Kannada actors
-
నటి శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోటు స్వాధీనం
కన్నడ సినీ, టీవీ నటి నటి శోభిత శివన్న (32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో పోలీసుల విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్‌లో తన భర్తతో ఆమె ఉంటున్నారు. డిసెంబర్ 1న తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే, తాజాగా ఆమె రాసిన ఒక నోట్ బయట పడింది.శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్‌ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్‌కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్‌రెడ్డికి మ్యాట్రిమోని ద్వారా శోభిత పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో వారు పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుధీర్.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఆపై పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు, సిరీయల్స్‌కు దూరమైంది. శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన ఆమె నిద్రపోయేందుకు ఓ గదిలోకి వెళ్లింది. అయితే, సుధీర్ మరో గదిలోకి వెళ్లి డ్యూటీ(వర్క్ ఫ్రమ్ హోం) చేస్తున్నాడు. ఉదయం 10 గంటల అయినా ఆమె డోర్ తియకపోవడంతో శోభిత గది తలుపును పనిమనిషి తట్టింది. ఆమె ఎంతసేపటికీ డోర్ ఓపెన్ చేయకపోవడంతో.. సుధీర్‌రెడ్డికి విషయం చెప్పి తలుపులు విరగ్గొట్టారు. శోభిత ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది.' పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత శోభిత మరణానికి కారణాలు తెలుపుతామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
ప్రియాంక ఉపేంద్ర ప్రయోగాత్మక చిత్రం 'క్యాప్చర్' విడుదలకు సిద్దం
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర భార్య ప్రియాంక ప్రయోగాత్మక చిత్రం క్యాప్చర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటి వరకు తెరపైకి రానటువంటి ప్రయోగాత్మక చిత్రమిదని యూనిట్ తెలిపింది. సినిమా మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ నుంచి షూట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సింగిల్ లెన్స్‌తో తీసిన మొట్ట మొదటి సినిమా కూడా ఇదే. దర్శకుడు లోహిత్.హెచ్ ఎప్పుడూ కూడా కొత్త పాయింట్‌తోనే సినిమాలు తీస్తుంటారు. ప్రియాంక ఉపేంద్ర, లోహిత్ కాంబోలో ఇది వరకు మమ్మీ, దేవకి వంటి చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు మూడోసారి మరో ప్రయోగాత్మక చిత్రమైన ‘క్యాప్చర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని షమికా ఎంటర్ప్రైజెస్, శ్రీ దుర్గా పరమేశ్వరి ప్రొడక్షన్స్ బ్యానర్స్ మీద రవి రాజ్ నిర్మిస్తున్నారు. రాధికా కుమారస్వామి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా గోవాలోనే జరిగింది. 30 రోజుల పాటు నిరవధికంగా చిత్రీకరించారు. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను విడుదల చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ప్రియాంక ఉపేంద్ర పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తే ప్రియాంక మొహం మీద తీవ్ర గాయాలు కనిపిస్తున్నాయి. ఇక ఆమె చుట్టూ సీసీటీవీ కెమెరాలు కనిపిస్తున్నాయి. వాటి మధ్యలో ఓ కాకి కనిపిస్తోంది. వ్యక్తుల చేతులు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో సినిమాను మలిచినట్టుగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. శివ రాజ్ కుమార్ తగరు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మన్విత కామత్ ఈ చిత్రంలో ఓ కీ రోల్ పోషిస్తున్నారు. మాస్టర్ కనిష్‌రాజ్ ఈ చిత్రంతో బాలనటుడిగా పరిచయం కాబోతున్నారు. పాండికుమార్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, రవిచంద్రన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. -
అందాల శిల్పం.. నటి శిల్పా మంజూనాథ్ (ఫోటోలు)
-
వైరల్: కరోనా పేషెంట్లతో సెలబ్రిటీల డ్యాన్స్
బెంగళూరు: కోవిడ్ సోకితే చాలు అయినవాళ్లనే పరాయివాళ్లుగా చూస్తున్నా రోజులివి. మానసిక స్థైర్యం కల్పించాల్సిన వాళ్లే మనకెందుకులే అని చేతులు దులుపుకుంటున్న దుర్దినాలివి. కానీ ఇలాంటి సమయంలో బాధతో కుమిలిపోతున్న కోవిడ్ పేషెంట్లను నవ్వించేందుకు, వారి ముఖాల మీద చిరునవ్వు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారిద్దరు నటీనటులు. కన్నడ స్టార్ హర్షిక పూనాచా, తన కజిన్, నటుడు భువన్ పొన్నన్నతో కలిసి కర్ణాటకలోని మడికెరి కోవిడ్ ఆస్పత్రిని సందర్శించింది. పీపీఈ కిట్లలో ఆస్పత్రిలో అడుగుపెట్టిన ఈ సెలబ్రిటీలు అక్కడి వార్డుల్లో ఉన్న ఆయా పేషెంట్లను పలకరిస్తూ డ్యాన్సులు చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న కొందరు కరోనా పేషెంట్లు వారితో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కొడగు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనుమతితో కోవిడ్ పేషెంట్లను కలిసిన ఈ సెలబ్రిటీలు వారిపై వివక్ష చూపకూడదని తెలియజేసేందుకు ఈ ప్రయత్నం చేశామన్నారు. అయితే అక్కడ చాలా మంది రోగులు మానసికంగా బలహీనంగా ఉన్నారని తెలిపారు. అలాంటివారికి ధైర్యాన్ని నూరిపోసేందుకు ప్రయత్నించామన్నారు. ఈ మాయదారి రోగాన్ని సమూలంగా నాశనం చేసేవరకు మనమందరం కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా భువన్, హర్షిక.. భువనమ్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడంతోపాటు రోగులకు ఔషధాలను కూడా పంపిణీ చేస్తున్నారు. చదవండి: OTT: నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదిగో! -
డ్రగ్ కేసు: స్టార్ జంటకు సమన్లు
సాక్షి, బెంగళూరు: ప్రస్తుతం డ్రగ్స్ కేసు అటూ బాలీవుడ్‌ను ఇటూ శాండల్ వుడ్‌ను కుదిపేస్తోంది. కన్నడ డ్రగ్ వ్యవహరంలో ఇప్పటికే కన్నడ హీరోయిన్లు సంజన గల్రానీ, రాగిణి ద్వివేదీలతో పాటు పలువురిని బెంగళూర్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ స్టార్ జంట దిగంత్ మంచలే, ఐంద్రిత రేలకు సీసీబీ పోలీసులు సమన్లు జారీ చేశారు. దర్యాప్తు నిమిత్తం రేపు ఉదయం 11 గంటలకు సీసీబీ కార్యాలయానికి హాజరు కావాలని వారిని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: డ్రగ్స్ కేసు: మాజీ మంత్రి కుమారుడి ఇంట్లో సోదాలు) అదే విధంగా ఈ కేసులో కీలక నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలోని ఐ బార్టనే అనే క్యాసినోకు ఈ జంటను ఆహ్వానించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో డ్రగ్స్ సప్లయర్స్‌తో వీరికి కూడా ఎమైన సంబంధం ఉందని భావించిన సీసీబీ వారికి సమన్లు జారీ చేసింది. మరోవైపు కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్యపై కూడా కేసు నమోదైంది. ఆయనకు చెందిన రిసార్ట్ పై ఇవాళ(మంగళవారం) ఉదయం సీసీబీ పోలీసులు తనిఖీ చేశారు. ప్రస్తుతం ఆదిత్య పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: డేటా మొత్తం డిలీట్ చేసిన సంజనా, రాగిణి) -
పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ జంట!
ప్రముఖ రియాలిటీ షో కన్నడ ‘బిగ్‌బాస్ సీజన్ 5’ విన్నర్ చందన్ శెట్టి, కంటెస్టెంట్ నివేదిత గౌడల వివాహం బంధువులు, స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. బిగ్‌బాస్ హౌజ్‌లో ప్రేమలో పడ్డ ఈ జంట గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా బుధవారం ఉదయం వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బిగ్‌బాస్ హౌజ్‌లో స్నేహితులుగా మెలిగిన వీరిద్దరూ ప్రేమికులుగా మారారు. ఇక బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక కూడా పార్టీలకు కలిసి వెళ్లడం, రెస్టారెంట్లు, కాఫీ డేలకు చేట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ప్రేమాయణం సాగించారు. ఇక చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా ఈ విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు చెప్పడంతో.. వారు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గతేడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ ప్రేమ జంట ఈ రోజు పెళ్లి చేసుకున్నారు. View this post on Instagram happy married life 💛💙@niveditha__gowda @chandanshettyofficial @puneethrajkumar.official #appuboss #chandanshetty A post shared by puneeth Rajkumar_fc (@power_star_boys_mysore) on Feb 25, 2020 at 8:11pm PST ఈ క్రమంలో కన్నడ పరిశ్రమ ప్రముఖులు, సన్నిహితులు, బంధువుల మధ్య పెళ్లికి ముందు రోజు రాత్రి జరిగిన రిసెప్షన్ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను చందన్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఫొటోలో వీరిద్దరూ ఒకే రంగు దుస్తులను ధరించి పార్టీలో అందరిని ఆకట్టుకున్నారు. చందన్ శెట్టి బ్లాక్ అండ్ మెరూన్ త్రీ పీస్ బ్రోకెడ్ కోటు ధరించగా.. నివేదిత బాల్రూం గౌనుకు తలపై నెట్ వేల్ ధరించి అందంగా ఉంది. View this post on Instagram Such a Wonderful Video🤩🤩 Give mE a Credit🤩 🙈 Do Follow More Update Follow @chandanshettyofficial @boss.chandanshetty #chandanshetty #csfire Admin:-) @vishu.nyk_ Credit :-) @ ________________________________________ #zeesaregamapa15 #sarigamapa #Sandalwood #rajeshkrishnan #vijayaprakash #naveensajju #chandanshetty #kgf #kannadasongs #kannada #kannadadubsmash #kannadaworld #banglore #anchoranushree #kannadamovies #kannadakogile #majatalkies #kuriprathap #support #follow #sanjithhegde #bbk6 #biggbosskannada #colorssuper #zeekannada #kannadamemesanthe #kannadamemes #sandalwoodactress #csshokilala _____________________________________________ Page:-@chandanshetty_fans_club Admin:- @dhanesh_patil1122 @poornima207 —————————————————- Page:- @chandanshettykannadarapper Admin:- @naveen_gowda25 —————————————————- Page:- @chandanshettyfansbgk1 Admin:- @pajjudodamani —————————————————- Page:-@rap_king_chandan_shetty_fans Admin:- @deepak_m_narendra ————————————————— Page:- @Chandanshetty_fans_krazee Admin:- @shivkanthofficial —————————————————- Page:- @Chandanbro_fans_club Admin:-@_appu_official ————————————————— Page & admin:- @shree.swamy_cs —————————————————- Page:- @chandanshettyfc Admin:- @shreyank_manjunath —————————————————- Page:- @boss.chandanshetty Admin:- @vishu.nyk_ —————————————————- Page:- @durgan_cs_fans Admin :- @____mr____nayaka____ @appu_shabhash ————————————————- Page:- @pra.deep_offical_740 by ———————————————— Page :- @teamchandanshettyofficial Admin :- @surajwakodedar A post shared by CHANDAN SHETTY 👑👑 (@boss.chandanshetty) on Feb 25, 2020 at 9:53pm PST -
విషాదాంతం
= రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు = ఉదయ్ మృతదేహం లభ్యం = ఆచూకీ లభించని అనిల్ = ప్రత్యేక బోట్ల సాయంతో గజ ఈతగాళ్ల గాలింపు = మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింపు = మూగబోయిన శాండిల్‌వుడ్ సాక్షి, బెంగళూరు: మాస్తిగుడి సినిమా చిత్రీకరణ సమయంలో తిప్పగొండనహళ్లి చెరువులో సోమవారం గల్లంతైన కన్నడ చిత్రరంగానికి చెందిన ఫైటర్లు అనిల్, ఉదయ్ రాఘవల కోసం మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకూ గాలింపు కొనసాగింది. ఉదయ్ మృతదేహం లభ్యం కాగా అనిల్ ఆచూకీ మాత్రం లభించలేదు. సంఘటన స్థలంలో బాధిత కుటుంబ సభ్యుల రోదనల మిన్నంటుతున్నాయి. ఈ ఘటనకు కారణమని భావిస్తున్న దర్శకుడు నాగశేఖర్తో సహా ఐదుగురిపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసు దాఖలైంది. అనిల్, ఉదయ్‌లు గల్లంతైన రోజు రాత్రి సంఘటనా స్థలానికి చేరుకున్న జాతీయ విపత్తు నిర్వహణ బృందం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స ఫోర్స్-ఎన్డీఆర్ఎఫ్) నిపుణులతో పాటు రాష్ట్ర అగ్నిమాపక నిరోధక శాఖ నిపుణులు, స్థానిక జాలర్లు బోట్లు, తెప్పలతో పాటు సినిమా చిత్రీకరణకు ఉపయోగించే ఫ్లడ్‌లైట్ల సహాయంతో అర్ధరాత్రి వరకూ గాలించిన ఫలితం లేకపోయింది. దీంతో తాత్కాలికంగా గాలింపును నిలిపి వేసి మంగళవారం ఉదయం 8 గంటలకు తిరిగి ఎన్డీఆర్ఎఫ్కు చెందిన నాలుగు బోట్లతో సహా మొత్తం 9 బోట్లతో గాలింపు చర్యలు మొదలయ్యాయి. నటులు పైనుంచి పడిన స్థలానికి చేరుకున్న అధికారులు ప్రత్యేక కెమరాలను నీటి లోపలికి పంపించి పరిశీలించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇక ఎన్డీఆర్ఎఫ్కు చెందిన ఇద్దరు స్కూబా డైవింగ్ నిపుణులు 30 అడుగుల లోతుకు వెళ్లి పరిశీలించినా నటుల ఆచూకీ లభించలేదు. దీంతో బోరు బావిలో పడిన పిల్లలను వెలికితీసేందుకు రూపొందించిన పరికరం సహాయంతో బయటికి తీయడంలో విజయం సాధించిన నిపుణుడు అయిన రోబో మంజు కూడా చెరువులో ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకూ గాలించాడు. మరో వైపు మంగళూరు నుంచి వచ్చిన ఐదుగురు సభ్యులతో కూడిన గజఈతగాళ్లు , స్కూబా డైవింగ్ దళం రాత్రి పొద్దుపోయే వరకూ గాలించినా అనిల్, ఉదయ్‌లు జాడ కనిపించలేదు. కృత్రిమ సుడిగుండమే కారణమా! సినిమా చిత్రీకణ సమయంలో దర్శకుడికి ప్రతి చిన్న విషయంపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలి. అరుుతే ఘటన జరిగిన తీరును పరిశీలిస్తే దర్శకుడికి లేదా స్టంట్మాస్టర్కు నీటికి సంబంధించి కనీస అవగాహన కూడా లేదని తెలుస్తోంది. తిప్పగుండనహళ్లి పూర్తి స్థారుు నీటి నిల్వ సామర్థ్యం 3 టీఎంసీలు. ఘటన జరిగిన ప్రాంతంలో చెరువు లోతు 74 అడుగులు. చుట్టుపక్కల ఉన్న పరిశ్రమల వల్ల తిప్పగుండనహళ్లిలోకి కలుషిత నీరు, వ్యర్థాలు చేరిపోయాయి. దీంతో చెరువులో 30 అడుగుల వరకూ పూడిక చేరింది. ఘటన సమయంలో హెలికాప్టర్ దాదాపు నిమిషం పాటు నిలబడి ఉంది. ఆ సమయంలో ప్రొఫెల్లర్ తిరగడం వల్ల నీటిలో కృత్రిమ సుడిగుండం ఏర్పడిందని, ఉదయ్, లలిత్‌లు అందులో పడి బయట పడలేక పోయారని కన్నడ చిత్ర రంగానికే చెందిన కొంతమంది స్టంట్ డెరైక్టర్లు చెబతున్నారు. అంతేకాకుండా దాదాపు 40 అడుగులు, అపై నుంచి మనిషి నీటిలోకి పడిన వెంటనే పది అడుగుల వరకూ మునుగుతాడని, ఆ సమయంలో నీరు ముక్కుల ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెలుతుందని, ప్రస్తుతం ఘటన జరిగిన చెరువు ఉన్న కలుషితం కావడంతో ఆ నీరు ఊపిరితిత్తుల్లోకి పోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురై ఉదయ్, రాఘవ ఎక్కువ సేపు ఈదలేక పోయాయి మునిగిపోయి ఉంటారని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఇలాంటి స్టంట్లు చేసే సమయంలో ’ఫ్లోటింగ్ డ్రస్’ లను నటులు ధరించాల్సి ఉంటుంది. అయితే అటు వంటి ఏర్పాట్లు ఎక్కడా లేదు. అనిల్, ఉదయ్ రాఘవల కాళ్లకు కనీసం గాలి నింపిన చిన్నచిన్న ట్యూబులను కట్టి అటుపై ప్యాంటు ధరించినా నీటిలోకి పడిన వారు ఎక్కువ లోతుకు వెళ్లకుండా వెంటనే తేలేవారని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కనీస విషయాలపై కూడా అవగాహన లేకుండా చిత్రీకరణకు అత్యుత్సాహం చూపించడం వల్లే ఘటన జరిగినట్లు చలనచిత్రం పోగొట్టుకోవాల్సి వచ్చిందని కన్నడ చిత్రరంగ నిపుణులు చెబుతున్నారు. ఐదుగురిపై క్రిమినల్ కేసులు... ఘటనకు సంబంధించి స్థానిక తవరెకెరె పోలీస్‌స్టేషన్‌లో ఐదుగురిపై బెంగళూరు జలమండలి అసిస్టెంట్ ఇంజినీర్ అనసూయ ఫిర్యాదు చేశారు. మాస్తిగూడి సినిమా నిర్మాత సుందరగౌడ ప్రథమ నిందితుడిగా, దర్శకుడు నాగశేఖర, సహాయదర్శకుడు సిద్ధు, స్టంట్‌మాస్టర్ రవివర్మ, యూనిట్ మేనేజర్ ఎస్.భరత్‌ను వరుసగా రెండో, మూడో, నాలుగో, ఐదో నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా సంఘటన జరిగినప్పటి నుంచి సుందరగౌడ, నాగశేఖర్, రవివర్మ సంఘటనా స్థలంలో లేకపోవడంపై బాధిత కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు వీరే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా కేసుకు సంబంధించి మొదటి ముద్దాయి సుందరగౌడను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. -
షూటింగ్ విషాదం... షాకింగ్ నిజాలు!
-
నటులపై ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు..
-
నటులపై ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు..
కావేరి నదీ జలాల విషయంలో కన్నడ నటుల ఆందోళనను ఎద్దేవా చేస్తూ ఫేస్బుక్లో పోస్టు పెట్టిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. కొందరు దుండగులు అతన్ని చితకబాదారు. తమిళనాడుకు 15వేల క్యూసెక్కుల నీటిని పదిరోజులపాటు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేయడంతో కర్ణాటక భగ్గుమన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కన్నడ సంఘాలు ఆందోళనకు దిగి.. శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్‌ను చేపట్టాయి. ఈ బంద్ నేపథ్యంలో ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి డీ సంతోష్ ఫేస్బుక్లో ఓ పోస్టు పెట్టాడు. కావేరి జలాల ఆందోళనలో కన్నడ నటులు శివరాజ్‌కుమార్, 'దునియ' విజయ్, రాగిణి ద్వివేది, దర్శన్ పాల్గొనడాన్ని తప్పుబడుతూ అతను విమర్శలు చేశాడు. అతని పోస్టు కర్ణాటకలో వైరల్‌గా మారింది. దీంతో ఆగ్రహించిన బెంగళూరు స్థానిక యువకులు కొందరు అతన్ని వెతికిమరీ పట్టుకున్నారు. కాలేజీ గేటు వద్ద అతన్ని అటకాయించి చితకబాదారు. ఐదుగురు అతన్ని చుట్టుముట్టి చితకబాదుతున్న వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.