కాల్షియంతో గుండె పదిలం!
లండన్: చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు ఉద్దేశించిన ఔషధాల వాడకం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుందన్న వాదన అపోహేనని ఆస్ట్రేలియాలోని అడిలైడ్ వర్సిటీ పరిశోధకులు తేల్చిచెప్పారు. గుండె జబ్బులకు అవకాశమున్న 12 వేలమందిపై పరీక్షలు జరిపి ఈ నిర్ధారణకు వచ్చామన్నారు.
హృదయ సంబంధిత వ్యాధుల నివారణకు ఆహారంలో తగినంత కాల్షియం ఉండేలా చూసుకోవడం అవసరమని దక్షిణకొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీ హాస్పిటల్ వారు నిర్వహించిన పరిశోధనలో తేలింది. అలాగే, కుంగుబాటు(డిప్రెషన్)కు చికిత్స తీసుకోవడం కూడా గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని అమెరికాలోని ఇంటర్‌మౌంటెయిన్ మెడికల్ సెంటర్ పరిశోధకుల అధ్యయనంలో స్పష్టమైంది.
డి విటమిన్‌తో హృదయం పదిలం
దీర్ఘకాలంగా హృద్రోగంతో బాధపడుతున్న వారు డి విటమిన్ ట్యాబ్లెట్లను తీసుకోవడం లేదా రోజూ ఒక గంటపాటు ఎండలో నిలబడడం ద్వారా గుండె పని తీరును మెరుగుపరుచుకోవచ్చని బ్రిటిష్ శాస్త్రవేత్తలు చెప్పారు.