Shivalinga
-
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన శివలింగం దగ్గర 'కేజీఎఫ్' హీరోయిన్ (ఫొటోలు)
-
జ్ఞానవాపి కేసులో తొందరపాటు వద్దు: సుప్రీం కోర్టు
సాక్షి, ఢిల్లీ: జ్ఞానవాపి కేసులో సుప్రీం కోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. శాస్త్రీయ సర్వే అంశాన్ని పక్కనపెట్టి.. ఈ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కార్బన్ డేటింగ్ పద్దతి సహా సైంటిఫిక్ సర్వేను నిర్వహించేందుకు అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు తాజాగా(మే 12వ తేదీన) ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్‌లో కనుగొనబడిన ఆకారం ‘శివలింగం’ అని పేర్కొంటూ హిందూ ఆరాధకులు, శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో.. కార్బన్ డేటింగ్(వయసు నిర్ధారణ కోసం) సహా సైంటిఫిక్‌సర్వేకు పురావస్తు శాఖకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఆ సమయంలో ‘శివలింగం’గా పేర్కొంటున్న ఆకారానికి ఎలాంటి నష్టం జరగకూడదని స్పష్టం చేసింది. అయితే.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై జ్ఞానవాపి మసీద్ ప్యానెల్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్.. హైకోర్టు తీర్పుతో విభేదించింది. ‘‘ఈ విషయంలో మనం జాగ్రత్తగా నడుచుకోవాలి. తొందరపాటు వద్దు. కాబట్టి శాస్త్రీయ సర్వేను వాయిదా వేద్దాం’’ అని మధ్యంతర స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలు అమలు అవుతాయని స్పష్టం చేసింది. ► మే 16, 2022న జ్ఞాన్వాపి మసీదు కాంప్లెక్స్‌లో ఆ ఆకారం బయటపడింది. ► జ్ఞానవాపి మసీదు కూడా కాశీ విశ్వనాథ్ ఆలయ కాంప్లెక్స్‌లో భాగమేనని.. ఆ మసీదు గోడలపై హిందూ దేవతా మూర్తుల విగ్రహాలు ఉన్నాయని.. తమకు పూజ చేసుకునే అవకాశం కల్పించాలని కోర్టును ఐదుగురు మహిళలు కోరడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. అయితే ఈ వాదనను మసీదు కమిటీ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ► ప్రశ్నార్థకమైన ఆ నిర్మాణాన్ని శివలింగం అని హిందూ వర్గాలు వాదిస్తుండగా.. ముస్లిం పక్షం ఈ వస్తువు 'వజూఖానా' రిజర్వాయర్ వద్ద వాటర్ ఫౌంటెన్ మెకానిజంలో భాగమని చెబుతోంది. ► ఇప్పటికే ఈ ఆకారంపై వీడియో రికార్డింగ్ సర్వే నిర్వహించారు. ► ప్రార్థనా స్థలాల చట్టం-1991ని జ్ఞానవాపి మసీదు విషయంలో వర్తింప చేయాలని మసీదు కమిటీ కోరింది. కానీ, గత నెల విచారణ సందర్భంగా జ్ఞానవాపి మసీదుకు ఈ చట్టం వర్తించదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ► శివలింగం లాంటి నిర్మాణంపై శాస్త్రీయ పరిశోధన నిర్వహించాలని హిందూ ఆరాధకుల అభ్యర్థనను వారణాసి కోర్టు గత సంవత్సరం తిరస్కరించింది. కానీ, అలహాబాద్ హైకోర్టు కార్బన్ డేటింగ్‌కు అనుమతించింది. ఇక ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం మాత్రం తొందరపాటు వద్దని, సైంటిఫిక్ సర్వేను వాయిదా వేయాలని ఆదేశించింది. ఇదీ చదవండి: థ్యాంక్యూ ఇండియా.. సాయంపై చైనా మెసేజ్ -
Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదులో శివలింగం!
వారణాసి/న్యూఢిల్లీ: ప్రసిద్ధ కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలోని జ్ఞానవాపి మసీదులో మూడు రోజులుగా కొనసాగుతున్న వీడియోగ్రఫీ సర్వే సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా మందిరం–మసీదు వివాదం మరింత రాజేసే పరిణామాలు జరిగాయి. సర్వేలో మసీదులోని వజూఖానాలో శివలింగం కనిపించిందని హిందూ పిటిషనర్లు పేర్కొన్నారు. దానికి రక్షణ కల్పించాలంటూ సోమవారం వారణాసి కోర్ట్ ఆఫ్ సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) రవి కుమార్ దివాకర్ ను ఆశ్రయించారు. దాంతో ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని యంత్రాంగాన్ని కోర్టు ఆదేశించింది. ఎవరూ అందులోకి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కమిటీ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరపనుంది. జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కేసును విచారిస్తుందని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వే సంతృప్తికరం: మేజిస్ట్రేట్ శర్మ సర్వేపై అన్ని వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయని వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ కౌశల్ రాజ్ శర్మ మీడియాతో అన్నారు. సర్వే నివేదిక అందాక తదుపరి చర్యలను మంగళవారం కోర్టు నిర్ణయిస్తుందని తెలిపారు. సర్వే సమయంలో మసీదులో ఏం దొరికిందనేది అప్పటిదాకా ఎవరూ వెల్లడించరాదన్నారు. అది ఫౌంటేన్ భాగం: మసీదు కమిటీ సర్వే బృందానికి కనిపించినది ఫౌంటెయిన్‌కు చెందిన ఒక భాగమే తప్ప శివలింగం కాదని మసీదు కమిటీ పేర్కొంది. తమ వాదనలు పూర్తి కాకుండానే ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలంటూ కోర్టు ఆదేశించిందని ఆరోపించింది. మరో మసీదును కోల్పోలేం తాజా పరిణామాలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ‘బాబ్రీ’ తర్వాత మరో మసీదును కోల్పోయేందుకు ముస్లింలు సిద్ధంగా లేరన్నారు. అటువంటి యత్నాలను తిప్పికొట్టాని పిలుపునిచ్చారు. ‘‘బాబ్రీ మసీదులో 1949లో అకస్మాత్తుగా హిందూ దేవతా విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అలాంటి కుట్ర పునరావృతం కాకుండా ముస్లింలు ప్రతినబూనాలి’ అంటూ ట్వీట్ చేశారు. దుష్టశక్తులు ముస్లిం సంస్కృతిని హరించాలని చూస్తున్నాయని ఆరోపించారు. నిజం తేలాల్సిందే: యూపీ డిప్యూటీ సీఎం సర్వే ఫలితంపై యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ప్రసాద్ మౌర్య సంతృప్తి వ్యక్తం చేశారు. నిజం ఎప్పుడో ఒకప్పుడు వెలుగులోకి రాకతప్పదన్నారు. ఆ ప్రాంతంలో ఆలయం ఉండేదన్న వాదన తాజా ఘటనతో రుజువైందని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ పేర్కొన్నారు. ఈ ఆధారాలను దేశ ప్రజలంతా గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. కోర్టు తీర్పును బట్టి తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు. జ్ఞానవాపి మసీదు వెలుపలి గోడలపై ఉన్న విగ్రహాలకు నిత్య పూజలకు అనుమతి కోరుతూ కొందరు మహిళలు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. చదవండి: ఇళ్లు తగలబెట్టే హిందూత్వ కాదు.. సీఎం ఫైర్ -
చిన్న సినిమాల్లో పెద్ద సినిమా అయింది – శివలెంక కృష్ణప్రసాద్
‘‘గోపీగణేష్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ‘బ్లఫ్ మాస్టర్’ సినిమాను బాగా తీశాడు. సత్యదేవ్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇలాంటి చిన్న సినిమాలను ఆదరిస్తే వీళ్ల దగ్గర నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. వీళ్ల కష్టానికి మనం ఇచ్చే ఎనర్జీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటమే’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. సత్యదేవ్, నందితా శ్వేత జంటగా గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. శ్రీదేవి మూవీస్ సంస్థ అధినేత శివలెంక కృష్ణ్ణప్రసాద్ సమర్పణలో అభిషేక్ ఫిలిమ్స్ అధినేత రమేష్ పిళ్లై నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘చిన్న సినిమాల్లో పెద్ద సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. గీతా ఆర్ట్స్, సురేశ్ ప్రొడక్షన్స్... ఇలా చూసిన ప్రతివాళ్లూ ఎగ్జయిట్ అయ్యారు. అదే ఎగ్జయిట్మెంట్ జనాల్లో కనిపిస్తోంది. నిర్మాతగా మాకు సంతృప్తిని ఇస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ‘‘తమిళ సినిమా ‘చదురంగ వేటై్ట’ విడుదలైన ఆరు నెలల తర్వాత ఆ చిత్రదర్శకుడు హెచ్.వినోద్‌ను పోలీసులు కలిసి దో నెంబర్ దందా నేరాలు తగ్గాయని అభినందిస్తూ లేఖ ఇచ్చారట. ఇక్కడ కూడా సినిమా అలాంటి ప్రభావం చూపించినప్పుడు మా ప్రయత్నం విజయవంతమైనట్టు’’ అని గోపీగణేష్ చెప్పారు. ‘‘ఈ చిత్రంలో అవని పాత్రలో నటించలేదు.. జీవించాను. ఆ పాత్ర నుంచి బయటకు రావడానికి చాలా రోజులు పట్టింది’’ అన్నారు నందితా శ్వేత. ‘‘ప్రేక్షకుల స్పందన గురించి విన్నప్పుడు, చూసినప్పుడు గర్వంగా అనిపించింది. చాలా ఆనందంగా ఉన్నా’’ అని సత్యదేవ్ అన్నారు. పాటల రచయిత లక్ష్మీభూపాల్ పాల్గొన్నారు. -
నేనెందుకు సిగ్గుపడాలి?
నేనెందుకు సిగ్గుపడాలి అంటూ ఎదురుప్రశ్న వేస్తోంది ఉత్తరాది భామ రితికాసింగ్. ఈ కుస్తీ రాణి నటిగా పరిచయమై తొలి చిత్రం ఇరుదుచుట్రు చిత్రంతోనే జాతీయ అవార్డును అందుకున్న లక్కీ బ్యూటీ ఇప్పటి వరకూ నటించిన చిత్రాలన్నీ సక్సెసే. తాజాగా రాఘవలారెన్స్‌కు జంటగా నటించిన శివలింగ కూడా విజయబాట పట్టడంతో యమ ఖుషీగా ఉన్న రితికాసింగ్‌తో చిట్‌చాట్. ప్ర: శివలింగ చిత్రంలో నటించిన అనుభవం? జ: పి.వాసు దర్శకత్వంలో రాఘవలారెన్స్‌కు జంటగా నటించిన చిత్రం శివలింగ. మొదట కన్నడంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వేదిక నాయకిగా నటించారు. ఆమె చాలా బాగా నటించారు. అదే పాత్రలో నటించే అవకాశం రావడం చాలా సంతోషం. నా నటనను తమిళ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ చిత్రంలో నటించడం చాలా మంచి అనుభవం. శివలింగ చిత్రంలో వేరే రితికాసింగ్‌ను చూస్తారు. ప్ర: శివలింగ చిత్రంలో అందాలారబోశారట? జ: పాటల్లో గ్లామర్ అవసరం అవడంతో అలా నటించాల్సి వచ్చింది. అయితే చిత్రం చూసేవారికి గ్లామరస్ అనిపించదు. అయితే రాఘవ లారెన్స్‌తో కలిసి డాన్స్ చేయడం అంత సులభం కాదు. ముఖ్యంగా చీర ధరించి డాన్స్ చేయడానికి నేను పడ్డ అవస్థలు చెప్పనలవికాదు. చీరలో డాన్స్ చేసేటప్పుడు ఎన్ని సార్లు కింద పడ్డానో నాకే తెలియదు. అంతకు ముందు నేనెప్పుడూ చీర ధరించలేదు. అందులో కష్టమున్నా, అదో సరికొత్త అనుభవం అనే చెప్పాలి. ప్ర: బాక్సింగ్ కష్టమా, నటన కష్టమా? జ: నేను మూడేళ్ల వయసు నుంచే కరాటే, బాక్సింగ్ నేర్చుకున్నాను. అందువల్ల నాకు బాక్సింగ్ కష్టం కాదు. సినిమాల్లో నటించడమే కష్టం. నటన, డాన్స్‌ను నేనింకా నేర్చుకోవాలి. ప్ర: మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తున్నానని చెప్పారా? జ: ఎందుకో తెలియదు గానీ చాలా మంది నా దగ్గరకు రావడానికే భయపడుతుంటారు. ఇక సినిమా రంగంలో నాకు స్నేహితులంటూ ఎవరూ లేరు. ఒక వేళ ఎవరైనా ధైర్యం చేసి ఐ లవ్యూ చెబితే నాకు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పి పంపేస్తాను. ఇక నాకూ ప్రేమించడానికి టైమ్ లేదు. ప్ర: చెన్నైలో మీకు నచ్చిన ఫుడ్? జ: విడియాప్పం, రసం, అప్పళం ఇష్టంగా తింటాను. కొంచెం నాన్ వెజ్ కూడా లాగించేస్తాను. ప్ర: మీకు సిగ్గు పడడం తెలుసా? జ: నిజంగా తెలియదు. అయినా నేనెందుకు సిగ్గుపడాలి. వివాహసమయంలో కల్యాణ వేదికపై కూడా నేను సిగ్గు పడను. ఒక వేళ సిగ్గు పడాలన్నా అది నాకు రాదని అంటోంది కుస్తీరాణి. -
శివలింగ ఘోస్ట్ స్టోరీ
రివ్యూ: శివలింగ చిత్రం: ‘శివలింగ’ తారాగణం: రాఘవా లారెన్స్, రితికా సింగ్, ఊర్వశి, వడివేలు... కెమేరా: సర్వేష్ మురారి మాటలు: శశాంక్ వెన్నెలకంటి సంగీతం: ఎస్.ఎస్. తమన్ నిర్మాతలు: రమేశ్ పి. పిళ్లై, మల్కాపురం శివకుమార్ రచన–దర్శకత్వం: పి. వాసు విడుదల తేదీ: 14–ఏప్రిల్–2017 వామ్మో... దెయ్యాలను ఇంత డీప్‌గా లవ్ చేసేస్తున్న మనుషుల్లో రాఘవా లారెన్స్ లాంటోడు మనకు ఇంకెవరూ కనిపించరేమో! వాటిపై అంత ప్రేమ ఎందుకుండదు? హారర్ ఫ్రాంచైజీ ‘ముని’తో మనోడి బ్యాంక్ అకౌంట్లో మనీ బాగానే పడింది కదా. భయపడినట్టు నటిస్తూనే బంపర్ హిట్స్ కొట్టాడు. అందుకే, హారర్ సినిమాలంటే లారెన్స్‌కి లవ్వు. లేటెస్ట్గా ఈ శుక్రవారం మరో హారర్ సినిమా ‘శివలింగ’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. దీనికి లారెన్స్ డైరెక్షన్ చేయలేదు. లకలకలక.... ‘చంద్రముఖి’తో ప్రేక్షకులకు చెమటలు పట్టించిన పి. వాసు దర్శకుడు. ఈ హారర్ ఫిల్మ్ మేకర్స్ ఇద్దరూ కలసి చేసిన ఈ సినిమా ఎలా ఉంది? ఓ లుక్కేయండి! కథ: శివ... శివలింగేశ్వర్ (రాఘవా లారెన్స్)... ఓ సీబీ–సీఐడీ ఆఫీసర్. మనోడు కేసు టేకప్ చేస్తే క్రిమినల్స్‌కి టెర్రరే. భయం అనేది శివ బాడీ లాంగ్వేజ్‌లోనూ, బ్లడ్‌లోనూ ఎక్కడా లేదు. కింగ్‌లాంటి మనోడి దగ్గర ఓ టాపిక్ తెస్తే చలిజ్వరం వచ్చిన పేషెంట్లా గజగజ వణుకుతాడు. హారర్ అంటే మనోడికి టెర్రర్. కానీ, కవర్ చేస్తుంటాడు. అలాంటోడికి భయపడుతూ హారర్ సినిమాలు చూసి ఎంజాయ్ చేసే అమ్మాయి సత్య (రితికా సింగ్)తో పెళ్లవుతుంది. కొత్తగా పెళ్లైంది... కుర్రాడు హనీమూన్‌కి వెళ్లి, సరదాగా ఎంజాయ్ చేస్తాడనే ఆలోచన కూడా ఉండదు సీబీ–సీఐడీ వాళ్లకు. ఎవరో రహీమ్ (శక్తీ వాసు) అనే వంటోడి మర్డర్ కేసు చిక్కుముడి విప్పమని శివ చేతిలో ఫైల్ పెడతారు. కొత్తగా మూడు ముళ్లు వేసినోడు... ఓ చేత్తో పెళ్లాం చేయి, మరో చేత్తో కేసు ఫైలు పట్టుకుని ఆ చిక్కుముడి ఏదో విప్పడానికి వరంగల్ వెళతాడు. ఇంతకీ, వరంగల్ ఎవరి ఊరో తెలుసా? శివ అత్తా్తరిది. కానీ, వాళ్లింటికి వెళ్లడు శివ. కొత్త పెళ్లి కొడుక్కి ఏవేవో కోరికలుంటాయి. పైగా, కేసు పనొకటి ఉంది. అందువల్ల, ఊరి చివర పెద్ద బంగ్లాలో అద్దెకు దిగుతాడు. ఇల్లు బాగుంటుంది గానీ... పెద్ద ప్రాబ్లెమ్ వచ్చి పడుతుంది. అదేంటంటే... ఇంటి వెనక శ్మశానం ఉంటుంది. అది చూసి దెయ్యాలంటే భయపడే శివకు సుస్సు వెళ్లినంత పనవుతుంది. వేరే ఇల్లు చూసుకుందామంటే... పెళ్లాం వద్దంటుంది. అంతకుముందు తనకు భయాలూ గట్రా లేవని పెళ్లాం ముందు ఫోజులు కొడతాడు. ఇప్పుడు ఆమె చెబితే వినాలి కదా! దాంతో కేసు క్లోజ్ చేసే వరకూ చచ్చినట్టు శ్మశానం పక్కన ఆ బంగ్లాలో కాపురం పెట్టాలని ఫిక్స్ అవుతాడు. అప్పుడు మొదలవుతుంది మనోడికి అసలు సిసలైన మ్యూజిక్. ఏ రహీమ్ మర్డర్ కేసులో హంతకులను పట్టుకోవాలని వరంగల్ వచ్చాడో... ఆ రహీమ్ ఆత్మ సత్య బాడీలోకి వస్తుంది. ఏదో కొత్తగా కట్టిన అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొని గృహ ప్రవేశం చేసినట్టు... నీ పెళ్లాం శరీరం లోంచి బయటకు వెళ్లనంటుంది. నన్ను చంపినోళ్లను పట్టుకునే వరకూ నిన్ను సుఖంగా కాపురం చేయనివ్వనని శపథం చేస్తుంది. పెళ్లాంపై ప్రేమ ఓ పక్క... దెయ్యాలంటే భయం మరోపక్క... సడన్ షాక్ ఒకటి. షాక్ నుంచి తేరుకుని మనోడు ధైర్యంగా ముందడుగు వేస్తాడు. ఓ పావురం హెల్ప్‌తో కేస్ క్లోజ్ చేస్తాడు. మరీ సిల్లీ కాకపోతే... పావురం హెల్ప్ తీసుకోవడం ఏంటండీ? అనే డౌట్ రావొచ్చు. హారర్‌కి ఎమోషన్ ఇంపార్టెంట్ గానీ... లాజిక్ అవసరమా? చెప్పండి! అసలు పావురం ఎలా హెల్ప్ చేసింది? రహీమ్‌ను మర్డర్ చేసింది ఎవరు? అతని కథేంటి? ఈ కేసును శివ ఎలా సాల్వ్ చేశాడు? అనేది 70ఎంఎం స్క్రీన్ మీద చూస్తేనే మజా! విశ్లేషణ: స్టోరీ, స్క్రీన్‌ప్లే, సీన్స్, ఎక్స్ట్రా... ఎక్స్ట్రా... రొటీన్‌గా ఉన్నాయా? కొత్తగా ఉన్నాయా? అనే ప్రశ్నలు పక్కన పెడితే... సినిమా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లా పరిగెడుతుంది. సీన్, సాంగ్, ఫైట్... ఒకదాని తర్వాత మరొకటి వస్తూ ఎంటర్టైన్ చేస్తాయి. మధ్యలో అక్కడక్కడా పి. వాసు భయపెట్టారు కూడా. ఇక, క్లైమాక్స్ ఫైట్‌లో గ్రాఫిక్స్ భలే ఉన్నాయి. అలవాటైన జానర్ కావడంతో రాఘవా లారెన్స్ రఫ్ఫాడించేశాడు. ‘గురు’ గాళ్ రితికా సింగ్ తన గ్లామర్‌తో సినిమాకి కిక్ ఇచ్చింది. దెయ్యంగానూ ఆమె ఫేస్ బాగానే సూటైంది. ‘రంగు రక్కర...’ పాటలో ఇంచుమించు లారెన్స్‌తో ఈక్వల్‌గా డ్యాన్స్ చేసింది. రహీమ్ పాత్రలో పి. వాసు తనయుడు శక్తి వాసు మంచి నటన కనబరిచాడు. హారర్ సినిమా లవర్స్‌ను బాగానే ఆకట్టుకుంటుందీ సినిమా. -
సమ్మర్ బరిలో గెలిచెదేవరు?
త్రిముఖ పోటీ. గెలిచేదెవరు? నిలిచేదెవరు? ఇదే కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం లేకపోలేదు. భారీ అంచనాలున్న మూడు చిత్రాలు శుక్రవారం ఒకే సారి తెరపైకి వస్తున్నాయి. శివలింగ, పా.పాండి, కడంబన్ ఈ మూడు చిత్రాలే అవి. వీటిలో ముందుగా చెప్పుకోవలసింది పా.పాండి. పవర్ పాండిగా ప్రచారంలో ఉన్న ఈ చిత్రం పేరును రాష్ట్ర ప్రభుత్వ రాయితీలను కోల్పోకుండా పా.పాండి అని టైటిల్‌ను చివరి క్షణంలో మార్చారు. ఇక ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే నిత్యం వార్తల్లో ఉంటున్న యువ నటుడు ధనుష్ తొలి సారిగా మెగాఫోన్ పట్టడం. ఆయనే కథను తయారు చేసుకుని తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించి ప్రత్యేక పాత్రలో మెరిసిన పా.పాండి చిత్రంలో నటుడు రాజ్‌కిరణ్ కథానాయకుడిగా నటించారు. నటి రేవతి, ప్రసన్న, ఛాయాసింగ్, మడోనా సెబాస్టియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాన్‌రోల్డన్ సంగీతాన్ని అందించారు. జీవితం అంతా కుటుంబం కోసం ధారపోసి, కష్టపడి సంపాదించిన వారికి వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలను తెరపై ఆవిష్కరించిన చిత్రం పా.పాండి. ఈ చిత్రం ఎలా ఉంటుందన్న ఆసక్తి పరిశ్రమ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మెండుగానే ఉంది. ఇక రెండో చిత్రం శివలింగ. తొలుత కన్నడంలో రూపొంది మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్ర తమిళ రీమేక్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం జరగడంతో చిత్రంపై అంచనాలు పెరిగాయి. కన్నడ వెర్షన్‌కు దర్శకత్వం వహించిన పీ.వాసు తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేశారు. రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించిన ఇందులో బాక్సింగ్ క్రీడాకారిణి, ఇరుదుచుట్రు చిత్రం ఫేమ్ రితికాసింగ్ నాయకిగా నటించింది. ఇది హారర్ కథా చిత్రం కాబట్టి సహజంగానే ఆసక్తి నెలకొంది. ఇక మూడో చిత్రం కడంబన్. ప్రముఖ నిర్మాత ఆర్బీ.చౌదరి సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్థతో ఆర్య చిత్ర నిర్మాణ సంస్థ ది షో పీపుల్ కలిసి నిర్మిస్తున్న ఇందులో ఆర్యతో క్యాథరిన్ ట్రేసా నటించింది. అధిక భాగం అడవుల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రానికి రాఘవ దర్శకుడు. ఇది అడవులను ఆక్రమించుకుని కార్పోరేట్ సంస్థలు దేశ ప్రజలను ఎలా బాధింపునకు గురి చేస్తున్నాయన్న సందేశంతో కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రం కడంబన్. మరో విశేషం ఏమిటంటే శివలింగ, కడంబన్ చిత్రాలు తెలుగులోనూ విడుదల కానున్నాయి. కాగా దేనికది ప్రత్యేకతను, అంచనాలను సంతరించుకున్న ఈ మూడు చిత్రాల్లో ఏది అధిక ప్రేక్షకాదరణ పొందుతుందన్న విషయం ఆసక్తిగా మారింది. -
ఆ నలుగురి వల్లే ఈ స్థాయికి ఎదిగా
– లారెన్స్ ‘‘నేను చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగా. అందుకు కారణం మా అమ్మగారు, ఆ రాఘవేంద్రస్వామి, ఇండస్ట్రీలో నాకు డ్యాన్సర్ స్థానాన్ని కల్పించిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారు, నన్ను కొరియోగ్రాఫర్‌ని చేసిన చిరంజీవిగారు. ఈ నలుగురుకీ నా కృతజ్ఞతలు’’ అని రాఘవా లారెన్స్ అన్నారు. నృత్యదర్శకుడిగా, దర్శకుడిగా, నటుడిగా లారెన్స్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రస్తుతం రాఘవా లారెన్స్, రితికా సింగ్ జంటగా పి.వాసు దర్శకత్వంలో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి.పిళ్లై తమిళ్, తెలుగు భాషల్లో నిర్మించిన ‘శివలింగ’ ఈ శుక్రవారం విడుదల కానుంది. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. మంగళవారం జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో లారెన్స్ మాట్లాడుతూ –‘‘శివలింగ’ చిత్రం కన్నడలో హిట్ అయింది. అందులో శక్తీ వాసు నటన చూసి, క్యారెక్టర్లో కొన్ని మార్పులు చేస్తే ఇంకా బాగుంటుందనగానే వాసుగారు మార్పులు చేశారు. తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది’’ అన్నారు. ‘‘మా చిత్రం జనవరిలో విడుదల కావాల్సి ఉంది. కొన్ని సాంకేతిక కారణాలతో ఆలస్యమైంది. లేటైనా, లెటెస్ట్‌గా వస్తున్నాం’’ అని పి.వాసు చెప్పారు. ‘‘వాసు దర్శకత్వ ప్రతిభ గురించి కొత్తగా మాట్లాడాల్సిన పనిలేదు. లారెన్స్, రితికా నటన ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు మల్కాపురం శివకుమార్. నటుడు శక్తీ వాసు, రితికా సింగ్, నిర్మాత బెల్లంకొండ సురేశ్ పాల్గొన్నారు. -
అమర్నాథ్ యాత్ర
మంచుకొండల్లో నెలకొన్న మహాశివుని దర్శనానికి సాగే యాత్ర ఇది. చుట్టూ ఎత్తయిన కొండలు.. కిందకు చూస్తే లోతెంతో తెలియని లోయలు.. పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ అందనంత ప్రమాదకరమైన వాతావరణం. మైనస్ డిగ్రీలలో గడ్డకట్టే శీతోష్ణ స్థితి.. ప్రయాణంలో వెంట్రుక వాసి నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపై ఆశ ఉండదు. అంతటి ప్రతికూల పరిస్థితిలోనూ ఒకే ఒక్క మంత్రం అందరినీ ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్తోంది. ఒకే ఒక్క మంత్రం దుర్భర వాతావరణాన్ని సానుకూలంగా మార్చేస్తుంది. అదే ఓం నమఃశివాయ. శివ పంచాక్షరి మంత్రం. ఏడాదిలో కేవలం 45రోజుల పాటు కనిపించే మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన అదే అమర్నాథ్ యాత్ర. ప్రపంచంలోనే అతి కష్టమైన యాత్ర అమర్నాథ్ యాత్ర. తిరిగి వస్తామో, రామో అన్న భయం. ఇరుకైన దారి... ఇరుపక్కలా లోయలు.. కళ్లు తెరిస్తే ఎక్కడ పడిపోతామో అన్నంత భయం.. తెరవకపోతే ఎలా వెళ్తున్నామో తెలియని అయోమయం.. ఒక్క మాటలో చెప్పాలంటే.. మృత్యువు మన వెనకే నడుస్తుంటే... దాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగడమే వెళ్లటమే అమర్నాథ్ యాత్ర. అమర్నాథ్ గుహ ఏడాదిలో జూలై, ఆగస్టు మాసాలు మినహా మిగతా సమయం అంతా పూర్తిగా మంచు కప్పుకుని ఉంటుంది.. ఆ సమయంలో గుహను చేరుకోవటం అసాధ్యం... జూలై వచ్చేసరికి ఇక్కడ వాతావరణం కొద్దిగా వేడెక్కుతుంది.. మంచు విచ్చుకుంటుంది.. గుహ స్పష్టంగా కనిపిస్తుంది.. కానీ, శివలింగం ఉండే ప్రాంతంలో మాత్రం వాతావరణం ఎప్పటిలాగే ఉంటుంది.. అందువల్లే 45 రోజుల పాటు శివలింగం చెక్కు చెదరకుండా ఉంటుంది.. విచిత్రమేమంటే గుహలో శివలింగం ప్రతి ఏటా ఒకే చోట, ఒకే ఎత్తులో ఆవిర్భవిస్తుంది.. 90 అడుగుల పొడవైన గుహలో అదే చోట ఎందుకు వెలుస్తుంది? అదే శివ మహత్యం అంటుంటారు భక్తులు. ఏడాదంతా గడ్డకట్టుకుపోయిన అమర్నాథ్ గుహ క్రమంగా తేటపడుతున్న సమయంలో జ్యోతిర్లింగం ఏర్పడే చోట గుహ పైభాగం నుంచి ఒక్కొక్కటిగా నీటి చుక్క కింద పడుతూ ఉంటుంది. సుమారు 45 రోజుల పాటు ఈ నీటిబొట్లు పడుతూనే ఉంటాయి. ఈ నీటి బొట్లు క్రమంగా మంచుగా మారి, లింగరూపంగా రూపాంతరం చెందుతుంది. ఏడాదిలో రెండు నెలలు మాత్రమే తెరిచి ఉండే ఈ గుహకు వెళ్లడానికి ఎన్నో వ్యయప్రయాసలు చేయాల్సిందే. ఇది మామూలు ప్రయాణం కాదు.. ఇదెంతో కష్టంతో కూడుకున్న ప్రయాణమని తెలిసినా... అంత దూరం వెళ్లటానికి ఎవరూ సంకోచించరు.... సరికదా... మరింత ఉత్సాహంతో అమర్నాథ్ యాత్రకు అపూర్వంగా, అపురూపంగా వెళ్తుంటారు భక్తులు. అదంతా కేవలం పార్వతీ ప్రియ వల్లభుడిపై ఉన్న భక్తిభావం. కొండంత నమ్మకం.మొత్తానికి మంచుకొండల్లో మహాదేవుని దర్శనం అనితర సాధ్యం. ఎంతో శ్రమిస్తే తప్ప ఆయన దర్శనం లభించదు.. లయకారకుడి నిజరూపాన్ని కళ్లారా చూసి తరించి... తన్మయత్వం చెంది... తనవి తీరా ఆ రూపాన్ని గుండెల్లో భద్రంగా పెట్టుకుంటారు భక్తులు. అమర్నాథ్ యాత్రలో RV టూర్స్ – ట్రావెల్స్ ప్రస్థానం ఎన్ని యాత్రలు చేసినా... ఎన్ని పర్యాటక ప్రాంతాలు తిరిగినా యాత్రికుల క్షేమమనేది ప్రధాన ఉద్దేశంతో, సేవే లక్ష్యం... ప్రేమే మార్గంగా మొదలైన RV టూర్స్ – ట్రావెల్స్. యాత్రికులకు పుణ్యక్షేత్రాల సందర్శనతో జన్మ పునీతం చేయాలనుకునే సంకల్పంతో ప్రారంభమైన ప్రయాణం. గత 16 సంవత్సరాలుగా నిరాటంకంగా అమర్నాథ్ యాత్రకు చిన్నా , పెద్దా వయస్సుతో నిమిత్తం లేకుండా ఎన్నో వేలమంది ప్రయాణికులకు గమ్యస్థానంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రతి ఒక్కరిని తన కంటికి రెప్పలా కాపాడుకుంటూ యాత్రికులు కోరుకున్న విధంగా యాత్రలను ఏర్పాటు చేయడం ఒక ఎత్తయితే, యాత్రికులకు ఎవ్వరూ ఇవ్వని విధంగా ప్రత్యేక సదుపాయాలను అందిస్తూ మరీ ముఖ్యంగా యాత్రికులకు తెలుగు భోజనం మంచి వసతి సౌకర్యాలను కల్పించడంతో పాటు తమ సంస్థ తరుపున ఒక్కో బందానికి ఒక్కో టూర్ మేనేజర్ని నియమించి... యాత్రికులకు తాము చేసిన యాత్రను అజన్మాంతం ఓ మధురానుభూతిని కల్గిస్తూ తెలుగు వారి ఆత్మీయ ట్రావెల్స్‌గా తెలుగు ప్రజలందరి మదిలో సుస్థిరమైన స్థానం ఏర్పరుచుకుంది ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్.. ఎంతో మహిమాన్వితమైన అమర్నాథ్ యాత్రను మీరు కూడా RVటూర్స్ – ట్రావెల్స్ ద్వారా చేయనుకున్నట్లైతే మరిన్ని వివరాలకు హైదరాబాద్, కూకట్‌పల్లిలో , ఆఒ్క ఆఫీస్ ఎదురుగా ఉన్న RVటూర్స్ – ట్రావెల్స్ ఆఫీస్‌ను సంప్రదించి కానీ , ఫోన్ చేసి కానీ వివరాలు తెలుసుకోవచ్చు. -
శివలింగలో రితికానే హీరో!
శివలింగ చిత్రంలో తన పాత్ర చంద్రముఖి చిత్రంలోని జ్యోతిక పాత్రకు ధీటుగా ఉంటుందని నటి రితికాసింగ్ పేర్కొన్నారు. కన్నడంలో విజయం సాధించిన శివలింగ చిత్రం అదే పేరుతో తమిళంలో పునర్నిర్మాణం అయిన విషయం తెలిసిందే. కన్నడంలో దర్శకత్వం వహించిన పి.వాసు తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించారు. ఆయనకు జంటగా నటి రితికాసింగ్ నటించగా, ప్రధాన పాత్రల్లో శక్తివేల్‌వాసు, రాధారవి,వడివేలు, వీటీవీ.గణేశ్, జయప్రకాశ్, భానుప్రియ, ఊర్వశి, మధువంతి, సాయిప్రియ నటించారు. సురేశ్మురారి ఛాయాగ్రహణం, ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన శివలింగ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నటుడు రాఘవ లారెన్స్ మాట్లాడుతూ శివలింగ చిత్రంలో పి.వాసు దర్శకత్వంలో నటించడం మంచి అనుభవం అన్నారు. అయితే విభిన్న హారర్, కామెడీ కథా చిత్రంగా రూపొందిన ఇందులో తాను కథానాయకుడిని కాదని, నటి రితికాసింగ్నే హీరో అని పేర్కొన్నారు. తాను ఎక్కువగా పాటలకే పరిమితం అవుతానని అన్నారు. నటి రితికాసింగ్ మాట్లాడుతూ శివలింగ చిత్రంలో చాలా మంచి పాత్రలో నటించే అవకాశాన్ని దర్శకుడు పి.వాసు కల్పించారని, ఇది చంద్రముఖి చిత్రంలో జ్యోతిక పాత్రకు ధీటుగా ఉంటుందని అన్నారు. ఇందులో ముందుగా రజనీకాంత్‌ను నటింపజేయడానికి దర్శకుడు ప్రయత్నించారు. ఆయన ఇతర చిత్రాలను కమిట్ అవడంతో నటించలేకపోయారనే ప్రచారం జరిగింది. -
ఆ ముగ్గురి తర్వాతే నేను - లారెన్స్
-
ఆ ముగ్గురి తర్వాతే నేను - లారెన్స్
‘‘ఈ చిత్రంలో కథే మొదటి హీరో రెండో హీరో రితికా సింగ్ (హీరోయిన్), మూడో హీరో శక్తివాసు. ఆ ముగ్గురి తర్వాతే నేను. నాలుగో హీరో అన్నమాట’’ అన్నారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా పి. వాసు దర్శకత్వంలో రూపొందుతోన్న తెలుగు, తమిళ చిత్రం ‘శివలింగ’. రితికా సింగ్ హీరోయిన్. తెలుగులో రమేశ్ పి.పిళ్లై, తమిళంలో రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో పాటల్ని, జనవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. లారెన్స్ మాట్లాడుతూ - ‘‘ఇప్పుడు చాలా చిత్రాల్లో ఇంటర్వెల్ దగ్గర అసలు కథ మొదలవుతోంది. కానీ, ఈ చిత్రంలో మొదటి సీన్ దగ్గరే కథ మొదలవుతుంది. రజనీకాంత్‌గారి దర్శకుడితో పనిచేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. పి.వాసు మాట్లాడుతూ - ‘‘పదేళ్ల క్రితం నేను కన్నడలో తీసిన ‘ఆప్తమిత్ర’ను తెలుగు, తమిళ భాషల్లో ‘చంద్రముఖి’గా రీమేక్ చేశా. పెద్ద హిట్టయ్యింది. ఈ చిత్రం కూడా కన్నడలో నేను తీసిన ‘శివలింగ’కి రీమేక్. నా కుమారుడు శక్తివాసు నటించిన తొలి తెలుగు చిత్రమిది’’ అన్నారు. సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్, నిర్మాతలు రమేశ్ పి.పిళ్లై, రవిచంద్రన్, డీఓపీ సర్వేశ్ మురారి, నటుడు శక్తివాసు పాల్గొన్నారు. -
శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
చెన్నారావుపేట : చెన్నారావుపేటలోని శ్రీ సిద్ధేశ్వరాలయం గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. ఈ దృశ్యం శుక్రవారం ఉదయం ఆవిష్కృతమైంది. సూర్యకిరణాలు పడుతుండగా శివలింగం మెరిసిపోతూ కనిపించింది. ఈ మేరకు వరలక్ష్మీ వ్రతం ఆచరించుకునేందుకు వచ్చిన మహిళలు ఈ దృశ్యాన్ని చూసి ప్రత్యేక పూజలు చేశారు. -
30 సినిమాలకు ఓకె చెప్పాడు..!
సాండల్‌వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సరికొత్త రికార్డ్‌కు తెర తీశాడు. సాధారణంగా స్టార్ స్టేటస్ అందుకున్న ఏ హీరో అయిన ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తాడు. శివరాజ్ కుమార్ మాత్రం ఏడాదికి నాలుగైదు సినిమాలతో సందడి చేస్తున్నాడు. అయితే ఈ మధ్యే వేగం తగ్గించాలని భావించిన శివరాజ్ ఏడాదికి మూడు సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాడు. నెంబర్ తగ్గించుకున్నా ఈ సూపర్ స్టార్ క్రేజ్ మాత్రం తగ్గటం లేదు. వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అందించిన శివరాజ్ కుమార్ ప్రస్తుతం శివలింగ, కిల్లింగ్ వీరప్పన్ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వీటితో పాటు మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా మరో ఎనిమిది సినిమాలకు డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమాలన్ని పూర్తి కావటానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందన్న టాక్ వినిపిస్తుంది. 53 ఏళ్ల వయసులోనూ ఇంత స్పీడుగా సినిమాలు చేస్తున్న శివరాజ్ కుమార్ చేతిలో ప్రస్తుతం 30 సినిమాలు ఉన్నాయట. రాబోయే పదేళ్లలో ఈ సినిమా 30 సినిమాలను పూర్తి చేయడానికి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు శివరాజ్ కుమార్, కన్నడనాట లెజెండరీ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాజ్‌కుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శివరాజ్ కుమార్ ప్రస్తుతం సాండల్‌వుడ్‌లో టాప్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాడు.