సాయిబాబా ఆలయంలో వింత వెలుగు!
బెంగళూరు :
మైసూరు జిల్లా హుణసూరిలోని శ్రీ సాయిబాబా ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. ఆలయంలోకి ప్రవేశించిన సూర్య కిరణాలు అచ్చు సాయి బాబా ఆకారం కనిపించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఆలయంలోకి సూర్య కిరణాలు ప్రవేశిస్తున్న సమయంలో ఆవి సాయి ఆకృతిలో ఉండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు మొత్తం అక్కడి సీసీ టీవీలో రికార్డు అయ్యాయి.
మంగళవారం ఆలయ పూజారి సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. సూర్య కిరణాల నడుమ సాయి నడిచి వచ్చినట్లు దృశ్యాలు అందులో ఉన్నాయి. అదే సమయంలో ఓ భక్తుడు బాబా సన్నిధిలో పూజ కూడా నిర్వహిస్తున్న దృశ్యం కూడా అందులో ఉంది. దీంతో పెద్ద సంఖ్యలో సాయి దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి వస్తున్నారు.