వాతావరణం మారుతోంది. ఇప్పుడే ఎండ... అంతలోనే చిటపట చినుకులు... రాత్రి అయేసరికి చలి.. ఈ పరిస్థితులలో దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటివి చాలామందికి సర్వసాధారణం. మన రోగ నిరోధక వ్యవస్థ సక్రమంగా ఉన్నంతవరకు మనల్ని ఏ రుగ్మతా ఏమీ బాధపెట్టలేదు. అయితే అలా మన ఇమ్యూన్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటించడం అవసరం. అవి మన వంటింట్లో సులువుగా దొరికే సహజసిద్ధమైనవైతే మరీ మంచిది. అలాంటి చిట్కాలేమిటో చూద్దాం...
పొద్దున్నే లేచి బ్రష్ చేసుకోగానే ఆమ్లా, చియా సీడ్స్ వాటర్ తాగితే చాలామంచిది. ఈ జ్యూస్ తాగితే జీవక్రియలు సక్రమంగా జరగడం తోపాటు ఒంటికి సరిపడా సీ విటమిన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి.
క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగుతుంటే కొద్దిరోజుల తర్వాత చర్మం పట్టులా నిగారించడంతోపాటు వాపులు, నొప్పులు తగ్గి, శరీరం తేలిక పడుతుంది. తిన్న ఆహారం చక్కగా ఒంటికి పడుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. సుగర్ స్థాయులు అదుపులో ఉంటాయి. లివర్ పనితీరు బాగుంటుంది. కండరాలు దృఢపడతాయి.
ఈ జ్యూస్ తయారీకి కావలసిందల్లా ముందుగా రెండు టీస్పూన్ల చియాసీడ్స్‌ను రాత్రిపూట నానబెట్టుకుని ఉంచుకోవాలి. పొద్దున లేవగానే చక్కగా కడిగి తరిగిన రెండు ఉసిరి కాయలను గింజలు తీసి రోటిలో వేసి దంచండి లేదా జ్యూసర్ లో అరగ్లాసు నీళ్లు కలుపుకుని రసం తీసి, వడ కట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చియా సీడ్స్‌ను కలుపుకుంటే సరి! డ్రింక్ రెడీ!!
Comments
Please login to add a commentAdd a comment