![Crime Branch Issued Summons To Kannada Actors Diganth And Aindrita Ray - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/15/couple.gif.webp?itok=5W4Tkvif)
సాక్షి, బెంగళూరు: ప్రస్తుతం డ్రగ్స్ కేసు అటూ బాలీవుడ్‌ను ఇటూ శాండల్ వుడ్‌ను కుదిపేస్తోంది. కన్నడ డ్రగ్ వ్యవహరంలో ఇప్పటికే కన్నడ హీరోయిన్‌లు సంజన గల్రానీ, రాగిణి ద్వివేదీలతో పాటు పలువురిని బెంగళూర్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ స్టార్ జంట దిగంత్ మంచలే, ఐంద్రిత రేలకు సీసీబీ పోలీసులు సమన్లు జారీ చేశారు. దర్యాప్తు నిమిత్తం రేపు ఉదయం 11 గంటలకు సీసీబీ కార్యాలయానికి హాజరు కావాలని వారిని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: డ్రగ్స్ కేసు: మాజీ మంత్రి కుమారుడి ఇంట్లో సోదాలు)
అదే విధంగా ఈ కేసులో కీలక నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలోని ఐ బార్టనే అనే క్యాసినోకు ఈ జంటను ఆహ్వానించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో డ్రగ్స్ సప్లయర్స్‌తో వీరికి కూడా ఎమైన సంబంధం ఉందని భావించిన సీసీబీ వారికి సమన్లు జారీ చేసింది. మరోవైపు కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్యపై కూడా కేసు నమోదైంది. ఆయనకు చెందిన రిసార్ట్ పై ఇవాళ(మంగళవారం) ఉదయం సీసీబీ పోలీసులు తనిఖీ చేశారు. ప్రస్తుతం ఆదిత్య పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: డేటా మొత్తం డిలీట్ చేసిన సంజనా, రాగిణి)
Comments
Please login to add a commentAdd a comment