D vitamin
-
సూర్యరశ్మికి కొదువ లేదు..ఐనా ఆ విటమిన్ లోపమే ఎక్కువ ఎందుకు..?
భారత్‌లో సూర్యరశ్మి పుష్కలంగా ఉంటుంది.. ఉష్ణమండల ప్రాంతమే అయినా..ఇక్కడ డీ విటమిన్ లోపంతో బాధపడే వాళ్ల సంఖ్యే ఎక్కువ. బలమైన ఎముకలకు అవసరమైన విటమిన్ డీ. ఇది ఎముకల దృఢత్వానికి అవసరమైన కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ, కండరాల పనితీరు, కణాల పెరుగుదలకు మద్దతిస్తుంది. అలాంటి డీ విటమిన్‌ని మన భారతదేశంలో అత్యంత సమృద్ధిగా లభించే సూర్యరశ్మి సాయంతో ఈజీగానే పొందొచ్చు. అయిప్పటికీ మన దేశంలోనే ఎందుకు ఎక్కువ మంది ఈ విటమిన్ లోపంతో బాధపడటానికి గల కారణం..?. ఎలా అధిగమించొచ్చు వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.భారతీయులు ఆధునిక పట్టణ జీవన శైలి ఇందుకు కారణమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చాలావరకు పట్టణాల్లో నివశించే ప్రజలు ఎక్కువ సమయం ఇంటిలో లేదా పాఠశాలలు, కార్యాలయాల్లోనే గడుపుతారు. అలాంటప్పుడు సూర్యరశ్మికి బహిర్గతం అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు నిపుణులు. కనీసం బహిరంగ కార్యకలాపాల్లో నిమగ్నమైనా.. ఆ అవకాశం కాస్తోకూస్తో ఉండే వీలుంటుంది. సహజసిద్ధంగా లభించే డీ విటమిన్‌ని పొందలేకపోవడానికి మరో బలమైన కారణం దుస్తులు. పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు, సన్‌స్క్రీన్ లోషన్లు తదితరాలు శరీరాన్ని బహిర్గతం కానివ్వకుండా చేస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇంకొక ప్రధాన కారణం పర్యావరణ కాలుష్యం. పట్టణాల్లో పొగ, దుమ్ముతో కూడిన వాతావరణంలో సూర్యరశ్మి కోసం బహిర్గతమైతే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదమే ఎక్కువ. వారికే డీ విటమిన్ అధికం..అలాగే ముదురు రంగు చర్మం కలవారిలో మెలనిన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. లేతరంగులో ఉన్న వారితో పోలిస్తే వారిలోనే డీ విటమిన్ అధికమని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఆయా వ్యక్తులలోని అధిక మెలనిన్ యూవీ కిరణాల నుంచి సంరక్షిస్తుంది. అలాంటి ఆహారాలు తీసుకోకపోవడం..విటమిన్ డీ సమృద్ధిగా ఉండే ఆయిల్ ఫిష్, గుడ్డు సొన, పాల ఉత్పత్తుల్లో ఉంటాయి. వీటిని చాలామంది భారతీయలు తగినంతగ తీసుకోకపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. అందువల్లే ఈ విటమిన్ లోపం ఇక్కడ తీవ్రంగా ఉందని చెబుతున్నారు. అధిగమించాలంటే..ప్రతిరోజూ మంచి సూర్యరశ్మి లభించే ఆరుబయట గడపే యత్నం చేయాలి. కనీసం ఉదయం పది గంటల లోపు, అలాగే మధ్యాహ్నం మూడు గంటల మధ్య ముఖం, చేతులు, కాళ్లను సూర్యరశ్మికి బహిర్గతం చేయాలి. ఆహారం: సాల్మన్, మాకేరెల్, ఫిస్ రోయ్, పోర్టిఫైడ్ డైరీ, తృణధాన్యాలు, విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి. డీ విటమిన్ సప్లిమెంట్లు: పెద్దలకు 400 ఐయూ యూనిట్లు, 70 ఏళ్లు పైబడిన వారు 800 ఐయూ యూనిట్లు సప్లిమెంట్లు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎముకల నొప్పి, ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే మాత్రం ఆరోగ్య నిపుణులను సంప్రదించి తగిన మోతాదులో ఈ సప్లిమెంట్లను వాడటం మంచిదని చెబుతున్నారు నిపుణులు. చివరిగా ఈ విటమిన్ లోపాన్ని అధిగమించాలంటే మాత్రం మెరుగైన ఆహారపు అలవాట్లు, సూర్యరశ్మికి బహిర్గతం అయ్యేలా చేయడం వంటి వాటితోనే సాధ్యమని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్‌కు ఓ రెస్టారెంట్ వినూత్న నివాళి..!) -
కరోనా కట్టడిలో ‘డి’ విటమిన్ పాత్ర
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడంలో ‘డీ’ విటమిన్ నిర్వహించే పాత్రపై తగిన పరిశోధనలు సాగించాల్సిందిగా బ్రిటన్ ఆరోగ్య మంత్రి మాట్ హాన్కాక్ ఇచ్చిన ఆదేశాల మేరకు క్వీన్ మేరీ యూనివర్శిటీ పరిశోధకులు తాజా పరిశోధనలు సాగించారు. ప్రాథమికంగా జరిపిన పరిశోధనల్లో మానవ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంతోపాటు కండరాలు, ఎముకలు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడుతుందని తేలింది. శరీరంలోని కాల్షియం, ఫాస్ఫేట్ను క్రమబద్దీకరించడంలో డీ విటమిన్ పాత్ర ఆమోగమని పరిశోధకులు తెలిపారు. డీ విటమిన్ తక్కువగా ఉండి, చర్మం తీవ్రంగా దెబ్బతిన్న 86 మంది శిశువులకు మూడు నెలల పాటు డీ విటమిన్ ఇవ్వగా వారి చర్మం పూర్తిగా మెరగుపడిందని వారు చెప్పారు. బ్రిటన్‌లో సగానికి సగం జనాభా డీ విటమిన్ కొరతతో బాధ పడుతున్నారు. సహజసిద్ధంగా సూర్య రశ్మితో మానవ శరీరంలో డీ విటమిన్ అభివృద్ధి చెందుతుంది. అయితే చలికాలంలో ఆ దేశంలో సూర్య రశ్మియే తగులక పోవడంతో వారిలో డీ విటమిన్ కొరత ఏర్పడుతోంది. అలాంటి వారు రోజుకు డీ 3 విటమన్‌ను 10 ఎంసీజీ ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవాలని పరిశోధకులు సూచించారు. ప్రతి మనిషికి రోజుకు 23 ఎంసీజీల డీ విటమిన్ అవసరం అవుతుందని, మనం తినే ఆహారం ద్వారా కొంత డీ విటమిన్ లభిస్తుంది కనుక రోజుకు 10ఎంసీజీ డీ 3 విటమిన్ ట్యాబ్లెట్లు సరిపోతాయని వారు చెబుతున్నారు. ద్రవరూపంలో కూడా డీ 3 విటమిన్లు అందుబాటులో ఉన్నాయని, వాటిని ఎక్కువగా శిశువులకు ఉపయోగిస్తున్నారని వారు తెలిపారు. పాల ఉత్పత్తులతోపాటు మాంసం, చేపలు, కోడి గుడ్లు, చిరు ధాన్యాల్లో డీ విటమిన్ ఎక్కువగా ఉంటోంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా కరోనా కట్టడికి ఉపయోగపడుతున్న డీ విటమిన్ పాత్రపై మరిన్ని ప్రయోగాలను సాగించడం కోసం 5 వేల మంది వాలంటీర్లను ఎంపిక చేసినట్లు యూనివర్శిటీ పరిశోధకలు తెలిపారు. -
డీ విటమిన్ ఉంటే ఢోకాలేదు!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్ సోకిన వారిలో డీ విటమిన్ ఎక్కువ ఉన్న వారు బతికి బయట పడతారని ఇంగ్లండ్‌లోని నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. అదే డీ విటమిన్ తక్కువ ఉన్న వారు తీవ్ర అనారోగ్య సమస్యలపాలై చివరకు మరణించే ప్రమాదం కూడా ఉందని వారు తేల్చారు. పెద్దవారిలో ప్రతి రోజు పది మైక్రోగ్రాముల డీ విటమిన్ ఉండాలని ఎన్హెచ్ఎస్ ఆరోగ్య మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. (కేర్ సెంటర్లలోనే కరోనా కేసులెక్కువ!) చేపలు, ఇతర మాంసాహారం, పుట్ట గొడుగులు తినడం ద్వారా, వంటికి ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మి తగలడం వల్ల మానవ శరీరంలో డీ విటమిన్ తయారవుతుందన్న విషయం తెల్సిందే. ప్రజల్లో డీ విటమిన్ తక్కువగా ఉన్న దేశాల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని ఆమ్స్టర్డామ్లోని వ్రిజి యూనివర్శిటీ జరిపిన మరో పరిశోధనలో తేలింది. చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, అమెరికా, బ్రిటన్, ఇరాన్, దక్షిణ కొరియా, స్పెయిన్, స్విడ్జర్లాండ్ దేశాల్లో నమోదైన కరోనా కేసులను ఈ యూనివర్శిటీ పరిశోధన బందం విశ్లేషించింది. విటమిన్ డీ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో 50 శాతం మందికి ఛాతీపరమైన ఇన్ఫెక్షన్లు తగ్గాయని ‘యూనివర్శిటీ ఆఫ్ గ్రెనడా’ జరిపిన పరిశోధనలో తేలింది. (కరోనా వైరస్: మరో నమ్మలేని నిజం) -
డీ విటమిన్‌తో కరోనాకు ఢీ
కాన్బెర్రా : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడినప్పటికీ ప్రాణాలతో బయట పడాలంటే ప్రతి రోజు పది నిమిషాలపాటు ఎండలోకి వెళ్లడం ఒక్కటే అత్యుత్తమమైన పరిష్కార మార్గమని ఆస్ట్రేలియాకు చెందిన స్కిన్ క్యాన్సర్ నిపుణులు డాక్టర్ రాచెల్ నీల్ తెలియజేశారు. తాను పరిశీలించినంత వరకు విటిమిన్ డీ తక్కువగా ఉన్నవారిలోనే ఎక్కువగా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని ఆమె చెప్పారు. డీ విటమిన్ ఎక్కువగా ఉన్నట్లయితే వారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. రోగ నిరోధక శక్తి ద్వారానే కరోనా వైరస్‌ను ఎదుర్కోగలమని అభిప్రాయపడ్డారు. డీ విటమిన్ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో శ్వాసకోశ ఇబ్బందులు తగ్గిపోవడం తాను గతేడాదే కనుగొన్నానని డాక్టర్ రాచెల్ తెలిపారు. డీ విటమిన్ ఎక్కువగా ఉన్న వారిలో కూడా శ్వాసకోశపరమైన ఇబ్బందులు ఉంటాయని ఆమె తెలిపారు. అయితే డి విటమిన్ తక్కువగా ఉన్న 78 వేల మంది రోగులను అధ్యయనం చేశానని, వారిలో డీ విటమిన్ ఎక్కువగా ఉన్న వారిలో ఉండే శ్వాసకోశ ఇబ్బందులకన్నా డీ విటమిన్ తక్కువగా ఉన్నవారిలో రెట్టింపు ఇబ్బందులు కనిపించాయని ఆమె చెప్పారు. వాతావరణ పరిస్థితులనుబట్టి అంటే, ఎండ తీవ్రతను బట్టి ప్రతి రోజు ఐదు నుంచి 15 నిమిషాలపాటు ఎండలోకి వెళ్లడం మంచిదని ఆమె సూచించారు. (కరోనా టెస్ట్ కిట్ల ‘కొనుగోల్‌మాల్’!) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1341281459.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
గుడ్డు తింటున్నారు సరే.. పెంకు పారేస్తారేం!
సాధారణంగా గుడ్ల పెంకులను బయట పారవేస్తుంటాం కదా. అయితే ఆ పెంకుల వల్ల ఉన్న ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా మనం ఇక నుంచి పారవేయడం ఆపేస్తామని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్డు పెంకును మనం స్వీకరిస్తే శరీరానికి కావలసిన క్యాల్షియం లభిస్తుందంటా. దీనిద్వారా ఎముకలు, దంతాలు మరింత గట్టిపడుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే నేరుగా కాకుండా.. గుడ్డు పెంకులను పొడిగా చేసుకుని తినాలని తెలిపారు. అలా ప్రతిరోజు సగం టేబుల్ స్పూన్ తీసుకుంటే ఆ రోజుకు మనకు కావల్సిన క్యాల్షియంలో 90 శాతం అందుతుందని, 1,000 నుంచి 1,500 మిల్లీగ్రాముల క్యాల్షియం ఎముకలు, దంతాలకు అందుతుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతో మంది సూర్యకాంతిని పొందలేకపోతున్నారు. అలాంటి వారికి డి విటమిన్ లోపం ఏర్పడుతుంది. డి విటమిన్ లోపం తలెత్తితే ఎముకలు, దంతాలకు సరిపడ క్యాల్షియం అందదు. తద్వారా మనం త్వరగా అలసిపోవడం, పనిలో చికాకు రావడం జరుగుతుంటుంది. అందుకే గుడ్డు పెంకు పొడిని నీళ్లు లేదా పాలలో కలుపుకుని తాగితే క్యాల్షియం సమస్య సులువుగా పరిష్కారమవుతుంది. -
డీ విటమిన్‌తో మరెన్నో ఉపయోగాలు
న్యూయార్క్: మానవ శరీరంలోని ఎముకలు, కండరాలు గట్టిగా, దృఢంగా ఉండాలంటే శరీరంలో చాలినంత డీ విటమిన్ ఉండడం తప్పనిసరి. శరీరంలోని కాల్షియం, ఫాస్పేట్, న్యూట్రియంట్ల పాళ్లను క్రమబద్ధీకరించడంలో డీ విటమిన్ ఎంతో ఉపయోగపడుతుంది. సూర్యరశ్మి నుంచి ఉచితంగా లభించే ఈ డీ విటమిన్ వల్ల ఇంతకుముందు అంచనా వేసిన వాటికన్నా మరెన్నో ఉపయోగాలున్నాయని ప్రపచంవ్యాప్తంగా నిర్వహించిన పలు తాజా పరిశోధనల్లో తేలింది. డీ విటమిన్ లోపం వల్ల పిల్లల్లో డయాబెటీస్ ఒకటవ రకం వస్తుంది. డీ విటమిన్ ఎక్కువ వున్న వారికంటే డీ విటమిన్ తక్కువ ఉన్న యువకులలో పెద్దవాళ్లలో గుండె జబ్బులు, కార్డియో వాస్కులర్ డిసీజ్‌లు వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువ. డీ విజమిన్ లోపం క్యాన్సర్‌కు కారణం అవుతుందని తేలింది. డీ విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ను తగ్గించవచ్చా అన్న అంశంలో మాత్రం ఇంకా ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంది. డీ విటమిన్ ట్యాబ్లెట్లను వాడడం వల్ల గుండె జబ్బులు తగ్గాయన్న అంశం ఇప్పటికే రుజువైంది. డీ విటమిన్ల వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతో బ్యాక్టరీ ఇన్ఫెక్షన్లను కూడా సమర్థంగా ఎదుర్కొనవచ్చు. శిశుప్రాయంలో డీ విటమిన్ సప్లిమెంట్లను తరచుగా ఇవ్వడం వల్ల 90 శాతం మంది పిల్లల్లో డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గిందని ఫిన్లాండ్లో 30 ఏళ్లపాటు నిర్వహించిన సర్వేలో తేలింది. డీ విటమిన్ కండరాల నొప్పులు రాకుండా నిరోధిస్తుంది. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో రోజుకు ఒక మనిషి 15 గ్రాముల డీ విటమిన్ తీసుకోవాలి. నేడు డీ విటమిన్ లోపమన్నది ప్రపంచ సమస్య. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద కోట్ల మంది ప్రజలు డీ విటమిన్ లోపం వల్ల బాధ పడుతున్నారు. సూర్య కిరణాలు ఎక్కువలేని ప్రాంతాలే కాదు, సంవత్సరం పొడవున సూర్య కిరణాలు ప్రసరించే దేశాల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంది. నల్ల వాళ్లుండే ఆఫ్రికా దేశాల్లో మరి ఎక్కువగా ఉంది. మాంసం, గుడ్లు, చేపల్లో లభించే డీ విటమిన్, శాకాహారమైన ఒక్క పాలల్లో మాత్రమే లభిస్తుంది. అందుకని ఎక్కువ మంది డీ విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం ఎండల్లో డీ విటమిన్ ఉచితంగా లభిస్తుందిగానీ కొన్ని దేశాల సంప్రదాయ దుస్తులు సూర్య కిరణాలు చర్మాణికి సోకకుండా అడ్డు పడతాయి. -
సన్బాత్తో గుండెపోటు, బీపీ కూడా రాదు
సూర్యుడి లేలేత కిరణాలకు సేదతీరితే శరీరంలో 'డి' విటమిన్ పెరిగి శరీరానికి కొత్త శక్తి వస్తుందనే విషయం మనందరికీ తెలిసిందే. సన్‌బాత్ వల్ల ఒక్క డి విటమిన్ రావడమే కాకుండా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తాజాగా శాస్త్రవేత్తలు తేల్చారు. రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, లావు తగ్గి సన్నబడతారని, ముఖ్యంగా లేత ఎండ వేడికి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ విడుదలవుతుందని, తద్వారా గుండెపోటు సమస్యలు కూడా రావని కనుగొన్నారు. అలాగే సన్‌బాత్ వల్ల మెదడులో సెరొటోనిన్ అనే రసాయనం విడుదల కావడంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, ఆస్తమా, కండరాల బలహీనతకు దారితీసే స్క్లేరోసిస్ లాంటి జబ్బులు రావని కూడా తేల్చారు. స్టాక్‌హోమ్‌లోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తలు తాజాగా జరిపిన అధ్యయనంలో ఈ సరికొత్త అంశాలు వెలుగుచూశాయి. గత 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా సన్‌బాత్ చేస్తున్న స్వీడన్‌కు చెందిన మూడువేల మంది మహిళలపై అధ్యయనం చేయడం ద్వారా ఈ కొత్త ప్రయోజనాలను కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. డి విటమిన్‌కు, ఈ కొత్త ప్రయోజనాలకు ఎలాంటి సంబంధం లేదని కూడా వారు తెలిపారు. పొగతాగడం ఎంత ముప్పో, సన్‌బాత్ చేయకపోవడం అంత ముప్పని, పొగతాగే వారు ఎక్కువ కాలం బతకనట్లే సన్‌బాత్ చేయనివారు కూడా ఎక్కువ కాలం బతకరని వారన్నారు. సన్‌బాత్ వల్ల ఆయురారోగ్యాలతో ఎక్కువ కాలం జీవిస్తారని చెప్పారు. వారు తమ అధ్యయన వివరాలను ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. సన్ బాత్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నా.. చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మాత్రం ఉంటుందని హెచ్చరించారు. -
కాల్షియంతో గుండె పదిలం!
లండన్: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు ఉద్దేశించిన ఔషధాల వాడకం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుందన్న వాదన అపోహేనని ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వర్సిటీ పరిశోధకులు తేల్చిచెప్పారు. గుండె జబ్బులకు అవకాశమున్న 12 వేలమందిపై పరీక్షలు జరిపి ఈ నిర్ధారణకు వచ్చామన్నారు. హృదయ సంబంధిత వ్యాధుల నివారణకు ఆహారంలో తగినంత కాల్షియం ఉండేలా చూసుకోవడం అవసరమని దక్షిణకొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ వారు నిర్వహించిన పరిశోధనలో తేలింది. అలాగే, కుంగుబాటు(డిప్రెషన్)కు చికిత్స తీసుకోవడం కూడా గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని అమెరికాలోని ఇంటర్‌మౌంటెయిన్ మెడికల్ సెంటర్ పరిశోధకుల అధ్యయనంలో స్పష్టమైంది. డి విటమిన్‌తో హృదయం పదిలం దీర్ఘకాలంగా హృద్రోగంతో బాధపడుతున్న వారు డి విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకోవడం లేదా రోజూ ఒక గంటపాటు ఎండలో నిలబడడం ద్వారా గుండె పని తీరును మెరుగుపరుచుకోవచ్చని బ్రిటిష్ శాస్త్రవేత్తలు చెప్పారు. -
డినకరుడు
సూర్య కిరణాలతో ‘డి’ విటమిన్ లభ్యం నగర వాసులకు అందని భాగ్యం గ్రేటర్లో 60 శాతం మందికి కాల్షియం లోపం బాధితుల్లో ఎక్కువ మంది ఐటీ అనుబంధ ఉద్యోగులే మహిళల్లోనే సమస్య తీవ్రం సాక్షి, సిటీబ్యూరో: అర్థరాత్రి విధులు... అపార్ట్మెంట్ జీవితం... మారిన జీవనశైలి...ఆహారపు అలవాట్లు వెరసి గ్రేటర్ వాసుల శరీరానికి రవి కిరణాల స్పర్శ కూడా తగలనివ్వడం లేదు. సూర్యుని కిరణాల్లో పుష్కలంగా లభించే విటమిన్ ‘డి’ని అందుకోవడం లేదు. ఫలితంగా గ్రేటర్లో 60 శాతం మంది కాల్షియం లోపంతో బాధ పడుతున్నారు. వీరిలో 60 శాతం మహిళలు ఉంటే, 40 శాతం పురుషులు ఉన్నారు. సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే ఈ లక్షణాలు ప్రస్తుతం పాతికేళ్ల యువతీ యువకుల్లో గుర్తిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. బాధితుల్లో అధిక శాతం ఐటీ, అనుబంధ రంగాల్లోని వారే కావడం గమనా ర్హం. రాత్రి విధులతో... గ్రేటర్ హైదరాబాద్‌లో ఐటీ, అనుబంధ రంగాల్లో ఏడు లక్షల మంది పని చేస్తున్నారు. నెలలో సగం రోజులు సగం మంది పగలు పని చేస్తే, మరో సగం మంది రాత్రి పని చేస్తున్నారు. వీరిలో 90 శాతం మందికి సూర్యరశ్మి అంటే తెలియదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. సాధారణంగా మనిషి శారీరక ఎదుగుదల 20 ఏళ్లలోపే. శరీరానికి 30 ఏళ్ల వరకు కాల్షియాన్ని నిల్వ చేసుకునే శక్తి ఉంటుంది. ఆ తర్వాత పురుషులు ఏటా ఒక శాతం కాల్షియాన్ని కోల్పోతే. మహిళలు రెండు శాతం కోల్పోతున్నట్లు కొన్ని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 60 శాతం మహిళలే అధిక శాతం మహిళలు అతి తక్కువ సందర్భాల్లోనే ఇంటి నుంచి కాలు బయట పెడుతుంటారు. సూర్య కిరణాలు సోకక పోవడంతో కాల్షియం లోపించి, చిన్న వ యసులోనే కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. సాధారణంగా మహిళల్లో 40-45 ఏళ్లకు వచ్చే మేనోపాజ్, మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు 35 ఏళ్లకే వస్తోంది. మోనోపాజ్ తర్వాత శరీరంలో నిల్వ ఉన్న కాల్షియం ఏటా సాధారణం కన్నా ఎక్కువ తగ్గుతుంది. వైద్యుల సూచనలు పాటిస్తూ... శరీరానికి సూర్యరశ్మి తగిలేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడే అవకాశం ఉంటుందని నిపుణుల మాట. పాలతో మేలు: డాక్టర్ నవీన్ పల్లా, చీఫ్ ఆర్థోస్కోపిక్ సర్జన్, శ్రీకర ఆస్పత్రి ఎముకల దృఢత్వానికి, రక్తపోటు నియంత్రణకు, గుండె రక్తనాళాల ఆరోగ్యానికి విటమిన్ ‘డి’బాగా తోడ్పడుతుంది. ఇందు కోసం పిల్లలకు ప్రతి రోజూ పావు లీటరు పాలు తాగించాలి. 45 గ్రాములు ఛీజ్, 200 గ్రాముల పెరుగుతో పాటు, ప్రతి రోజూ ఓ గుడ్డు, చేపలు, మాంసం, తాజా కూరలు, డ్రై ఫ్రూట్స్, గింజలు, నారింజ, ద్రాక్ష, వంటి ఫలాలు ఇవ్వడం ద్వారా యుక్త వయసు వచ్చే నాటికి రోజుకు 1000 ఎంజీల కాల్షియం ఉత్పత్తి అవుతుంది. ఇది ఎముకల పటుత్వాన్ని పెంచుతుంది. ప్రొటీన్, సోడియం, కెఫిన్ అతిగా తీసుకోవడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. సాధ్యమైనంతవరకూ వీటికి దూరంగా ఉండాలి. ఉదయం పూట వ్యాయామం ఉత్తమం:డాక్టర్ గురువారెడ్డి, సన్‌షైన్ ఆస్పత్రి ఉదయం ఏడు గంటల్లోపు సూర్య కిరణాల్లో విటమిన్ ‘డి’ పుష్కలంగా లభిస్తుంది. ఆ సమయంలో వ్యాయామం శరీరానికి ఎంతో మంచింది. రాత్రి విధుల వల్ల నగరంలో చాలా మంది మధ్యాహ్నం తర్వాత నిద్రలేస్తూ కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. ఫలితంగా ఎముకల్లో పటుత్వం తగ్గిపోయి, నొప్పులతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రికి వస్తున్న బాధితుల్లో నూటికి 80 శాతం మంది ఇదే లోపంతో బాధ పడుతున్నారు. -
ఇదోరకం జబ్బండీ
నూటికొక్కరికి జబ్బొస్తే అయ్యో అంటాం. నూటికి 80 మంది జబ్బుపడితే ఏం చెప్పాలో డాక్టర్లకే తెలియడం లేదు. ఇది తిండిలేక వచ్చే జబ్బు కాదు, తిండి ఎక్కువైనా వచ్చే జబ్బు అంతకన్నా కాదు. పోనీ ఏసీ గదుల్లోనే ఉంటూ ఆరోగ్యంగా ఉందామనుకునే వాళ్లంటే ఈ జబ్బుకు మరింత మంట. పోనీ జబ్బు ఉందో లేదో తెలుసుకోవాలన్నా పెద్దగా లక్షణాలు కనిపించవు. ఇదేంటని ఆరా తీస్తే..‘డి’ విటమిన్ లోపం. పొద్దున్నే కాసేపు ప్రత్యక్ష నారాయణుడ్ని దర్శించుకోని పాపం ఇప్పుడు సిటీవాసులను పీడిస్తోంది. ఎక్కడ కందిపోతామోనని ఎండ కన్నెరగకపోతే.. మీరూ ఈ రోగాన్ని ఆహ్వానించినట్టే. కేవలం ఎండలో తిరగక పోవడంతో వచ్చే జబ్బు ఇది. చూడ్డానికి చాలా చిన్న సమస్యగా ఉంది గానీ, నగరంలో లక్షలాది మంది ‘డి’విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.ఎక్కువగా స్కూలు చిన్నారుల్లో ఇది కనిపిస్తోంది. ఇటీవల ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యులకు రక్తపరీక్షలు చేస్తే 90 శాతం మందిలో డి విటమిన్ లోపం ఉందని తేలింది. ఈ జబ్బును అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం ఉంటుందని అంటున్నారు ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా.చంద్రశేఖర్‌రెడ్డి. హైదరాబాద్ లాంటి నగరంలో 80 శాతం మంది ‘డి’ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ఆయన అంటున్నారు. చిన్నపిల్లలు, పాలిస్తున్న తల్లులు, గర్భిణులు, వృద్ధులు ఎక్కువగా ‘డి’ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని చెబుతున్నారు. శరీరంలో 30 నానో గ్రామ్స్ (పర్ మిల్లీ లీటర్) కంటే తక్కువగా ‘డి’ విటమిన్ ఉంటే లోపం ఉన్నట్టు. ప్రతి 100 మందికి 80 మంది డి విటమిన్ బాధితులే 90 శాతం మంది బాధితులు సూర్యకాంతి అందకనేనగరంలో 70 లక్షల నుంచి 80 లక్షల మంది బాధితులు ఉన్నట్టు అంచనా40 శాతం మంది చిన్నారులు, మహిళలున్నారు 10 శాతం మంది వృద్ధులు డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు ‘డి’ విటమిన్ లోపంతో సమస్యలు * ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి * కండరాలు తీవ్రంగా నొప్పి కలిగిస్తుంటాయి * శారీరక అలసట కలుగుతుంది * చిన్నారులు రికెట్స్ వ్యాధి బారిన పడతారు * ఒళ్లు నీరసంగా అనిపిస్తుంది.. పని మీద ఏకాగ్రత ఉండదు * వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది * తాజా పరిశోధనల ప్రకారం గుండెపోటుకూ ‘డి’ విటమిన్ లోపం కారణమవుతోంది * మధుమేహం రావడానికి సైతం అవకాశం ఉంది సూర్యకాంతి మందు * సూర్యకాంతి ద్వారా మాత్రమే శరీరానికి కావాల్సినంత డి విటమిన్ లభిస్తుంది * రోజూ కనీసం 45 నిమిషాలు ఎండలో తిరిగితే చాలు * నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుందని తేలింది. బ్లాక్ స్కిన్ ఉన్నవారిలో మెల నోసైట్స్ అనే పదార్థం ఉండటంతో వారి శరీరంలోకి సూర్యకాంతి తొందరగా వెళ్లదు. * మూర్ఛ వ్యాధికి మందులు వాడే వారిలోనూ డి విటమిన్ లోపం ఉంటుంది * సాల్మన్, మెకరల్, ట్యూనా చేపలు తినడం వల్ల డి విటమిన్‌ను కొద్దివరకూ పొందచ్చు * పుట్టగొడుగులు, కాడ్‌లివర్ ఆయిల్లోనూ డి విటమిన్ ఉంటుంది * డి విటమిన్ 30 నుంచి 100 నానోగ్రామ్స్ (పర్ మిల్లీ లీటర్) ఉంటే సరిపోయినట్టు * కేవలం రక్త పరీక్ష ద్వారానే డి విటమిన్ లోపం తెలుసుకోగలం