
అరసవల్లిలో అద్భుతం
శ్రీకాకుళం : అరసవల్లిలో అద్భుతం చోటు చేసుకుంది. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్‌ను గురువారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి జనాలు తండోపతండాలుగా విచ్చేశారు. ఉత్తరాయన పుణ్యకాలంలో స్వామివారిని సూర్యకిరణాల స్పర్శ తాకింది. ఉదయం 6.24 గంటలకు మొదలై 6.30 గంటల వరకు ఆరు నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామి మూలవిరాట్‌పై పడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకున్నారు.