సీటు ఇవ్వకున్నా.. జగనన్న వెంటే: మంత్రి రోజా | Minister Roja Condemns Yellow Media Stories On 'Not Contesting In Next Elections' | Sakshi
Sakshi News home page

జగనన్న సైనికురాలిని.. సీటు ఇవ్వకున్నా ఆయన వెంటే: మంత్రి రోజా

Published Tue, Dec 19 2023 11:34 AM | Last Updated on Tue, Dec 19 2023 12:19 PM

Minister Roja Condemns Not Contesting Yellow Media Stories - Sakshi

సాక్షి, తిరుమల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్‌ రాదని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు, యెల్లో మీడియాపై మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారని అన్నారామె.

‘‘ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది నేనే. నేను సీఎం జగననన్నకు సైనికురాలిని. జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా​‍​‍. మిషన్‌  2024లో 175/175లో భాగం అవుతా’’ అని అన్నారామె.

ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా ఆమె స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారామె. అయితే జగనన్న మాటే తనకు శిరోధార్యని చెప్పారామె. సీఎం వైఎస్‌ జగన్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు.

ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పవన్‌, చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలో తెలియక.. రెండేసి చోట్ల సర్వే చేయించుకుంటున్నారని మంత్రి రోజా దుయ్యబట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement