sun rays
-
ప్రత్యక్ష దైవమా.. ప్రణామం
రామవరప్పాడు: సమస్త జీవరాశి మనుగడకూ సూర్యుడే మూలాధారం. ఉదయభానుని అరుణ కిరణ స్పర్శతోనే ప్రకృతి మేల్కొంటుంది. ప్రాణికోటికి ప్రాణప్రదాత, ఆరోగ్యదాత భాస్కరుడే. ఆటవికుల నుంచి ఆధునికుల వరకూ జాతిమతాలకు అతీతంగా ఇనబాంధవుని ఆరాధిస్తూనే ఉంటారు. భారతీయ సంస్కృతిలో కశ్యప పుత్రుని స్థానం సమున్నతం. మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథినాడు రథసప్తమి (Ratha Saptami) పేరుతో సూర్యజయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యుడు సప్తాశ్వాలు పూన్చిన రథాన్ని అధిరోహించి దక్షిణాయనాన్ని ముగించుకుని పూర్వోత్త దిశగా ప్రయాణం ఆరంభిస్తాడని భక్తుల విశ్వాసం. మాఘ సప్తమి (Magha Saptami) నుంచి రానున్న ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రుబాధలు నశిస్తాయని భారతీయుల నమ్మకం. సూర్యకిరణాలు (Sun Rays) తప్పనిసరిగా శరీరంపై ప్రసరించాలి. ఇందులో భాగంగానే వైదిక సంస్కృతిలో సంధ్యావందనం, సూర్యనమస్కారాలు వంటి పలు ప్రక్రియలు ఆచరణలోకి వచ్చాయి.సూర్యనమస్కారాల విశిష్టత సూర్యనమస్కారములు ఒక అద్భుతమైన వ్యాయామ పద్దతి. సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిష్టమైన ప్రాణాయామం, ధ్యానం, సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉంది. ఇందులో ఒక విశిష్టమైన ఆసన సరళి, ఒక మహోన్నతమైన శ్వాస నియంత్రణ ఒక పరమోత్కృష్ట ధ్యాన విధానం ఉన్నాయి. సూర్యనమస్కారాలు చూడటానికి సాధారణ వ్యాయామంలాగే కనిపించినా ఆచరించి చూస్తే ఒక అవ్యక్తానుభూతి కలుగుతుందని యోగ గురువులు చెబుతున్నారు. సూర్య నమస్కారాలతో మంచి ఆరోగ్యం నిత్యం సూర్య నమస్కారాలు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. శరీరంలోని ప్రతి అంగాన్నీ ఉత్తేజపరచే ప్రక్రియలు సూర్యనమస్కారాలు. ఈ పన్నెండు ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని బిగువులు తొలగడం, విషపదార్థాలు కరిగిపోవడం, దేహ కదలికలు సులువు కావడం, కీళ్లు వదులవడంతో నరాలు, కండరాల వ్యవస్థ సమతుల్యంగా పని చేస్తుంది. దృష్టి, వినికిడి, వాసన, రుచి శక్తులు పెరుగుతాయి. సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్వష్టం చేస్తున్నారు. వీటివల్ల బరువు తగ్గడంతోపాటు జీర్ణక్రియ మెరుగుపడటం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్యనమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పారా థైరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంథులు సాధారణ స్థాయిలో పనిచేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి 1,12 ఆసనాలతో శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి. 2,11 ఆసనాలతో... జీర్ణవ్యవస్థను మెరుగు పడుతుంది. వెన్నుముక, పిరుదులు బలోపేతమవుతాయి. 3,10 ఆసనాలు.. రక్తప్రసరణ పెంచుతాయి, కాలి కండరాలను బలోపేతం చేస్తాయి, గ్రంథులపై కూడా ప్రభావం చూపుతాయి. 4,9 ఆసనాలు... వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి. 5,8 ఆసనాలు.. గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి. 6వ ఆసనం. మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది. 7వ ఆసనం... జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నుముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది. యువతను చైతన్య పరుస్తున్నాం.. సూర్యనమస్కారాలు, యోగ ఆసనాలపై యువతకు ఉచితంగా అవగాహన కల్పిస్తున్నాం. యోగ, సూర్యనమస్కారాల విశిష్టత అందరికీ తెలియాలనే ఉద్ధేశ్యంతో యోగపై ప్రత్యేకంగా పుస్తకం రాశాను. ప్రత్యక్షంగా ఆసనాలు నేర్చుకోలేని వారి కోసం పరోక్షంగా అవగాహన కల్పించడం కోసం హై క్వాలిటీ రికార్డింగ్‌తో పర్ఫెక్ట్ టైమింగ్‌తో ఆడియో కూడా రూపొందించాను. పాఠశాలలు, కళాశాలల్లో యువత, విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ ఆడియో సాయంతో విజయవాడ, హైదరాబాద్‌తో పాటు అమెరికా, లండన్‌లో కూడా సెంటర్లు నడుస్తున్నాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఆసనాలపై ఆశక్తి పెంపొందించుకుని ఆరోగ్యంగా ఉండటమే మా లక్ష్యం. 1. నమస్కారాసనం (ఓం మిత్రాయనమః )చాతీని ముందుకు చాచి భుజాలను విశ్రాంతిగా ఉంచాలి. శ్వాస తీసుకుంటూ రెండు చేతులనూ ప్రక్కల నుంచి ఎత్తి శ్వాస వదులుతూ రెండు చేతులనూ కలుపుతూ నమస్కార ముద్రలో ఛాతీని ముందుకు తీసుకురావాలి. సూర్యునికి అభిముఖంగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్చరించాలి.2. హస్త ఉత్తానాసనం ( ఓం రవయేనమః )కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి వెనుకకు తీసుకురావాలి. భుజాలను చెవులకు దగ్గరగా తీసుకురావాలి. తలను, నడుమును వెనుకకు వంచాలి. ఈ ఆసనంలో మడమల నుంచి చేతివేళ్ల వరకు మొత్తం శరీరాన్ని సాగదీయాలి.3. పాదహస్తాసనం (ఓం సూర్యాయనమః)శ్వాస వదలి, వెన్నుపూసను నిటారుగా ఉంచి నడుము నుంచి ముందుకు వంగాలి. శ్వాసను పూర్తిగా వదిలేసి చేతులను పాదాల పక్కకు భూమిమీదకి తీసుకురావాలి. తలను మెకాలుకు ఆనించాలి. కాళ్లు వంచకూడదు.4. అశ్వసంచలనాసనం (ఓం భానవే నమః )ఎడమ మెకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్లపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పై భాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.5. దండాసనం (ఓం ఖగాయనమః)శ్వాస తీసుకుంటూ ఎడమకాలును కూడా వెనుకకు చాచి మొత్తం శరీరాన్ని భూమికి సమాంతరంగా ఒకే లైన్లో ఉంచాలి6. సాష్టాంగ నమస్కారం (ఓం పుష్ణేనమః)ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి అష్టాంగ నమస్కారం అని కూడా అంటారు. రెండు కాళ్లు రెండు మోకాళ్లు, రెండు చేతులు, రొమ్ము, గడ్డం ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.7. భుజంగాసనం (ఓం హిరణ్యగర్భాయనమః)ముందుకు సాగి ఛాతీని పైకిలేపి త్రాచుపాము ఆకారంలోకి తీసుకురావాలి. ఈ ఆకారంలో మోచేతులను వంచవచ్చు. భుజాలు మాత్రం చెవులకు దూరంగా ఉంచాలి. శ్వాసను పీల్చి తల వెనుకకు వంచాలి.8. పర్వతాసనం (ఓం మరీచయేనమః)ఐదవ స్థితివలెనే కాళ్లు చేతులను నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.9. అశ్వసంచలనాసనం (ఓం ఆదిత్యాయనమః)శ్వాస తీసుకుంటూ కుడి పాదాన్ని రెండు చేతుల మధ్యలోకి తీసుకురావాలి. ఎడమ మోకాలు నేలమీద ఉంచి తుంటి భాగాన్ని కిందికి నొక్కుతూ పైకి చూడాలి.చదవండి: ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్యారాధన!10. పాదహస్తాసనం (ఓం సవిత్రేనమః)శ్వాస వదులుతూ ఎడమపాదాన్ని ముందుకు తేవాలి. అరచేతులు భూమిమీద ఉంచాలి. అవసరమైతే మోకాలు వంచవచ్చు.11.హస్త ఉత్తానాసనం (ఓం అర్కాయనమః) శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు వెన్నుపూసను నిటారుగా చేసి, చేతులు పైకిలేపి కొంచెం వెనుకకు వంగి తుంటి భాగాన్ని కొద్దిగా బయటకు తోయాలి.12. నమస్కారాసనం (ఓం భాస్కరాయ నమః)నిటారుగా నిలబడి ఊపిరి పీల్చుకునేటప్పుడు అరచేతులను ఒకచోటచేర్చి నమస్కారం చేయాలి. -
అంగారకుడిపై సూర్యకిరణాలు.. ఇదే తొలిసారి!
వాషింగ్టన్: ఫొటోలో కనిపిస్తున్నవేమిటో తెలుసా? అంగారకునిపై కనువిందు చేస్తున్న సూర్య కిరణాలు. కుజ గ్రహంపై సూర్య కిరణాలు మన కంటపడటం ఇదే తొలిసారి! మార్స్‌పై పరిశోధనలు చేస్తున్న క్యూరియాసిటీ రోవర్ తాజాగా వీటిని తన కెమెరాలో బంధించింది. దిగంతాల మీదుగా సూర్యుడు అస్తమిస్తున్న క్రమంలో మేఘాలన్నింటినీ ప్రకాశవంతం చేస్తున్న తీరును ఫొటోలో గమనించవచ్చు. కుజునిపై మేఘాలు ఉపరితలానికి 60 కిలోమీటర్ల ఎత్తున నీరు, మంచుతో కూడి ఉన్నాయని నాసా అంచనా. కుజ గ్రహాన్ని వాసయోగ్యం చేసుకుని అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు కేంద్రంగా మార్చుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ క్రమంలో అక్కడి వాతావరణం, దాని కూర్పు, ఇతర స్థితిగతులను తెలుసుకోవడానికి దాని మేఘాలను విశ్లేషించడం కీలకం. -
శ్రీరాముని మూల విరాట్టుపై సూర్య కిరణాలు
న్యూఢిల్లీ: సూర్య భగవానుని కిరణాలు ప్రతి ఏటా శ్రీరామనవమి రోజున అయోధ్య భవ్య రామమందిరం గర్భగుడిలోని శ్రీరాముని విగ్రహంపై పడేలా నిర్మాణం చేపడతామని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపల్ వెల్లడించారు. ఒడిశా కోణార్క్‌లో సూర్యదేవాలయం నిర్మాణాన్ని స్ఫూర్తిగా తీసుకుని, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో చర్చలు జరిపి ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పవిత్ర గర్భగుడిలోకి సూర్య కిరణాలు ప్రసరించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. ఇందుకోసం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, ఢిల్లీ, ముంబై, రూర్కీ ఐఐటీలకు చెందిన నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రామాలయ నిర్మాణం శరవేగంగా సాగుతోందని ట్రస్ట్ అధికారి ఒకరు చెప్పారు. 2023 డిసెంబర్ కల్లా గర్భగుడి నిర్మాణం పూర్తి చేసుకుని, భక్తుల దర్శనానికి సిద్ధమవుతుందని అన్నారు. ఇప్పటికే మొదటి దశ పునాది నిర్మాణం పూర్తయిందనీ, రెండో దశ నవంబర్ 15 నుంచి మొదలవుతుందని చెప్పారు. పిల్లర్ల నిర్మాణం ఏప్రిల్ 2022 నుంచి మొదలవుతుందన్నారు. -
అపురూప దృశ్యం.. ఆవిష్కృతం
నగరి (చిత్తూరు జిల్లా): నగరి మున్సిపల్ పరిధి కీళపట్టు పురాతన శ్రీచంద్రమౌళీశ్వరస్వామి ఆలయంలోని అరుణోదయ వేళ శివలింగాన్ని సూర్యకిరణాలు తాకిన అపురూప దృశ్యం మంగళవారం సాక్షాత్కరించింది. ఉదయం 6.30 నుంచి 6.45 గంటల వరకు భానుడు తన కిరణాలతో స్వామివారిని స్పృశించాయి. ఎన్నడూ లేని విధంగా ఆలయంలోకి సూర్యకిరణాలు శివలింగం వరకు ప్రసరించడం ప్రత్యకతను సంతరించుకుంది. ఈ విషయం తెలియడంతో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చేసి ఈ దృశ్యాన్ని తిలకించి పరవశించారు. కిరణాలు ఒక మార్గంలా వెళ్లి శివలింగంపై పడుతుండడంతో ఇది మహత్యమే అంటూ దర్శించేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. ఆలయ నిర్వాహకుడు సుబ్రమణ్యంస్వామి మాట్లాడుతూ శతాబ్దాల కిందటే సూర్యకిరణాలు స్పృశించేలా తూర్పు ముఖంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోందని, పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దృశ్యాన్ని గమనించేవారు లేకపోయారన్నారు. కొన్నేళ్లుగా భక్తుల చొరవతో ఆలయం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంటోందని, నిత్యపూజా కైంకర్యాలు బాగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. సూర్యోదయ సమయాన్నే కిరణాలు శివలింగాన్ని స్పృశించడాన్ని వీక్షించి తరించామని వివరించారు. వారం రోజుల పాటు శివలింగాన్ని సూర్యకిరణాలు స్పృశించవచ్చని భావిస్తున్నామని తెలిపారు. శివలింగాన్ని స్పృశిస్తున్న సూర్యకిరణాలు.. చదవండి: ‘మనకు మొహమాటం ఉన్నా.. కరోనాకు లేదు’ రెచ్చిపోతున్న ఆన్లైన్ మోసగాళ్లు.. -
సూర్యుడు కూడా ‘లాక్డౌన్’!
సాక్షి, న్యూఢిల్లీ : 930 లక్షల మైళ్ల దూరంలోని సూర్యుడి అంతర్భాగాన నిరంతరం సుడులు తిరిగే మంటలు, ఉపరితలానికి ఎగిసి పడుతుండే అగ్ని జ్వాలలు, సూర్య గోళం చుట్టూ ఆవిష్కృతమయ్యే అయస్కాంత క్షేత్రాలు హఠాత్తుగా తగ్గిపోయాయి. పర్యవసానంగా భూమిపైకి ప్రసరించే పలు రకాల కిరణాల వాడి కూడా తగ్గింది. ప్రాణాంతక కరోనా వైరస్‌కు భయపడి ప్రపంచ మానవాళి ‘లాక్డౌన్’లోకి వెళ్లినట్లుగా సూర్యుడు కూడా లాక్డౌన్లో విశ్రాంతి తీసుకుంటున్నాడేమోనని ‘రాయల్ ఆస్ట్రానమికల్ సొసైటీ’ అధికారులు వ్యాఖ్యానించారు. (లాక్డౌన్: మరో రెండు వారాలు పొడిగించండి) 450 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన సూర్యగోళం కాస్త నెమ్మదించడం కొత్తేమి కాదని, దీన్ని ‘సోలార్ మినిమమ్’గా వ్యవహరిస్తారని రాయల్ సొసైటీ అధికారులు వివరించారు. సూర్యుడు తన నిర్దేశిత మార్గంలో సంచరిస్తున్నప్పుడు 11 ఏళ్లకోసారి నెమ్మదించడం కనిపిస్తుందని, అప్పుడు భూమి మీద ప్రసరించే కిరణాల వేడి కూడా తక్కువగా ఉంటుందని వారు చెప్పారు. ఈసారి కరోనా విజంభించడానికి, సూర్యుడిలో ఈ మార్పు రావడానికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. (వైరస్‌లను తరిమికొట్టే కోటింగ్ సృష్టి) సూర్యుడు 11 ఏళ్లకోసారి నెమ్మదించడాన్ని 17వ శతాబ్దం నుంచి ఖగోళ శాస్త్రవేత్తలు రికార్డు చేస్తున్నారని వారు చెప్పారు. సూర్యుడిలో మంటలు తగ్గిన చోటు నల్లటి మచ్చగా కనిపిస్తుందని, అలా సూర్యుడిలో పలు మచ్చలు ఏర్పడడం, మళ్లీ అవి కనిపించక పోవడం కూడా సహజమేనని తెలిపారు. సూర్యుడు బాగా నెమ్మదించినప్పుడు భూగోళంపై భారీగా మంచు కురిసిందని శాస్త్రవేత్తలు ఇదివరకే తేల్చి చెప్పారు. బాగా మంచు కురియడాన్ని ‘మంచు యుగం’గా పేర్కొన్నారు. అలా మూడు మంచు యుగాలు ఏర్పడినట్లు కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. మంచు యుగాల సమయంలోనే సముద్రాలు గడ్డ గట్టిపోయి ఖండాలు కలసి పోవడంతో ప్రజలు ఖండాంతర వలసలు పోయారని మానవ నాగరికత చరిత్ర తెలియజేస్తోంది. (‘తెల్లగా, సూట్‌కేస్ సైజ్‌లో ఉంది’) -
డీ విటమిన్ ఉంటే ఢోకాలేదు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకిన వారిలో డీ విటమిన్ ఎక్కువ ఉన్న వారు బతికి బయట పడతారని ఇంగ్లండ్‌లోని నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. అదే డీ విటమిన్ తక్కువ ఉన్న వారు తీవ్ర అనారోగ్య సమస్యలపాలై చివరకు మరణించే ప్రమాదం కూడా ఉందని వారు తేల్చారు. పెద్దవారిలో ప్రతి రోజు పది మైక్రోగ్రాముల డీ విటమిన్ ఉండాలని ఎన్హెచ్ఎస్ ఆరోగ్య మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. (కేర్ సెంటర్లలోనే కరోనా కేసులెక్కువ!) చేపలు, ఇతర మాంసాహారం, పుట్ట గొడుగులు తినడం ద్వారా, వంటికి ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి తగలడం వల్ల మానవ శరీరంలో డీ విటమిన్ తయారవుతుందన్న విషయం తెల్సిందే. ప్రజల్లో డీ విటమిన్ తక్కువగా ఉన్న దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆమ్స్టర్డామ్లోని వ్రిజి యూనివర్శిటీ జరిపిన మరో పరిశోధనలో తేలింది. చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, అమెరికా, బ్రిటన్, ఇరాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్విడ్జర్లాండ్ దేశాల్లో నమోదైన కరోనా కేసులను ఈ యూనివర్శిటీ పరిశోధన బందం విశ్లేషించింది. విటమిన్ డీ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో 50 శాతం మందికి ఛాతీపరమైన ఇన్ఫెక్షన్లు తగ్గాయని ‘యూనివర్శిటీ ఆఫ్ గ్రెనడా’ జరిపిన పరిశోధనలో తేలింది. (కరోనా వైరస్: మరో నమ్మలేని నిజం) -
అరసవల్లిలో ఆవిష్కృతం కానున్న అరుదైన దృశ్యం
అరసవల్లి: అరసవల్లి ఆదిత్యుని దేవస్థానంలో కనిపించే అరుదైన దృశ్యానికి సమయం దగ్గరపడింది. ఈ నెల 9, 10 తేదీల్లో ఆదిత్యుని మూలవిరాట్టును తొలి సూర్యకిరణాలు స్పృశించే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. సూర్యోదయ సమయాన సాక్షాత్కరించనున్న ఈ కిరణ స్పర్శ దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు అరసవల్లి క్షేత్రానికి రానున్నారు. ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా ఆలయ గర్భాలయంలో కొలువైన ప్రత్యక్ష దైవమైన శ్రీసూర్యనారాయణ స్వామి పాదాలపై నేరు గా తొలిసూర్యకిరణాలు తాకనున్నాయి. రానున్న సోమ, మంగళ వారాల్లో కన్పించనున్న ఈ అద్భుత దర్శనానికి ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకా‹Ù, ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మలు సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. దీనిపై ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ‘సాక్షి’ తో మాట్లాడుతూ వాతావరణం అనుకూలిస్తే కిర ణ దర్శన ప్రాప్తి ఉంటుందన్నారు. ఈ నెల 9,10 తేదీల్లోనే బాగా కిరణాలు పడే అవకాశముందని అన్నారు. -
కాస్తా ఎండన పడండి!
పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం. సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని కూడా చూడలేకపోతున్నారు. చూడ లేకపోతే పోయేది ఏముందిలే అనుకోకండి. వైద్యులు చెబుతున్న వాస్తవాలు వింటే భయపడి పోవాల్సిందే. సూర్యుడి కిరణాలకు చిక్కకుండా చాలా మంది తప్పించుకుని తిరుగుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా విటమిన్–డి చాలా అవసరం. సూర్య కిరణాల నుంచి సహజంగా లభించే విటమిన్–డికి దూరమైతే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బద్ధకం వీడి ‘ఉదయాన్నే లేవండి.. కాస్తా ఎండన పడండి.. ఆరోగ్యంతో జీవించండి..’ అని వైద్యులు సూచిస్తున్నారు. సాక్షి, నెల్లూరు(బారకాసు): చుర చురమనే ఎండ అంటే.. అందరికి దడే. ఆ ఎండ కిరణాలు శరీరాన్ని తాకకపోతే కూడా ప్రమాదమేనని వైద్యులు చెబుతున్న విషయాలు వింటే దడ పుడుతోంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల విటమిన్లు అందించాలి. ఏ ఒక్క విటమిన్ తక్కువైనా శరీరం అనారోగ్యానికి గురవుతోంది. ఇందులో విటమిన్–డి చాలా ప్రధానమైనది. డి విటమిన్ శరీరానికి, ఆరోగ్యానికి చాలా అవసరం. కండరాలు, ఎముకలు ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే డి విటమిన్ తప్పని సరి. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం, లేచాక చదువులు/ఉద్యోగాలకు పరుగులు తీయడం అనివార్యంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పలు సర్వేల్లో అత్యధికంగా భారతీయుల్లోనే విటమిన్–డి కొరత ఏర్పడుతోందని తేలింది. 10 శాతం మందికి విటమిన్ డి లోపం జిల్లా జనాభాలో 10 శాతం మందికి విటమిన్–డి లోపం ఉందని ఇటీవల పరీక్షల్లో తెలినట్లు వైద్య సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో డి విటమిన్ లోపిస్తున్న వారు అధికమవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ల్లోని జనరల్ ఫిజీషియన్లు, ఆర్థోపెడిక్, న్యూరాలజిస్టులు, ఎండోక్రైనాలజిస్టుల వద్దకు వెళ్లే రోగుల్లో 10 శాతం మంది విటమిన్–డి లోపంతో బాధపడున్నట్లు నిర్ధారణ అవుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య నానాటికి పెరుగుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఎముకలకు కావాల్సిన కాల్షియంను శోషించడానికి, కండరాలు బలహీనంగా కాకుండా రక్షించడానికి విటమిన్–డి తోడ్పడుతోంది. డి విటమిన్‌ను సూర్యకాంతి ద్వారా సులభంగా లభిస్తుంది. లేకపోతే డాక్టర్ సూచనతో విటమిన్–డి సప్లిమెంట్లు (మాత్రలు) తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్–డి తక్కువైతే.. శరీరంలో విటమిన్–డి తక్కువైతే తీవ్రమైన అలసట, బలహీనత, నీరసం, నడుంనొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచన శక్తి తగ్గిపోవడం, డిప్రెషన్, మానసిక స్థితిలో తేడా కనిపిస్తుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. తరచూగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడంతో పాటు జుట్టు రాలడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెదడు పని తీరుపైనా తీవ్ర ప్రభావం ఉటుంది. శరీర నిరోధకశక్తి తగ్గుతోంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాకపోవడంతో షుగర్ వస్తుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాతా సహజంగా క్యాల్షియం తగ్గుతుంది. క్యాల్షియం తగ్గితే కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. విటమిన్–డి ప్రయోజనాలు ప్రతి వ్యక్తి శరీరంలో కోలి కాల్సిఫెరాల్ అనే యాసిడ్ ఒకటి ఉంటుంది. అది లోపిస్తే చాలా సమస్యల బారిన పడతారు. ఉదయాన్నే ఎండలో కాసేపు ఉంటే విటమిన్–డి శరీరానికి లభిస్తుంది. సూర్యకాంతిలో ఉండే అల్ట్రావయొలెట్–బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్–డిని తయారు చేసుకుంటాయి. తద్వారా కాలేయం, మూత్ర పిండాల్లో విటమిన్–డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురవుతుంది. అనంతరం శరీరం దానిని ఉపయోగించుకుంటుంది. అలా సూర్యకాంతి ద్వారా తయారైన విటమిన్–డి శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తోంది. శరీరకంగా దారుఢ్యంగా ఉండాలన్నా, ఎముకలు పటిష్టంగా మారాలన్నా విటమిన్–డి తప్పనిసరి. దీంతో పాటు పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే నిత్యం మనకు తగిన మోతాదులో విటమిన్–డి అవసరం. నీడ పట్టు ఉద్యోగం అనుకుంటే.. నీడ పట్టున కూర్చుని పని చేసే ఉద్యోగం అంటే చాలా లగ్జరీగా భావిస్తారు. కానీ ఇదే వారి అనార్యోగానికి కారణం అవుతోంది. ఎండ బారిన పడకుండా హయిగా నీడన కూర్చుని పని చేసే వారికి విటమిన్–డి లోపం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ గదుల్లోనే ఉండే ఉద్యోగులు, షిఫ్ట్ ఉద్యోగులు, హెల్త్ కేర్ వర్కర్స్కు విటమిన్–డి లోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఏమి తినాలంటే... చేపలు, బీఫ్, లివర్, కాడ్‌లివర్ ఆయిల్, కోడిగుడ్లు, ఆర్గాన్ మీట్స్, ఆయిల్స్, పాలు, ఛీజ్, పన్నీరు, నెయ్యి, వెన్న, పుట్టగొడుగుల్లో విటమిన్–డి పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారంలో ఈ పదార్థాలను తప్పక చేర్చుకోవాలి. తరచూ వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం కంటే ముఖ్యంగా పైసా ఖర్చు లేకుండా ఉదయం ఎండలో కాసేపు గడిపితే విటమిన్–డి పుష్కలంగా ఉంటుంది. కాసేపు ఎండలో ఉండటం మంచిది ఎండలో కాసేపు గడపక పోవడం వల్ల విటమిన్–డి లోపం కలుగుతుంది. ఉదయం, సాయంత్రం వేళలో నడక చాలా మంచిది. ఈ లోపం ప్రధానంగా 40 ఏళ్లకు పైగా ఉన్న వారిలో కనిపిస్తుంది. పరీక్షల ద్వారా లోపం బయట పడుతుంది. ఎండలో కొద్దిసేపు గడపడంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చు. – డాక్టర్ ఎన్.విజయభాస్కర్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యుడు, జిల్లా ప్రభుత్వాస్పత్రి, ఆత్మకూరు క్యాల్షియం లోపం కారణంగా రక్తంలో విటమిన్–డి ఉంటే ఆహారంలోని క్యాల్షియంను శరీరం తీసుకుంటుంది. అది లోపిస్తే ఎముకలు మెత్తబడుతాయి. ప్రస్తుతం ఎండలో పనిచేసే వారు లేకపోవడంతో విటమిన్–డి లోపిస్తోంది. ఈ లోపం ఉన్న వారు క్యాల్షియం తీసుకోవాలి. తొలి సంధ్య వేళ సూర్యకాంతి తగిలేలా చూడాలి. – డాక్టర్ మస్తాన్‌బాషా, ఎముకలు, కీళ్లు నరాల ప్రభుత్వ వైద్యుడు, సర్వజన ప్రభుత్వ వైద్యశాల, నెల్లూరు -
లైట్ హౌస్
మేం లైట్‌హౌస్ వద్దకు చేరే సరికి లోనికి పోయే మార్గానికి గేటు మూసి ఉంది. నేను కారు దిగి గేటు వైపు నడిచాను. ‘‘లైట్‌హౌస్ ఎక్కడుంది నాన్నా? మనం లోనికెళ్దాం పద.’’ అంటూ నా భార్య ఇంకా కారు దిగకుండానే పాప నన్ను ముందుకు నెట్టింది. శ్రీలంకకు దక్షిణాగ్రాన దోండ్రా హెడ్ అనే చోట ఒక లైట్‌హౌస్ ఉందనీ, దాని నుంచి వచ్చే సంకేతాలతోనే నావికులు పెద్ద ఓడలను సముద్రంలో నడుపుతూ ఉంటారనీ, అది చూడటానికి అద్భుతంగా ఉంటుందనీ పాపకు వాళ్ల టీచరు చెప్పింది. బడి నుంచి ఇంటికి వచ్చిన మరుక్షణం నుంచి పాప దాని గురించి సవాలక్ష ప్రశ్నలు సంధించింది. ఎలాగైనా తీసుకెళ్లి చూపించమని మారాం చెయ్యడం మొదలుపెట్టింది. శ్రీలంక మ్యాప్‌లో చూస్తే దోండ్రా హెడ్ సముద్రంలోంచి ఒక బొబ్బలాగ పొడుచుకు వచ్చి ఉంటుంది. దోండ్రా అంటే దేవతల నగరం అని అర్థం. ఇది ఆగ్నేయాసియాలోనే అత్యంత ఎత్తయిన లైట్‌హౌస్ అని చెబుతారు. ఈ వివరాలన్నీ ఆ చిన్ని తలలో ఎంతో ఆసక్తి రేపేటట్టు టీచరు చెప్పి ఉంటుందని నాకు అర్థమైంది. పాప దాని గురించి ఒక అందమైన దృశ్యాన్ని మనసులో చిత్రించుకుంటోంది. అక్కడకు మూడు నాలుగు నెలల తర్వాత నాకు దక్షిణాదికి వెళ్లవలసిన పని పడింది. పనిలో పనిగా పాప కోరిక తీర్చడం కూడా కార్యక్రమంలో పెట్టుకున్నాను. మేం అక్కడకు వెళుతున్నామని విన్నప్పటి నుంచి పాప ఉప్పొంగిపోతోంది. ఇంకా రకరకాల ప్రశ్నలు వేస్తోంది. కాని తీరా అక్కడకు చేరుకునే సరికి లోనికి వెళ్లే గేటు మూసి ఉండటం వల్ల ఆమె ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అసహనంగా నన్ను కుదుపుతూ ‘‘లైట్‌హౌస్ ఎక్కడుంది నాన్నా!’’ అని అడుగుతోంది. చుట్టూ చూశాను. ఎడమ వైపున అర్ధచంద్రాకారంలోని మార్గం కనిపించింది. ఆవరణ అంతా పచ్చగడ్డితో నిండి ఉంది. ఆమార్గం తాటి చెట్ల మధ్య నుంచి ఒక గుట్ట శిఖరానికి పోతోంది. కేవలం ఒక భవనం మాత్రమే కనిపిస్తోంది. కాని లైట్‌హౌస్ కనబడటం లేదు.మనుషుల అలికిడి కోసం కళ్లు చికిలించి చూశాను. ప్రాణి సంచారమే లేదు. మా పాప నిరాశపడుతుందని భయపడ్డాను. అక్కడ ఆగి ఉన్న మా కారులాగానే పరిసరాలన్నీ స్థిరంగానూ చలనరహితంగానూ ఉన్నాయి. లయబద్ధమైన సాగర ఘోష తప్ప వేరేమీ వినబడటం లేదు. ఉదయం తొమ్మిది గంటలైనప్పటికీ, ప్రశాంతత రాజ్యమేలుతోంది. సూర్యకిరణాలు సముద్రం మీదా, చుట్టూ ఉన్న వృక్ష సంపద మీదా పడి ప్రతిఫలిస్తున్నాయి. నీటి మీద నుంచి నేల మీదకు వీచే చల్లని గాలులు శరీరాలకు మృదు స్పర్శనిస్తున్నాయి. అలలు రాళ్లను తాకి తెల్లని తుంపరలుగా మారి ఒక నీలి తివాచీకి అంచుగా ముత్యాల కుచ్చెళ్లు ఉన్నట్లు రూపిస్తున్నాయి. తరంగాలు తీరాన్ని తాకి ఆట నుంచి నిష్క్రమిస్తున్న పిల్లల మాదిరిగా వెనక్కు మళ్లుతున్నాయి. ‘‘ఎలాగైనా లోనికెళ్దాం నాన్నా!’’ పాప నన్ను ముందుకు నెడుతోంది. నా కాళ్లు పరిసరాలను గాలించడం మొదలుపెట్టాయి. దూరంగా ఆ ఆవరణలోనే సరిహద్దు పిట్టగోడను ఆనుకుని ఒకే ఒక్క చిన్న ఇల్లు కనిపించింది. దాని తలుపులు కూడా మూసి ఉన్నాయి. మేం ముందుకు నడిచాం. ఇంటి పక్కనే పిట్టగోడ మీద కూర్చుని సముద్రంవైపు నిశ్చలంగా తదేకంగా చూస్తున్న ఒక అమ్మాయి నా దృష్టిలో పడింది. చిరునవ్వుతో ముందుకెళ్లాను. మా రాకను గమనించి తనూ నవ్వుతో మా వైపు తిరిగింది. సుమారు పదేళ్లుంటాయి. ముచ్చటగా జడ వేసుకుని, మాసిన వెలిసిపోయిన గౌను వేసుకుంది. ఆమె అమాయకమైన సిగ్గరి ముఖంలో ఒక తాజాదనం, ఒక ప్రత్యేకమైన ఆకర్షణ నాకు గోచరించాయి. లైట్‌హౌస్ వైపు చూపిస్తూ, ‘‘పాపా! అక్కడెవరూ లేరా?’’ అని అడిగాను.‘‘ఉంటారు. కాని ఇప్పుడే పియదాసా మామయ్య గేటు మూసి లోనికెళ్లాడు’’ అంది. ఆమె ఇంకా పిట్టగోడపైనే తన రెండు చేతుల్నీ వెనక్కు ఆనించుకుని ఉంది.దగ్గర్లోనే ఒక నేవీ గోపురం కనిపించింది. ‘‘లోపల నేవీ వాళ్లు ఉంటారా?’’ అని అడిగాను.‘‘నేవీ వాళ్లు అప్పుడప్పుడు వచ్చి పోతుంటారు. కాని లోపల ఇక్కడి వాడే ఒకతను కాపలా కాస్తుంటాడు’’ అని చెప్పింది. ‘‘మేం లోపలికి వెళ్లాలంటే ఏం చెయ్యాలి?’’‘‘ఆ గేటు దూకి లోనికి వెళ్లండి. మేం కూడా అదే పని చేస్తుంటాం.’’ కాని నా వయసు వాడు అనుమతి లేకుండా గేటు దూకి ఒక ప్రదేశంలో ప్రవేశించడం ఇబ్బందిగా తోచింది. ‘‘మేమంతా గేటు దూకడం కష్టం కదమ్మా! నువ్వు కాస్త లోపలికి వెళ్లి ఎవర్నైనా పిలిచి, గేటు తెరిపించగలవా?’’ అని అడిగాను.మరో మాట లేకుండా ఆ అమ్మాయి పిట్టగోడకు రెండో వైపు దూకింది. లైట్‌హౌస్ లోనికి వెళ్లింది. ఆ ఇంటి వారి మాట తీసుకోకుండా చిన్నమ్మాయిని లోనికి పంపించడం నాకే నచ్చలేదు. ఎవరైనా ఇంటి నుంచి బయటకు వచ్చి మమ్మల్ని ప్రశ్నించక ముందే, ఆమె తిరిగి వస్తే నయమని భావించాను. కొద్ది సేపట్లోనే ఒక ముసలామె ఒక చేత్తో కత్తీ, మరో చేత్తో వంటచెరకు ముక్కా పట్టుకుని బయటకు వచ్చింది. మమ్మల్ని పట్టించుకోకుండానే, ఒక పెద్ద దుంగ మీద ఆ ముక్కను పెట్టి కత్తితో ముక్కలు చెయ్యసాగింది.ముందుగా నేనే మాట్లాడాను.‘‘అమ్మా! మేం ఆ లైట్‌హౌస్ చూడటానికి వచ్చాం.’’ అన్నాను. అప్పుడు తలెత్తి మావైపు చూసింది. కాస్త దగ్గరకు వచ్చింది. ఆమెకు నా మాట స్పష్టంగా వినిపించినట్లు లేదు. కొంచెం బిగ్గరగానే అదే మాట మళ్లీ చెప్పాను. ‘‘అలాగా!’’ ఆమె ముడుతలు పడిన ముఖం మీద ఒక చిరునవ్వు వ్యాపించింది. ‘‘ఇంతసేపూ ఇక్కడున్న చిన్నమ్మాయి నీ మనవరాలేనా అమ్మా!’’‘‘ఏదీ? ఇప్పుడా అమ్మాయి ఎక్కడకు వెళ్లింది?’’ ఒక్కసారిగా కలవరపాటుతో అడిగింది. నా ప్రశ్న ఆ అమ్మాయి ఉనికి గురించి గుర్తు చేసినట్లుంది. వెంటనే చిన్నది ఎక్కడికి వెళ్లిందో ఏదమైందో తెలుసుకోవాలనుకుంటోంది. కొంచెం జంకుతోనూ, ఆ అమ్మాయి నేరమేమీ లేదన్నట్టుగానూ నేనే సంజాయిషీ ఇచ్చాను. ‘‘అమ్మా! నేనే ఆమెను లోనికెళ్లి ఎవర్నైనా పిలవమని పంపాను.’’‘‘ఏమంటున్నావు బాబూ!’’ చెవి దగ్గర చెయ్యి పెట్టి అడిగింది. నా మాటని మళ్లీ చెప్పాను.‘‘అవును. అక్కడ పియదాసా అనే వాడుండాలి. కాని అసలు కాపలా మనిషి ప్రస్తుతం లేడు. నగరంలోకి వెళ్లాడనుకుంటాను.’’ అంది. మేమీ లైట్‌హౌస్ పరిసరాలకు వచ్చినప్పటి నుంచి పరిస్థితులు అనుకూలంగా లేవని అనిపించింది. ‘‘మరి ఇక్కడ ఉండేవారు ఎవరమ్మా?’’ వాతావరణాన్ని తేలిక చేసే ఉద్దేశంతో అడిగాను.‘‘ఇక్కడెవరుంటారు నాయనా? నేనూ నా మనవరాలూ మాత్రమే ఉంటాం..’’ నిట్టూర్పుతో జవాబిచ్చింది. ముసలామె మా వైపు నిదానంగా చూసింది. ఆ తర్వాత వాడిన తన ముడుతలు పడిన ముఖాన్ని సముద్రం వైపు తిప్పింది. ఇంక నేను వివరాలేమీ అడక్కుండానే ఆ చిన్నమ్మాయి గెంతుకుంటూ వచ్చింది. ఆమె వెనుకనే ఒక నడి వయస్కుడు లుంగీ బనియన్‌తో వచ్చాడు. ఆ వ్యక్తితో లైట్ హౌస్ చూడటానికి అనుమతి గురించి మాట్లాడాను. ఈలోగా ముసలామె నా భార్యతో మేం ఎక్కడి నుంచి వచ్చామో మొదలైన వివరాలు అడగటం వినిపించింది. ‘‘లైట్ హౌస్ నిర్వాహకుడు ఈ ఉదయమే గాలేకు ఒక ప్రభుత్వ పని మీద వెళ్లాడు. మీరు పై అంతస్తుకి వెళ్లి చూడటానికి వీలు పడదు. కాని లోనికెళ్లి కింద భాగం వరకు చూడొచ్చు. చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కూడా చూడొచ్చు.’’ అన్నాడు పియదాసా. ఆ చిన్నమ్మాయి వైపు చూపుతూ ముసలామెతో, ‘‘అమ్మా! ఈ చిన్నారిని మాతో లోనికి తీసుకెళ్లవచ్చునా?’’ అన్నాను.ఎందుకో ఆ పాప గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది. ‘‘అమ్మాయీ! వీరితో వెళ్లిరా.’’ అంది ముసలామె. అంటూనే ఆమె వైపు జాలిగా చూసింది. ఆ ఇద్దరి మధ్య మాటలకందని విషాదమేదో ఘనీభవించి ఉన్నదని నాకు తోచింది. ఈ లైట్ హౌస్ పరిసరాలకు వచ్చినప్పటి నుంచి నాలో ఒక వింత అనుభూతి చోటు చేసుకుంది. అది ఈ సరికి వివరణకు అందని వ్యాకులతగా రూపాంతరం చెందింది. కాని దాన్ని అధిగమించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. మొదట ఆ చిన్నమ్మాయి మాతో రావడానికి సంకోచించింది. కాని నా భార్యా నా కుమార్తె ఒత్తిడి చేసిన మీదట అంగీకరించింది. నడుస్తూ ఉండగా నేనడిగాను: ‘‘నీ పేరేమిటమ్మా!’’‘‘సామంతిక!’’ తరగతి గదిలో టీచరు ప్రశ్నకు విద్యార్థి బదులు చెప్పినట్టుగా వెంటనే చెప్పింది.లైట్ హౌస్ పూలతోట నిజంగా చాలా సుందరంగా ఉంది. ఒక్క కలుపు మొక్క కూడా లేదు. మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. పచ్చగడ్డి ఆకుపచ్చని తివాచీలా పరుచుకుని ఉంది. పూదోటని దాటి ఇటుకలూ చిన్న గులకరాళ్లూ పేర్చిన సన్నని దారి గుండా మేం ఆ గుట్ట పైకి ఎక్కాం. కొద్ది దూరం కొబ్బరి చెట్ల మధ్యగా నడిచాం.ఇంకొంచెం ముందుకెళ్లగానే లైట్‌హౌస్ కనిపించింది. అది అతి పెద్ద రాకెట్ ఆకాశం వైపు సంధించినట్టుగా ఉంది. నా కుమార్తె ఎంతో సంబరపడిపోయింది. ‘‘అదిగో లైట్ హౌస్’’ అంతూ గంతులేసింది.సామంతిక కంటే మా పాప ఒకటి రెండు సంవత్సరాలు చిన్నగా ఉంటుంది. ప్రారంభంలో పాప సామంతికతో చనువుగా ఉండలేదు. బహుశ లైట్ హౌస్‌ని చూడాలనే ఆమె కాంక్ష ముందు మిగతావేవీ పట్టించుకునే స్థితిలో లేదు. సామంతికకు ఒంటరితనపు భావన రాకుండా, ఆ ఇద్దరినీ చేరువ చేసే ఉద్దేశంతో నా కుమార్తె అడిగిన ప్రశ్నలకు సామంతిక వైపు తిరిగి జవాబులు చెప్పేవాణ్ణి. నేనే స్వయంగా సామంతికను మాటల్లోకి దించాను. ‘‘సామంతికా! రాత్రి పూట ఈ వైపు నుంచి చాలా కాంతివంతంగా ఉంటుందనుకుంటాను’’ అన్నాను.‘‘నిజమే. వాస్తవంగా ఇక్కడ రాత్రి చాలా అందంగా ఉంటుంది. ఆ సమయంలో లైట్‌హౌస్ శిఖరంలో ఉన్న దీప స్తంభం ఆకాశంవైపు ఎక్కువ కాంతిని ప్రసరిస్తుంది. మా ఇంట్లోనికి చీకటి రానే రాదు. ఎల్లప్పుడూ మిట్ట మధ్యాహ్నంలా ఉంటుంది. వెన్నెల రాత్రుల్లో మాత్రం కాంతి పుంజం అంత స్పష్టంగా కనబడదు. చీకటి రాత్రుల్లో కాంతి దూరంగా సముద్రం వైపు పడుతుంది. అప్పుడు ఈ ప్రదేశమంతా స్వర్గంలా ఉంటుంది.’’సామంతిక ఏదో పరవశంతో చెప్పుకుపోతోంది. లైట్‌హౌస్ ఈ ప్రాంతాన్ని వెలుగులతో నింపడానికే అని భావిస్తోంది. ఇక్కడి నుంచి కాంతి సంకేతాలు పంపుతారనే విషయం బహుశ ఆమెకు తెలీదు.‘‘ఎక్కడ చదువుతున్నదో సామంతికను అడుగమ్మా!’’ అన్నాను మా పాపతో. ఇద్దరి మధ్య సంభాషణ ప్రారంభించాలని నా కోరిక. పాప అడిగింది.‘‘నేనిప్పుడు బడికి వెళ్లడం లేదు’’ చాలా తేలిగ్గా తీసుకుంది సామంతిక.‘‘ఎందుకు?’’ నేనడిగాను.‘‘మా నాన్నని పోగొట్టుకున్న తర్వాత నేను బడి మానేశాను’’ అన్నది. ఈ మాట విని మేమంతా దిగ్భ్రాంతికి గురయ్యాం. కొద్దిసేపు అతి నిశ్శబ్దంగా నడిచాం. సామంతిక ఒక కర్ర ముక్క తీసుకుని పూల గుత్తుల్ని కదిలించడం మొదలుపెట్టింది. ఒక సీతాకోక చిలుకలాగాసామంతిక ఎగురుతూ ఉంది. అంటే తనకు సంభవించిన ఆపద తీవ్రతనీ, భవిష్యత్తులో తనకు ఎదురు కాబోయే సమస్యలనీ అర్థం చేసుకునే వయస్సూ, పరిణతీ ఆమెకు లేదని నేననుకున్నాను.ఈ ఆలోచన రాగానే ఆమె పట్ల నా మనస్సు మరింత జాలితోనూ, ఆర్ద్రతతోనూ నిండిపోయింది.‘‘మరి మీ నాన్నని ఎలా పోగొట్టుకున్నావమ్మా!’’‘‘ఒకరోజు సముద్రంలోనికి చేపల వేటకు వెళ్లాడు. ఇప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు.’’‘‘అతడు వెళ్లిన పడవ దొరికిందా?’’‘‘మా గ్రామస్తులు కొన్ని వారాల పాటు వెతికారు. వారికేమీ దొరకలేదు. మా నాన్నమ్మ ఇలా చెప్పింది: ‘ఏదో ఒక రోజున మీ నాన్న వస్తాడు. అంతవరకు ఓపికగా ఎదురు చూడక తప్పదు అన్నది.’’‘‘మీ నాన్నని పోగొట్టుకుని ఎన్నాళ్లయింది?’’ అడిగాను. సామంతిక మాటల్లో ‘నాన్నని పోగొట్టుకున్నాను’ అంటున్నప్పుడుఅతడుచనిపోయాడు అన్న ధ్వని లేదు. ‘కేవలం సముద్రంలోనికి వెళ్లి తిరిగి రాలేదు’ అన్న అర్థం వచ్చేట్లు మాట్లాడుతోంది. నేనూ అదే వైనాన్ని కొనసాగించాను.‘అప్పుడు నాకు ఎనిమిదేళ్లు’’‘‘ఇప్పుడు నీ వయసెంత?’’‘‘పదేళ్లు’’ అన్నది.‘‘మీ నాన్న పడవలో మరో దేశం వైపు వెళ్లి ఉండొచ్చు. కలత చెందకు. అతను ఏదో ఒక రోజున తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు.’’ అన్నాను కాస్త అనునయించే ధోరణిలో. సామంతిక మళ్లీ తన ఊహా ప్రపంచంలోకి వెళ్లిపోయింది. ‘‘అప్పుడు నేను మా నాన్నతో కొలంబో వెళ్లి జూ చూస్తాను. ఆ రోజుల్లో నాతో నాన్న కొలంబో తీసుకెళ్లి జూ చూపిస్తాను అంటుండేవాడు. అక్కడ మేం నగరమంతా తిరుగుతాం. అన్నీ చూస్తాం. ఎంతో బావుంటుంది’’ ఆమె ఇంకా బాల్య చాపల్యంలోనే ఉంది. ‘‘ ఆ రోజుల్లో ప్రతిరోజూ బడి నుంచి ఇంటికి తిరిగి వచ్చి ఆ పిట్ట గోడపైనే కూర్చునే దాన్ని. మా పడవ వచ్చే వరకు ఎదరు చూసే దాన్ని. పడవని దూరంగా చూడగానే మా అమ్మని బిగ్గరగా పిలిచేదాన్ని. మేమిద్దరమూ లైట్ హౌస్ రెండో వైపునున్న బీచ్ వైపు పరుగెత్తే వాళ్లం. నాన్న తీరానికి చేరే వరకు వేచి ఉండే వాళ్లం. నాన్న ఇసుక మీద అడుగు పెట్టగానే నన్ను పట్టుకుని మీదకు ఎత్తుకునే వాడు. ప్రతిరోజూ ఇలా అడిగేదాన్ని: ‘‘నాన్నా! మనం ఈరోజు జూ చూడ్డానికి వెళ్దామా?’ నాన్న ఇలా చెప్పేవాడు: ‘‘వచ్చే వారం వెళ్లి జూ చూద్దాం. సరేనా?’’ అనేవాడు. తర్వాత నా చేతికొక చేపని ఇచ్చేవాడు. అప్పుడు అమ్మా నేనూ ఇంటికి వచ్చేవాళ్లం. అమ్మ వంట మొదలుపెట్టేది. నేను సహాయం చేసేదాన్ని. నాన్న కూడా ఇంటికి చేరిపోయేవాడు. నేను నాన్న ఒడిలోకి ఎక్కి కూర్చునే దాన్ని. నాన్న నాకు తినిపించేవాడు.’’ ఇలా సామంతిక కబుర్లు చెప్పుకుంటూ పోతోంది. బహుశ ఇలా ఆమెను గుర్తించి, అభిమానించి, ఆమె జీవితం గురించి శ్రద్ధాసక్తులను కనపరచిన వారు ఈ మధ్య కాలంలో ఎవరూ ఉండి ఉండరు. అందువల్లనే మా మధ్య ఇంత తక్కువ సమయంలోనే స్నేహ వాతావరణం ఏర్పడింది. సముద్ర జలాల్లోకి వేటకు వెళ్లి ఆచూకీ తెలియకుండా పోయిన ఎందరో మత్స్యకారుల గురించి విన్నాను, చదివాను. కొందరిని ఇతర దేశాల వారు ముందు రక్షించి, ఆ తర్వాత వారి మాతృ దేశానికి అప్పగించే సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని సార్లు అతి ఘోరమైన విషాదకరమైన సంఘటనలు కూడా పత్రికల్లో కనపడుతుంటాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య సామంతిక తండ్రి సురక్షితంగా ఇంటికి చేరాలనే కోరుకుంటున్నాను. లైట్ హౌస్ చుట్టూ తిరిగాం. భవనంలో నేల భాగం అంతా చూశాం. అక్కడి నుంచి చూస్తే మూడు వైపులా అనంతమైన మహా సముద్రం కనిపిస్తుంది. ఉవ్వెత్తున లేచిపడే రాకాసి తరంగాలు కనిపిస్తాయి.నా ఆలోచనలు సామంతిక తండ్రి వైపు మళ్లాయి. అతడికి ఏమై ఉంటుంది? పొట్ట కూటి కోసం అనంత సాగరంతో తలపడటానికి వెళ్లాడు. అతని పడవ తుఫానులో చిక్కుకున్నదా? లేక ఏమైనా మంచుకొండకు గుద్దుకున్నదా? అతణ్ణీ, అతడి సహచరులనీ అగాథమైన సముద్రం కబళించిందా? వారు విగత జీవులై సముద్రం అడుగు భాగానికి చేరిపోయారా? వద్దు.. వద్దు.. అలా జరగకూడదు. సామంతిక తండ్రి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. కుమార్తెను ఆనందంతో ఆలింగనం చేసుకోవాలి.. అని నా మనసు కోరుకుంటోంది. గేటు పక్కనే సముద్రానికి చేరువగా పరిచి ఉన్న పచ్చగడ్డి పొరపై మేం కొంతసేపు నిలుచున్నాం. పిల్ల తెమ్మెరల్లోని చల్లదనం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. అందరమూ ఒకేసారి అర్ధంతరంగా సామంతికను విడిచి రావడం సరికాదనిపిస్తోంది. లైట్ హౌస్ నీడలో సముద్రానికి చేరువగా ఏకాంతంగా గడుపుతున్న సామంతిక గాలివాటుకు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరై ఇబ్బంది పడింది. ‘‘మనం రెండోవైపు పోదామా? ఇక్కడ నీటి తుంపర్లు ఎక్కువగా ఉన్నాయి’’ అంది సామంతిక.‘‘ఫరవాలేదమ్మా! కాసేపు ఇక్కడే ఉందాం’’ కూర్చుంటూ అన్నాను.నా భార్యా, పాప కూర్చున్నారు. సామంతిక కూడా మాతో పాటు కూర్చుంది. మాతో తెచ్చిన కేకుల్ని పంచుకుని, టీ తాగాం. ఎక్కువగా ఒత్తిడి చెయ్యకుండానే సామంతిక కూడా మాతో కలిసి తీసుకుంది.‘చూడండి నాన్నా! అక్కడ బోలెడన్ని ఆల్చిప్పలు ఉన్నాయి.’’ అంది మా పాప.సామంతిక పిట్టగోడ పైనుంచి ఒక్క తృటిలో దూకి బీచ్ వైపు పరుగెత్తింది. ఒక్కొక్క రాతి మీద నుంచి గెంతుతూ ఆల్చిప్పలను ఏరుతోంది. మా పాప కూడా వెళ్లి ఆమెతో చేరిపోయింది. ఇద్దరూ ఒకరికొకరు చేరువైపోయారు. దూరం నుంచి తీరంలో ఎగురుతున్న సీతాకోక చిలకల్లా కనిపించారు. కాసేపు చెట్టాపట్టాలేసుకుని పరుగెత్తారు. మాకు కనిపించనంత దూరం పోయారు. నేను వారిని వెతుకుతూ వెళ్లాను.ఒక్కసారి ఏదైనా రాకాసి అల వచ్చి, వారిని లోనికి లాక్కుపోవచ్చని భయపడ్డాను. మా పాపకు ఇష్టం లేకపోయినా నీటికి అందనంత దూరం చేయి పట్టి లాగాను. నిజానికి నీటిని వదిలి తీరంలోని ఇసుక పైకి చేరుకోవడం సామంతికకు ఇష్టం లేనట్టుంది. తెల్లబోయి విచారంగా చూసింది. మేం బయల్దేరబోయాం. సామంతిక బరువుగా చూసింది. ముసలమ్మకు కృతజ్ఞతలు చెప్పాం. సామంతిక వల్లనే లైట్ హౌస్ చూడటం సాధ్యమైందని మరీ మరీ చెప్పి కదలబోయాం.‘‘బాబూ! ఈ చిన్నది పరుగెత్తడం, సంతోషంగా గెంతులెయ్యడం నేనూ వంటగది కిటికీలోంచి సంతృప్తిగా చూశాను. పాపం ఈమె ఎవరితో ఆడుకోగలదు? దగ్గర్లో ఇళ్లు లేవు. ఈ వయసు పిల్లలూ లేరు. ఈ పిట్టగోడ మీద రోజంతా ఒంటరిగా కూర్చుంటుంది. ఓపిగ్గా సముద్రం వైపు వాళ్ల నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.’’ అంటూ ముసలామె బాధపడింది. ‘‘సామంతిక తల్లి ఇంటి వద్ద ఉండదా?’’ ఈ ప్రశ్న వెయ్యడానికి కాస్త తటపటాయించాను. ఒక వేళ తల్లి చనిపోయి ఉంటే గాయాన్ని మరింత రేపినట్టవుతుందని భయపడ్డాను.‘‘లేదు బాబూ! ఆమె ఇంకొకరితో లేచిపోయింది. ఇది జరిగి ఏడాదవుతోంది. ఆమె లేకపోవడమే మాకు బావుంది. ఈ చిన్నదానికి అసలు వాళ్లమ్మతో చేరికే లేదు. ఎప్పుడూ నాన్నతోనే గడిపేది. నా శక్తి మేరకు బుట్టలు తయారు చేసి అమ్ముతుంటాను. ఆ డబ్బుతోనే నేనూ ఈ పిల్లా కష్టంగా బతుకుతున్నాం.’’ అంటూ ముసలామె నిట్టూర్చింది. ‘‘నా బాధంతా ఒక్కటే బాబూ! నేను కన్ను మూసిన తర్వాత ఈమె అనాథ అయిపోతుంది.’’ అన్నది. ఈ మాటలన్నీ ఆమె సామంతిక సమక్షంలోనే పైకి చెప్పింది. నిజానికి మనవరాలి వద్ద దాచవలసిన అంశాలేవీ ఆమెకు లేవు. ప్రస్తుతం ఇద్దరి జీవితాలూ పెనవేసుకుని ఉన్నాయి. ఇవన్నీ విన్న తర్వాత ఆ అభాగ్యులను తక్షణమే వదిలి వెళ్లడం కష్టంగా తోచింది. నోట మాట రాక చాలాసేపు మౌనంగా నిల్చుండిపోయాను. నా భార్య నిశ్శబ్దాన్ని భగ్నం చేసింది. ‘‘సామంతికా! మాతో వస్తావా? మేం నిన్ను కొలంబో తీసుకెళ్తాం. జూ చూపిస్తాం.’’‘నేను రాలేనమ్మా! మా నాన్న తిరిగి వచ్చేవరకు ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తుండాలి.’’ అన్నది సామంతిక అప్రయత్నంగా.\నిజానికి నేనే ఇటువంటి సూచన చెయ్యాలనుకున్నాను. ఇప్పుడు నా భార్య ప్రతిపాదనను బలపరచాలనుకున్నాను. ‘‘అమ్మా! సామంతికను మాతో తీసుకెళ్లనిస్తావా? మేం ఈమెను చక్కగా చూసుకుంటాం. చదివిస్తాం.’’అన్నాను.‘‘అమ్మో! కుదరదు బాబూ! ఈ చిన్నది కూడా లేకుండా నేనెల బతగ్గలను? నా ప్రాణం, నా ఆశ ఈ పిల్లే కదా బాబూ! నాకా వయసు పైబడింది. ఈ దశలో నేను ఈమెను విడిచి ఉండటం వీలు కాదు.’’ అన్నది ముసలమ్మ. ఇప్పుడు అటువంటి ప్రతిపాదన చేసినందుకు నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. బాధపడ్డాను కూడా. ఒక సుదీర్ఘమైన నిశ్శబ్దం అక్కడ ఏర్పడింది. సముద్రపు అలల శబ్దం మాత్రమే వినిపిస్తోంది.సామంతిక నానమ్మకు దగ్గరగా వెళ్లి ఆమెను ఆలింగనం చేసుకుని, చుట్టుకున్నది. బహుశ ఆ చిన్నదానికి కావలసిన వెచ్చదనం ముసలామె ఒడిలోనే లభించవచ్చు. లేదా మేం బలవంతంగా తీసుకుపోతామని భయపడి ఉండవచ్చు. ఏది ఏమైనా మేం ఇప్పుడు వారి నుంచి విడిపోయి బయల్దేరడానికి మార్గం సుగమమైంది. అంతేకాదు, కాస్త మనసు గట్టిపడింది. మేం ముగ్గరం కారెక్కిపోయాం. కారుని రోడ్డు వైపు తిప్పి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను. చేతులు ఊపి వీడ్కోలు చెప్పాలనుకున్నాను. కాని ఆ సరికే ముసలమ్మ తిరిగి కట్టెని ముక్కలు చెయ్యడంలో నిమగ్నమై ఉన్నది.సామంతిక పిట్టగోడపై కూర్చుని సముద్రంవైపు విషాదంగా చూస్తున్నది. లైట్ హౌస్‌ని చూసిన ఆనందంలో మా పాప అదేపనిగా వాగుతోంది.నాకు మాత్రం మనసనే నిశ్చలమైన సరస్సుని ఎవరో బలవంతంగా కెలికినట్టుంది. సామంతిక తన పాలిపోయిన ముఖంతో పిట్టగోడ మీద కూర్చుని సముద్రంవైపు విషాదంగా చూస్తున్న చిత్రం వెంటాడుతోంది.లైట్ హౌస్ నీడలో నివసిస్తున్న ఆ చిన్నారి జీవితంలోనికి ఎప్పటికైనా ఆ దీపస్తంభం తన కాంతిపుంజాన్ని ప్రసరించగలదా అన్న ప్రశ్న నన్ను వేధిస్తోంది. పదే పదే నా ఆలోచనలకు భంగం కలిగిస్తోంది. సింహళ మూలం : పి.ఎన్. కిశోర్ కుమార్ అనువాదం: టి.షణ్ముఖరావు -
కిరణ స్పర్శ కాసింతే..
అరసవల్లి: ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో శనివారం పాక్షికంగా కిరణ దర్శనమైంది. ఉత్తరాయణ, దక్షిణాయన కాలమార్పుల్లో భాగంగా గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టును తొలిసూర్యకిరణాలు స్పృశించే అరుదైన దృశ్యం కోసం ఎదురుచూసిన భక్తులకు కొంతమేరకు నిరాశే మిగిలింది. ఆకాశం మేఘావృతం కావడంతోపాటు మంచు కమ్మేయడంతో సూర్యోదయం కాస్తా ఆలస్యమైంది. దీంతో శనివారం ఉదయం 6.28 నిమిషాలకు సూర్యోదయ తొలికిరణాలు ఆలయ ధ్వజస్తంభాన్ని తాకి అంతరాలయంలోకి చేరుకున్నాయి. అయితే కిరణాల దిశ మారిపోవడంతో కిరణాలు పూర్తి స్థాయిలో మూలవిరాట్టును తాకలేదు. దీంతో పాక్షికంగా తాకిన కిరణాల దర్శనాలతో భక్తులు వెనుదిరిగారు. పలువురు ఉన్నతాధికారుల కుటుంబసభ్యులు ఆదిత్యుని కిరణ దర్శనాన్ని తిలకించేందుకు వచ్చి, స్వామిని దర్శించుకున్నారు. పెద్ద సం ఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ఈవో ఆర్.పుష్పనాథం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభం నుంచి అంతరాలయం వరకు ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆదిత్యునికి ప్రత్యేక పూజలు చేశా రు. కలెక్టర్ సతీమణి పబితా నివాస్, ఎస్పీ సతీమణి రామలక్ష్మి, డీఎస్పీ ఎ.చక్రవర్తి తదితరులు కిరణ స్పర్శను చూసేందుకు వచ్చారు. నేడు కూడా కిరణ దర్శనానికి అవకాశం తొలి సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆదివారం కూడా కన్పించేందుకు అవకాశముంద ని ఆలయ ఈవో తెలియజేసారు. ఈమేరకు భక్తు ల దర్శనాలకు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కిరణాల దర్శనం తర్వాత సాధారణ దర్శనాలకు అవకాశమిస్తామని తెలియజేసారు. ఆనందంగా ఉంది.. తొలిసారి ఆదిత్యుని కిరణాలను తాకే దృశ్యం చూసేందుకు వచ్చాను. కొద్దిపాటి సమయం అంతరాలయంలో స్వామి వారి విగ్రహంపై కిరణాలు పడటం కన్పించింది. చాలా ఆనందంగా ఉంది. మళ్లీ ఆదివారం కూడా అవకాశముందని ఆలయ అధికారులు చెబుతున్నారు. మరోసారి చూసేందుకు ప్రయత్నిస్తా. –పబితా నివాస్, జిల్లా కలెక్టర్ సతీమణి -
భావన్నారాయణునికి సూర్యకిరణాభిషేకం
ప్రకాశం, చినగంజాం: పెదగంజాం గ్రామంలో భూనీలా సమేత భావన్నారాయణ స్వామి ఆలయంలో గత మూడు రోజులుగా సూర్య కిరణాలు స్వామివారి మూలవిరాట్‌ను అభిషేకిస్తున్నాయి. బుధవారం నాలుగో రోజు కూడా సూర్యకిరణాలు స్వామి వారిని ఆపాదమస్తకం అభిషేకించి భక్తులను పులకింపజేశాయి. సుమారు 10 నుంచి 15 నిమిషాలపాటు సంభవించే ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు వేకువ జామునే ఆలయానికి తరలివచ్చారు. ఏటా ఉత్తరాయణం, దక్షిణాయణ పుణ్యకాలంలో సూర్య కిరణాలు స్వామివారిని స్పృశిస్తాయి. మార్చి మొదటి వారంలో, సెప్టెంబర్ చివరి వారం, అక్టోబర్ మొదటి వారంలోనూ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. -
అరసవల్లి ఆలయంలోకి సూర్యకిరణాలు
-
భక్తులకు నిరాశను మిగిల్చిన కిరణ దర్శనం
-
నీరు ముంచినా దారి ఉంటుంది!
వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో సముద్రమట్టాలు గణనీయంగా పెరుగుతాయని.. తీర ప్రాంతాల్లోని మహా నగరాలు సగానికిపైగా నీటమునిగిపోతాయని తరచూ వార్తలొస్తున్నాయి. అకాల వర్షాలు, వరదల తీరు చూస్తూంటే ఈ పరిణామాలు నిజమయ్యే సూచనలే ఎక్కువ. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్కిటెక్ట్‌లు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేస్తున్నారు. నేలను వదిలి.. సముద్రాలపైనే జీవించాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి భవనాలు కట్టాలి? వాటిల్లో ఎలాంటి సౌకర్యాలుండాలి? అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. వాటిల్లో ఒకటి పక్క ఫొటోలోని వర్టికల్ సిటీ. మధ్యప్రాచ్య దేశాల్లో ఇలాంటి ఒక భవన నిర్మాణానికి ఇటలీకి చెందిన ఓ ఆర్కిటెక్చర్ సంస్థ డిజైన్ చేస్తోంది. మునిగిపోతాయనుకునే మహానగరాలకు సమీపంలోనే సముద్రగర్భాన్నే పునాదిగా చేసుకుని నిర్మాణమవుతాయి ఈ నిట్టనిలువు నగరాలు! మొత్తం 180 అంతస్తులు.. 2460 అడుగుల ఎత్తు ఉండే వీటిల్లో ఇళ్లు, ఆఫీసులు, విందు, వినోదాలన్నింటికీ ఏర్పాట్లు ఉంటాయి. మొత్తం 19 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణముండే ఈ భవనంలో గాలి, వెలుతురుతోపాటు పచ్చదనానికీ పెద్దపీట వేశారు. భవనం చుట్టూ ఉండే అద్దాల్లోనే సూర్యరశ్మిని ఒడిసిపట్టగల సోలార్ ప్యానెళ్లు ఉంటాయి. సముద్రగర్భాన్నే పునాదిగా చేసుకుంటున్నారు కాబట్టి.. కింద కొన్ని అంతస్తుల భవనం నీటిలోనే ఉంటుంది. వీటన్నింటినీ వాహనాల పార్కింగ్, భవనానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనకు వాడతారు. వీటితోపాటు ఈ ప్రాంతంలోనే కొన్ని పారదర్శకమైన హోటల్ గదులూ ఉంటాయి. వీటిల్లోంచి సముద్రపు అడుగున జీవించే జలచరాలను గమనించవచ్చునన్నమాట. నీటిలోంచి, గాల్లోంచి కూడా ఈ భవనంలోకి ప్రవేశించేందుకు తగిన ఏర్పాట్లు ఉన్నాయి. భవనం పై అంతస్తులో హెలీప్యాడ్, నీటిలోంచి వచ్చేందుకు పడవలను వాడతారు. ఐడియా బాగుంది కానీ ఎప్పటికి వాస్తవ రూపం దాలుస్తుందన్నదే నో ఐడియా! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మూలవిరాట్‌ను తకని సూర్య కిరణాలు
-
సాయిబాబా ఆలయంలో వింత వెలుగు!
బెంగళూరు : మైసూరు జిల్లా హుణసూరిలోని శ్రీ సాయిబాబా ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించిన సూర్య కిరణాలు అచ్చు సాయి బాబా ఆకారం కనిపించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఆలయంలోకి సూర్య కిరణాలు ప్రవేశిస్తున్న సమయంలో ఆవి సాయి ఆకృతిలో ఉండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు మొత్తం అక్కడి సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. మంగళవారం ఆలయ పూజారి సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సూర్య కిరణాల నడుమ సాయి నడిచి వచ్చినట్లు దృశ్యాలు అందులో ఉన్నాయి. అదే సమయంలో ఓ భక్తుడు బాబా సన్నిధిలో పూజ కూడా నిర్వహిస్తున్న దృశ్యం కూడా అందులో ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో సాయి దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి వస్తున్నారు. -
రెండో రోజు ఆదిత్యుని తాకని కిరణాలు...
-
రెండో రోజు ఆదిత్యుని తాకని కిరణాలు...
శ్రీకాకుళం : ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవెల్లి శ్రీసూర్యనారాయణస్వామిని లేలేత కిరణాలు తాకే దృశ్యాలను వీక్షించేందుకు వచ్చిన భక్తులకు ఆదివారం కూడా నిరాశే ఎదురైంది. వాతావరణం అనుకూలించకపోవడంతో మూలవిరాట్ స్వామివారిని కిరణాలు తాకలేదు. దీంతో భక్తులు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. శనివారం కూడా మూలవిరాట్ స్వామివారిని సూర్యకిరణాలు తాకుతాయని భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. కానీ ఆకాశం మేఘావృతం కావడంతో సూర్యకిరణాలు తాకలేదు. దాంతో భక్తులు వెనుదిరిగారు. -
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
చెన్నారావుపేట : చెన్నారావుపేటలోని శ్రీ సిద్ధేశ్వరాలయం గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఈ దృశ్యం శుక్రవారం ఉదయం ఆవిష్కృతమైంది. సూర్యకిరణాలు పడుతుండగా శివలింగం మెరిసిపోతూ కనిపించింది. ఈ మేరకు వరలక్ష్మీ వ్రతం ఆచరించుకునేందుకు వచ్చిన మహిళలు ఈ దృశ్యాన్ని చూసి ప్రత్యేక పూజలు చేశారు. -
సోలార్ కిడ్స్..!
వైద్య రంగానికి సవాల్ విసురుతున్న పాక్ చిన్నారులు కరాచీ: ఆ ముగ్గురు చిన్నారులూ సూర్యోదయంతోనే శక్తిని పుంజుకుంటారు. సూర్యాస్తమయం కాగానే శరీరాన్ని కదపలేక నిస్తేజంగా పడుకుంటారు..అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న పాకిస్తాన్‌కు చెందిన ఈ ముగ్గురు చిన్నారులూ వైద్యరంగానికే సవాల్ విసురుతున్నారు. ఏడాది వయసుగల షోయబ్, తొమ్మిదేళ్ల వయసున్న రషీద్, 13 ఏళ్ల వయసుగల ఇలియాస్ హసీమ్ సోదరులు. క్వెట్టాకు 15 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న వీరు పగలంతా మిగతా పిల్లలమాదిరిగానే ఆడుతూపాడుతూ తిరుగుతున్నారు. కాని సూర్యకాంతి తగ్గుతున్న కొద్దీ వారి శరీరంలోని శక్తి క్షీణించడం మొదలవుతుంది. మళ్లీ మరుసటి రోజు సూర్య కిరణాలు తాకగానే ఉత్సాహంగా లేస్తారు. దీంతో గ్రామస్తులు వీరిని సోలార్ కిడ్స్‌గా పిలవడం మొదలు పెట్టారు. చికిత్స నిమిత్తం వీరిని ఇస్లామాబాద్‌లోని పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (పిమ్స్) లో చేర్చగా.. ఇటువంటి కేసు మునుపెన్నడూ చూడలేదని, దీనిపై పరిశోధన చేస్తున్నట్లు పిమ్స్ చాన్సెలర్ డాక్టర్ జావెద్ అక్రం తెలిపారు. వీరికి పరీక్షలు నిర్వహించేం దుకు పిమ్స్ 9 మంది నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. వీరి రక్త నమూనాలను పరీక్షించి, రిపోర్టులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న 13 అంతర్జాతీయ పరిశోధనా సంస్థలకు పంపించారు. ఇప్పటివరకు వందలాది పరీక్షలు జరిపినా ఎలాంటి ఫలితమూ లేదు. కానీ ఇటీవల జరిపిన పరీక్షలో వచ్చిన ఫలితాల ప్రకారం దీన్ని అత్యంత అరుదైన మస్తీనియా సిండ్రోమ్‌గా భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్ప టివరకు 600 మంది ఈ వ్యాధిబారిన పడినట్లు సమాచారం. -
అందుకే.. ఇందూరు మండుతోంది...
సూర్యభగవానుడు ఇంద్రపురిపైనే ఎందుకు కక్షగట్టాడు? ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఎందుకు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు? నిజామాబాద్ జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఎందుకు నమోదవుతున్నాయి? వేడి గాలులు తీవ్ర స్థాయిలో వీయడానికి కారణమేమై ఉంటుంది? భౌగోళికంగా ఇందూరు జిల్లా ఎత్తై ప్రాంతంలో ఉండడంతో సూర్యకిరణాలు నిట్టనిలువునా పడుతుండడం, చెట్లు తక్కువగా ఉండడంతో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మేలో 48 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వవచ్చంటున్నారు. * జిల్లా ఎత్తై ప్రాంతంలో ఉంది.. * సూర్య కిరణాలు నిట్టనిలువుగా పడుతున్నాయి * గాలిలో తగ్గుతున్న తేమ శాతం, పొడిబారుతున్న భూమి * చెట్లు తక్కువగా ఉండడమూ కారణమే * కాంక్రీట్, రోడ్ల పాపమూ ఉంది * మే నెలలో 48 డిగ్రీలకు చేరే అవకాశం ఇందూరు : ఇందూరు జిల్లా విదర్భ భూమిలో కలిసి ఉంది. అందుకే భౌగోళికంగా చూస్తే ఎత్తై ప్రాంతంలో ఉంది. సూర్య కిరణాలు ఏ కాలంలోనైనా సరే భూమిని తాకి వేడిని ఉత్పన్నం చేసుకునేందుకు వీలైన ప్రాంతంగా చెప్పవచ్చు. వేసవిలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇందూరు నిప్పుల కుంపటిగా మారుతోంది. * సూర్య కిరణాలు ఏటవాలుగా భూమిని తాకితే వేడి శక్తి తక్కువగా ఉంటుంది. కానీ ఇందూరు ఎత్తై ప్రాంతంలో ఉండడంతో సూర్యుడి కిరణాలు భూమిని నిట్టనిలువునా తాకుతున్నాయి. తద్వారా భూమి త్వరగా వేడెక్కుతోంది. దీనికి తోడు మెటల్, కాంక్రీటు రోడ్లు భూమిని కప్పేయడంతో సూర్యుడి కిరణాల ప్రభావం ఎక్కువవుతోంది. * గాలిలో తేమ శాతం సాధారణంకంటే 20 శాతం తగ్గడం, ఉత్తర వాయువ్యం నుంచి వేడి గాలులు వీయడం, ఎల్‌నినో ప్రభావం వెరసి జిల్లాపై ప్రచండ భానుడి ప్రతాప తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. * చెట్లు లేకపోవడం, వర్షాభావంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ఎండిపోవడమూ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడానికి కారణమే. * నేలపై నీటిశాతం తగ్గిపోవడంతో తడిగా ఉండాల్సిన భూమి పూర్తి పొడిబారిపోయింది. దీంతో సూర్య కిరణాలు భూమిని తాకి వేడిని మరింత ఉత్పన్నం చేస్తున్నాయి. ఇరవై ఏనిమిదేళ్ల తర్వాత.. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరింది. అయితే జిల్లా రికార్డులను తిరిగేసి చూస్తే 1988 సంవత్సరం ఏప్రిల్ 29న 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత ఏప్రిల్‌లో ఎప్పుడూ అంత ఉష్ణోగ్రత నమోదు కాలేదు. దీనికి ఒకటి రెండు డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఈసారి భానుడు పాత రికార్డును తిరగరాసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మేలో ఆందోళనకరం.. ఏప్రిల్‌లోనే 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడంపై వాతావరణ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవికి మారు పేరైన, అసలు సిసలు ఎండలకు నెలవైన మేలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. సూర్యుడి ప్రతాపం మే నెలలో మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. మేలో జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరవచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. 2015 మే 22న 46.6 డిగ్రీలు నమోదైంది. కాగా 2005 మే 22న జిల్లాలో రికార్డు స్థాయిలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అప్పుడు జిల్లాలో కరువు పరిస్థితులు లేకున్నా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, వాతావరణ మార్పులను చూస్తే ఉష్ణోగ్రత కచ్చితంగా 48 డిగ్రీలకు చేరుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదుకోవాల్సింది క్యుములోనింబస్ మేఘాలే వేసవి ధాటికి జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రత ఉదయమే 30 డిగ్రీలు దాటుతోంది. పది దాటితే మండిపోతున్నాడు. మిట్టమధ్యాహ్నం ఉగ్రరూపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నానికి 44 డిగ్రీలు దాటుతోంది. సాయంత్రమైనా భానుడి ప్రతాపం తగ్గడం లేదు. భూమిలోంచి వేడి తగ్గడానికి చాలా సమయమే పడుతోంది. రాత్రి 8 గంటలు దాటినా భూమి నుంచి వేడి వెలువడుతోంది. దీనికి తోడు వేడి గాలలు ఎక్కువగా ఉంటున్నాయి. మొత్తం 27 మేఘాలున్నాయి. అయితే క్యుములో నింబస్ మేఘాలు వస్తేనే వేడినుంచి ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. ఈ సీజన్లోనే ఇవి ఏర్పడతాయి. క్యుములో నింబస్ మేఘాలే జిల్లాకు వేడి నుంచి ఉపశమనం కలిగించగలవని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేఘాలు ఉరుములతో కూడిన వర్షాలు కురిపిస్తాయని, భూతాపం తగ్గడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. మే నెలలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు ఆయ్యేందుకు అవకాశం కల్పిస్తాయంటున్నారు. అయితే ఈసారి జూన్ 15 నుంచి వర్షాలు పడే అవకాశాలున్నాయని, సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని పుణే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ⇒ 1988 సంవత్సరం ఏప్రిల్ 29న జిల్లాలో 46.8 డిగ్రీల అత్యధికఉష్ణోగ్రత నమోదైంది. ⇒ 2005 సంవత్సరం మే 22న 47.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డైంది. రోజురోజుకు వేడి పెరుగుతోంది జిల్లా విదర్భ ప్రాంతంలో ఉండి ఎత్తై ప్రదేశంలో ఉండడంతో వేసవిలో సూర్యుడి నుం చి వచ్చే కిరణాలు నిట్టనిలువుగా భూమిపై పడుతున్నాయి. దీనికి తోడు జిల్లాలో కరు వు పరిస్థితులు, గాలిలో తేమ శాతం తగ్గ డం, ఉత్తర వాయువ్యం నుంచి వేడిగాలు లు వీస్తుండడం వల్ల వేడి ప్రభావం పెరుగుతోంది. భూమిపై కాంక్రీటు వేయడం, నేల పొడిబారడంతో వేడి పరావర్తనం చెంది మరింత వేడి ఉత్పన్న అవుతోంది. మేలో ఎండలు మరింత పెరగొచ్చు. - ఏ.నరేందర్, సహాయక శాస్త్రవేత్త, నిజామాబాద్ -
అరసవల్లిలో అద్భుతం
శ్రీకాకుళం : అరసవల్లిలో అద్భుతం చోటు చేసుకుంది. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్‌ను గురువారం ఉదయం సూర్యకిరణాలు తాకాయి. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి జనాలు తండోపతండాలుగా విచ్చేశారు. ఉత్తరాయన పుణ్యకాలంలో స్వామివారిని సూర్యకిరణాల స్పర్శ తాకింది. ఉదయం 6.24 గంటలకు మొదలై 6.30 గంటల వరకు ఆరు నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామి మూలవిరాట్‌పై పడ్డాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో దేవాలయానికి చేరుకున్నారు. -
తొలిరోజు ఆదిత్యుని తాకని సూర్య కిరణాలు
-
తొలిరోజు ఆదిత్యుని తాకని సూర్య కిరణాలు
అరసవల్లి : సూర్య భగవానుడు తొలిరోజు భక్తులను కటాక్షించలేదు. వాతావరణం మబ్బులతో ఉండటంతో సూర్యకిరణాలు ఆదిత్యుని పాదాలు తాకలేదు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ప్రతి అక్టోబర్ మొదటివారంలో మూడ్రోజుల పాటు భానుడి కిరణాలు మూలవిరాట్‌ను స్పృశిస్తాయి. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు దేశ నలువైపుల నుంచి అశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. పది నిమిషాలపాటు సూర్యుడి శిరస్సు నుంచి పాదాల వరకూ తాకే లేలేత కిరణాలను చూసి ధన్యులవుతుంటారు. అయితే గత రెండ్రోజులుగా వర్షాలు పడుతుండడంతో, దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. దీంతో ఆదిత్యుడిని దర్శించుకునేందుకు ఆశగా ఎదురుచూసిన భక్తులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. కనీసం రెండో రోజు అయినా తమకు ఆ మహద్భాగ్యం కలగాలని ప్రార్థించారు. కాగా భాస్కరుడు ప్రసరించే సహస్ర కిరణాలు మన శరీరంలోకి ప్రవేశించి అనారోగ్యం లేకుండా కాపాడతాయి.