భారత్‌లో సూర్యరశ్మి పుష్కలంగా ఉంటుంది.. ఉష్ణమండల ప్రాంతమే అయినా..ఇక్కడ డీ విటమిన్ లోపంతో బాధపడే వాళ్ల సంఖ్యే ఎక్కువ. బలమైన ఎముకలకు అవసరమైన విటమిన్ డీ. ఇది ఎముకల దృఢత్వానికి అవసరమైన కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ, కండరాల పనితీరు, కణాల పెరుగుదలకు మద్దతిస్తుంది. అలాంటి డీ విటమిన్‌ని మన భారతదేశంలో అత్యంత సమృద్ధిగా లభించే సూర్యరశ్మి సాయంతో ఈజీగానే పొందొచ్చు. అయిప్పటికీ మన దేశంలోనే ఎందుకు ఎక్కువ మంది ఈ విటమిన్ లోపంతో బాధపడటానికి గల కారణం..?. ఎలా అధిగమించొచ్చు వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.
భారతీయులు ఆధునిక పట్టణ జీవన శైలి ఇందుకు కారణమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చాలావరకు పట్టణాల్లో నివశించే ప్రజలు ఎక్కువ సమయం ఇంటిలో లేదా పాఠశాలలు, కార్యాలయాల్లోనే గడుపుతారు. అలాంటప్పుడు సూర్యరశ్మికి బహిర్గతం అయ్యే అవకాశం ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు నిపుణులు.
కనీసం బహిరంగ కార్యకలాపాల్లో నిమగ్నమైనా.. ఆ అవకాశం కాస్తోకూస్తో ఉండే వీలుంటుంది. సహజసిద్ధంగా లభించే డీ విటమిన్‌ని పొందలేకపోవడానికి మరో బలమైన కారణం దుస్తులు. పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు, సన్‌స్క్రీన్ లోషన్‌లు తదితరాలు శరీరాన్ని బహిర్గతం కానివ్వకుండా చేస్తున్నాయని చెబుతున్నారు నిపుణులు. ఇంకొక ప్రధాన కారణం పర్యావరణ కాలుష్యం. పట్టణాల్లో పొగ, దుమ్ముతో కూడిన వాతావరణంలో సూర్యరశ్మి కోసం బహిర్గతమైతే లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదమే ఎక్కువ.
వారికే డీ విటమిన్ అధికం..
అలాగే ముదురు రంగు చర్మం కలవారిలో మెలనిన్ స్థాయిలు అధికంగా ఉంటాయి. లేతరంగులో ఉన్న వారితో పోలిస్తే వారిలోనే డీ విటమిన్ అధికమని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఆయా వ్యక్తులలోని అధిక మెలనిన్ యూవీ కిరణాల నుంచి సంరక్షిస్తుంది.
అలాంటి ఆహారాలు తీసుకోకపోవడం..
విటమిన్ డీ సమృద్ధిగా ఉండే ఆయిల్ ఫిష్, గుడ్డు సొన, పాల ఉత్పత్తుల్లో ఉంటాయి. వీటిని చాలామంది భారతీయలు తగినంతగ తీసుకోకపోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. అందువల్లే ఈ విటమిన్ లోపం ఇక్కడ తీవ్రంగా ఉందని చెబుతున్నారు.
అధిగమించాలంటే..
ప్రతిరోజూ మంచి సూర్యరశ్మి లభించే ఆరుబయట గడపే యత్నం చేయాలి. కనీసం ఉదయం పది గంటల లోపు, అలాగే మధ్యాహ్నం మూడు గంటల మధ్య ముఖం, చేతులు, కాళ్లను సూర్యరశ్మికి బహిర్గతం చేయాలి.
ఆహారం: సాల్మన్, మాకేరెల్, ఫిస్ రోయ్, పోర్టిఫైడ్ డైరీ, తృణధాన్యాలు, విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారాలను చేర్చండి.
డీ విటమిన్ సప్లిమెంట్లు: పెద్దలకు 400 ఐయూ యూనిట్లు, 70 ఏళ్లు పైబడిన వారు 800 ఐయూ యూనిట్లు సప్లిమెంట్లు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
ఎముకల నొప్పి, ఇన్ఫెక్షన్‌లతో బాధపడుతుంటే మాత్రం ఆరోగ్య నిపుణులను సంప్రదించి తగిన మోతాదులో ఈ సప్లిమెంట్లను వాడటం మంచిదని చెబుతున్నారు నిపుణులు. చివరిగా ఈ విటమిన్ లోపాన్ని అధిగమించాలంటే మాత్రం మెరుగైన ఆహారపు అలవాట్లు, సూర్యరశ్మికి బహిర్గతం అయ్యేలా చేయడం వంటి వాటితోనే సాధ్యమని చెబుతున్నారు నిపుణులు.
(చదవండి: బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్‌కు ఓ రెస్టారెంట్ వినూత్న నివాళి..!)
Comments
Please login to add a commentAdd a comment