
రామ్‌చరణ్(Ram Charan) హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీ స్పోర్ట్స్ డ్రామా ఫిల్మ్ ‘పెద్ది’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఓ సెట్‌లో నైట్ షూట్ జరుగుతోందని తెలిసింది. రామ్‌చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్‌ల కాంబినేషన్ లోని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. అలాగే ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ గురించే కాకుండా... మరికొన్ని ఇతర స్పోర్ట్స్ గురించిన ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది.
ఇంకా ఈ షెడ్యూల్‌లోనే ఓ మాస్ యాక్షన్ సీక్వెన్స్‌ను తీసేందుకు టీమ్ రెడీ అయిందని, ‘జైలర్’ ఫేమ్ కెవిన్ కుమార్ ఈ యాక్షన్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ చేయనున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్ .
Comments
Please login to add a commentAdd a comment