం’ రెబ్బెన(ఆసిఫాబాద్): అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మకమలం రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్లో దర్శనమిచ్చింది. బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా వర్క్‌షాప్ డీజీఎంగా పనిచేస్తున్న శివరామిరెడ్డి నివాసంలో ఈ బహ్మకమలం వికసించింది. కొద్ది గంటలు మాత్రమే పూర్తిగా వికసించే ఈ పుష్పం ఆపై ముడుచుకుంటుంది. శివరామిరెడ్డి సతీమణి సృజన మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బ్రహ్మకమలం వికసిస్తుందని తెలిపారు. అలాంటి అరుదైన పుష్పం పూయటం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. -
Kondagattu: అంజన్న భక్తులకు శఠగోపం..
సాక్షి, కొండగట్టు(జగిత్యాల): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీఆంజనేయస్వామి సన్నిధిలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి అక్రమాలను అడ్డుకునేందుకు కొండపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకుండాపోతోంది. అంజన్న దర్శనం కోసం తరలివస్తున్న భక్తుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. 20 కెమెరాలు.. రూ.10లక్షల వ్యయం భక్తుల రక్షణ, అక్రమాలు అరికట్టే ఉద్దేశంతో ఐదేళ్లక్రితం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో 20 కెమెరాలకు రూ.8లక్షల – రూ.10లక్షల వరకు వె చ్చించారు. ఆలయంలో 16, వై జంక్షన్ వద్ద రెండు, ఇతర ప్రదేశాల్లో మరోరెండు సీసీ కెమెరాలు బిగించారు. ఆలయంలోని టెంకాయ కొట్టేచోట కెమెరా లేదు. టెండర్‌దారులు భక్తుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకొని వె ళ్తున్న వారిని కొందరు అర్చకులు మరీ పిలిపించుకు ని గోత్రానామాలు చదవడం, స్వామివారి కుంకు మ, పండ్లు ఇవ్వడం ద్వారా రూ.100 – రూ.500వరకు దండుకుంటున్నారు. ఈ తంతు సీసీ కెమెరాల సాక్షిగా సాగుతోంది. అయినా వారిలో భయం, భక్తీలేదు. రూ.వేలల్లో వేతనాలు తీసుకునే అర్చకులు.. ఆలయ హుండీల్లోకి వెళ్లే సొమ్మును సైతం తమ జేబుల్లోకి మళ్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హిందూ వాహిని సంస్థకు చెందిన కొందరు.. భక్తుల నిలువుదోపిడీ చూడలేక ఇటీవల ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో అర్చకులు, టెంకాయ కొట్టేచోట దోపిడీ ఆగినా.. కరోనా లాక్డౌన్ ఎత్తివేశాక.. ఇప్పుడు మళ్లీ మొదలైంది. కెమెరాల ముందే దోపిడీ జరుగుతున్నా.. ► ఇప్పటికే ఆలయంలోని పలుచోట్ల 20 సీసీ కెమెరాలు ఉన్నాయి. మరో 30 కెమెరాలు ఏర్పాటుచేస్తే అంతటా నిఘా ఉంచినట్లవుతుంది. ► ఇటీవల రూ.10లక్షలు వెచ్చించి మరికొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఈ ప్రోక్యూర్మెంట్ పిలిచారు. ► రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సాక్షిగా భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు. అయినా పట్టించుకునే నాథుడేలేడు. ► ఇప్పటికిప్పుడు రూ.10లక్షలు వెచ్చించి కెమెరాలు ఏర్పాటు చేసినా ఎవరు పర్యవేక్షిస్తారో అధికారులకే తెలియాలి. ► ఇదే సొమ్ముతో ఆలయ అధికారులు నేరుగా కెమెరాలు కోనుగోలు చేస్తే రూ.5లక్షల లోపే ఖర్చవుతుందని భక్తులు అంటున్నారు. ► రూ.లక్ష వెచ్చించి నిరంతరం సీసీ కెమెరాలను పర్యవేక్షించినా రూ.6లక్షల్లో ఈప్రక్రియ పూర్తవుతుందని, ఇందుకు రూ.4లక్షలు చేర్చి రూ.పదిలక్షలతో టెండర్ పిలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. నిఘా వ్యవస్థ పనిచేస్తే.. ► భక్తుల భద్రతకు ఢోకా ఉండదు. ► కట్నాలు, కానుకల రూపంలో స్వామివారికి సమర్పించే సొమ్మంతా హుండీల్లోకే వెళ్తుంది. ► తద్వారా అంజన్న ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ► దొంగలు, అక్రమాలకు పాల్పడేవారు ఆలయ పరిసరాల్లోకి వస్తే గుర్తుపట్టడం సులభమవుతుంది. ► ఇతరత్రా నేరాలు, అఘాయిత్యాలు అరికట్టే వీలుంటుంది. ► సీసీ ఫుటేజీలు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారుతాయి. నిఘా ఉన్నా భయం లేదు కొండపై టెంకాయ కొట్టేచోట కొందరు అర్చకులు భక్తులను దోపిడీ చేస్తున్నారు. మేం ఈవోకు ఫిర్యాదు చేశాం. ఆయన స్పందించి అక్రమార్కులను హెచ్చరించారు. కొద్దిగా దోపిడీ తగ్గింది. ఇప్పుడు మళ్లీ భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పనిచేస్తే అక్రమార్కులపై చర్య తీసుకునే అవకాశం ఉంది. – కె.అనిల్‌గౌడ్, హిందూ వాహిని ప్రతినిధి, కొడిమ్యాల రూ.లక్షలు వృథా ఎందుకు? గతంలో పదిలక్షల రూపాయలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటితో ఎవరూ భయపడతలేరు. ఇప్పుడు మరో పదిలక్షల రూపాయలతో మళ్లీ సీసీ కెమెరాలు పెడితే ఏం లాభం? వాటి నిర్వహణకు ఓ టెక్నీషియన్‌ను నియమించండి. ఆ పనిచేయకుండా సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేసినా వృథానే. – ఎ.వపన్ భక్తుడు, జగిత్యాల బాధ్యులపై చర్యలు తప్పవు కొండపై భక్తులను ఇబ్బందులకు గురిచేస్తే వారు ఎవరైనా చర్యలు తప్పవు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ఈ ప్రొక్యూర్మెంట్ పిలిచాం. ఫ్రైస్ బిడ్ ఫైనల్ కాలేదు. సీసీ కెమెరాల ఏర్పాటు టెండర్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వారి ఆదేశాల మేరకు టెండర్ ఫైనల్ చేస్తాం. ఎలాంటి అపోహలకు తావులేదు. –ఎ.చంద్రశేఖర్, ఈవో చదవండి: బాధిత కుటుంబాలకు తక్షణమే సాయం -
మొహమాటం ఖరీదు రూ.3 లక్షలు.. కొండగట్టులో వింత ఆచారం
సాక్షి, కొండగట్టు(కరీంనగర్): కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయం తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. రోజూ వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కోరిన కోర్కెలు తీరడంతో మొక్కులు చెల్లించుకుంటారు. ఈసందర్భంగా ఆలయానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ఇలా వచ్చే నిధులను భక్తుల సౌకర్యాలు, వసతుల కల్పనకు వెచ్చించాల్సి న ఆలయ యంత్రాంగం.. వీఐపీలు, వీవీఐపీల సందర్శనల సందర్భంగా మొహమాటానికి వెళ్తోంది. ఆలయ నిబంధనల మేరకు శాలువాలతో ప్రముఖులను సత్కరించడం ఆనవాయితీ. కానీ, వారితో వచ్చే చిన్నాచితకా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులను సైతం సన్మానిస్తోంది. ఇందుకోసం లెక్కకు మించి శాలువాలను వృథా చేస్తోంది. ఏటా వందమందికిపైగా వీఐపీల రాక.. కొండగట్టులోని శ్రీ ఆంజనేయస్వామి దర్శనం కోసం ఏటా 100 మందికిపైగానే వీఐపీలు తరలివస్తుంటారు. వారు స్వామివారిని దర్శించుకుని వెళ్లంటారు. ఈసమయంలో ఆలయ అధికారులు ప్రముఖులను శాలువాలు, కండువాలతో సన్మానిస్తున్నారు. అయితే, స్వామివారి దర్శనం కోసం వచ్చే ప్రముఖులు ఒకరిద్దరు ఉంటే.. వారివెంట చిన్నాచితకా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఒక్కోసారి అధికారులూ లెక్కకు మించి ఉంటున్నారు. కొందరి పర్యటనలో 25 మంది – 30 మంది వరకు ఉంటే.. మరికొందరి వెంట ఆ సంఖ్య రెట్టింపుకన్నా అధికంగానే ఉంటోంది. కరోనా సమయంలోనూ ఒకరిద్దరు రావాల్సి ఉండగా, పదుల సంఖ్యలో హాజరవడం విస్మయం కలిగించింది. ప్రముఖులు పూజలో కూర్చుండగానే వారి అనుయాయులూ అనుసరిస్తున్నారు. ఎంతైనా ప్రముఖులతోనే వచ్చారు కదా, వారిని కూడా సత్కరించకుంటే వీఐపీలు ఏమనుకుంటారోనని మొహమాటానికి గురవుతున్నారు అధికారులు. దీంతో ప్రముఖుల వెంట వచ్చిన అనధికారులను సైతం శాలువాలు, కండువాలతో సన్మానిస్తున్నారు. క్యూలైన్లలో తాగునీటికి తిప్పలు.. అంజన్న దర్శనం కోసం క్యూలైన్లలో వెళ్తున్న భక్తులు తాగునీటి సౌకర్యంలేక తపిస్తున్నారు. అనధికారులకు వెచ్చిస్తున్న సొమ్ముతో క్యూలైన్లలో తాగునీటి సౌకర్యం కల్పిస్తే సమస్య పరిష్కారమవుతుందని కొందరు అధికారులు భావిస్తున్నా.. ఆ దిశగా చర్యలు తీసుకునే నాథుడే లేకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో శాలువా ధర రూ.25– రూ.200.. నాణ్యత, బ్రాండ్‌ను బట్టి ఒక్కో శాలువా రూ. 25–200 వరకు ధర ఉంటుంది. అయితే, కేవలం ప్రముఖులనే సన్మానిస్తే అంజన్న ఆలయంపై ఏటా సుమారు రూ.లక్ష వరకే ఉంటుందని అంచనా. కానీ, అనధికారులనూ సన్మానిస్తుండడంతో శాలువాలు, కండువాలు అధికంగా వినియోగించాల్సి వస్తోంది. తద్వారా అంజన్నపై ఏటా రూ.3లక్షల వరకు భారం పడుతోంది. ఇదంతా భక్తుల ద్వారా ఆలయానికి సమకూరిన సొమ్మే. దీనిని ఇష్టం వచ్చిన వారికి వెచ్చించడం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. చదవండి: CM KCR: ‘టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్’గా ఆస్పత్రి -
పూజకు వేళాయే.. తరలివచ్చిన భక్తజనం.. లఘు దర్శనాలకే అనుమతి
సాక్షి, వేములవాడ: ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయడంతో 40 రోజులుగా మూసి ఉంచిన వేములవాడ రాజన్న ఆలయాన్ని ఆదివారం ఉదయం ఆలయ అధికారులు తెరిచారు. దీంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం కేవలం స్వామివారి లఘు దర్శనం, కల్యాణకట్టలో తలనీలాల సమర్పణ, స్వామివారి ప్రసాదాలను మాత్రమే అనుమతించారు. గర్భగుడి దర్శనాలు, ధర్మగుండం ప్రవేశం నిలిపివేశారు. కోడె మొక్కులు చెల్లించుకునే అంశంపై తుదినిర్ణయం తీసుకుంటామని ఆలయ ఏఈవో హరికిషన్ తెలిపారు. జోరందుకున్న పుట్టువెంట్రుకలు ప్రభుత్వం అన్‌లాక్ ప్రకటించడంతో పాటు ఆదివారం మంచిరోజు కావడంతో చిన్నారుల పుట్టు వెంట్రుకలు తీసేందుకు కుటుంబాలతో వచ్చిన వారితో ఆలయ ఆవరణ కిటకిటలాడింది. అలాగే కల్యాణకట్టలోనూ మొక్కులు చెల్లించుకున్నారు. కొత్త పెళ్లి జంటలు సైతం తమ ఇలవేల్పు రాజన్నను కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. చాలా రోజుల తరువాత రాజన్నను దర్శించుకున్నామంటూ జనం సంబరపడిపోయారు. స్థానికుల దర్శనాలు మూడు మాసాలుగా రాజన్న గుడి మెట్లు ఎక్కని స్థానికులు ఆదివారం వేకువజాము నుంచే స్వామి సన్నిధికి చేరుకుని దర్శించుకున్నారు. మే 12 ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌కు ముందునుంచే రాజన్న ఆలయాన్ని అధికారులు సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించడం, సెకండ్ వేవ్‌తో చాలా మంది మృతిచెందడంతో స్థానికులు రాజన్న గుడివైపు వెళ్లలేకపోయారు. పాజిటివ్ కేసులు తగ్గడం, ప్రభుత్వం అన్‌లాక్ ప్రకటించడంతో పురప్రముఖులు, స్థానికులు దర్శనం కోసం క్యూ కట్టారు. పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. చదవండి: సప్త మాతృకలకు బంగారు బోనం.. -
యాదాద్రిలో వేసవిలోనూ హరితమయ శోభ..
