
కన్నడ సినీ, టీవీ నటి నటి శోభిత శివన్న (32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో పోలీసుల విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న సీ బ్లాక్‌లో తన భర్తతో ఆమె ఉంటున్నారు. డిసెంబర్ 1న తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్ అయ్యారు. అయితే, తాజాగా ఆమె రాసిన ఒక నోట్ బయట పడింది.
శోభిత ఆత్మహత్యకేసులో సూసైడ్ నోట్‌ను గచ్చిబౌలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యు కెన్ డూ ఇట్ అంటూ ఆ లేఖలో ఆమె పేర్కొంది. అయితే, ఎవరిని ఉద్దేశించి శోభిత అలా రాసిందో తెలుపలేదు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డిప్రెషన్ వల్లే శోభిత మృతికి కారణమై ఉంటుందా అని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. సీరియల్స్, మూవీస్‌కి దూరంగా ఉండటమా..? తన భర్త సుధీర్ రెడ్డితో ఏమైనా గొడవలు ఉన్నాయా..? అనే వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ తుక్కుగూడకు చెందిన సుధీర్‌రెడ్డికి మ్యాట్రిమోని ద్వారా శోభిత పరిచయం ఏర్పడింది. ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో వారు పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సుధీర్.. పెళ్లి తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఆపై పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు, సిరీయల్స్‌కు దూరమైంది. శనివారం రాత్రి భర్తతో కలిసి భోజనం చేసిన ఆమె నిద్రపోయేందుకు ఓ గదిలోకి వెళ్లింది.

అయితే, సుధీర్ మరో గదిలోకి వెళ్లి డ్యూటీ(వర్క్ ఫ్రమ్ హోం) చేస్తున్నాడు. ఉదయం 10 గంటల అయినా ఆమె డోర్ తియకపోవడంతో శోభిత గది తలుపును పనిమనిషి తట్టింది. ఆమె ఎంతసేపటికీ డోర్ ఓపెన్ చేయకపోవడంతో.. సుధీర్‌రెడ్డికి విషయం చెప్పి తలుపులు విరగ్గొట్టారు. శోభిత ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది.' పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత శోభిత మరణానికి కారణాలు తెలుపుతామని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment