
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకిన వారిలో డీ విటమిన్ ఎక్కువ ఉన్న వారు బతికి బయట పడతారని ఇంగ్లండ్‌లోని నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. అదే డీ విటమిన్ తక్కువ ఉన్న వారు తీవ్ర అనారోగ్య సమస్యలపాలై చివరకు మరణించే ప్రమాదం కూడా ఉందని వారు తేల్చారు. పెద్దవారిలో ప్రతి రోజు పది మైక్రోగ్రాముల డీ విటమిన్ ఉండాలని ఎన్‌హెచ్‌ఎస్ ఆరోగ్య మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. (కేర్ సెంటర్లలోనే కరోనా కేసులెక్కువ!)
చేపలు, ఇతర మాంసాహారం, పుట్ట గొడుగులు తినడం ద్వారా, వంటికి ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి తగలడం వల్ల మానవ శరీరంలో డీ విటమిన్ తయారవుతుందన్న విషయం తెల్సిందే. ప్రజల్లో డీ విటమిన్ తక్కువగా ఉన్న దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆమ్‌స్టర్‌డామ్‌లోని వ్రిజి యూనివర్శిటీ జరిపిన మరో పరిశోధనలో తేలింది. చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, అమెరికా, బ్రిటన్, ఇరాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్విడ్జర్లాండ్ దేశాల్లో నమోదైన కరోనా కేసులను ఈ యూనివర్శిటీ పరిశోధన బందం విశ్లేషించింది. విటమిన్ డీ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో 50 శాతం మందికి ఛాతీపరమైన ఇన్ఫెక్షన్లు తగ్గాయని ‘యూనివర్శిటీ ఆఫ్ గ్రెనడా’ జరిపిన పరిశోధనలో తేలింది. (కరోనా వైరస్: మరో నమ్మలేని నిజం)
Comments
Please login to add a commentAdd a comment