సాక్షి, యాదగిరిగుట్ట(యాదాద్రి భువనగిరి) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధితో పాటు కొండకు దిగువన ఉన్న ప్రాంతాలు హరితమయంగా కనిపిస్తున్నాయి. ఆకుపచ్చని మొక్కలతో యాదాద్రి కొండ చుట్టూ ఉన్న ప్రాంతాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆలయానికి వచ్చే చాలా మంది భక్తులు ఆ పచ్చదనంతో శోభను చూసి ఆనందపడుతున్నారు. వేసవిలోనూ.. రంగురంగుల పూల మొక్కలు.. ఆకర్షించే గ్రీనరీ.. పది అడుగుల మొక్కలు క్షేత్రానికి వచ్చే భక్తులను ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదంలోకి తీసుకెళ్తున్నాయి. మండుతున్న ఎండలకు భక్తులు, స్థానికులు ఈ పచ్చని అందాలను వీక్షిస్తూ సేద తీరుతున్నారు. ఈ మొక్కల సంరక్షణకు నిత్యం కూలీలు శ్రమిస్తున్నారు. -
కోవిడ్ ఎఫెక్ట్: 90 రోజుల వరకు శ్రీవారి దర్శన అవకాశం
సాక్షి, తిరుమల: ఆన్లైన్లో రూ.300 టికెట్ బుక్ చేసుకుని ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి రావాల్సిన భక్తులు.. కోవిడ్ కారణంగా రాలేని పరిస్థితుల్లో ఉంటే వచ్చే 90 రోజుల వరకు వారు దర్శన అవకాశాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. కోవిడ్ కేసులు పెరిగిన నేపథ్యంలో టీటీడీ పలు నిర్ణయాల ను తిరిగి అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీని నిలిపేసింది. దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడే భక్తులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. తిరుమలలో దివ్యప్రబంధ పారాయణం రామానుజాచార్యుల వారి 1,005వ అవతార మహోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల పెద్దజీయర్ మఠంలో ఆదివారం రామానుజ నూట్రందాది దివ్యప్రబంధ పారాయణాన్ని నిర్వహించారు. టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి 11 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. మానవాళికి కరోనా ముప్పు తొలగించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ చేపడుతోన్న కార్యక్రమాల్లో భాగంగా ఈ పారాయణాన్ని నిర్వహించారు. పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు, వారి శిష్యబృందం, ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి ఆచార్య కె.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి
మహా సంగీతవేత్త అయిన జయదేవుడు కృష్ణభక్తుడు. ఒడిశా రాష్ట్రంలోని కెంధు బిల్వా అనే ప్రదేశంలో భోజదేవుడు, రమాదేవి అనే దంపతుల కడుపున పుట్టాడు. కారణ జన్ముడు. భార్య పద్మావతీ దేవి. 8 అంగాలుగా ఉండేటట్టు రాయడంతో ఆయన కీర్తనలు జయదేవుడి అష్టపదులుగా ప్రసిద్ధి. ఆయన పాట పాడుతుంటే ఆమె నృత్యం చేసేది. జయదేవుని కీర్తనకు నర్తన చేసేటప్పుడు ఆమె పాదం లయ తప్పకుండా ఉండేటట్లు కృష్ణ పరమాత్ముడు జాగ్రత్తపడేవాడట. భక్తులందరూ ఆయన పాదాలవంక చూస్తుంటే ఆయన మాత్రం ఆమె పాదాలు జయదేవుని కీర్తనలకు అనుగుణంగా పడేటట్లు శ్రద్ధ చూపడంతో ఆయనకు ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ అని ప్రస్తుతించారు. ఒకసారి జయదేవుడు అష్టపదుల రచన చేస్తున్నాడు. ఒక సన్నివేశంలో–‘‘ ప్రియే చారుశీలే! స్మరగరళ ఖండనం మమతిరతి మండనం దేహిపదపల్లవ ఉదారం...’’ అని రాశాడు. అంటే ‘ఓ రాధా! నీ పైన ఉండే విశేషమైన అనురాగంతో మన్మథ బాణాలు నామీద పడి మదనతాపం అనే విషం నా తలకెక్కిపోతున్నది. వేడి తగ్గటం లేదు. ఒక్కసారి పల్లవమైన చల్లని నీ పాదాన్ని తీసి నా తలమీద పెట్టవూ...’ అని కృష్ణుడు అన్నట్లుగా రాసాడు. రాసిన తరువాత ఆయనకు – ‘ఎంత రాధమీద ప్రేమ ఉంటే మాత్రం...రాధా! నీ మీద నాకున్న మోహం చేత మదనతాపం కలిగి వేడెక్కిన నా తల మీద నీ పాదం పెట్టు..’ అంటాడా భగవానుడు.. అనడు. అందువల్ల నేనిలా రాయకూడదు. మరోలా రాయాలి.. అని ఆ చరణాలు కొట్టేసి.. ఘంటం పక్కనపెట్టి– ‘‘పద్మావతీ! స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తా..’ అని చెప్పి అభ్యంజనానికి బయల్దేరాడు. అభ్యంజనం...అంటే ఒంటినిండా నూనె రాసుకుని వెళ్ళి స్నానం చేయడం. ఇలా గడప దాటాడో లేదో మళ్ళీ జయదేవుడు వెనక్కి వచ్చాడు...‘‘అదేమిటి మళ్ళీ వచ్చారు?’ అని పద్మావతీ దేవి అడిగితే ..‘‘అష్టపది పూర్తిచేయడానికి మంచి ఆలోచన వచ్చింది. ..’ అంటూ పూర్తి చేసి వెళ్లిపోయాడు. కొంతసేపటి తరువాత నదీస్నానం ముగించుకుని జయదేవుడొచ్చాడు. తాను రాసిన పుస్తకం మీద నూనెబొట్లు పడి ఉన్నాయి. ‘‘పద్మావతీ, ఇదేమిటి.. నేను కొట్టి వేసిన చరణాలు మళ్ళీ రాసి ఉన్నాయి. ఎవరు రాసారు?’’ అని అడిగాడు. దానికామె ‘మీరేగా.. మంచి ఆలోచన స్ఫురించిందని ఇది ఉంటేనే బాగుంటుందని అంటూ అప్పుడే వెనక్కి వచ్చి రాసి వెళ్ళారుగా..’’ అంది. ‘‘పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. వచ్చింది నేను కాదు. ఆ పరమాత్మ. స్వయంగా ఒంటికి నూనె పూసుకుని నా రూపంలో వచ్చి నేను కొట్టేసిన చరణాలు మళ్ళీ రాసిపోయాడు. ఆయన దర్శన భాగ్యం నాకు కలగలేదు. నీవు పొందావు’’ అన్నాడు. అందుకే వీటిని ‘దర్శన అష్టపది’ అంటారు. ఇప్పటికీ భక్తులు ఈ అష్టపదులను ఇంట్లో వింటూ ఉంటారు. అవి అలా వింటూ ఉంటే స్వామి ప్రసన్నుడౌతాడని వారి నమ్మకం. -
శ్రీవారి దర్శన టికెట్లకోసం పోటెత్తిన భక్తులు
-
హరహర మహాదేవ.. శంభో శంకర
సాక్షి, అచ్చంపేట : హరహర మహాదేవ.. శంభో శంకర.. ఓం నమఃశివాయ.. శివాయ నమ ఓం.. అంటూ ఒంటిపూట భోజనం.. సాయంత్రం అల్పాహారం.. అందుబాటులోని శివాలయంలో పూజలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు.. ధ్యానముద్రలతో ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతున్నారు శివదీక్షా స్వాములు. పంచాక్షరి నామజపం ఆ మల్లికార్జునస్వామి శివదీక్షను స్వీకరిస్తే తమకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని, కుటుంబమంతా ఆయురోగ్యాలతో తులతూగుతారని భావిస్తుంటారు. రవాణా సౌకర్యాలు ఉన్నా దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శివనామ సంకీర్తనలు చేసుకుంటూ కాలినడకన కొండలు, గుట్టలు, బండరాళ్లు, ముళ్లకంపల అడ్డు తొలగించుకుంటూ శ్రీశైలం చేరుకుంటారు. ఈ ప్రయాణం శరీరానికి ఎంతో బాధ కలిగించినప్పటికీ మనస్సు మాత్రం ఆధ్యాతి్మకానందంతో పులకిస్తుందని, అది ప్రత్యక్షంగా అనుభవిస్తే తెలుస్తుందని శివస్వాములు పేర్కొంటున్నారు. వందల కి.మీ.