
భర్త కాళ్లు విరగ్గొట్టడానికి రూ.5 లక్షల సుపారీ
భార్యతో సహా నలుగురు నిందితుల అరెస్టు
వివాహేతర సంబంధాలు సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. వైవాహికేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఆలుమగల నైతిక విలువల పతనం మొత్తం కుటుంబాన్ని బలి తీసుకున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ప్రతిరోజు ఇలాంటి వార్తలను మీడియాలో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటక (Karnataka)లో వెలుగులోకి వచ్చింది. తనను కాదని మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడన్న కోపంతో ఓ మహిళ తన భర్త కాళ్లు విరగొట్టిచ్చింది. కిరాయి మనుషులకు డబ్బులిచ్చి మరీ ఆమె ఘనకార్యానికి పాల్పడడం గమనార్హం. బండారం బయట పడడంతో ఆమెతో పాటు ముగ్గురు నిందితులు కటకటాల పాలయ్యారు.
కలబుర్గి (kalaburagi)లోని అత్తార్ కాంపౌండ్ ప్రాంతంలో చోటుచేసుచేసుకున్న ఈ ఘటన వివరాలను మీడియాకు పోలీసులు వివరించారు. వెంకటేష్, ఉమాదేవి భార్యాభర్తలు. వెంకటేష్ మరో మహిళతో వివావహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం ఉమాదేవికి తెలియడంతో చాలాసార్లు భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. ఎన్నిసార్లు చెప్పినా వెంకటేష్ తన వైఖరి మార్చుకోకపోవడంతో ఉమాదేవి విసిగిపోయింది. ఏదోటి చేసి భర్తను తన దారికి తెచ్చుకోవాలని అనుకుంది. కాళ్లు విరగ్గొడితే ఇంటి పట్టునే ఉండి తన దారికి వస్తాయని అనుకుంది.
తన ప్లాన్ అమలు చేయడానికి ఆరిఫ్, మనోహర్, సునీల్ అనే వ్యక్తులను సంప్రదించింది. తన భర్త కాళ్లు విరగ్గొడితే 5 లక్షల రూపాయలు ఇస్తానని వారితో చెప్పింది. ఆఫర్ నచ్చడంతో రంగంలోకి దిగిన ముగ్గురు పని పూర్తి చేశారు. దోపిడీ పథకం వేసి వెంకటేష్ రెండు కాళ్లతో పాటు చేయి విరగొట్టారు.. అయితే బాధితుడి కుమారుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బ్రహ్మపురి పోలీసులు కూపీ లాగడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. దీంతో ఉమాదేవితో పాటు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యే తన కాళ్లు విరగ్గొట్టించిందని తెలియడంతో వెంకటేష్ ఆవేదనకు గురయ్యాడు. కాగా, వెంకటేష్, ఉమాదేవి ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం.
ముగ్గురికి ఐదేళ్ల జైలు శిక్ష
మైసూరు: భర్త ఆత్మహత్యకు కారణమైన భార్య, ఆమె ప్రియుడు, ఆమె సోదరుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1.25 లక్షల జరిమానా విధిస్తూ అదనపు జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. మైసూరు (Mysore) జిల్లా నంజనగూడు తాలూకా బిళిగెరె గ్రామంలో కుమార, జ్యోతి దంపతులు నివాసం ఉండేవారు. జ్యోతికి చిక్కాటి గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
కుమారకు ఈ విషయం తెలిసి భార్యను మందలించాడు. నడత మార్చుకోవాలని పలుమార్లు సూచించాడు. అయినా ఆమె పెడచెవిన పెట్టింది. అంతేగాకుండా ప్రియుడు, తన సోదరుడితో కలిసి కుమార్‌ను దుర్భాషలాడి బెదిరించింది. దీంతో మనో వేదనకు గురైన కుమార 2018 జనవరి 20న ఆత్మహత్య చేసుకున్నాడు.
చదవండి: ఫిర్యాదు చేసేందుకు వస్తే.. గర్భవతిని చేశాడు
బిళిగెరె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి జ్యోతి, ఆమె ప్రియుడు ప్రసన్నకుమార్, ఆమె సోదరుడు మంజునాథ్‌పై కేసు నమోదు చేశారు. అదనపు జిల్లా కోర్టులో ఈకేసు విచారణకు వచ్చింది. దోషుల నేరం నిరూపితం కావడంతో ముగ్గురికీ జైలు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె.భాగ్య తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment