శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
చెన్నారావుపేట : చెన్నారావుపేటలోని శ్రీ సిద్ధేశ్వరాలయం గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఈ దృశ్యం శుక్రవారం ఉదయం ఆవిష్కృతమైంది. సూర్యకిరణాలు పడుతుండగా శివలింగం మెరిసిపోతూ కనిపించింది. ఈ మేరకు వరలక్ష్మీ వ్రతం ఆచరించుకునేందుకు వచ్చిన మహిళలు ఈ దృశ్యాన్ని చూసి ప్రత్యేక పూజలు చేశారు.