muscle
-
బరువు తగ్గించే ఔషధాలతో కండరాల క్షీణత
బరువు తగ్గేందుకు వినియోగించే ఔషధాల వల్ల కండరాల ద్రవ్యరాశి క్షీణించే ప్రమాదం ఉన్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. మధుమేహం, రక్తపోటు లాంటి జీవన శైలి వ్యాధులకు దారి తీసే ఊబకాయాన్ని నియంత్రించడంలో ఈ మందులు సమర్థంగా పని చేస్తున్నప్పటికీ బరువు కోల్పోయే ప్రక్రియలో కండరాలు క్షీణతకు గురయ్యే ముప్పు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.బరువు కోల్పోవడం కారణంగా కండరాలు క్షీణతకు గురైనప్పుడు వార్దక్య లక్షణాలు, హృద్రోగ జబ్బుల ముప్పు పెరుగుతాయి. ఈమేరకు పెన్నింగ్టన్ బయో మెడికల్ రీసెర్చ్ సెంటర్ (అమెరికా), ఆల్బర్టా, మెక్ మాస్టర్ వర్సిటీ (కెనడా)కి చెందిన పరిశోధకులు రూపొందించిన పత్రాలు లాన్సెట్ జనరల్‌లో ప్రచురితమయ్యాయి. – సాక్షి, సెంట్రల్ డెస్క్కండరాలు ఎందుకు అవసరం?⇒ దేహానికి పటుత్వం చేకూర్చి శరీరాన్ని దృఢంగా ఉంచడంతోపాటు జీవ క్రియలు, వ్యాధి నిరోధక వ్యవస్థను నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి.⇒ శరీర కదలికలు, ఆకృతికి కండర కణజాలం అవసరం.ఏం చేయాలి?⇒ బరువు కోల్పోయేందుకు తీసుకునే మందుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.⇒ ఆహారం తక్కువ తీసుకుంటే విటమిన్లు, ఖనిజాలు తగిన మోతాదులో అందకపోయే ప్రమాదం ఉంది.⇒ తగినంత ప్రోటీన్లు తీసుకోవడంతోపాటు వ్యాయామాలు లాంటి ఆరోగ్యకరమైన విధానాలను పాటించాలి.బరువు తగ్గించే మందులు ఏం చేస్తాయి?డయాబెటిక్ బాధితులు, బరువు కోల్పోయేందుకు తీసుకునే ఓజెమ్పిక్, వెగావై, మౌన్జరో, జెప్‌బౌండ్ లాంటి మందుల్లో జీఎల్పీ – 1 రిసెప్టార్ఎగోనిస్ట్లు ఉంటాయి. ఒక రకమైన ప్రోటీన్లు లాంటి ఈ రిసెప్టార్లు రక్తంలో చక్కెర స్థాయిలు, జీవ క్రియలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. క్లోమ గ్రంథి నుంచి ఇన్సులిన్ విడుదలయ్యేలా ప్రేరేపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయి పెంచే గ్లూకగాన్ హార్మోన్ విడుదలను అడ్డుకుంటాయి. ఆహారం తీసుకున్న తరువాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేందుకు ఇది దోహదం చేస్తుంది.ఆకలిని కూడా ఇవే రిసెప్టార్లు నియంత్రిస్తాయి. కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా బరువును నియంత్రించడంలో చురుకైన పాత్ర పోషిస్తాయి. ఈ రిసెప్టార్లను అనుకరిస్తూ టైప్ 2 డయాబెటిస్, ఊబకాయాన్ని నియత్రించే ఔషధాలు తయారయ్యాయి. మధుమేహ నియంత్రణలో వాడే మరికొన్ని మందులు మూత్రం ద్వారా గ్లూకోజ్‌ను బయటకు పంపి శరీర బరువును సమతూకంలో ఉంచేలా దోహదం చేస్తాయి. ప్రధానంగా మెదడులోని కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఆకలిని అణచివేసి తక్కువ తీసుకునేలా ప్రోత్సహిస్తాయి. -
కట్టేసుకుంటే చాలు, నొప్పిని ఇట్టే మాయం చేసే గాడ్జెట్.. అదెలా పనిచేస్తుందంటే
ఆటలాడేటప్పుడో, చిన్నా చితకా ప్రమాదాల్లోనో గాయాలు తగలడం సహజం. కొన్నిసార్లు కండరాలు వాచిపోయేలా, ఎముకల వరకు నొప్పి పాకేలా దెబ్బలు తాకుతుంటాయి. ఇంకొన్నిసార్లు కాళ్లు చేతులు బెణుకుతుంటాయి. నెత్తురు కనిపించని ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు ఉపశమనం కోసం కాపడం పెట్టడం, మంచుముక్కలను రుద్దడం వంటివి చేస్తుంటాయి. ఈ చర్యలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్న చోట కట్టేసుకుంటే ఇట్టే నొప్పిని మాయం చేసేస్తుంది. నడుము, భుజాలు, తొడలు, మోకాళ్లు– ఇలా ఎక్కడైనా కట్టుకునేందుకు వీలుగా ఉండే బెల్ట్ వల్ల దీనిని ఉపయోగించుకోవడం చాలా తేలిక. ఇది కాపడంలోని వెచ్చదనాన్నీ, మంచుముక్కల్లోని చల్లదనాన్నీ అందించగలదు. వెచ్చదనం కోసం ఒక స్విచ్, చల్లదనం కోసం మరో స్విచ్ ఇందులో ఉంటాయి. కోరుకున్న రీతిలో వీటిని ఎంపిక చేసుకుని, టెంపరేచర్‌ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని వాడటం వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఈ పరికరాన్ని ‘రికవరీ థెర్మ్‌క్యూబ్’ పేరుతో ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 149 డాలర్లు (రూ.12,402) మాత్రమే! -
వృద్ధులకు ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలు
సాక్షి, అమరావతి: వృద్ధాప్యం కారణంగా కీళ్లు, కండరాల నొప్పులతో బాధపడేవారికి సేవలు అందించేందుకు రాష్ట్రంలో ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వాటి పరిధిలో వృద్ధులకు మరింతగా సేవలు అందించేందుకు ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం రూ.కోటి నిధులను కేటాయించింది. రాష్ట్రంలోని విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్), విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ఫిజియోథెరపీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడు కేంద్రాల్లో నిపుణులైన ఫిజియోథెరపిస్టులు, వైద్యులు సేవలు అందిస్తున్నారు. గడిచిన ఏడాదికాలంలో వీటి ద్వారా 12వేల మందికిపైగా వృద్ధులు ఫిజియోథెరపీ సేవలు పొందారు. వీటితోపాటు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వయోవృద్ధులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, మానసిక, వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ సహాయం అందించేలా ఎల్డర్ లైన్–14567 టోల్ ఫ్రీ నంబర్‌తో జాతీయస్థాయిలో హెల్ప్‌లైన్‌ను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ప్రత్యేక ఫీల్డ్ రెస్పాన్స్ టీమ్స్‌తో ఎల్డర్‌లైన్ హెల్ప్‌లైన్ విభాగం సమర్థంగా పనిచేస్తోంది. మరోవైపు వయోవృద్ధులకు చేతికర్రలు, వినికిడి యంత్రాలు, మూడుచక్రాల కుర్చీలు వంటి పరికరాలు అందిస్తోంది. రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీఓ) నిర్వహిస్తున్న 70 వృద్ధాశ్రమాలకు ప్రభుత్వం గ్రాంట్‌ను నేరుగా అందిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019, జూన్ నుంచి వృద్ధాప్య పింఛనుకు వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఫలితంగా వైఎస్సార్ పింఛను పథకం కింద సుమారు 35లక్షల మంది వృద్ధులు ప్రతి నెల పింఛను పొందుతున్నారు. (చదవండి: ఇంకెన్నాళ్లీ ‘కలం’ కూట విషం?) -
జిమ్‌లకు వెళుతుంటారా?.. అయితే ఈ గ్యాడ్జెట్ మీకోసమే!
కండలు పెంచడానికి చాలామంది జిమ్‌లకు వెళుతుంటారు. రోజూ కష్టపడి బరువులు ఎత్తుతూ కసరత్తులు చేస్తుంటారు. రోజూ చేసే కసరత్తుల వచ్చే ఫలితమేంటో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలు లేదు. ఒకటి రెండు నెలలు గడిస్తే గాని, శరీరంలోని మార్పు స్పష్టంగా కనిపించదు. అయితే, కసరత్తుల వల్ల కండరాల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే ఎలా? ఇన్నాళ్లూ అలా తెలుసుకోవడానికి వీలు ఉండేది కాదు గాని, ఇప్పుడు ‘ఫిట్టో’ అందుబాటులోకి వచ్చేసింది. ఇది చేతిలో ఉంటే, వ్యాయామం తర్వాత కండరాల్లో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అమెరికన్ కంపెనీ ఆలివ్ హెల్త్‌కేర్ రూపొందించిన ఈ సాధనం పూర్తిగా డేటా డ్రైవెన్ ట్రైనింగ్ ఇంప్రూవ్మెంట్ ట్రాకింగ్ సిస్టమ్. దీనికి రెండు బటన్స్ ఉంటాయి. ఒకటి పవర్ బటన్, ఇంకోటి స్కాన్ బటన్. పవర్ బటన్ ఆన్ చేసుకున్నాక, దీని నుంచి నియర్ ఇన్ఫ్రారెడ్ ఎల్ఈడీ లైట్ వెలుగుతుంది. ఈ వెలుతురును కండరాల వైపు ప్రసరింపజేస్తూ, స్కాన్ బటన్‌ను ఆన్ చేసుకుంటే, కండరాల్లోని మార్పులను యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు తెలియజేస్తుంది. దీని ధర 299 డాలర్లు (రూ.24,418) మాత్రమే! -
వ్యాయామం చేస్తుంటే పట్టేసిన కండరం.. మళ్లీ అదే వ్యాయామంలోనే?
సాధారణంగా జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలో ఏదైనా కండరం పట్టేసిందనుకోండి. మళ్లీ అదే వ్యాయామం చేస్తున్న సమయంలోనే, అది విడుస్తుందనీ... అప్పుడే రిలీఫ్ వస్తుందని, అందుకే వ్యాయామం ఆపకూడదంటూ కొందరు సలహా ఇస్తుంటారు. ఇది వాస్తవం కాదు. ఏదైనా వ్యాయామం చేస్తున్నప్పుడు కండరం పట్టేసినా, బ్యాలెన్స్ తప్పడం వల్ల తీవ్రమైన నొప్పి వచ్చినా... అది పూర్తిగా తగ్గే వరకు ఆ వ్యాయామం చేయకూడదు. ఉదాహరణకు లోహపు కడ్టీకి రెండువైపులా బరువులు (ప్లేట్స్) వేసుకుని, భుజం మీద దాన్ని పెట్టుకుని చేసే ‘స్క్వాట్స్’ వ్యాయామంలో భుజాలపై బ్యాలెన్స్ తప్పి బరువు పడటం వల్ల గానీ, లేదా కాళ్లపై బాలెన్స్ తప్పి బరువు పడటం గానీ జరిగితే... ఎక్కడైనా కండరం పట్టేయడం లేదా అధికబరువు పడటం వల్ల భుజాలూ, కాళ్లూ, పిక్కలూ, పాదాలు...ఇలా ఏ భాగంలోనైనా నొప్పి రావచ్చు. ఇలా జరిగితే... నొప్పి తగ్గే వరకు అదే వ్యాయామం చేయకపోవడం మంచిది. చాలా కండరాలపై భారం పడే అవకాశం ఉన్నందున ‘స్క్వాట్స్’ను ఉదాహరణ కోసం చెప్పినప్పటికీ... ఈ నియమం ఏ వ్యాయామానికైనా వర్తిస్తుంది. గాయపడ్డ కండరంపై మళ్లీ మళ్లీ ఒత్తిడి పడేలా అదే వ్యాయామాన్ని మాటిమాటికీ చేస్తుండటం వల్ల గాయం మళ్లీ మళ్లీ రేగి... ‘రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజరీ’ అయి పూర్తిగా కోలుకోకముందే అది మళ్లీ మళ్లీ గాయపడటం జరుగుతుంటుంది. ఇదెంతమాత్రమూ మంచిది కాదు. ఏదైనా వ్యాయామ సమయంలో గాయపడినా/కండరాలు పట్టేసినా వెంటనే ఫిజీషియన్/స్పోర్ట్స్ మెడిసిన్ లేదా ఫిట్నెస్ నిపుణులు లేదా ఆర్థోపెడిక్ నిపుణులను సంప్రదించాలి. -
ఫిజియోతో కండరాలకు బలం పెంచుకోవడం ఎలా?
కొందరు కరోనా రోగులు తమ చికిత్సతో భాగంగా హాస్పిటల్లో ఒకింత ఎక్కువ రోగులు గడపాల్సి రావచ్చు. ఆ తర్వాత కూడా తాము కోలుకునేవరకు ఇంట్లోనూ చాలాకాలం పాటు బెడ్ రెస్ట్‌లో ఉండి... కేవలం మంచానికే పరిమితం కావాల్సి రావచ్చు కూడా. ఇలాంటివారు తమ కండరాల శక్తిని తాత్కాలికంగా కోల్పోయే అవకాశం ఉంది. వారు మునుపటిలా తమ శక్తిని పెంచుకునేందుకూ, పుంజుకునేందుకు డాక్టర్లు ఫిజియోధెరపీ వ్యాయామాలను సిఫార్సు చేస్తారు. అలాంటి వారు చేయాల్సిన ఫిజియో వ్యాయామాలలో ప్రధానమైనవి ఇవే... వీటిని కరోనా రోగులే గాక ఆరోగ్యవంతులు కూడా చేయవచ్చు. సీటెడ్ నీ ఎక్స్టెన్షన్ కుర్చీలో నిటారుగా ఉంటూ... కాళ్లు కిందకు వేలాడేలా కూర్చోవాలి. ∙ఒక కాలిని మోకాలిని మెల్లగా పైకి లేపుతూ కాలు స్ట్రెయిట్‌గా ఉండేలా లేపాలి. ఇలా లేపి ఉంచిన కాలిని 10 సెకండ్లపాటు అలాగే నిలబెట్టి ఉంచాలి. ∙ఆ తర్వాత రెండో కాలినీ లేపి, దాన్ని కూడా 10 సెకండ్లపాటు నిలబెట్టి ఉంచాలి. ఈ వ్యాయామాన్ని 10 రిపిటేషన్లతో చేయాలి. సీటెడ్ హిప్ ఫిక్సేషన్... కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. రెండుకాళ్లూ నేలకు ఆనించి ఉంచాలి. ∙ఒక కాలిని తొడ దగ్గర బలం ఉపయోగిస్తూ లేపుతూ... మోకాలి కిందిభాగం నుంచి కాలు అలాగే వేలాడుతూ ఉంచేలా... కేవలం తొడ భాగం మాత్రమే కుర్చీ నుంచి పైకి లేపాలి. ∙ఇప్పుడు రెండో కాలినీ ఇలాగే లేపాలి. ∙ఇలా రెండు కాళ్లూ మార్చి మార్చి లేపుతూ... మార్చ్ఫాస్ట్ చేస్తున్నట్టు తొడల దగ్గర కాళ్లు లేపుతూ ఉండాలి. సిట్ టు స్టాండ్ : ∙వీపును నిటారు గా ఉంచుతూ కుర్చీ అంచున కూర్చోవాలి. చేతులు రెండింటినీ నేలకు సమాంతరంగా ఉండేలా పైకి లేపాలి. ∙అలాగే నెమ్మదిగా పైకి లేవాలి. ∙ఇలా చేయడం చాలా తేలిగ్గా ఉందని మీకు అనిపిస్తూ మీరు మరింత తక్కువ ఎత్తు ఉండే కుర్చీని ఎంచుకుని అందులోంచి కూర్చుని పైకి లేస్తూ ఉండే వ్యాయామాన్ని రిపిటీషన్లతో చేయాలి. షోల్డర్ ప్రెస్ : మీరు కూర్చుని గానీ లేదా నిల్చుని గానీ ఈ వ్యాయామాన్ని చేయవచ్చు. మీ రెండు చేతులూ పై వైపునకు ఉండేలా ఎత్తాలి. ∙ఆ తర్వాత రెండు చేతులను మోచేతుల దగ్గర మడుస్తూ పై వైపునకు గాలిలో బలంగా కదిలిస్తూ గాలిలో పంచ్‌లు ఇవ్వాలి. ∙మీకు ఈ వ్యాయామం తేలిగ్గా అనిపిస్తే చేతిలో కొంత బరువు ఉండేలా తేలికపాటి డంబెల్స్తోనూ చేయవచ్చు. కష్టంగా అనిపిస్తే తేలికపాటి డంబెల్స్ లేకుండా / పంచ్‌లు కూడా ఇవ్వకుండా తేలిగ్గా మోచేతుల దగ్గర ముడిస్తూ, మళ్లీ చేతులు స్ట్రెయిటెన్ చేస్తూ కూడా వ్యాయామం చేయవచ్చు. షోల్డర్ స్ట్రెంతెనింగ్ : కుర్చీలో నిటారుగా కూర్చోండి. ∙రెండు అరచేతులూ ఒకదానికి మరొకటి ఎదురుగా వచ్చేలా చేతులు స్ట్రెయిట్ గా ముందుకు చాచండి. ముందుకు ఉన్న ఆ రెండు చేతులనూ క్రమంగా పక్కలకు తెండి. మళ్లీ ముందుకు తెండి. ∙ఈ వ్యాయామం తేలిగ్గా అనిపిస్తే... రెండు చేతుల్లోనూ తేలికపాటి డంబెల్స్ ఉంచుకుని కూడా చేయవచ్చు. సీటెడ్ ట్రైసెప్ డిప్స్ హ్యాండ్ రెస్ట్ ఉన్న ఓ కుర్చీని తీసుకుని ఆ కుర్చీలో నిటారుగా కూర్చోండి. ఇప్పుడు మీ చేతులతో హ్యాండ్ రెస్ట్‌ను పట్టుకుని... దానిపై ఒత్తిడి వేస్తూ చేతులు రెండూ మోచేయి దగ్గర స్ట్రెయిట్ అయ్యేంతవరకు కుర్చీలో లేవండి. ∙ఆ తర్వాత మళ్లీ కూర్చుని మళ్లీ లేస్తూ... మీకు వీలైనన్ని రిపిటీషన్లు చేయండి. బ్రిడ్జింగ్ : మీ పడక మీద లేదా నేల మీద వెల్లకిలా పడుకోండి. మోకాళ్లను కొంత మడిచి ఉంచండి. మీ అరికాళ్లతో నేలను బలంగా తంతున్నట్లుగా బలం ఉపయోగించి మీ నడుము భాగాన్ని పైకి ఎత్తుండి. పైకెత్తిన నడుము భాగాన్ని దించుతూ... మళ్లీ ఎత్తుతూ... రిపిటీషన్స్‌తో ఈ వ్యాయామాన్ని చేయండి. సైడ్–వే లెగ్ లిఫ్ట్ : ఓ పక్కకు తిరిగి పడుకుని నేలకు ఆని ఉన్న కాలిని మోకాలి దగ్గర సౌకర్యంగా కాస్త ఒంచి ఉంచండి. ∙నేలకు దూరంగా ఉన్న కాలిని మెల్లగా వీలైనంతవరకు పైకి ఎత్తండి. ఇలా కాలిని ఎత్తుతూ... దించుతూ మీకు వీలైనన్ని రిపిటీషన్స్ చేయండి. ∙ఇప్పుడు మరో వైపునకు ఒరిగి మళ్లీ అనే రిపిటీషన్స్‌తో రెండోకాలితో వ్యాయామాన్ని చేయండి. స్ట్రెయిట్ లెగ్ రెయిజ్ : ∙నేల మీద లేదా పడక మీద వెల్లకిలా పడుకోండి. ఒక కాలిని మోకాలి దగ్గర ఒంచి... మరో కాలిని స్ట్రెయిట్‌గా ఉంచండి. ∙స్ట్రెయిట్‌గా ఉన్న కాలిని మెల్లగా వీలైనంతవరకు పైకి ఎత్తండి. ఆ తర్వాత దించండి. ఇలా ఎత్తుతూ... దించుతూ వీలైనన్ని రిపిటీషన్స్ చేయండి. ∙ఇప్పుడు మరో కాలిని వంచి అలాగే... ఇంకో కాలిని స్ట్రెయిట్ చేసి ఇదే వ్యాయామాన్ని అన్నే సార్లు రిపీట్ చేస్తూ... అనే రిపిటీషన్స్‌తో చేయండి. - డాక్టర్ వినయ్‌కుమార్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ -
మూలకణాలతో కండరాలు పెంచారు
కండరాల సమస్యలతో బాధపడేవారికి టెక్సస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ శుభవార్త మోసుకొచ్చారు. మూలకణాలతో పరిశోధనశాలలో కండరాలను అభివృద్ధి చేసేందుకు వీరు ఒక కొత్త పద్ధతిని ఆవిష్కరించారు. మస్కులర్ డిస్ట్రోఫీ వంటి వ్యాధులు వచ్చినప్పుడు కండరాలు క్రమేపీ బలహీనపడిపోతాయి. ఇప్పటివరకూ దీనికి చికిత్స అంటూ ఏదీ లేదు. ఈ నేపథ్యంలో తాము ఈ వ్యాధిని సమగ్రంగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడేలా మూలకణాల సాయంతో కండరాలను అభివృద్ధి చేశామని.. భవిష్యత్తులో ఈ పద్ధతి ద్వారా మస్కులర్ డిస్ట్రోఫీకి చికిత్సను సిద్ధం చేసేందుకు అవకాశం ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రాడ్‌బోడ్ దరాబీ తెలిపారు. మునుపటితో పోలిస్తే ఈ కొత్త పద్ధతి చాలా వేగంగా ఫలితాలిస్తుందని ఆయన చెప్పారు. -
తిండి కలిగినా... కండలేదోయ్!
‘తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్’గురజాడ మాట. ‘కండరాలకు ఈ తిండి చాలదోయ్.. దానికి దండిగా ప్రొటీన్లతో పొత్తు కలవాలోయ్’అని కొనసాగింపు వ్యాక్యాలుంటే నేటికి సరిగ్గా నప్పుతాయేమో! శరీర నిర్మాణానికి మాంసకృత్తులు అత్యంత అవసరం. వాటి లోపం శారీరక పెరుగుదల, మేధో వికాసాన్ని మందగింప చేయడం సహా పలు రకాలుగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అంతటి కీలకమైన మాంసకృత్తులు భారతీయుల ఆహారంలో లోపిస్తున్నాయి. ఇప్సోస్– ఇన్‌బాడీ అనే దక్షిణ కొరియా సంస్థ ఇటీవల హైదరాబాద్ సహా ఎనిమిది నగరాల్లోని 30– 55 వయస్కులపై జరిపిన అధ్యయనం ప్రకారం 68 శాతం మంది భారతీయులు మాంసకృత్తుల లోపాన్ని ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్‌లో ఇలాంటి వారి సంఖ్య 75 శాతం మంది కన్నా ఎక్కువే. ఇండియన్ మార్కెట్ రీసెర్చ్ బ్యూరో (ఐఎంఆర్బీ) గతేడాది విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని తేల్చింది. దీని ప్రకారం.. దేశంలో 73 శాతం మందిలో మాంసకృత్తులు లోపించాయి. 84 మంది భారతీయ శాకాహారులు, 65 శాతం మాంసాహారులు తగిన మేరకు ప్రొటీన్లు తీసుకోవడం లేదు. 93 శాతం మందికి ప్రొటీన్లు ఎంత మేరకు తీసుకోవాలో కూడా తెలియదు. 71% మందికి కండరాల అనారోగ్యం ఇప్సోస్– ఇన్‌బాడీ అధ్యయనం ప్రకారం.. దేశంలో 71% మందికి కండరాల ఆరోగ్యం సరిగా లేదు. భారతీయుల కండరాలు బలంగా లేకపోవడానికి ప్రొటీన్ల లోపమే కారణమంటున్నారు. కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. దేశంలోని పిల్లల్లో 36% మంది తక్కువ బరువుతో ఉన్నారు. 21% మంది ఎత్తుకు తగినంత బరువు లేరు. 38% మంది ఎదుగుదల లోపంతో గిడసబారిపోతున్నారు. గుడ్ల పెంకులు.. పోషకాల గనులు ఇటీవల బెంగళూరులో ఓ పరిశోధక బృందం.. శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి తయారు చేసిన గుడ్ల పెంకు పొడిని గోధుమ పిండితో కలిపి చపాతీలు, బిస్కట్లు తయారు చేయడమెలాగో ప్రదర్శనపూర్వకంగా వివరించింది. పరిశోధకుల్లో ఒకరైన హెచ్‌బీ శివశీల.. గుడ్డు పెంకు ఇచ్చే ఒక స్పూను పొడిలో 750– 800 మిల్లీ గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెబుతున్నారు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ గుడ్ల పెంకుల పొడిని ఆహారంలో భాగం చేయడం వల్ల చేకూరే ప్రయోజనాలను వివరించింది. ఇలాంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏం తినాలి?... పాల సంబంధిత ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, మాంసం, గింజలు, పప్పులు, బఠానీలు, సోయాబీన్స్, చిక్కుళ్లు, వేరుశనగలు, ముదురాకుపచ్చ కూరల్లో మాంసకృత్తులు పుష్కలంగా లభిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వృక్ష సంబంధిత మాంసకృత్తులతో పోల్చుకుంటే, జంతు సంబంధమైన మాంసకృత్తులు శరీరానికి అవసరమైన అమినో యాసిడ్లను తగిన మేరకు అందించగలవని, గుడ్లలో ఉత్తమ కోవకు చెందిన ప్రొటీన్లు ఉంటాయని, వీటిని మొత్తంగా తీసుకోవడం వల్ల అన్ని రకాల అమినో యాసిడ్లూ లభిస్తాయని నిపుణులు వివరిస్తున్నారు. -
కండర మూలకణాల గుట్టు రట్టు!
సాక్షి, హైదరాబాద్: కండరాలు మెరుగ్గా పనిచేసేందుకు దోహదపడుతున్న కణాలపై సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కీలకమైన ఆవిష్కరణ చేశారు. కండరాల పోగుల్లోని మూలకణాలు శరీర అవసరాలకు తగ్గట్టుగా ఇతర పరమాణువులతో జట్టుకట్టి ఎలా పనిచేస్తున్నాయో గుర్తించారు. కండరాల క్షీణత మొదలుకొని అనేక వ్యాధులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఇది కీలకం కానుందని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ జ్యోత్సా్న ధవన్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జ్యోత్సా్న ధవన్ పరిశోధన వివరాలను వెల్లడించారు. ‘జీవితాంతం సక్రమంగా పనిచేసేందుకు వీలుగా ఈ కండరాల్లో కొన్ని మూలకణాలుంటాయి. కండరాల పోగులపై డిస్టోఫిన్, ల్యామినిన్ పరమాణు పొరల మధ్య నిద్రాణంగా ఉండే ఈ మూలకణాలు గాయమైనా.. ఒత్తిడి కారణంగా దెబ్బతిన్నా.. వెంటనే చైతన్యవంతమవుతాయి. ఇబ్బడిముబ్బడిగా పెరిగి గాయం మానేలా చేస్తాయి. ఇలా చైతన్యవంతమైన మూలకణాల్లో కొన్ని మళ్లీ నిద్రాణ స్థితికి చేరుకుని భవిష్యత్తు అవసరాల కోసం సిద్ధంగా ఉంటాయి. ఈ ప్రక్రియలో ఏదైనా తేడా వస్తే.. కండరాల క్షీణత మొదలుకొని ఇతర జబ్బులు వచ్చే అవకాశముంటుంది. కండర మూలకణాలు అవసరమైనప్పుడు ఎలా చైతన్యవంతమవుతాయి.. ఎలా నిద్రాణ స్థితికి చేరుకుంటాయో తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి’అని వివరించారు. చైతన్యంలో ఒకటి.. నిద్రాణంలో మరొకటి.. తాను అజయ్ అలియోసిస్ అనే శాస్త్రవేత్తతో కలసి పరిశోధనలు నిర్వహించినట్లు జ్యోత్సా్న ధవన్ తెలిపారు. మూలకణాలు ఆన్/ఆఫ్ అయ్యేందుకు ఎల్‌ఈఎఫ్1, ఎస్‌మ్యాడ్3 అనే రెండు ప్రొటీన్లు ఉపయోగపడుతున్నట్లు గుర్తించామని చెప్పారు. చైతన్యవంతమైన స్థితి నుంచి నిద్రాణ స్థితికి చేరే క్రమంలో మూలకణాలు బీటీ–కేటనైన్ అనే మూలకాన్ని వదిలి ఎస్‌మ్యాడ్3తో జట్టు కడుతున్నట్లు ఈ పరిశోధనల్లో తెలిసింది. కండర మూలకణాలు చైతన్యవంతమైనప్పుడు ఒక ప్రొటీన్‌తో, నిద్రాణంగా ఉన్నప్పుడు మరోదానితో మూలకణాలు జత కడుతున్నట్లు తమ పరిశోధనలు చెబుతున్నాయని జ్యోత్సా్న తెలిపారు. కండర క్షీణత వ్యాధిలో మూలకణాలు నిత్యం చైతన్యవంతంగానే ఉంటాయి కాబట్టి వాటిని మళ్లీ నిద్రాణ స్థితికి తీసుకెళ్లగలిగితే కండరాల పునరుజ్జీవం సాధ్యం కావచ్చునని.. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేపట్టనున్నామని వివరించారు. -
ఇంత చిన్న వయసులోనూ కండరాల నొప్పులా?
మా బాబుకు ఏడేళ్లు. ఇటీవల తరచూ కాళ్లూ చేతుల్లో నొప్పులు అంటున్నాడు. కండరాల నొప్పులు కూడా ఉన్నాయి. ఈ సమస్య మినహా అన్ని రకాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. డాక్టర్‌కు చూపిస్తే విటమిన్–డి లోపాల వల్లగాని లేదా ఎదుగుదల సమయంలో వచ్చే నొప్పులు కావచ్చని అంటున్నారు. అయితే ఇటీవల నాకు కూడా విపరీతంగా కాళ్లూ, చేతుల్లో నొప్పి వస్తే డాక్టర్‌కు చూపించాను. నాకు విటమిన్–డి లోపం ఉన్నట్లు చెప్పారు. దీన్నిబట్టి మా బాబుకు నిశ్చయంగా విటమిన్–డి లోపమేనంటారా? ఇది ఇతర సమస్యలకు దారితీయవచ్చా? దయచేసి వివరంగా సలహా చెప్పండి. – సుహానా, కర్నూలు మీ బాబు విషయంలో మీరు పేర్కొన్న లక్షణాలు అనేక కారణాల వల్ల కనిపించినప్పటికీ... అతడిలో ఇతర ఆరోగ్య సమస్యలు... అంటే... తరచూ జ్వరం, బరువులో మార్పులు, ఎదుగుదల సమస్యలు, కడుపుకు సంబంధించిన లేదా కాలేయానికి సంబంధించిన సమస్యలు, కీళ్లలో వాపులు, నడవడంలో తీవ్ర ఇబ్బందులు లేవు కాబట్టి మీ బాబు సమస్యను తీవ్రమైన ఇతర జబ్బులకు సూచనగా భావించలేం. మీ డాక్టర్ చెప్పినట్లుగా విటమిన్–డి లోపం ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు చాలా ఎక్కువగా చూస్తుంటాం. సాధారణంగా ఇటీవలి కాలం వరకూ బాగా చల్లటివీ, సూర్యరశ్మి తక్కువగా ఉండే పాశ్చాత్య దేశాల్లోనే విటమిన్–డి లోపం ఎక్కువగా ఉంటుందనే అపోహ ఉండేది. అయితే ఇటీవల మన దేశంలాంటి ఉష్ణమండల (ట్రాపికల్) వాతావరణం ఉన్నచోట్ల కూడా విటమిన్–డి లోపాన్ని చాలా ఎక్కువగా చూస్తున్నాం. విటమిన్–డి అనేది అనేక ఆరోగ్య అంశాల నిర్వహణకు చాలా అవసరం. మన ఎముకల ఆరోగ్యానికి, పటిష్టతకు అది దోహదం చేస్తుంది. అలాగే మన దేహంలోని అనేక కీలక అవయవాల సమర్థమైన పనితీరుకు అది అవసరం. ఎండకు తగినంతగా ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల, మనం తీసుకునే ఆహారంలో విటమిన్–డి లోపం వల్ల, శాకాహార నియమాన్ని మరీ ఖచ్చితంగా పాటిస్తుండటం వల్ల, పాలతో అలర్జీ ఉండటం వల్ల విటమిన్–డి లోపం కనిపిస్తుంది. అలాగే కొందరిలో దీర్ఘకాలికంగా కాలేయ వ్యాధులు, మూత్రపిండాల సమస్యలు ఉండటం, కొన్ని రకాల మందులు వాడుతుండటం జరుగుతుంటే ఈ లోపం కనిపించవచ్చు. ఇప్పుడు విటమిన్–డి లోపం అన్నది పిల్లల్లో, పెద్దల్లో కనిపించడం చాలా సాధారణమైంది. విటమిన్–డి లోపం ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చి స్పృహతప్పడం, కాళ్లూచేతులు వంకర్లు తిరగడం, కండరాల నొప్పులు, నడకలో నిదానం, రికెట్స్ కనిపించవచ్చు. దాంతో పాటు కొద్దిమందిలో వ్యాధినిరోధకశక్తి (ఇమ్యూనిటీ)లో లోపం రావడం వల్ల తరచూ ఇన్ఫెక్షన్స్ బారిన పడటం, ఆస్తమా, మతిమరపు, డయాబెటిస్, మల్టిపుల్ స్కి›్లరోసిస్, గుండెజబ్బుల బారినపడటం వంటి అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు లోనయ్యేందుకు విటమిన్–డి లోపం ఒక కారణమని తెలుస్తోంది. మీ అబ్బాయి విషయంలో విటమిన్–డి లోపంతో పాటు బహుశా క్యాల్షియం మెటబాలిజం లోపాల వల్ల కూడా మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తూ ఉండవచ్చు. అలాగే మీలోనూ విటమిన్–డి లోపం ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి మీరు, మీ అబ్బాయి ఇద్దరూ విటమిన్–డి3తో పాటు క్యాల్షియమ్, ఫాస్ఫరస్ లోపాలు కనుగొనడానికి అవసరమైన వైద్య పరీక్షలతో పాటు థైరాయిడ్, పారాథైరాయిడ్ హార్మోన్ పరీక్షలు, సీబీపీ, సీపీకే పరీక్ష చేయించుకుంటే ఈ నొప్పులకు తగిన కారణాలపై పూర్తి స్థాయి సమాచారం తెలుస్తుంది. ఈ లోపం తొలగడానికి విటమిన్–డి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం కంటే కూడా... సూర్యుడికి తగినంత ఎక్స్పోజ్ కావడమే చాలా ముఖ్యం. ఇక ఆహారం విషయానికి వస్తే విటమిన్–డి ఎక్కువగా ఉండే పాలు, చేపలు, మాంసాహారం తీసుకోవాలి. దీంతో పాటు విటమిన్–డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల మీ బాబు సమస్య తప్పక తగ్గుతుంది. అలాగే పైన పేర్కొన్న వాటితో పాటు క్యాల్షియం కూడా తగిన పాళ్లలో అందేలా జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ లోపం మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలిస్తే విటమిన్–డి ఇంజెక్షన్లను తీసుకోవాల్సి ఉంటుంది. మీరు పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటూ మీ పిల్లల వైద్య నిపుణుడిని సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. బాబుకు యూరిన్‌లో ప్రోటీన్స్ ఎక్కువగా పోతున్నాయి... కిడ్నీ జబ్బు కావచ్చా? మా బాబుకు ఐదేళ్లు. వాడికి ఇటీవల రెండుమూడు సార్లు జ్వరం వచ్చింది. మందులు ఇచ్చిన వెంటనే తగ్గింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు. డాక్టర్‌ను సంప్రదిస్తే మావాడికి మూత్రంలో ఇన్ఫెక్షన్ అని చెప్పారు. కొద్దిగా నీరసంగా కూడా ఉన్నాడు. ఈమధ్య మూత్రపరీక్ష చేయిస్తే అతడికి యూరిన్‌లో కొద్దిగా ప్రోటీన్స్ పోతున్నట్లుగా రిపోర్టు వచ్చింది. మా దూరపు బంధువుల్లో ఒకరికి కిడ్నీ రుగ్మత ఉంది. ఆయనకు కూడా ఇలాగే ప్రోటీన్స్ పోతుంటాయి. దాంతో మావాడి విషయంలో నాకు చాలా ఆందోళనగా ఉంది. ఇదేమైనా మావాడి రాబోయే కిడ్నీ రుగ్మతకు సూచనా? దయచేసి వివరంగా చెప్పండి. – సునీల, బెంగళూరు పిలల్లోని పదిశాతం మందిలో ఎనిమిది, పదిహేనేళ్ల మధ్య...వారిలో జీవితకాలంలోని ఏదో సమయంలో ఇలా మూత్రంలో ప్రోటీన్ పోవడం అన్నది చాలా సాధారణంగా జరిగేదే. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏమిటంటే... ఇలా పోతున్న ప్రోటీన్ అన్నది కిడ్నీకి సంబంధించినదా, లేక తాత్కాలికంగా నష్టపోతున్నదా లేదా ఇతరత్రా హానికరం కాని కారణాల వల్ల పోతున్నదా అని తెలుసుకోవడం అన్నది చాలా ముఖ్యం. పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు, అధికంగా వ్యాయామం చేసినప్పుడు, జలుబు చేసినప్పుడు, తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు, తాము ఉన్న స్థితినుంచి మారడం (పొజిషనల్ వేరియేషన్) వంటి సాధారణమైన కారణాలు మొదలుకొని కిడ్నీజబ్బులు, ట్యూబ్యులార్ డిసీజెస్, పాలీసిస్టిక్ కిడ్నీ, రిఫ్లక్స్ నెఫ్రోపతి వంటి తీవ్రమైన, దీర్ఘకాలిక జబ్బుల వరకు ప్రోటీన్ పోవడం సంభవించవచ్చు. ప్రోటీన్ పోవడంలోని తీవ్రత ఆధారంగానే పేషెంట్ విషయంలో భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడం జరుగుతుంది. పిల్లల్లో యూరిన్‌లో ప్రోటీన్ పోవడంలోని తీవ్రత – నిత్యం, గుర్తించేంత మోతాదులో అంటే కన్సిస్టెంట్గా, సిగ్నిఫికెంట్‌గా పోతుంటే అప్పుడిది ఏదైనా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బులకు దారితీసే కండిషన్స్‌కు సూచికా అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అలాగే కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా మూత్రంలో ప్రోటీన్స్ చాలా తక్కువ మోతాదులో పోతుంటాయి. దీన్నే మైక్రో ఆల్బ్యుమిన్ యూరియా అంటారు. ఈ అంశంలో తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు యూరిన్ ప్రోటీన్ క్రియాటినిన్, 24గంటల్లో మూత్ర విసర్జన పరిమాణం, ఇమ్యూనలాజికల్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ వంటి మరిన్ని అదనపు పరీక్షలు చేయించాలి. అవసరమైతే కిడ్నీ బయాప్సీ మొదలైన పరీక్షల ద్వారానే ఇదేమైనా దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకు ఒక లక్షణమా అని తెలుసుకోవచ్చు. ఇక మీ అబ్బాయి విషయానికి వస్తే రెండు మూడు సార్లు జ్వరం తప్ప మరే ఇతర లక్షణాలూ కనిపించలేదు కాబట్టి అతడి విషయంలో కనిపిస్తున్న ప్రోటీన్ పోవడం అన్నది తీవ్రమైన, దీర్ఘకాలిక కిడ్నీ జబ్బుకు ఒక లక్షణం కాకపోవచ్చు. అయినా మీ బంధువుల్లో ఒకరు కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని రాశారు కాబట్టి పైన పేర్కొన్న పరీక్షలు చేయించడం వల్ల మీ అబ్బాయి సమస్యకు సంబంధించిన పూర్తి సమాచారం లభ్యమవుతుంది. మీరేమీ ఆందోళన చెందకుండా మీ అబ్బాయికి సంబంధించిన యూరిన్ టెస్ట్ రిపోర్టులు, ప్రోటీన్ పోతున్న రిపోర్టులతో ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడితో పాటు నెఫ్రాలజిస్టును కలిసి తగిన సలహా తీసుకోండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
కండలు పెరిగి సిక్స్ ప్యాక్ రావాలంటే.....
న్యూయార్క్: నేడు సిక్స్ ప్యాక్‌లు పెంచుకోవడం బాలీవుడ్, టాలీవుడ్ హీరోలకే పరిమితం కాలేదు. సిక్స్ ప్యాక్‌లను పెంచుకునేందుకు నేటి కుర్రకారంతా తహతహలాడుతున్నారు. అందుకోసం జిమ్‌ల వెంట పరుగులు తీస్తున్నారు. కండర గండులు కావాలంటే జిమ్ములకెళ్లి గంటల కొద్ది కసరత్తు చేయడం ఒక్కటే సరిపోదు. శరీరంలో కండలు పెరిగేందుకు పద్ధతిగా ప్రోటీన్లు తీసుకోవడం తప్పనిసరి. ప్రొటీన్లు మాంసాహారంలో ఎక్కువగా ఉంటాయా లేదా శాకాహారంలో ఎక్కువ ఉంటాయా? మాంసాహారులైతే రెండూ తీసుకోవచ్చు. మరి శాకాహారాలు ఏం చేయాలి? ఈ అంశంపై ఆది నుంచి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆదిలో మంసాహారంలోనే ఎక్కువ ప్రోటీన్లు ఉంటాయని, మాంసాహారం తీసుకోవడమే మేలన్న వాదన కొనసాగేది. ఆ తర్వాత కాలంలో శాకాహారానికి ప్రోత్సాహం, ఆదరణ పెరిగాక శాకాహారంలోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉన్నాయి. శాకాహారాన్ని తీసుకోవడమే మంచిదన్న వాదన పుట్టుకొచ్చింది. ఒకరి వాదనను ఒకరు ఒప్పుకోకుండా ఈ అంశంపై మాంసాహారులు, శాకాహారులు రెండుగా చీలిపోయారు. ఎవరి వాదనలో నిజం ఎంతుందో శాస్త్రీయంగా తెలుసుకునేందుకు అమెరికాలోని ఓ న్యూట్రిషన్ బృందం ప్రాక్టికల్‌గా ఓ అధ్యయనం జరిపింది. ఇందుకోసం ఆ బందం కసరత్తు, ప్రోటీన్ల ద్వారా కండలు పెంచుకోవాలనుకుంటున్న మూడు ఏజ్ గ్రూపులకు చెందిన మూడు వేల మంది వలంటీర్లను ఎంపిక చేసింది. వారిలో జిమ్ములకెళ్లి కసరత్తు ఎక్కువ చేయగలిగిన కుర్రవాళ్లను ఓ గ్రూపుగాను, మధ్యవయస్కులను మరో గ్రూపుగాను, పెద్ద వయస్కులను మరో గ్రూపుగాను విభజించింది. మళ్లీ ఈ మూడు గ్రూపులను శాకాహారులుగా, మాంసాహారులుగా విభజించింది. శాకాహారులకు అత్యధిక పోషక విలువలు కలిగిన పండ్లు, కూరగాయలతో కూడిన ఆరు రకాల డైట్‌ను అందజేయగా, మాంసాహారులకు మేక, కోడి మాంసం, చేపలు, గుడ్డు, తక్కువ ఫ్యాట్ కలిగిన పాలను డైట్‌ను అందజేసింది. ఎవరు ఎంత మోతాదులో ఆహారం తీసుకుంటారు, ఎంత సేపు కసరత్తు చేస్తున్నారనే అంశాలను కూడా ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ వచ్చారు. కొన్ని నెలల తర్వాత అన్ని గ్రూపుల వారి కండలను కొలిచి చూడగా ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. అన్ని గ్రూపుల్లోనూ మాంసాహారం తీసుకున్నవారిలోనే కండరాలే ఎక్కువగా పెరిగాయి. ఎక్కువ మోతాదులో శాకాహారం తీసుకున్న వారికన్నా తక్కువ మోతాదులో మాంసాహారాన్ని తీసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపించాయి. అంటే శాకాహారులు అత్యధిక పోషక విలువలు కలిగిన 60 గ్రాముల శాకాహారాన్ని తీసుకున్న వారికన్నా 20 గ్రాముల మాంసాహారాన్ని తీసుకున్న వారిలోనే మంచి ఫలితాలు వచ్చాయి, ఎందుకు అలా జరిగిందో నిపుణుల బృందం మళ్లీ అధ్యయనం జరిపింది. మనుషుల్లో కండరాలు పెరగడానికి, అవి బలోపేతం అవడానికి లూసినో లాంటి ఆమ్లో ఆసిడ్స్ కారణమని, అవి మాంసాహారుల్లో ఎక్కువ ఉండడం వల్ల వాటిని డైట్‌గా తీసుకున్న వారిలో మంచి ఫలితాలు కనిపించాయని తేలింది. లూసినో లాంటి కీలకమైన ఆమ్లో ఆసిడ్ మాంసాహారంలో 9 నుంచి 13 శాతం ఉండగా, పండ్లు, కూరగాయలు, పప్పుదినుసులు లాంటి వెజిటేరియన్ డైట్లో ఆరు నుంచి ఎనిమిది శాతం ఉన్నాయి. మొక్కజొన్న, సజ్జలు, కొర్రల్లో మాత్రమే 12 శాతం వరకు ఉన్నాయని తేలింది. ముఖ్యంగా మాంసహారంలో మొత్తం తొమ్మిది రకాల ఆమ్లో ఆసిడ్స్ ఉండగా, శాకాహారంలో రెండు రకాల ఆసిడ్స్ తక్కువగా ఉన్నాయని, అవి కూడా అధ్యయన ఫలితాలను ప్రభావితం చేసి ఉంటాయని నిపుణుల బృందం పేర్కొంది. ఈ అధ్యయనం వివరాలను ‘అమెరికన్ జనరల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ప్రచురించారు. -
చెవి గురించి చిత్రమైన సంగతులు!
పిల్లల కోసం ప్రత్యేకం ⇒ మన శరీరంలోని అత్యంత చిన్న కండరం మధ్య చెవిలో ఉంటుంది. దీని పేరు స్టెపీడియస్. దీని పొడవు 1.27 మిల్లీ మీటర్లు మాత్రమే. ఇది మన శరీరంలోని అత్యంత చిన్న ఎముక అయిన స్టెపీస్ను నియంత్రిస్తుంది. శబ్ద తరంగాలను మెదడుకు చేరవేసేందుకు ఈ స్టెపీస్ ఎముక మరో రెండు ఎముకలతో కలిసి పనిచేస్తుంది. ఆ ఎముకల పేర్లే మెలియస్, ఇన్‌కస్. ⇒ మనకు కనిపించే చెవి కేవలం బాహ్య చెవి మాత్రమే. ఈ చెవితో పోలిస్తే లోపల ఉండే భాగం పరిమాణమే చాలా ఎక్కువ. ⇒ ఎవరు మాట్లాడే మాటలను వారు... గాలి ద్వారా వచ్చే తరంగాల కంటే ముఖంలోని ఎముకల ద్వారా ప్రసరించే తరంగాల ద్వారానే ఎక్కువగా గ్రహిస్తుంటారు. అందుకే ఎవరి మాటల్ని వారు టేప్ చేసి విన్నప్పుడు అవి తమ మాటల్లాగా అనిపించడం లేదని ఫిర్యాదు చేయడం ఎక్కువ. ⇒ వినడంతో పాటు చెవిలో ఉండే ద్రవం వల్ల మనిషి నిటారుగా ఉండటం సాధ్య మవుతుంది. బ్యాలెన్స్‌గా నిలబడేందుకు చెవిలోని ఈ ద్రవం తోడ్పడుతుంది. -
మనం - మనదేహం!
ట్రివియా మన చిన్న పేగు పాతిక అడుగుల పొడవు ఉంటుంది. పెద్ద పేగు ఐదడుగులు ఉంటుంది. అయితే వెడల్పు మాత్రం చిన్నపేగు కంటే పెద్దపేగు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. మనం ఒక అడుగు వేయాలంటే రెండు వందల కండరాలు పనిచేయాలి. నవ్వాలంటే పదిహేడు కండరాలు కదలాలి. అయిష్టంగా, అసంతృప్తిగా ముఖం పెట్టినప్పుడు 43 కండరాలు బిగుసుకుంటాయి. ఎముక కణాలు కొత్తవి పుడుతూ పాతవి నశిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో పన్నెండేళ్లకో కొత్త అస్థిపంజరం తయారవుతుంటుంది. మనిషిలోని నరాలను వరుసగా పేరిస్తే వాటి పొడవు 45 మైళ్లు ఉంటుంది. రక్తనాళాల పొడవు 60 వేల మైళ్లు ఉంటుంది. నాలుక మీద రసననాడులు రుచిని తెలియచేస్తాయి. వీటిలో చేదును గుర్తించే టేస్ట్‌బడ్స్ వెనుకవైపు, కారాన్ని గుర్తించేవి నాలుకకు లోపలగా ఇరు పక్కల, ఉప్పును గుర్తించేవి నాలుక ముందు భాగంలో పక్కల, తీపిని గుర్తించేవి నాలుక చివర్లోనూ ఉంటాయి.