
బెంగళూరు: కోవిడ్ సోకితే చాలు అయినవాళ్లనే పరాయివాళ్లుగా చూస్తున్నా రోజులివి. మానసిక స్థైర్యం కల్పించాల్సిన వాళ్లే మనకెందుకులే అని చేతులు దులుపుకుంటున్న దుర్దినాలివి. కానీ ఇలాంటి సమయంలో బాధతో కుమిలిపోతున్న కోవిడ్ పేషెంట్లను నవ్వించేందుకు, వారి ముఖాల మీద చిరునవ్వు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేశారిద్దరు నటీనటులు.
కన్నడ స్టార్ హర్షిక పూనాచా, తన కజిన్, నటుడు భువన్ పొన్నన్నతో కలిసి కర్ణాటకలోని మడికెరి కోవిడ్ ఆస్పత్రిని సందర్శించింది. పీపీఈ కిట్లలో ఆస్పత్రిలో అడుగుపెట్టిన ఈ సెలబ్రిటీలు అక్కడి వార్డుల్లో ఉన్న ఆయా పేషెంట్లను పలకరిస్తూ డ్యాన్సులు చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న కొందరు కరోనా పేషెంట్లు వారితో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
కొడగు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనుమతితో కోవిడ్ పేషెంట్లను కలిసిన ఈ సెలబ్రిటీలు వారిపై వివక్ష చూపకూడదని తెలియజేసేందుకు ఈ ప్రయత్నం చేశామన్నారు. అయితే అక్కడ చాలా మంది రోగులు మానసికంగా బలహీనంగా ఉన్నారని తెలిపారు. అలాంటివారికి ధైర్యాన్ని నూరిపోసేందుకు ప్రయత్నించామన్నారు. ఈ మాయదారి రోగాన్ని సమూలంగా నాశనం చేసేవరకు మనమందరం కలిసి కట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా భువన్, హర్షిక.. భువనమ్ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు నిత్యావసర సరుకులు అందించడంతోపాటు రోగులకు ఔషధాలను కూడా పంపిణీ చేస్తున్నారు.
చదవండి: OTT: నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదిగో!
Comments
Please login to add a commentAdd a comment