ల దూరం నుంచి మండుటెండలను సైతం లెక్క చేయకుండా.. పుడమి తల్లి వేడికి పాదాలు బొబ్బలెక్కుతున్నా, మదిలో ప్రతిధ్వనిస్తున్న శివనామస్మరణతో కైలాస ద్వారం చేరుతున్నామని పేర్కొంటున్నారు. అక్కడి నుంచి తమ ప్రయాణం సాఫీగా జరుగుతుందని, ఇక శ్రీశైలం చేరినట్లేనని భావిస్తామని చెబుతున్నారు. ఆదుకుంటున్న అన్నదాన సత్రాలు శ్రీశైలంలో 50కిపైగా నిత్యాన్నదాన సత్రాలు ఉన్నాయి. అన్నదాన సత్రాల్లో అన్నపూర్ణాదేవికి అర్చనలు చేస్తున్నారు. వాసవీ సత్రం, కొండవీటి రెడ్ల సత్రం, మున్నూరుకాపు సత్రం, వెలమ సత్రం, విశ్వబ్రాహ్మణ సత్రం, అన్నదాన సత్రం, కమ్మసత్రం, కాకతీయ సత్రం, కంబం సత్రం, యాదవ సత్రం, శ్రీకష్ణదేవరాయ సత్రం, ఆరెకటిక, మేరుసంఘం, వెలమ, వందేళ్లనాటి కరివెన సత్రాలతోపాటు మరిన్ని సత్రాలు నిరాటకంగా నిత్యాన్నదానం చేయడంలో ముందున్నాయి. ఇక ఆశ్రమాలు, మఠాల సంగతి చెప్పక్కర్లలేదు. శివరాత్రి బహ్మోత్సవాల సందర్భంగా అటకేశ్వర సమీపంలోని నాలుగు ఆశ్రమాలు వేలాది మంది భక్తులకు అన్నదానం చేస్తున్నాయి. శ్రీశైలంలో ఒకరికి అన్నదానం చేస్తే కాశీలో లక్షమందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయనే నేపథ్యంలో అన్న వితరణకు తామూ భాగస్వాములం అవుతామని వేలాది మంది విశేషంగా అన్నసత్రాలకు విరాళాలు సమరి్పస్తున్నారు. శ్రీశైలంలో అన్నదాన ప్రభంజనంతో హర్షిత రేఖలు వ్యక్తం చేస్తూ ‘అన్నదాతా.. సుఖీభవ’ అంటూ దీవిస్తున్నారు. అటవీశాఖ నిబంధనలతో.. పాదయాత్రతో శ్రీశైల మహాక్షేత్రం వెళ్లే స్వాములకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకొచ్చి షామియానాలు, ఉచిత భోజనం, మంచి నీటి సౌకర్యాలతోపాటు అల్పాహారం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పాదయాత్రతో వచ్చిన శివస్వాములకు నల్లమల దారిలోని మన్ననూర్, ఫర్హాబాద్, వట్టువర్లపల్లి, రాసమల్లబావి వద్ద గత పుష్కరకాలంగా దాతలు సేవలందిస్తున్నారు. కాలినడకన వెళ్లే శివస్వాముల ఆకలి తీర్చడంలో దాతలు ఏర్పాటు చేసిన అన్నదాన కేంద్రాలు చురుకైన పాత్ర పోషిస్తుంది. అచ్చంపేట– శ్రీశైలం నల్లమల అభయారణ మార్గంలో ప్రతిఏటా 20కిపైగా అన్నదాన కేంద్రాలు వెలిశాయి. మన్ననూర్ తర్వాత వటువర్లపల్లి వరకు ఎక్కడ కూడా వీరికి తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకదు. వటువర్లపల్లి తర్వాత మళ్లీ దోమలపెంట వరకు ఇదే పరిస్థితి. అటవీశాఖ వారు అటవీప్రాంతంలో తాగునీటి వసతి కలి్పంచాల్సి ఉన్నా ఇంత వరకు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. గతంలో కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రాం కింద అటవీశాఖ వారు మంచినీటి సరఫరా, అల్పహార కేంద్రాలు ఏర్పాటు చేసేవారు. కానీ గత నాలుగేళ్లుగా ఈ పద్ధతికి అటవీశాఖ స్వస్తి చెప్పి వీరి పేరిట డబ్బు ఖర్చు పెడుతున్నట్లు రికార్డులు చూపుతున్నారు. పాదయాత్ర చేసే స్వామలకు జంతువుల నుంచి ప్రాణహాని కలగకుండా అటవీ మార్గంలో సిబ్బందితో టీం ఏర్పాటు చేసి రక్షణ కల్పిస్తున్నారు. ప్లాస్టిక్ నిషేధంపై స్వాములకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేక బస్సు సర్వీసులు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు, శివరాత్రిని పురస్కరించుకొన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వివిధ ఆర్టీసీ డిపోల నుంచి సోమవారం నుంచి 22వ తేదీ వరకు ఆరురోజులపాటు శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. శ్రీశైలం కాలినడకన వెళ్లిన శివస్వాములు తిరుగు ప్రయాణం కోసం జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. గద్వాల డిపో నుంచి సోమవారం 35 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఐదురోజులపాటు 390 బస్సులను శ్రీశైలానికి నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లకుండా ఆర్టీసీ బస్సులో సురక్షిత ప్రయాణం చేయాలని అధికారులు కోరుతున్నారు. అచ్చంపేట డిపో నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని డీఎం మనోహర్ తెలిపారు. -
శివ స్రవంతి
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో నివాసం ఉంటున్న రుద్ర స్రవంతి అనే శివభక్తురాలు కార్తీకమాసం ప్రారంభం రోజు నుంచి నేటి వరకు 11 వేలకు పైగా శివలింగ ప్రతిమలను తయారు చేయడం శివభక్తులకు కనువిందైన ఒక విశేషం అయింది. ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతానికి చెందిన రుద్ర స్రవంతి.. భర్త వ్యాపారం రీత్యా నాయుడుపేటలో ఉంటున్నారు. ఆమె శివభక్తురాలు. ప్రత్యేకించి శివలింగ ప్రతిమలను తయారుచేయడం కోసమే ఆమె నాయుడుపేట పట్టణంలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డు సమీపంలో బాలాజీ ఎనక్లేవ్లో నివాసం ఉంటూ గత ఐదేళ్లుగా ప్రతిమల తయారీతో శివారాధన చేస్తున్నారు. తండ్రి ప్రమాదంలో గాయపడి కోలుకున్న తరువాత ఆయన క్షేమం కోసం మరింత భక్తిభావంతో పరమశివుడిని ఆరాధిస్తున్నారు. అష్టగంధంతో శివలింగ ప్రతిమలు ఈసారి కాశీకి చెందిన ఓ ఆశ్రమ పీఠాధిపతి ఇచ్చిన అష్టగంధంతో గత నెల రోజులుగా శివలింగ ప్రతిమలను తయారు చేస్తున్నట్లు రుద్ర స్రవంతి తెలిపారు. గంధంతోపాటు పసుపు, విబూది, బంకమట్టి, పుట్టమట్టి మేళవింపుతో ప్రతిమలకు ఆమె రూపునిస్తున్నారు. ఎవరి సహాయమూ తీసుకోకుండా ఇంట్లోనే ప్రతి రోజూ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు రోజుకు 300 నుంచి 350 శివలింగ ప్రతిమలను తయారు చేస్తున్నారు. కార్తీక మాసమంతా ఉపవాసం ఉంటూ కేవలం ద్రవ పదార్థాలనే ఆహారంగా తీసుకుంటూ రోజుకు 12 గంటలకు పైగా శ్రమించి ప్రతిమల్ని చేస్తున్నారు. దాంతో ఇంట్లో ఎక్కడ చూసినా శివలింగ ప్రతిమలే దర్శనమిస్తున్నాయి. అంతేకాదు, ఇంటి ముఖద్వారం తెరుచుకున్న వెంటనే అనేక రుద్రాక్షలు ధరించి ఉన్న శివుడి ప్రతిమ కనిపిస్తుంది. ఆమె పూజ గదిలోనూ ఎక్కువగా శివుడు, శివలింగాల ప్రతిమలే ఉంటాయి. నేడు ప్రాణ ప్రతిష్ట ఇప్పటి వరకు పూర్తి చేసిన 11,111 శివలింగాల ప్రతిమలకు నేడు (కార్తీకమాసం చివరి సోమవారం) వేదపండితులతో ప్రత్యేక పూజలు చేయిస్తున్నట్లు రుద్ర స్రవంతి తెలిపారు. ఈ శివలింగాలను ఎవరికీ ఇచ్చేది ఉండదని, మొత్తం శివలింగాలను కలిపి మహా శివలింగం తయారు చేసి పూజలు చేసిన అనంతరం మూడు రోజుల తరువాత నవంబరు 28వ తేదీన నెల్లూరు జిల్లా పరిధిలోని మల్లాం గ్రామ సమీపంలో సముద్రతీరంలో నిమజ్జనం చేస్తామని ఆమె చెప్పారు. రుద్ర స్రవంతి తయారు చేస్తున్న ఈ శివలింగాలను రోజూ అనేక మంది భక్తులు ఇంటికి వచ్చి మరీ ఆసక్తిగా తిలకిస్తున్నారు. – ఎస్.కె.రియాజ్బాబు, సాక్షి నాయుడుపేట -
ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భక్తుల రద్ధీ
-
భక్తులతో పోటెత్తిన గోకవరం దేవీచౌక్
-
మాజీ ఎమ్మెల్యే హల్చల్
పందిరిపల్లిగూడెం (కైకలూరు): ఎన్నికలు తరుముకొస్తున్న వేళ ఏ చిన్న అవకాశాన్ని అధికార పార్టీ నాయకులు వదలడం లేదు. ప్రజలను ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అటవీ శాఖ నిబంధనలకు కొల్లేరు గ్రామాల్లో తూట్లు పొడుస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మరోసారి ‘చింతమనేని’ అవతారం ఎత్తారు. మహిళా అధికారి అని కూడా చూడకుండా ఫోన్లో రేంజర్‌ను ఇష్టానుసారం తిట్టారు. కొల్లేరు నాయకులతో అటవీ సిబ్బందిని నిర్బంధించారు. దీంతో కొల్లేరు పెద్దింట్లమ్మ దర్శనానికి వచ్చే యాత్రికులు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. వివరాల్లోకి వెళితే పందిరిపల్లిగూడెం నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు రోడ్డును ఆర్అండ్బీ అ«ధికారులు నిర్మించడానికి గ్రావెల్ తోలారు. బుధవారం కొల్లేరు పరిశీలనకు వచ్చిన అటవీ శాఖ డీఎఫ్‌వో అనంత్‌శంకర్, రేంజర్ విజయ కొల్లేరు అభయారణ్య పరిధిలో అటవీ శాఖ అనుమతి లేకుండా రోడ్డు ఎలా నిర్మిస్తారని, పనులను అడ్డుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. దీంతో గురువారం పనులను అటవీ శాఖ సిబ్బంది అడ్డుకున్నారు. జయమంగళ హల్చల్.. పెద్దింట్లమ్మ దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం రోడ్డును వేస్తుంటే ఫారెస్టు అధికారులు అడ్డుకోవడం ఎంటీ? అని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ రెచ్చిపోయారు. పెద్దింట్లమ్మ దర్శనానికి పార్టీ నాయకులతో వచ్చిన ఆయన దారిలో అటవీ సిబ్బందిని నిర్బంధించారు. ఫారెస్టు రేంజర్ విజయతో ఫోన్లో ఇష్టానుసారం మాట్లాడారు. ముందుగా రోడ్డు ఏర్పాటుకు అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని చెప్పినా ఆమె మాట వినలేదు. చివరకు రేంజర్.. జయమంగళకు ఘాటుగా సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో దేవస్థానానికి చేరే భక్తులు గంటల తరబడి ఎండలో ఇబ్బందులు పడ్డారు. చివరకు సీఐ రవికుమార్ వచ్చి భక్తులకు దారి ఇవ్వాలని చెప్పారు. ఆర్అండ్బీ సిబ్బంది ఎట్టకేలకు రోడ్డు వేయడానికి దించిన మెటీరియల్‌ను వెనక్కు తీసుకువెళ్ళారు. అనుమతులు తీసుకోవాలి.. కొల్లేరు అభయారణ్యంలో వేలాది ఎకరాల్లో అక్రమ చేపల చెరువులను అడ్డగోలుగా తవ్వితే పట్టించుకోని అటవీ శాఖ అధికారులు భక్తులకు అవసరమైన రోడ్డు నిర్మాణంలో ఆంక్షలు విధించడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. అయితే, అటవీ అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం ముందుగా తమకు దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. పందిరిపల్లిగూడెం రోడ్డు పక్కా అభయారణ్యంలో ఉందని స్పష్టం చేస్తున్నారు. -
హరుడికే అమ్మ అయిన అమ్మవ్వ
పూర్వం బెజ్జ మహాదేవి అనే భక్తురాలు ఉండేది. ఆమె ఒకనాడు ఇలా అనుకుంది. ‘శివునికి అందరూ ఉన్నారు. కానీ అమ్మానాన్నా మాత్రం లేరు. చచ్చిపోయారో ఏమో పాపం. మా అమ్మ పోతే నాకెంత దుఃఖమో, ఆయనకూ అంత బాధే ఉండాలి. తల్లి వుంటే శివుణ్ణి సన్యాసి కానివ్వదు. తల్లి వుంటే తల జడలు కట్టనివ్వదు. అమ్మ వుంటే విషం తాగనిస్తుందా? అలా తోళ్లు కట్టుకొని తిరగనిస్తుందా? పాములు మెడలో వేసుకుని, వంటికి బూడిద పూసుకుని తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటుందా? తల్లి వుంటే శివునికి తిరిపమెత్తుకు తిరిగే కర్మమెందుకు పడుతుంది? అనాథలా వల్లకాటిలో ఎందుకు తిరిగేవాడాయన?’ దాంతో ఆమెకు శివుడి మీద మాతృత్వ భావన కలిగింది. ‘అమ్మానాన్నలు లేని ఆ శివయ్యకి ఇక నుంచి అమ్మయినా, నాన్నయినా నేనే’ అని అనుకుంది. బెజ్జమహాదేవి శివలింగ మూర్తిని కాళ్లపై పడుకోబెట్టి నీళ్లు పోసి తుడిచి వస్త్రాలు చుట్టి భస్మం పెట్టి, కాటుక బెట్టి పాలిచ్చి పెంచసాగింది. ఆమె ముగ్ధ భక్తికి శివుడు మెచ్చి అన్ని ఉపచారాలూ స్వీకరించసాగాడు. ఒకనాడు ఆమెను పరీక్షింపదలచి పాలు తాగడం మానివేశాడు. బెజ్జ మహాదేవి దానికి భయపడిపోయింది. ‘అయ్యో బిడ్డడికి అంగిట్ల ముల్లయింది’ అని ఏడ్చింది. అడ్డమైన ప్రతి భక్తుడి ఇంటికి తిరిగి ఏది పెడితే అది తిని వస్తావు. ఎక్కడ గొంతునొచ్చిందో ఏమోనని పుత్రవాత్సల్యం చూపిస్తూనే ఆయనకు కలిగిన కష్టానికి కుమిలిపోయింది. శివుడు పాలు, వెన్నా ఏమీ ముట్టకపోయేసరికల్లా ‘ఇక మాటలతో పనిలేదు బిడ్డా! నీ బాధ చూస్తూ నేను బతికి ఉండి మాత్రం ఏమి లాభం?’ అని తల నరుక్కోడానికి సిద్ధపడింది. ఆమె అవ్యాజ ప్రేమానురాగాలకు, నిష్కల్మష భక్తికి ఉబ్బు శంకరుడు మరింతగా ఉబ్బిపోయాడు. వెంటనే ఆమె ముందు ప్రత్యక్షమై ‘వరాలు కోరుకో’మన్నాడు. అప్పుడు బెజ్జ మహాదేవి ‘‘కన్న ప్రేమకంటే ఈ పెంచిన ప్రేమయే గొప్పది. నీవు నా కొడుకువు. నీ ముఖాన్నే శాశ్వతంగా చూస్తూ ఉండేటట్టు అనుగ్రహించు’’ అంది. శివుడందుకు సంతోషించి ఆమెకు నిత్యత్వాన్ని ప్రసాదించాడు. శివునికి తల్లి అయిన కారణంగా ఆమె అమ్మవ్వ అనే పేర ప్రసిద్ధురాలైంది. భగవంతుడిని అదివ్వు, ఇదివ్వు అని కోరుకునేవారే కానీ, ఆయనకు అమ్మానాన్నా అయి, ఆలనాపాలనా చూసేవారెవరుంటా రు? అసలంతటి నిష్కల్మషమైన భక్తి ఎవరికి ఉంటుంది? అందుకే శివుడు ఆమెను అమ్మలా ఆదరించాడు. నాన్నలా తన గుండెలో నిలుపుకున్నాడు. భక్తి అంటే అలా ఉండాలి. – డి.వి.ఆర్. -
నిత్య జీవితంలో భక్తిసాధన
‘తిరువళ్లువార్’ మహాభక్తుడు, జ్ఞాని. నేత నేసి తన సంసారాన్ని అల్లుకొచ్చేవాడు. వారంలో ఒకరోజును పూర్తిగా భగవంతుని సేవకు వినియోగించేవాడు. ఆయన భార్య వాసుకి. కాపురానికి వచ్చినప్పటినుంచి అన్నం వడ్డించేటప్పుడు భర్త ఆదేశానుసారం విస్తరి దగ్గర ఒక దొన్నెనిండా నీరు, ఒక సూది ఉంచుతూ ఉండేది. అయితే భర్త ఆ దొన్నె నీటినిగాని, సూదినిగాని ఎన్నడూ ఉపయోగించలేదు. వాసుకికి అంత్యకాలం సమీపించింది. ఆ సమయంలో వాసుకి ‘నాకొక సందేహం ఉంది తీరుస్తారా?’ అనడిగింది భర్తను. సరేనన్నాడు తిరువళ్లువార్. ‘‘మీరు భోజనం చేసేటప్పుడు విస్తరి పక్కన దొన్నెలో నీరు, సూది ఉంచమనేవారు. కాని మీరెప్పుడూ దొన్నెలో నీరుగాని, సూదిగాని ఉపయోగించటం నేను చూడలేదు. వాటిని మీ విస్తరి పక్కన పెట్టమనటంలో మీ ఉద్దేశం ఏమిటన్నదే నా సందేహం. దీనినే తీర్చవలసింది’’ అని అడిగింది. తిరువళ్లువార్ చిరునవ్వుతో ఇలా చెప్పాడు. ‘‘అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నాన్ని కింద పడేయరాదు. వ్యర్థం చేయరాదు. నీవు వడ్డించేటప్పుడు పొరపాటున మెతుకు కిందపడితే దానిని సూదితో తీసి, నీటిలో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలని నా ఉద్దేశం. నీవు ఏనాడూ పొరపాటున కూడా ఒక్క మెతుకైనా కిందపడేయలేదు, అందుకే సూదిని, నీటిని ఉపయోగించే అవసరం రాలేదు’’అన్నాడు. వాసుకి సందేహం తీరి, భర్త ఒడిలో ప్రాణం వదిలింది. తిరువళ్లువార్ అన్నాన్ని బ్రహ్మగా భావించాడు. అతని భార్య అన్నాన్ని బ్రహ్మభావంతో, కిందపడకుండా జాగ్రత్తగా వడ్డించింది. ఒకనాడు కాదు, జీవితాంతం చేసింది. ఈ యోగం ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో చేస్తే ఇంతకంటే భక్తి సాధన వేరొకటి లేదు. – డి.వి.ఆర్. -
82 రోజులు.. 40 గుళ్లు!
సాక్షి, బెంగళూరు: ఈ మధ్యే వచ్చిన తెలుగు సినిమాలో ముఖ్యమంత్రి అయిన ఎనిమిది నెలల్లో ఏమేమి చేయొచ్చో.. హీరో వివరంగా చెబితే ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు కొట్టారు. కానీ బయట రాజకీయ పరిస్థితి మాత్రం కాస్త విభిన్నంగా ఉంది. పొత్తులతో అధికార పీఠం చేజిక్కించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో తొలినాళ్లలోనే కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామికి అర్థమయిందో ఏమోగానీ.. ఆయన ప్రస్తుతం గుళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మే 23న కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జేడి(ఎస్) అధినేత కుమారస్వామి అనుకున్నవి ఏమి జరగటంలేదని కొంత నిరుత్సాహపడ్డారు. కానీ స్వతహగా దైవభక్తి కలిగి ఉండటంతో దేవుడిపైనే భారం వేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన వరుసగా ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. సీఎంవో ప్రకారం ఆదివారం వరకు కుమారస్వామి అధికారికంగా 34 దేవాలయాలను దర్శించుకున్నారు. ఇక, సోమవారం హర్దనహళ్లిలో శివాలయంతోపాటు మరో నాలుగు దేవాలయాలను దర్శించుకున్నారు. అంతేకాక హసన్ జిల్లాలోని మరో పుణ్యక్షేత్రాన్ని దేవగౌడ తనయుడు కుటుంబ సమేతంగా దర్శించకున్నారు. కుమారస్వామి గుడిబాటపై మిశ్రమ స్పందన లభిస్తోంది. దేవాలయాల సందర్శనలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పను కుమారస్వామి మించిపోయారని రాజకీయ విశ్లేషకులు చురకలు అంటిస్తున్నారు. కానీ దేవగౌడ కుటుంబం దైవాన్ని, జాతకాలను ఎక్కువగా నమ్ముతుందని, అందుకే దేవాలయాలకు వెళ్తుంటారని, ఇందులో మరో ఉద్దేశం లేదని సీఎం సన్నిహితులు చెప్తున్నారు. -
శ్రీవారికి రూ.1.75 కోట్ల బంగారు ఖడ్గం
సాక్షి, చిత్తూరు : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రూ. 1.75 కోట్ల విలువ చేసే బంగారు ఖడ్గాన్ని ఓ భక్తుడు కానుకగా సమర్పించాడు. శ్రీవారి దర్శనార్థం మంగళవారం తమిళనాడు తేని జిల్లా బొడినాయకులు గ్రామానికి చెందిన తంగదొరై అనే భక్తుడు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి రూ. 1.75 కోట్ల విలువచేసే బంగారు ఖడ్గాన్ని కానుకగా ఇచ్చారు. కొనసాగుతున్న భక్తుల రద్దీ : తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లు అన్నీ నిండి భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతోండగా, కాలి నడకన వచ్చే భక్తుల దర్శనానికి 10 గంటలు, అలాగే స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. అలాగే శ్రీవారి టైం స్లాట్ సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. నటి శ్రీరెడ్డి కాలినడకన వచ్చి నేడు స్వామి వారిని దర్శించుకున్నారు. -
గుడిలో ఉరేసుకుని భక్తుడి ఆత్మహత్య
పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ గుడిలో గుర్తు తెలియని భక్తుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని చిన్నారుట్ల సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో జరి గింది. స్టేషన్ రైటర్ సురేష్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి పరిశీలించారు. ఎస్ఐ రామకోటయ్య కథనం ప్రకారం.. శ్రీశైలం రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఉరేసుకున్న వ్యక్తికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. మృతుడికి 20 నుంచి 30 ఏళ్లు ఉం టాయి. కాషాయ వస్త్రాలు ధిరించి ఉన్నాడు. శరీరంపై జంధ్యం ఉంది. సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9121102194 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
అలిపిరి చెక్‌పోస్టు వద్ద పిస్టల్ కలకలం..
సాక్షి, తిరుపతి: అలిపిరి చెక్ పోస్టు వాహనాల తనిఖీలో పిస్టల్ దొరకడం కలకలం రేపింది. వివరాలివి.. ఒరిస్సాకు చెందిన రామన్ పాణిగ్రహి అనే వ్యక్తి కారులో స్టీరింగ్ క్యాబిన్లో పిస్టల్ పెట్టుకుని తిరుమలకు బయలుదేరాడు. అలిపిరి వద్ద తనిఖీ చేసిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అంతేకాక అతనికి గన్ లైసెన్స్ కూడా లేదని సమాచారం. దీంతో అతని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రామన్ విచారణ సమయంలో పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. సీవీఎస్ఓ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ.. నిందితుడు పలు కేసులలో ముద్దాయిగా ఉన్నట్లు తెలిపారు. ‘తనకు వివాదాలు ఉన్నట్లు, సేఫ్టి కోసమే గన్ కొన్నట్లు అతను చెబుతున్నాడు. అంతేకాక పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. ఒంటరిగా గన్‌తో రావడంపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని’ రవికృష్ణ చెప్పారు. -
కొబ్బరికొట్టులో కొలువుతీరిన బాలబాలాజీ
కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతూ... కోనసీమవాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న శ్రీ బాల బాలాజీ స్వామి కొలువు తీరిన గ్రామం అప్పనపల్లి. పవిత్ర వైనతేయ గోదావరి నది సోయగాలతో నిత్యం వేలాదిమంది భక్తుల గోవింద నామస్మరణలతో అలరారుతున్న ఈ గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. గ్రామ చరిత్రను పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర అంశాలు స్ఫురణకు వస్తాయి. బాలాజీ ఎక్కడున్నా నిత్యకల్యాణం పచ్చతోరణమే కదా... అప్పనపల్లి కూడా అదే సంప్రదాయాన్ని అందిపుచ్చుకుంది. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం ‘అప్పన్న’ అనే బాలుడు తపస్సు చేసి తరించడం వల్ల ఈ గ్రామానికి ‘అప్పనపల్లి’ అని పేరు వచ్చిందని ప్రచారంలో ఉంది. పూర్వం ‘అర్పణేశ్వరుడు’ అనే యతీంద్రుడు అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వైనతేయ నదీ తీరాన ఇసుక మేటలు వేసిన ప్రశాంత స్థలంలో ముక్కంటిని ధ్యానిస్తూ శివసాక్షాత్కారం పొందాడని, ఈ ‘అర్పణ’ ఫలితాలు కాలక్రమేణా ‘అప్పనపల్లి’గా ప్రసిద్ధి చెందాయని మరో కథనం ప్రచారంలో ఉంది. కొబ్బరి కొట్టులో కొంగుబంగారంగా... ఆలయ వ్యవస్థాపకుడు మొల్లేటి రామస్వామి పూర్వకాలం నుంచి కొబ్బరికాయల వ్యాపారం చేసేవారు. ఆ వ్యాపారం నష్టాలతో నడుస్తుండడంతో తిరుమల శ్రీవారికి వ్యాపారంలో వాటా పెడతానని మొక్కుకున్నారు. అప్పటినుంచి ఆ వ్యాపారం లాభాల బాటలో పయనించింది. దాంతో మొక్కుబడి ప్రకారం లాభంలో 10 శాతం వాటాను తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి సమర్పించేవారు. 1960వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని తీసుకు వచ్చి కొబ్బరి కొట్టులో ప్రతిష్టించారు. లాభంలో కొంత వాటాను తిరుమల తిరుపతి తీసుకు వెళ్లి స్వామివారి పాదాల చెంత పెట్టేందుకు రామస్వామి ప్రయత్నించగా అర్చకులు అంగీకరించలేదు. అర్చకులతో వాదించి, వాదించి అలసి నిద్రిస్తున్న రామస్వామికి స్వప్నంలో శ్రీనివాసుడు సాక్షాత్కరించి తానే అప్పనపల్లి వస్తానన్నాడట. అన్నమాట ప్రకారం ముద్దులొలికే బాలుడి విగ్రహ రూపంలో కొబ్బరికాయల మధ్యన కనిపించాడట. ఆ ముద్దుల బాలుని చూసి మైమరచిన రామస్వామి కొట్టులో ప్రతిష్టించిన స్వామి వారికి బాల బాలాజీగా నామకరణం చేశారు. ఆ విధంగా ప్రతిష్టించిన శ్రీబాల బాలాజీ స్వామి వారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చేవారు. వారి సంఖ్య క్రమేపి పెరిగి దిన దిన ప్రవర్ధమానంగా ఈ ఆలయం ప్రాచుర్యం పొందింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పోటెత్తడంతో నూతన ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు రామస్వామి. నూతన ఆలయ నిర్మాణం 1970 మార్చి18న నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కొబ్బరికొట్టులో ప్రతిష్టించిన శ్రీవారి చిత్రపటాన్ని అలాగే ఉంచి దానికి సమీపంలో నూతన ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేశారు. కొత్తగుడిపై చిత్రీకరించిన గోవు–గొల్లవాడు, గీతోపదేశం వంటి అద్భుత చిత్రాలు భక్తులను పరవశింపజేస్తాయి. 1991లో పద్మావతి, ఆండాళ్, గరుడాళ్వార్లను శ్రీమాన్ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి చేతుల మీదుగా ప్రతిష్టించారు. అన్నదానానికి ఆదర్శంగా ఆ ఆలయం అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి ఆలయం అన్నదానానికి ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అప్పనపల్లిలోనే అన్నదానానికి నాంది పలికారు. 1977వ సంవత్సరంలో ఆలయ నిర్మాత మొల్లేటి రామస్వామి నిత్యాన్నదాన పథకానికి శ్రీకారం చుట్టారు. అన్నదానానికి అప్పనపల్లి ఆదర్శంగా నిలిచింది. నిత్యం బూరె, పులిహోర, మూడు రకాల కూరలు, పెరుగుతో అమలు చేస్తున్న అన్నదాన పథకం ఆలయ చరిత్రలో విశిష్టంగా నిలుస్తుంది. రోజూ ఉదయం తొమ్మిది నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ ఆలయంలో భక్తులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. నిత్యం రెండు వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. శని, ఆదివారాలు ఈ సంఖ్య గణనీయంగా ఉంటోంది. స్వామి వారిని దర్శించుకునే భక్తులో అధిక శాతం మంది స్వామి వారి భోజనాన్ని అన్నప్రసాదంగా స్వీకరిస్తున్నారు. నిత్యం లక్ష్మీనారాయణ హోమం, ఉభయదేవేరులతో కల్యాణం, ఏడాదికోసారి దివ్య తిరుకల్యాణోత్సవాలు, అధ్యయనోత్సవాలతో ఆలయ పరిసరాలు గోవింద నామస్మరణలతో మారుమోగుతుంటాయి. ప్రస్తుతం జరుగుతున్న ధనుర్మాస దీక్షలు భోగిరోజున జరిగే గోదా కల్యాణోత్సవంతో ముగియనున్నాయి. ఆలయానికి చేరుకునేది ఇలా... స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులు రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా తాటిపాక చేరుకోవాలి. రాజమండ్రి నుంచి ఆలయానికి 70 కిలో మీటర్లు దూరం. కాకినాడ నుంచి అమలాపురం పాశర్లపూడి మీదుగా అప్పనపల్లి చేరుకునే వారికి 64 కిలోమీటర్లు. పైన పేర్కొన్న ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సదుపాయాలు ఏర్పాటు చేశారు. – ఏడిద బాలకృష్ణారావు సాక్షి, మామిడికుదురు, తూర్పు గోదావరి జిల్లా అద్భుతాలమయం భోగేశ్వరాలయం ఓరుగల్లు అనగానే కాకతీయులు నిర్మంచిన శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం (వేయిస్తంభాల గుడి), శ్రీ సిద్ధేశ్వర ఆలయం, శ్రీ పద్మాక్షి ఆలయం, శ్రీ భద్రకాళి ఆలయం వంటివి జ్ఞాపకం రావడం సహజం. అయితే, వాటితోపాటు వరంగల్లు, హన్మకొండల నడుమ మరో సుప్రసిద్ధమైన ఆలయం ఉంది. అదే శ్రీ భోగేశ్వర స్వామి ఆలయం. మట్టెవాడ అనే ప్రదేశంలోని ఈ ఆలయం గర్భాలయంలోని ప్రధానలింగం ఎంతో విశిష్టమైనది. పానవట్టం పైన ఉన్న లింగభాగాన్ని పక్కకు జరపడానికి వీలుగా ఉంటుంది. పానవట్టం కింది భాగం బోలుగా ఉంటుంది. పానవట్టం అడుగుభాగంలో, శివలింగం కింద మేరుప్రస్తార రూపంలో ఉన్న ఒక శ్రీచక్రం ఉన్నదట. ఆ శ్రీచక్రం కింద సువర్ణలింగం ఉన్నదని ప్రతీతి. ఆ శ్రీచక్రం బిందుస్థానంలో మరొక చిన్న రాతి లింగం ఉన్నదట. అంటే అది అంతరలింగం అన్నమాట. ఆ శ్రీచక్రాన్ని కప్పివేస్తూ పానవట్టం ఉంటుంది. ఈ భోగేశ్వరలింగానికి అభిషేకం చేస్తే, ఏకాదశ రుద్రాభిషేకం చేసిన ఫలితం లభిస్తుందని అంటారు. మరోవిశేషం ఏమిటంటే, ఈ శివలింగానికి ఎన్ని బిందెల నీళ్లతో అభిషేకం చేసినా, ఒక్క చుక్క నీరు కూడా సోమసూత్రం ద్వారా బయటకు రాదు. గుడికి నైరుతి భాగంలోని బావిలోకి పోతుందంటారు. శివలింగానికి వెనకవైపున వామాంకిత స్థితౖయెన గౌరీదేవితో సహా ఈశ్వరుని విగ్రహం, ఆ విగ్రహం పైభాగంలో ఒక తల ఉంది. ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి, గోడలపై చెక్కిన శిలాశాసనాలను బట్టి అది కాకతీయుల కాలం నాటిదని ఇట్టే చెప్పవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఆంజనేయస్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎక్కడ ఉంది? వరంగల్ స్టేషన్ నుంచి దాదాపు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఈ భోగేశ్వర ఆలయం ఉంది. వరంగల్ నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాలద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. -
తెప్పించే దారులు
ధర్మ సందేహాలు, సంకటాలు భక్తులకే ఉంటాయని కదా అనుకుంటాం! ఆ సందేహాలన్నింటినీ చక్కగా తీరుస్తుండే ఆధ్యాత్మికవేత్తలు సైతం కొన్ని సందర్భాలలో ధర్మ సంకటంలో పడిపోతుంటారు!! ‘జీవాత్మ, పరమాత్మ వేర్వేరు కాదు’ అనే భావనపై ‘అద్వైత’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆదిశంకరాచార్యుల వారు క్రీ.శ. ఎనిమిదో శతాబ్దంలో నాలుగు హిందూ పీఠాలను స్థాపించారు. ఆ నాలుగు పీఠాలలో ఒకటైన జ్యోతిర్మఠానికి (బదరీనాథ్) ఇప్పుడు కొత్తగా ‘శంకరాచార్య’ కావలసి వచ్చారు. ఖాళీ అయిన ఆ ఆధ్యాత్మిక పీఠాన్ని భర్తీ చేయడం కోసం అర్హులైన సాధువుల నుంచి ఇటీవలే భారత మహాధర్మ మండలి దరఖాస్తులు ఆహ్వానించింది. దాదాపు రెండు వందల దరఖాస్తులు వచ్చాయి. వాటన్నింటినీ సూక్ష్మంగా వడబోసి, చివరికి నలుగురు సాధువులతో ఒక జాబితాను మండలి సిద్ధం చేసింది. విశేషం ఏమిటంటే.. ఆ నలుగురిలో ఒకరు మహిళ! ‘శంకరాచార్య’ పదవి చేపట్టడానికి మిగతా ముగ్గురితో సమానంగా అన్ని అర్హతలున్న ఆ సాధ్వి పేరు.. హేమానంద్ గిరి. నేపాల్ ఝంపా జిల్లా పరిధిలోని గౌరీగంజ్‌లో ఉన్న ‘సూర్యశివ’ మఠానికి ప్రస్తుత ఆచార్యురాలు. ఇలా ఒక మహిళ ‘శంకరాచార్య’ స్థానానికి పోటీ పడటం గత పన్నెండు వందల ఏళ్ల చతుర్మఠాల చరిత్రలోనే మొదటì సారి అవడంతో.. ఒకవేళ మహిళనే ఎంపిక చేయవలసి వస్తే ధర్మశాస్త్రాలు అంగీకరిస్తాయా అన్న విషయమై మహా ధర్మ మండలి ఇప్పుడు మీమాంసలో పడిపోయింది! ఆది శంకరాచార్యులు రాసిన ‘మహానుశాసనం’లో ఇందుకు ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అని కూడా మండల సభ్యులు శోధిస్తున్నారు. ప్రస్తుతానికైతే పరిష్కారం దొరకలేదు కానీ, శంకరాచార్య అవడానికి కనీస అర్హత ‘దండి’ స్వామి అయి ఉండటం అనే నిబంధన వారి కంటబడింది. అయితే హేమానంద్ గిరి.. ‘దండి’ స్వామి కాదు. కాలేరు కూడా! ఎందుకంటే.. హైందవ «ధర్మశాస్త్రాలు పురుషులను మాత్రమే దండి స్వామిగా అంగీకరిస్తున్నాయి. మరేమిటి సాధనం? మహిళలను ‘తప్పించే’ దారులను వదిలిపెట్టి, ‘తెప్పించే’ దారుల కోసం వెదకడమే. అవును. ఒక కొత్త ఒరవడిని నెలకొల్పాలన్న సదుద్దేశంతో, పూర్వపు నియమాలలో స్వల్ప సడలింపులను చేసుకుంటే అది తప్పు కాబోదు, ధర్మం తప్పినట్టూ అవదు. -
మేడారానికి పోటెత్తిన భక్తులు
జయశంకర్ భూపాలపల్లి : మేడారం సమ్మక్క సారాలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ చర్యలు చేపట్టారు. మేడారం గద్దెల వరకు వాహనాలు వెళ్లకుండా జంపన్నవాగు దాటినా తర్వాత వాహనాలను పంట పొలాల్లోకి మళ్లించారు. గద్దెల వద్ద దేవతలకు మొక్కులు చెల్లించడానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో సందడి మొదలైంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 11 కంపార్టమెంట్లో భక్తులు వేచియున్నారు. సర్వ దర్శనానికి 4 గంటలు, కాలిబాట దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.93 కోట్లు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను జేఈఓ శ్రీనివాస రాజు, ఎస్పీ అభిషేక్ మహంతి పరిశీలించారు. 1400 మంది పోలీసులతో టీటీడీ ఏకాదశి రోజున బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి ఏకాదశి దర్శనానికి కంపార్టమెంట్లోకి అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. 72 వేల మంది వేచి ఉండే విధంగా క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. -
తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ గురువారం పెరిగింది. శ్రీవారి దర్శనానికి 20 కంపార్టమెంట్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 7 గంటలు, కాలిబాట దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.10 కోట్లు. ఈ నెల 29, 30 న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రానుండటంతో తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనంగా ఆరు కిలోమీటర్ల క్యూలైన్ ఏర్పాటు చేశారు. ఏకాదశి నాడు ఉదయం 5:30 గంటలకు వీఐపీ దర్శనం, 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమౌతుంది. ఏకాదశి శుక్రవారం రానుండటంతో నాలుగు గంటలు ఆలస్యంగా దర్శనం ప్రారంభమౌతుంది. -
విశ్వేశ్వరా... మల్లెం కొండేశ్వరా!!
అది దట్టమైన అటవీ ప్రాంతం... పక్షుల కిలకిలారావాలు... జలపాతాల గలగల ధ్వనులు ... ఆ అరణ్యంలోని చెట్టుపుట్టగుట్ట అన్నీ శివనామస్మరణ చేస్తున్నట్లుగా భాసిస్తుంది... అణువణువూ ఆ మహాశివుని దివ్యస్వరూపంగానే దర్శనమిస్తుంది... ఈ ప్రాంతం వైఎస్సార్ జిల్లా గోపవరం మండలం మల్లెంకొండ.ఆలయానికి పైకప్పు లేకపోవడం ఇక్కడి ప్రత్యేకత. వైఎస్సార్, నెల్లూరు జిల్లా సరిహద్దుగా ఈ మల్లెంకొండ ఉంది. ఆలయ విశేషాలు పరమశివుడు మల్లెం కొండేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. ఇక్కడి కొండలోని గుండాలలో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి సత్సంతానం కలుగుతుందని చెబుతారు. పూలమాల ఆకృతి ఈ గిరి శిఖరం పూలమాల ఆకారంలో ఉండటం విశేషం. ఈ శిఖరానికి మాల్యాద్రి శిఖరం అని పేరు. ఈ శిఖరం మీద కాశీవిశ్వనాథుడు, మల్లెం కొండేశ్వరుల ఆలయాలు కనువిందు చేస్తాయి. ఆలయం నుంచి మరో 2 కిలోమీటర్లు నడిచి వెళితే... రామసరి జలపాతం మార్గాయాసాన్ని మర్చిపోయేలా చేస్తుంది. కాకులు కనిపించని కానలు సాధారణంగా అడవుల్లో జంతువులు, క్రూరమృగాలు, పక్షులు నివసిస్తాయి. కాని ఈ ప్రాంతంలో మాత్రం కాకి కాని, పులి కాని కనిపించదు. అడవుల్లో ఎక్కువగా పెరిగే ఏపి చెట్లు కూడా కనిపించవు. ఇందుకు సంబంధించిన స్థానిక కథనం ఇలా ఉంది... కొండమీద వెలసిన శివుడు, మల్లెం కొండయ్య, అంకమ్మలకు కొన్ని శతాబ్దాల క్రితం పరిసర గ్రామపెద్దలు ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించారట. అంతవరకు మొండి గోడల మధ్యన కొలువుతీరిన ఈ దేవతామూర్తులు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా ఉండేలా, పైకప్పు నిర్మాణం ప్రారంభించారు. అయితే, పై కప్పు వేసిన మరుసటి రోజే ఆ కప్పు కూలిపోతుండటంతో ఇది ఎలా జరుగుతోందో తెలుసుకుందామని కాపు కాశారట. అర్ధరాత్రప్పుడు ఓ యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి ఆ కప్పును కూల్చేయడం కనిపించింది. దాంతో గ్రామస్తులు ఆగ్రహంతో అతన్ని పట్టుకుని, ఏపి చెట్ల నారతో చేసిన తాళ్లతో బంధించారట. తాను మల్లెం కొండేశ్వరుడినని, తనకు కానీ ఇక్కడున్న శివుడికి కానీ ఆలయానికి పై కప్పు వేయరాదని చెప్పాడట. అంతేకాకుండా తనను కట్టి వేయడానికి సహకరించిన ఏపి చెట్లు ఈ అడవుల్లో కనిపించకూడదని శపించాడట. మల్లెం కొండయ్యను బంధించినప్పుడు ఓ కాకి ఆయన కళ్లను పొడవబోయిందట. దాంతో ఆ అరణ్యంలో కాకి కానరాకూడదని శపించాడట. పులి కనిపించని అడవి ఈ పర్వత ప్రాంతంలో నివసించే ఒక గిరిజన భక్తుడు తన గోవులను మేపుకోవడానికి అడవికి వచ్చేవాడట. అక్కడ సంచరించే పులులు అదను చూసి గోవులపై దాడి చేశాయట. ఆ గిరిజనుడు శివునితో తన గోడు చెప్పుకున్నాడట. శివుడు ఈ అరణ్యంలో పులులు సంచరించరాదని ఆఙ్ఞాపించాడట. అందుకే ఈ అరణ్యంలో నేటికీ పులి కనిపించదు. రాముడు సైతం... శ్రీరామచంద్రుడు రావణసంహారం అనంతరం సీతతో కలసి ఈ మాల్యవంత పర్వత ప్రాంతానికి వచ్చాడట. ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఇక్కడే ఉండిపోయాడట. అప్పుడే మల్లెంకొండలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం. ఈ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లోనూ నీటి గుండాలను ఏర్పాటు చేశారట. కొండమీద మల్లెంకొండేశ్వరుని ఆలయం చేరుకోవాలంటే 10 కిలోమీటర్లు దట్టమైన అటవీప్రాంతంలో కొండకోనలు దాటుకుంటూ వెళ్లాలి. కాలినడక తప్ప మరో మార్గం లేదు. దాంతో సంవత్సరంలో ఒక్కశివరాత్రి రోజే.. భక్తులు ఈ ఆలయానికి వెళ్లేవారట. దశాబ్దం క్రితం సుబ్బరాజు అనే భక్తుడు ఆలయ జీర్ణోద్ధరణతో పాటు అక్కడ వసతి, తాగునీరు, సోలార్లైట్లు, వంటసామగ్రి ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రతివారం వెళుతున్నారు. ఎలా వెళ్లాలంటే... నెల్లూరు–కడప జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. కడప జిల్లా బద్వేల్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లె గ్రామం నుంచి కొండకు నడిచి వెళ్లాలి. కడప నుంచి బద్వేల్‌కు, బద్వేల్ నుంచి బ్రాహ్మణపల్లెకు బస్సు సౌకర్యం ఉంది. కడప నుంచి 60 కిలోమీటర్లు. నెల్లూరు నుంచి 100 కిలోమీటర్లు. నెల్లూరు నుంచి బద్వేల్ వెళ్లే బస్సులో పి.పి.కుంట వరకు వెళ్లి, అక్కడ నుంచి బ్రాహ్మణపల్లెకు మరో బస్సులో వెళ్లాలి. – మల్లు విశ్వనాథరెడ్డి సాక్షి, అమరావతి బ్యూరో -
శ్రీవారి ఆలయంలో కదిలే పైకప్పులు
సాక్షి, తిరుమల: తిరుమల ఆలయంలో అంతర్జాతీయ స్టేడియాల్లో వాడే అధునాతన రీట్రాక్టబుల్‌రూఫ్(కదిలే పైకప్పు)లు నిర్మించనున్నారు. ఆలయంలోని కొన్ని ముఖ్యమైన మండపాల్లో రాతి, సున్నంతో నిర్మించిన పైకప్పులు మాత్రమే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో పైకప్పులే లేవు. దీని వల్ల భక్తులు అసౌక ర్యానికి గురవుతున్నారు. దీన్ని గుర్తించిన టీటీడీ అధికారులు ఆయా కాలాల్లో అందుబా టులో ఉన్న రేకులు, ప్లాస్టిక్ గాల్ వాల్యూమ్ షీట్లు, ఇతర ఫైబర్ షీట్లతో తాత్కాలిక పైకప్పులు నిర్మిస్తున్నారు. ఇవి ఫలితాలు ఇవ్వ ట్లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతర్జాతీయ స్థాయిలో.. రీట్రాక్టబుల్ రూఫ్‌లు అంటే కదిలే పైకప్పులు. అంతర్జాతీయ స్థాయి స్టేడియంలలో ఇలాంటి పైకప్పులు నిర్మిస్తారు. వీటిని అవసరానికి తగ్గట్టుగా వాడుకోవచ్చు. ఆకాశం కనిపించేలా పైకప్పును పక్కకు జరపటం, ఎండ, వర్షం వస్తే మూసివేయటం క్షణాల్లో చేసుకోవచ్చు. దాతల సహకారంతో నిర్మాణం.. ధ్వజస్తంభం మండపం నుంచి కల్యాణోత్సవం మండపం వరకు 15 మీటర్ల పొడవు, ఆరు మీటర్ల వెడల్పు కలిగిన రీట్రాక్టబుల్ రూఫ్‌ను నిర్మించాలని టీటీడీ ఇప్పటికే నిర్ణయించింది. సుమారు రూ.50 లక్షలు ఖర్చు అయ్యే ఈ వ్యయాన్ని భరించేందుకు బెంగళూరుకు చెందిన ఓ దాత ముందుకొచ్చారు. అలాంటి పైకప్పులు తయారు చేసే జర్మనీకి చెందిన ఓ సంస్థకు పనుల బాధ్యతను టీటీడీ అప్పగిం చింది. కొత్త పైకప్పు త్వరలోనే ఆలయానికి చేరుకోనుంది. ఇది విజయవంతం అయితే మహాద్వారం నుండి ధ్వజస్తంభం వరకు, తిరిగి ఆనంద నిలయం ప్రాకారం ఉత్తర, పడమర, దక్షిణ దిశల్లోనూ నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై ఇప్పటికే సంబంధిత నిపుణుల బృందం సర్వే చేసి సంతృప్తి వ్యక్తం చేసింది. -
అటూ ఇటూ భక్తాద్రి.. నడుమ యాదాద్రి
యాదాద్రిలో భక్తుల వసతికి గుట్టపై మినీ పట్టణం - 940 ఎకరాల్లో ఏర్పాట్లు.. వీఐపీ అతిథుల కోసం మరో గుట్ట - వందల్లో కాటేజీలు, హోటళ్లు, ఆసుపత్రులు, ఉద్యానవనాలు - రెండు మూడేళ్లలో సర్వాంగ సుందరంగా ముస్తాబు - వచ్చే మార్చిలో బ్రహ్మోత్సవాలకల్లా ప్రధాన ఆలయం సిద్ధం - 4 మాడవీధులు, 7 గోపురాలు, ప్రధాన మండపంతో కనువిందు సాక్షి, హైదరాబాద్: నీవుండేదా కొండపై నా స్వామి... నేనుండేదీ నేలపై అంటూ ఓ భక్తుడు అప్పుడెప్పుడో పాడుకున్నాడు. కానీ.. యాదగిరీశుడి సన్నిధిలో ‘నీవుండేదా కొండపై నా స్వామి.. నేనుండేదీ కొండపై..’ అని భక్తులు పాడుకోనున్నారు! యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఓ కొండపై కొలువుదీరితే, స్వామిని దర్శించేందుకు వచ్చే భక్తులు మరో రెండు గుట్టలపై ఉండనున్నారు. తొమ్మిది గుట్టలతో యాదాద్రి క్షేత్రం అభివృద్ధి చెందనుండటం తెలిసిందే. వాటిలో రెండింటిని భక్తుల వసతి గృహాలకు కేటాయించారు. ఈ రెండింటిలో పెద్ద గుట్టపై భారీ పట్టణమే వెలవనుంది. నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అవి పూర్తయ్యేందుకు మరో రెండుమూడేళ్లు పట్టే అవకాశముంది. ప్రధానాలయ ప్రాంగణం వచ్చే మార్చి నాటికి సిద్ధమయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే జరిగితే మార్చిలో స్వామివారి బ్రహ్మోత్సవాల నాటికి ప్రధానాలయం కొత్త రూపుతో భక్తులను మంత్రముగ్ధులను చేయనుంది. 4 మాడ వీధులు, 7 గోపురాలు, విమానగోపురం, ప్రధాన మండపం సిద్ధమయ్యేలా పనులు జరుగుతున్నాయి. రూ.1,900 కోట్లు అవసరమని భావిస్తున్న ఈ పనుల్లో రూ.300 కోట్ల వ్యయంతో తొలి దశ సిద్ధమవుతోంది. తొమ్మిది గుట్టల్లో రెండు భక్తులకే యాదగిరీశుడు వెలిసిన గుట్టకు చుట్టూ ఉన్న గిరులను ప్రత్యేక ఇతివృత్తాలతో అభివృద్ధి చేయబోతున్నారు. రెండు గుట్టలను భక్తుల విడిది కేంద్రాల పనులు మొదలయ్యాయి. ఒక గుట్టను రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు, ఇతర ప్రముఖులకు కేటాయించారు. మరో గుట్టను ఖరీదైన భక్తులుండే కాటేజీల నిర్మాణానికి కేటాయించారు. వీవీఐపీల వసతి గృహాలు నిర్మించే గుట్టపై 13.25 ఎకరాల స్థలమే ఉంది. మరో గుట్టపై ఏకంగా 945 ఎకరాల్లో కాటేజీలు రానున్నాయి. భక్తులుండేందుకు వీలుగా వందలాది కాటేజీలు, హోటళ్లు, ఉద్యానవనాలు, ఆసుపత్రి, శుభకార్యాల నిర్వహణకు కల్యాణ మండపం, పార్కింగ్... ఇలా పెద్ద గుట్టపై ఓ పట్టణమే రూపుదిద్దుకోబోతోంది. తొలి విడతలో 250 ఎకరాల్లో పనులు మొదలుపెట్టారు. రోడ్ల నిర్మాణం, ప్లాటింగ్ పూర్తయింది. ప్లాట్లను దాతల కోసం సిద్ధం చేశారు. కాటేజీల నిర్మాణానికి ముందుకొచ్చే దాతలకు ప్లాట్లను కేటాయిస్తారు. ఒక్కోటి నాలుగు పడక గదుల క్వార్టర్లను నిర్మిస్తారు. వాటిని గుట్ట దేవాలయాభివృద్ధి సంస్థ నిర్దేశించిన నమూనాల్లోనే నిర్మించాల్సి ఉంటుంది. లేదంటే ఆ నిధులు అందజేస్తే సంస్థే వాటిని నిర్మిస్తుంది. ఆ కాటేజీలను తిరుమల తరహాలో దాతలకు ఏడాదిలో 30 రోజులు కేటాయిస్తారు. దాతలు, వారు సిఫారసు చేసినవారు ఆయా రోజుల్లో వాటిలో ఉచితంగా ఉండొచ్చు. అద్భుత శిల్పకళతో ప్రధాన క్షేత్రం లక్ష్మీ నరసింహుడు ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బాలాలయంలో కొలువుదీరాడు. గత ఏప్రిల్‌లో ప్రధానాలయాన్ని మూసేసి పనులు ప్రారంభించడం తెలిసిందే. ప్రధానాలయం 4.2 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం 2.33 ఎకరాల్లో పనులు జరుగుతున్నాయి. తిరుమల తరహాలో ఎత్తయిన ప్రాకారాలతో నాలుగు మాడ వీధులు సిద్ధం చేస్తున్నారు. నాలుగు వైపులా నాలుగు గోపురాలతోపాటు మొత్తం ఏడు గోపురాలు నిర్మిస్తారు. వీటిలో రెండు గోపురాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మిగతా వాటి బేస్మెంట్లు సిద్ధమయ్యాయి. ప్రధాన మండపం, దానిపై ప్రస్తుత శిఖరాన్ని అనుసరిస్తూ కొత్త శిఖరాన్ని నిర్మిస్తారు. స్వామివారు వెలిసిన గుట్ట భాగాన్ని అలాగే ఉంచి దానిపై మండపాన్ని నిర్మిస్తారు. ప్రధానాలయ నిర్మాణంలో ఎక్కడా సిమెంట్ వాడటం లేదు. పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్టు యాడా ఉపాధ్యక్షుడు కిషన్‌రావు తెలిపారు. కాకతీయ, విజయనగర శిల్ప సౌందర్యం ఉట్టిపడేలా రాతి శిల్పాలు సిద్ధం చేస్తున్నారు. 500 మంది శిల్పులు ఈ పనుల్లో తలమునకలుగా ఉన్నారు. యాదాద్రితోపాటు ఏపీలోని ఆళ్లగడ్డ, మార్టూరు ప్రాంతాల్లో శిల్పులు వాటిని సిద్ధం చేస్తున్నారు. 12 మంది ఆళ్వార్ల విగ్రహాలతో బృహత్ మండపం రూపుదిద్దుకో నుంది. నాలుగు విగ్రహాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. 11.9 అడుగుల వెడల్పున్న ఆలయం ఈ భారీ నిర్మాణాలతో 48 అడుగులకు పెరగనుంది. ఎత్తు కూడా రెట్టింపై 48 అడుగులకు చేరుతుంది. దీంతో పైన ఇతర భవనాలేవీ ఉండవు. పార్కింగ్ సహా అన్నీ దిగువే ఉంటాయి. దిగువన ఏడు వేల కార్లను పార్క్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గుట్ట కిందే గుండం, కల్యాణకట్ట స్వామివారికి తలనీలాలు సమర్పించే కల్యాణ కట్ట ప్రస్తుతం క్షేత్రం పక్కనే ఉంది. ఆ పక్కనే గుండం (కోనేరు) ఉంది. భవిష్యత్తులో ఈ రెంటినీ కిందకు మారుస్తారు. ప్రస్తుత గుండం అలాగే ఉంటుంది. స్వామి దీక్షలో ఉన్నవారు అందులో స్నానమాచరించవచ్చు. భక్తుల కోసం దిగువన భారీ కోనేటిని నిర్మిస్తున్నారు. కొండ చుట్టూ 100 అడుగుల సర్క్యులర్ రోడ్డు, గిరి ప్రదక్షిణ రోడ్డు ఏర్పాటవుతున్నాయి. కల్యాణ మండపం, ఆర్టీసీ డిపో, బస్టాండ్, భారీ పార్కింగ్ స్థలం, పూజారుల అగ్రహారం, డార్మిటరీ, సాధారణ భక్తుల వసతి గృహ సముదాయాలు, యాగశాల, ప్రవచనశాల, వ్రత మండపం తదితరాలు దిగువన ఏర్పాటు కానున్నాయి. ఆలయం వద్ద 30 వేల మందికి సరిపడా క్యూలైన్లు సిద్ధం చేస్తారు. గుట్టపైకి ఎక్కేందుకు, దిగేందుకు విడిగా దారులు ఏర్పాటవుతున్నాయి. క్షేత్ర పాలకుడైన ఆంజనేయస్వామిది 108 అడుగుల భారీ విగ్రహం ఏర్పాటవుతుంది. వచ్చే మార్చి బ్రహోత్సవాల నాటికి ఆలయ పనులు, మరో ఏడాదిన్నర, రెండేళ్లలో మిగతా పనులు పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. -
అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద పిస్టల్ కలకలం
-
టీటీడీ సిబ్బంది దాడిలో గాయపడ్డ భక్తుడు మృతి
-
పుట్టపర్తికి చేరిన ఇండోర్ భక్తుడి పాదయాత్ర
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి సేవలు, ఆధ్యాత్మిక బోధనల పట్ల ప్రజలను చైతన్యం చేసేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సత్యసాయి భక్తుడు సతీష్ చేపట్టిన పాదయాత్ర బుధవారం పుట్టపర్తికి చేరుకుంది. 2016 అక్టోబర్ 20న ఇండోర్‌లో పాదయాత్ర ప్రారంభించిన ఆయన సత్యసాయి చిత్రపటాన్ని, ఆయన బోధించిన బోధనలతో కూడిన ప్ల కార్డులతో పాదయాత్రగా పుట్టపర్తికి చేరుకున్నారు. ప్రశాంతి నిలయం వద్ద ఆయనకు సత్యసాయి పూర్వ విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి ప్రజా సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన సేవాస్పూర్తిని, ఆధ్యాత్మిక బోధనలతో అందరిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. మార్గ మధ్యలో ప్రజలకు సత్యసాయి చరిత్రను వివరించానన్నారు. గతంలో ఇండోర్ నుండి మహారాష్ట్రలోని షిర్డీకి, హిమాచల్‌ప్రదేశ్‌లోని వైష్టోదేవి ఆలయానికి పాదయాత్ర చేపట్టానన్నారు. -
కోనేరులో పడి భక్తుడు మృతి
బేతంచెర్ల : శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నున్న కోనేరులో మునిగి ఓ భక్తుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. కర్నూలు షరీఫ్ నగర్ కు చెందిన ఎల్లస్వామి (32) తమ్ములు తమ పిల్లల పుట్టు వెంట్రుకలను శనివారం మద్దిలేటిస్వామి ఆలయం వద్ద తీయిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎల్లస్వామి స్నానం చేసి వస్తానని కోనేరు వద్దకు ఒక్కడు వెళ్లాడు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటి గుండంలో మునిగి పోయాడు. ఎంతసేపటికి ఫంక్షన్ వద్దకు రాకపోవడంతో ఊరికి వెళ్లి ఉంటాడని బంధువులు భావించారు. కార్యక్రమం పూర్తిచే సుకొని శనివారం రాత్రి ఇంటికెళ్లి చూడగా ఎల్లస్వామి కనిపించకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే మద్దిలేటి స్వామి క్షేత్రం వద్దకు వచ్చి గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయం ఆలయ నీటిగుండంలో ఎల్లస్వామి శవం తేలింది. మృతుడికి భార్య గంగాభవాని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు హెడ్‌కానిస్టేబుల్ గౌస్ తెలిపారు. -
శ్రీవారికి రూ.10 లక్షల విరాళం
తిరుమల: టీటీడీ అన్నదానం ట్రస్టుకు ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. బెంగుళూరుకు చెందిన వినయ్‌బాబు, అర్చన దంపతులు రూ.10, 00,116 లు స్వామి వారికి విరాళంగా ఇచ్చారు. మంగళవారం ఈ మొత్తానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్టును టీటీడీ పాలకమండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి అందజేశారు. -
అజ్ఞాత భక్తుడు రూ. 2కోట్ల విరాళం
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ అజ్ఞాత భక్తుడు పెద్ద మొత్తంలో విరాళమిచ్చాడు. తన వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడని ఓ వ్యక్తి స్వామివారికి గురువారం రూ.2కోట్లు విరాళం సమర్పించాడు. ఆ డబ్బును శ్రీవారి అన్నప్రసాద ట్రస్ట్ కు ఉపయోగించాలని అతడు కోరాడు. కాగా గతంలోనూ అజ్ఞాత భక్తులు స్వామివారికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. తిరుపతిలో తరచూ ఇటువంటి సంఘటనలు కనిపిస్తుండటం తెలిసిందే. -
భక్తుడిపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దాడి
స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితుడి పరిస్థితి విషమం సాక్షి, తిరుమల: శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడిపై టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దాష్టీకం ప్రదర్శించారు. పిడిగుద్దులు గుద్దడంతో కుప్ప కూలిన ఆ భక్తుడు ప్రస్తుతం స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన పద్మనాభం(65) కుటుంబసభ్యులతో కలసి ఈ నెల 20న రాత్రి 9.30 గంటలకు శ్రీవారి దర్శన క్యూలైన్లలోకి వెళ్లారు. పొరపాటున మహిళా భక్తులు వెళ్లే స్కానింగ్ కేంద్రం నుంచి వెళ్లబోతుండగా.. అక్కడి విధుల్లోని మహిళా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారిమధ్య వాగ్వాదం జరిగింది. పద్మనాభంపై ఇద్దరు మహిళా సిబ్బంది తోపాటు మరో ఎస్పీఎఫ్ సెక్యూరిటీ గార్డు దాడిచేసి తీవ్రంగా కొట్టారు. దీంతో కుప్పకూలిన పద్మనాభాన్ని అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతిలోని స్విమ్స్ కి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పద్మనాభం బంధువుల ఫిర్యాదు మేరకు తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడి జరగలేదు: టీటీడీ విజిలెన్స్ అధికారులు శ్రీవారి దర్శనానికి వచ్చిన పద్మనాభంపై ఎలాంటి దాడి జరగలేదని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా క్యూలైన్లలోకి రావటంతో అడ్డుకున్న మహిళా సెక్యూరిటీకి, పద్మనాభానికి వాగ్వాదం జరిగిందని తెలిపారు. ఆ సందర్భంగా అతడికి తీవ్ర రక్తపోటు రావటంతో ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ నెల 20వ తేదీన భక్తుడు పద్మనాభం శ్రీవారి దర్శనానికి వెళ్లే సీసీ కెమెరా దశ్యాలను టీటీడీ అధికారులు బుధవారం రాత్రి విడుదల చేశారు. వీటిలో భక్తుడిపై దాడిచేసిన దశ్యం కనిపించలేదు. దాడిచేసిన దశ్యాలను ఎడిట్ చేసి విడుదల చేశారని బాధితుడి బంధువులు ఆరోపించారు. -
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రి: యాదాద్రిలో కోలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. కంపార్టుమెంట్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. ఆలయం వెలుపలకు భక్తులు క్యూలో నిలబడ్డారు. ఈ నేపథ్యంలో కొండపైకి వాహన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయాయి. సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడక భక్తులకు 10 గంటల సమయం పడుతుంది. సోమవారం శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ. అలాగే అక్టోబర్ 30వ తేదీన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. -
శ్రీవారి ఉదయాస్తమాన సేవలో ప్రముఖులు
తిరుమల: తిరుమలలో శుక్రవారం శ్రీవారి ఉదయాస్తమాన సేవలో చీఫ్ జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు. అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అయితే తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవరం కూడా కొనసాగుతుంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి... భక్తులు భారీగా క్యూ లైన్లులో నిలబడ్డారు. సర్వదర్శనానికి 14 గంటలు, నడకదారిన వచ్చే భక్తులకు 12 గంటల సమయం పడుతుంది.