వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం పెరిగింది.
తిరుమల : వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం పెరిగింది. శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్మెంట్లు నిండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ బయటకు క్యూ లైన్లలో బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. అయితే నేటి నుంచి మూడు రోజుల పాటు టీటీడీ శ్రీవారి పవిత్రోత్సవాలు నిర్వహిస్తుంది.
శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి
కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్, వైఎస్ఆర్ సీపీ నాయకురాలు, ఎమ్మెల్యే రోజా ఆదివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో వారు శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారికి తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు కేంద్రమంత్రికి అందజేశారు.