30 సినిమాలకు ఓకె చెప్పాడు..! | kannada super star shivaraj kumar commited to do 30 films | Sakshi
Sakshi News home page

30 సినిమాలకు ఓకె చెప్పాడు..!

Published Sat, Dec 12 2015 12:45 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

30 సినిమాలకు ఓకె చెప్పాడు..! - Sakshi

30 సినిమాలకు ఓకె చెప్పాడు..!

సాండల్వుడ్ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సరికొత్త రికార్డ్కు తెర తీశాడు. సాధారణంగా స్టార్ స్టేటస్ అందుకున్న ఏ హీరో అయిన ఏడాదికి ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తాడు. శివరాజ్ కుమార్ మాత్రం ఏడాదికి నాలుగైదు సినిమాలతో సందడి చేస్తున్నాడు. అయితే ఈ మధ్యే వేగం తగ్గించాలని భావించిన శివరాజ్ ఏడాదికి మూడు సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాడు. నెంబర్ తగ్గించుకున్నా ఈ సూపర్ స్టార్ క్రేజ్ మాత్రం తగ్గటం లేదు.

వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ అందించిన శివరాజ్ కుమార్ ప్రస్తుతం శివలింగ, కిల్లింగ్ వీరప్పన్ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వీటితో పాటు మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా మరో ఎనిమిది సినిమాలకు డేట్స్ ఇచ్చేశాడు. ఈ సినిమాలన్ని పూర్తి కావటానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందన్న టాక్ వినిపిస్తుంది. 53 ఏళ్ల వయసులోనూ ఇంత స్పీడుగా సినిమాలు చేస్తున్న శివరాజ్ కుమార్ చేతిలో ప్రస్తుతం 30 సినిమాలు ఉన్నాయట.

రాబోయే పదేళ్లలో ఈ సినిమా 30 సినిమాలను పూర్తి చేయడానికి పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు శివరాజ్ కుమార్, కన్నడనాట లెజెండరీ యాక్టర్గా పేరు తెచ్చుకున్న రాజ్కుమార్ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శివరాజ్ కుమార్ ప్రస్తుతం సాండల్వుడ్లో టాప్ స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement