
‘ఉప్పెన’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు(Buchi Babu) సానా ద్వితీయ చిత్రాన్ని హీరో రామ్‌చరణ్(Ram Charan)తో చేసే అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ఆర్‌సీ 16’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా శనివారం (ఫిబ్రవరి 15) బుచ్చిబాబు బర్త్ డే.
ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ‘ఆర్‌సీ 16’ యూనిట్ ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజు వేడుకని నిర్వహించారు. రామ్‌చరణ్ కూడా బుచ్చిబాబుతో కలిసి ఉన్న ఫొటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. ‘ఆర్‌సీ 16’ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ముగిసింది.
రామ్ చరణ్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు బుచ్చిబాబు. ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది. శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment