గుడ్డు తింటున్నారు సరే.. పెంకు పారేస్తారేం! | Uses of Egg shell | Sakshi
Sakshi News home page

గుడ్డు తింటున్నారు సరే.. పెంకు పారేస్తారేం!

Published Sun, Jun 25 2017 1:21 AM | Last Updated on Tue, Sep 5 2017 2:22 PM

గుడ్డు తింటున్నారు సరే.. పెంకు పారేస్తారేం!

గుడ్డు తింటున్నారు సరే.. పెంకు పారేస్తారేం!

సాధారణంగా గుడ్ల పెంకులను బయట పారవేస్తుంటాం కదా. అయితే ఆ పెంకుల వల్ల ఉన్న ప్రయోజనాలు తెలిస్తే కచ్చితంగా మనం ఇక నుంచి పారవేయడం ఆపేస్తామని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. గుడ్డు పెంకును మనం స్వీకరిస్తే శరీరానికి కావలసిన క్యాల్షియం లభిస్తుందంటా. దీనిద్వారా ఎముకలు, దంతాలు మరింత గట్టిపడుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే నేరుగా కాకుండా.. గుడ్డు పెంకులను పొడిగా చేసుకుని తినాలని తెలిపారు.

అలా ప్రతిరోజు సగం టేబుల్‌ స్పూన్‌ తీసుకుంటే ఆ రోజుకు మనకు కావల్సిన క్యాల్షియంలో 90 శాతం అందుతుందని, 1,000 నుంచి 1,500 మిల్లీగ్రాముల క్యాల్షియం ఎముకలు, దంతాలకు అందుతుందని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతో మంది సూర్యకాంతిని పొందలేకపోతున్నారు. అలాంటి వారికి డి విటమిన్‌ లోపం ఏర్పడుతుంది. డి విటమిన్‌ లోపం తలెత్తితే ఎముకలు, దంతాలకు సరిపడ క్యాల్షియం అందదు. తద్వారా మనం త్వరగా అలసిపోవడం, పనిలో చికాకు రావడం జరుగుతుంటుంది. అందుకే గుడ్డు పెంకు పొడిని నీళ్లు లేదా పాలలో కలుపుకుని తాగితే క్యాల్షియం సమస్య సులువుగా పరిష్కారమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement