శ్రీకాకుళం : ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీసూర్యనారాయణస్వామిని లేలేత కిరణాలు తాకే దృశ్యాలను వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఆదివారం కూడా నిరాశే ఎదురైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో మూలవిరాట్ స్వామివారిని కిరణాలు తాకలేదు. దీంతో భక్తులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు.
శనివారం కూడా మూలవిరాట్ స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయని భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. కానీ ఆకాశం మేఘావృతం కావడంతో సూర్యకిరణాలు తాకలేదు. దాంతో భక్తులు వెనుదిరిగారు.