హాలీవుడ్ నటి, స్టార్ వార్స్ ఫేమ్ డైసి రిడ్లీకి 2023లో ఈ గ్రేవ్స్ వ్యాధి వచ్చినట్లు నిర్థారణ అయ్యింది. ఆమె ఇటీవలే తనకు వచ్చిన వ్యాధి గురించి ఉమెన్స్ హెల్త్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. తాను 'గ్రేవ్స్ డిసీజ్' అనే ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వివరించింది. ఇదొక "విచిత్రమైన అలసటగా" అభివర్ణించిది. ఇది శరీరమంతటా వ్యాపించి నిసత్తువుగా చేసేస్తుందంటూ బాధగా చెప్పుకొచ్చింది. అసలేంటి గ్రేవ్స్ వ్యాధి..?. ఎందువల్ల వస్తుందంటే..
గ్రేవ్స్ వ్యాధి అంటే..?
థైరాయిడ్ హార్మోన్ల అధిక ఉత్పత్తికి దారితీసే పరిస్థితిని హైపర్ థైరాయిడిజం అంటారు. ఈ పరిస్థితికి ఐరిష్ వైద్యుడు రాబర్ట్ గ్రేవ్స్ పేరు పెట్టారు. అతను 1800లలో తొలిసారిగా ఈ రుగ్మత గురించి వివరించాడు. గ్రేవ్స్ వ్యాధి అనేది స్వయం ప్రతిరక్షక ప్రతిస్పందన వల్ల వస్తుంది. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ పొరపాటున థైరాయిడ్ గ్రంధిపై దాడి చేస్తుంది. దీంతో అధిక మొత్తంలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసేందుకు కారణమవుతుంది. ఇప్పటి వరకు ఇలా ఎందుకు జరుగుతోందనేందుకు కారణాలు తెలియరాలేదు. ఇది కుటుంబ చరిత్ర, జన్యుపరిస్థితి, ఒత్తిడి వంటి వాటి కారణంగా వస్తుందని చెబుతుంటారు.
లక్షణాలు:
అలసట, బలహీనత
వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన
వణుకు
విపరీతమైన ఆకలి, బరువు తగ్గడం
ఆందోళన, చిరాకు, మానసిక కల్లోలం
తరచుగా ప్రేగు కదలికలు
ఉబ్బిన కళ్ళు (ఎక్సోఫ్తాల్మోస్), కళ్ల చుట్టూ ఉన్న మృదు కణజాలాల వాపు
ఇక్కడ నటి రిడ్లీ బరువు తగ్గడం, చేతి వణకు వంటి లక్షణాలు వచ్చినట్లు వివరించింది. ఈ అలసటను భరించలేని చిరాకుని కలిగిస్తుందని చెప్పుకొచ్చింది. ఆమె కొన్నేళ్లుగా శాకాహారి. ఈ రోగ నిర్థారణ తర్వాత నుంచి గ్లూటెన్ రహితంగా ఫుడ్ తీసుకోవడం మొదలుపెట్టినట్లు తెలిపింది. అంతేగాదు పలు ఆరోగ్య జాగ్రత్తులు తీసుకుంటున్నట్లు కూడా చెప్పింది. ప్రస్తుతం ఆమె ఆకుపంక్చర్, ఆవిరి స్నానాలు, క్రయోథెరపీ వంటివి తీసుకుంటోంది.
ఈ వ్యాధిని జయించేందుకు కొద్దిపాటి వర్కౌట్‌ల తోపాటు మాససిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇచ్చేలా యోగా వంటి వాటిని చేస్తున్నట్లు వివరించింది. నిజానికి కొన్ని రకాల వ్యాధులు ఎందుకు వస్తాయనేందుకు ప్రత్యేక కారణాలు తెలియవు. అలాగే చికిత్స ఇది అని కూడా ఉండపోవచ్చు. అలాంటప్పుడూ మన రోజూవారి జీవనశైలిలో మార్పులు చేయడం, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వంటి చిట్కాలతో ఎలాంటి వ్యాధినైనా జయించగలుగుతారు. ఈ నటి నుంచి స్పూర్తిగా తీసుకోవాల్సింది ఈ అంశాన్నే. ఏ వ్యాధి అయినా నయం అవ్వాలంటే మానసిక స్థైర్యం ఉంటేనే సాధ్యం అనేది గ్రహించాలి.
(చదవండి: Monsoon Diet వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయలివే..!)
Comments
Please login to add a commentAdd a comment