Central Crime Branch
-
రేవ్ పార్టీ కేసు: బెంగళూరు పోలీసులకు హేమ లేఖ.. విచారణకు డుమ్మా
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నేడు నిందితులను బెంగళూరు క్రైమ్ బ్యాంచ్ పోలీసులు విచారించనున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ నటి హేమతో పాటు మరో ఎనిమిది మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేనని హేమ పోలీసులకు లేఖ రాశారు. ఈ లేఖలో హేమ.. ఈ కేసులో తాను హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. తాను వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలిపారు. అయితే, హేమ లేఖను సీసీబీ పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని హేమకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. బెంగళూరు రేవ్ పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీలో దాదాపు 150 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ శాంపిల్స్‌లో తేలింది. దీంతో, వారంతా ఈరోజు విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారు. అయితే రేవ్ పార్టీకి తాను హాజరుకాలేదని వీడియోలు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. అలాగే, వారి బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వాసు బ్యాంక్ ఖాతాల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక, ఈ కేసులో వాసు ప్రధాన అనుచరుడు చిత్తూరుకు చెందిన అరుణ్ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
బెంగళూరులో ఉగ్ర కలకలం.. ఐదుగురి అరెస్ట్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అయిదుగురు అనుమానిత టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం వీరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని జునైద్, సోహైల్, ముదాసిర్, ఉమర్, జాహిద్‌గా గుర్తించారు. వీరి నుంచి సెల్ ఫోన్లతోపాటు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఇతర వస్తులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని సీసీబీ పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో మరో అయిదుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం జల్లెడపడుతున్నారు. కాగా అరెస్ట్ అయిన నిందితులు 2017లో జరిగిన ఓ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కొంతకాలం బెంగుళూరు సెంట్రల్ జైలులో శిక్షననుభవించారని చెప్పారు. ఆ సమయంలో కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడి పేలుడు పదార్థాలను నిర్వహించడంలో శిక్షణ పొందినట్లు వెల్లడించారు. చదవండి: ఐఏఎస్ ఆకాశ్‌పై భార్య వందన ఫిర్యాదు -
‘హష్’ రవాణాతో సిటీకి లింకులు!
సాక్షి, హైదరాబాద్: బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులకు ఇటీవల చిక్కిన హష్ ఆయిల్ అక్రమ రవాణా గ్యాంగ్ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ ముఠా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి బెంగళూరుతో పాటు హైదరాబాద్, చెన్నై, కొచ్చి, ముంబైలకు సరఫరా చేస్తోందని గుర్తించారు. అయితే ఈ అక్రమ రవాణా మొత్తం నెల్లూరు కేంద్రంగా సాగుతున్నట్లు వెలుగులోకి రావడంతో కంగుతిన్నారు. ఈ గ్యాంగ్ అరెస్టుపై ఇక్కడి అధికారులకు సమాచారం ఇచి్చన సీసీబీ నెల్లూరు కోణంపై దృష్టి పెట్టాల్సిందిగా కోరింది. బెంగళూరులోని వివిధ పబ్బుల్లో పని చేసే డిస్కో జాకీలకు (డీజే) పెద్ద ఎత్తున గంజాయి, హష్ ఆయిల్ సరఫరా అవుతున్నాయి. వీళ్లే తమ పబ్స్‌కు వచ్చే కస్టమర్లకు వీటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై అక్కడి సీసీబీ అధికారులకు గత నెల్లో సమాచారం అందింది. దీంతో వరుసపెట్టి దాడులు చేసిన అధికారులు కొందరు డీజేలను అరెస్టు చేశారు. వీరికి ఈ మాదకద్రవాలు ఎక్కడ నుంచి వస్తున్నాయనే అంశంపై సీసీబీ దృష్టి పెట్టింది. తమ దర్యాప్తును కొనసాగించిన నేపథ్యంలో విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ముఠా అరకు లోయ నుంచి తీసుకువచ్చి అందిస్తున్నట్లు గుర్తించింది. దీంతో నిఘా కొనసాగించిన సీసీబీ పోలీసులు గత వారం నలుగురిని అరెస్టు చేశారు. ఇప్పటి వరకు పోలీసు రికార్డుల్లోకి ఎక్కని, తొలిసారిగా పోలీసులకు చిక్కిన ఈ గ్యాంగ్‌లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. అరకు ప్రాంతానికి చెందిన వీరిని శ్రీనివాస్, ప్రహ్లాద్, సత్యవతి, మల్లీశ్వరిగా వీరిని గుర్తించారు. ఈ నలుగురినీ కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్న సీసీబీ లోతుగా విచారించింది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు కోణం వెలుగులోకి వచి్చంది. ఈ ముఠా ఏజెన్సీ ప్రాంతానికి చెందినదే. గంజాయి పండేది, హష్ ఆయిల్ ఉత్పత్తి అవుతున్నది సైతం ఆ ఏరియాలోనే. అయితే తమకు మాత్రం ఈ మాదకద్రవ్యాలను నెల్లూరులో ఓ వ్యక్తి అందించారంటూ ఈ నలుగురూ బయటపెట్టారు. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన రేగా అనే వ్యక్తి ఆదేశాల మేరకు తాము అక్కడకు వెళ్లామని సీసీబీ విచారణలో చెప్పారు. నెల్లూరులో ఓ వ్యక్తి గతంలోనూ తమకు గంజాయి, హష్ ఆయిల్ ఇచ్చాడని, వాటిని హైదరాబాద్‌తో పాటు ఇతర మెట్రో నగరాలకు తీసుకువెళ్లి డెలివరీ చేసి వచ్చాయని అంగీకరించారు. డెలివరీ ఎవరికి ఇవ్వాలనేది ముందుగా చెప్పరని ఆయా ప్రాంతాలకు చేరుకున్న తర్వాతే వాట్సాప్ కాల్ ద్వారా తమకు సమాచారం ఇస్తారని ఈ నలుగురూ సీసీబీ విచారణలో వెల్లడించారు. ఈ ముఠాకు హైదరాబాద్‌లోనూ పెడ్లర్లు ఉన్నారని తెలియడంతో సీసీబీ పోలీసులు ఇక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. నలుగురి వివరాలు, ఫోన్ నెంబర్లు అందించి స్థానిక లింకులపై ఆరా తీయాల్సిందిగా కోరారు. ఈ ముఠాకు, నెల్లూరులోని సరఫరాదారుడికి ఉన్న సంబంధాన్నీ తెలుసుకున ప్రయత్నాలు చేయాలని కోరారు. దీంతో ఇక్కడి అధికారులు ఆ కోణంలో ఆరా తీయడం మొదలెట్టారు. (చదవండి: డిస్క్ంకు ఉరితాళ్లు!) -
ఓసారి బ్రిజా, మరోసారి డిజైర్, ఇంకోసారి క్రెటా...
సాక్షి, హైదరాబాద్: ఓసారి బ్రిజా, మరోసారి డిజైర్, ఇంకోసారి క్రెటా... ఇలా ఖరీదైన కార్లలో హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరు వెళ్తూ.. అనువైన ఇళ్లను టార్గెట్‌గా చేసి వరుస చోరీలు చేస్తాడు... ఇలా రెచ్చిపోతున్న ఘరానా దొంగ బస్వరాజ్ ప్రకాష్ అలియాస్ విజయ్‌కుమార్ అలియాస్ జంగ్లీని బెంగళూరులోని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌లో పట్టుకుని తీసుకెళ్లిన పోలీసులు ఇతడి నుంచి 1.3 కేజీల బంగారం సహా రూ.80 లక్షల విలువైన సొత్తు రికవరీ చేశారు. బెంగళూరులోని రామనగరకు చెందిన ప్రకాష్ ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని మేడ్చల్‌లో నివసిస్తున్నాడు. వ్యవసాయ కుటుంబం నుంచి వచి్చన ఇతగాడు 2012లో ప్రేమ వివాహం చేసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. రామనగరలో బేకరీ ఏర్పాటు చేయగా..తీవ్ర నష్టాలు వచ్చాయి. దీంతో దాన్ని వదిలేసి ఏడాది కుమార్తెతో భార్యాభర్తలు 2014లో బెంగళూరు చేరుకున్నారు. అక్కడి యశ్వంత్‌పూర్ రైల్వేస్టేషన్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రకాష్‌కు ఉద్యోగం దొరకలేదు. ఓ దశలో తమ కుమార్తెకు పాలు కొనడానికి కూడా డబ్బులు లేకపోవడంతో తొలిసారిగా ఆ రైల్వేస్టేషన్ సమీపంలోని ఇంట్లో రూ.900 చోరీ చేశాడు. అప్పటి నుంచి కర్ణాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుల్లో వరుస చోరీలు చేస్తూ ఇప్పటి వరకు 11 సార్లు అరెస్టయ్యాడు. ఇలా అరెస్టు అవుతూ ఏడాదిలో ఆరు నెలలు జైల్లోనే ఉంటున్న ఇతడిని భార్య వదిలేసి కుమార్తెతో వెళ్లిపోయింది. అప్పటి నుంచి మేడ్చల్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. చిరు వ్యాపారిగా యజమానికి పరిచయం చేసుకున్నాడు. ఖరీదైన.. ప్రధానంగా ఎస్యూవీ కార్లంటే ప్రకాష్‌కు మక్కువ ఎక్కువ. దీంతో సెకండ్ హ్యాండ్ కారు ఖరీదు చేసి..దానిపైనే చోరీ చేసే చోటుకు వెళ్తాడు. తాళం వేసి ఉన్న.. ప్రధాన ద్వారం వేసి ఉండని ఇళ్లను గుర్తించి చోరీ చేస్తాడు. ఎక్కడా షెల్టర్ తీసుకోకుండా అక్కడ నుంచి తన వాహనంపై తిరిగి బయలుదేరుతాడు. నేరుగా మేడ్చల్‌లోని ఇంటికి రాకుండా తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తాడు. కొన్ని రోజులు అక్కడ తలదాచుకుని, చోరీ సొత్తును విక్రయించడంతో పాటు మరో నేరం చేసి తిరిగి వస్తాడు. ఇలా నాలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 100కు పైగా కేసులు ఇతడిపై నమోదై ఉన్నాయి. ఇలా గతేడాది కాలంలో బెంగళూరులోనే 11 నేరాలు చేశాడు. తొలినేరం చేసినప్పుడు సీసీబీ ఇన్స్పెక్టర్ హజారీష్ ఖలీందర్ నేతృత్వంలో ఓ ప్రత్యేక బృందం ఏర్పాటైంది. వీళ్ల గాలింపు కొనసాగుతుండగానే మరో పది చోరీలు చేసేశాడు. ఆఖరుగా గత నెల్లో పంజా విసిరాడు. వేట ముమ్మరం చేసిన హజారీష్ నేతృత్వంలోని బృందం మంగళవారం మేడ్చల్‌లో ప్రకాష్‌ను పట్టుకుని తీసుకువెళ్లింది. బెయిల్‌పై వచ్చి పరారయ్యాడు ఇతడిపై హైదరాబాద్‌లోనూ కేసులు ఉండటంతో గతేడాది అరెస్టయ్యాడు. మేము వెళ్లేలోపే బెయిల్‌పై వచ్చి పరారయ్యాడు. చోరీ చేయడానికి వెళ్లేప్పుడు తన వెంట సెల్‌ఫోన్ తీసుకెళ్లడు. కారునూ దూరంగా పార్క్ చేసి వస్తాడు. మేడ్చల్‌లో శాశ్వత షెల్టర్ ఉన్నప్పటికీ.. ప్రతి ఆరు నెలలకోసారి కొన్ని రోజులు మరోచోట తలదాచుకుంటాడు. వాహనాన్నీ మార్చేస్తూ పోలీసు నిఘా నుంచి తప్పించుకుంటాడు. ఈ కారణంగానే అతడి కోసం ఏడాది గాలించాల్సి వచి్చంది – ‘సాక్షి’తో సీసీబీ ఇన్స్పెక్టర్ హజారీష్ ఖలీందర్ -
డ్రగ్స్ కేసు.. హీరోయిన్లకు షాక్
బెంగళూరు: శాండల్‌వుడ్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న హీరోయిన్ రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు శనివారం బెయిల్ మీద బయటకు వస్తామని భావిస్తుండగా.. వారి ఆశ కాస్త నిరాశ అయ్యింది. వీరికి సంబంధించిన బెయిల్ విచారణ ఈ రోజు జరగాల్సి ఉండగా అది కాస్తా సెప్టెంబర్ 21 కి వాయిదా పడింది. సీసీబీ(సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) అధికారులు తమ దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని కనుక బెయిల్ పిటిషన్ విచారణని వాయిదా వేయాలని కోరారు. వారి అభ్యర్థన మేరకు బెంగళూరులోని ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) ప్రత్యేక కోర్టు రాగిణి, సంజనా బెయిల్ పిటిషన్ విచారణను వచ్చే సోమవారానికి(సెప్టెంబర్ 21) వాయిదా వేసింది. రాగిణి, సంజనలు ఇద్దరికి డ్రగ్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్నాయని.. వారు పార్టీలలో మాదకద్రవ్యాలు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్లకు, పెడ్లర్లకు మధ్య జరిగిన మెసేజ్‌లను కూడా రిమాండ్ కాపీలో పొందు పర్చారు అధికారులు. (చదవండి: డ్రగ్స్‌కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు?) డ్రగ్స్ రాకెట్ కేసుకు సంబంధించి సీసీబీ రాగిణి ద్వివేదిని సెప్టెంబర్ 4 న అరెస్ట్ చేయగా.. సెప్టెంబర్ 8 న సంజన గల్రానిని అరెస్టు చేసింది. ప్రస్తుతం వీరిద్దరూ పరపన అగ్రహార జైలులో ప్రత్యేక సెల్లో ఉన్నారు. శాండల్‌వుడ్ డ్రగ్ రాకెట్‌కు సంబంధించి ఇప్పటికే 10 మందికి పైగా అరెస్టయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల సెలబ్రిటీ జంట ఐంద్రితా రే, దిగంత్‌లను సీసీబీ విచారణకు పిలిచింది. ఒక రోజు ప్రశ్నించమే కాక వారి గాడ్జెట్లను స్వాధీనం చేసుకుని తరువాత పంపించింది. ఈ రోజు నటులు అకుల్ బాలాజీ, సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు యువరాజ్‌లను సీసీబీ విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. -
డ్రగ్స్‌కేసులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు?
బెంగళూరు : శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో పలువురు సినీనటులు, రాజకీయనేతల పేర్లు బయటకు వచ్చాయి. కేసు విచారణ నిమిత్తం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఆర్కె దేవరాజ్ కుమారుడు యువరాజ్ శనివారం సీసీబీ ( సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) ఎదుట హాజరయ్యారు. ప్రస్తుత కాంగ్రెస్ కార్పోరేటర్‌గా యువరాజ్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కన్నడ సినీ నటులు అకుల్ బాలాజీ, సంతోష్ కుమార్‌లకు సీసీబీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటివరకు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ, ఆర్టీఓ క్లర్క్ బి కె రవిశంకర్, రాహుల్ థోన్స్, నైజీరియా సైమన్ సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. (సంజన ఇంట్లో కీలక సాక్ష్యాలు) ఈ కేసులో ప్రధాన నిందితుడు లూమ్ పెప్పర్ సాంబాను సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కన్నడ సినిమారంగానికి చెందిన సెలబ్రిటీలకు తామే మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అంతేకాకుండా . బెంగళూరుతో పాటు చుట్టు ప్రక్కల రిసార్ట్‌లో మధ్యరాత్రి వరకు జరిగే పార్టీలకు మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఏడుగురు రాజీకయనేతలు కూడా డ్రగ్స్‌కేసులో ఉన్నట్లు సీసీబీ అధికారుల వద్దా పక్కా సమాచారం ఉంది. వీరిలో కాంగ్రెస్ మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ ఆళ్వా పుత్రుడు ఆదిత్య ఆళ్వా నివాసంపై సీసీబీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. బెంగళూరు హెబ్బాళలోని హౌస్ ఆఫ్ లైఫ్ రిసార్ట్, ఇంటిలో సోదాలు జరిపారు. డ్రగ్స్ కేసు వెలుగుచూసినప్పటి నుంచీ ఆదిత్య అదృశ్యమయ్యాడు. (డ్రగ్స్ కేసు: విస్తరిస్తున్న మత్తు ఉచ్చు) Karnataka: Yuvraj, a Congress corporator and son of senior Congress leader RV Devaraj reaches Central Crime Branch (CCB) office in Bengaluru, in connection with a drug case. pic.twitter.com/N1P7zTZiRX — ANI (@ANI) September 19, 2020 -
డ్రగ్ కేసు: స్టార్ జంటకు సమన్లు
సాక్షి, బెంగళూరు: ప్రస్తుతం డ్రగ్స్ కేసు అటూ బాలీవుడ్‌ను ఇటూ శాండల్ వుడ్‌ను కుదిపేస్తోంది. కన్నడ డ్రగ్ వ్యవహరంలో ఇప్పటికే కన్నడ హీరోయిన్లు సంజన గల్రానీ, రాగిణి ద్వివేదీలతో పాటు పలువురిని బెంగళూర్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా కన్నడ స్టార్ జంట దిగంత్ మంచలే, ఐంద్రిత రేలకు సీసీబీ పోలీసులు సమన్లు జారీ చేశారు. దర్యాప్తు నిమిత్తం రేపు ఉదయం 11 గంటలకు సీసీబీ కార్యాలయానికి హాజరు కావాలని వారిని పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: డ్రగ్స్ కేసు: మాజీ మంత్రి కుమారుడి ఇంట్లో సోదాలు) అదే విధంగా ఈ కేసులో కీలక నిందితుడైన షేక్ ఫాజిల్ శ్రీలంకలోని ఐ బార్టనే అనే క్యాసినోకు ఈ జంటను ఆహ్వానించిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో డ్రగ్స్ సప్లయర్స్‌తో వీరికి కూడా ఎమైన సంబంధం ఉందని భావించిన సీసీబీ వారికి సమన్లు జారీ చేసింది. మరోవైపు కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు ఆదిత్యపై కూడా కేసు నమోదైంది. ఆయనకు చెందిన రిసార్ట్ పై ఇవాళ(మంగళవారం) ఉదయం సీసీబీ పోలీసులు తనిఖీ చేశారు. ప్రస్తుతం ఆదిత్య పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. (చదవండి: డేటా మొత్తం డిలీట్ చేసిన సంజనా, రాగిణి) -
శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆఫ్రికన్ అరెస్టు
బెంగళూరు: కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వినియోగంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు శనివారం ఈ కేసులో ఆఫ్రికా దేశం సెనెగల్ కు చెందిన వ్యక్తిని అరెస్టు చేశారు. లౌమ్ పెప్పర్ సాంబా అనే ఇతడు సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నటి రాగిణి ద్వివేదిని సహా మొత్తం ఆరుగురు ఇప్పటికే అరెస్టయ్యారు. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కింద మొత్తం 12 మందిపై కేసులు నమోదయ్యాయి. రాగిణిని శుక్రవారం అరెస్టు చేయగా, జయనగర్ ఆర్టీవోలో క్లర్క్‌గా పనిచేస్తున్న రవిశంకర్, రియల్టర్ రాహుల్ షెట్టిలను గురువారం అరెస్టు చేశారు. ఉన్నతవర్గాల పార్టీలను నిర్వహించే వీరేన్ ఖన్నాను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ డీలర్ సాంబా... రవిశంకర్‌కు, సెలబ్రిటీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని సీసీబీ పోలీసులు తెలిపారు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఇటీవల బెంగళూరులో కొన్ని అరెస్టులు చేíసినప్పుడు... కన్నడ నటులు, సంగీతకారులతో డ్రగ్ డీలర్లకు ఉన్న సంబంధాలు వెలుగు చూశాయి. నటి రాగిణిని అరెస్టు చేయడం ప్రకంపనలు రేపింది. కొందరు బడా నేతల కుమారుల ప్రమేయం ఉండటంతో ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
డ్రగ్స్ కేసు: నటికి నోటీసులు
బెంగళూరు: కన్నడ పరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులు నటి రాగిణి ద్వివేదికి సమన్లు జారీ చేశారు. నేడు రాత్రిలోగా సీసీబీ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. కాగా ఈ కేసులో నటి స్నేహితుడు రవిని పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నటి రాగిణికి కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధాలున్నట్లుగా సంకేతాలు అందడంతో ఆమెను విచారణకు ఆదేశించారు. దీని గురించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు నేడు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు. కాగా కన్నడ చిత్రపరిశ్రమలో నటీనటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను ఆగస్టు 20న ఎన్సీబీ(నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరి డైరీని స్వాధీనం చేసుకోగా అందులో సెలబ్రిటీలు, నటులు, మోడల్స్ లిస్టు పేర్లు రాసి ఉన్నాయి. (చదవండి: సినీ సెలబ్రిటీల గుట్టు బయటపెట్టిన అనికా!) మరోవైపు ఈ వ్యవహారంలో పాలుపంచుకుంటున్న సెలబ్రిటీల పేర్లు వెల్లడించేందుకు సిద్ధమేనని దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ప్రకటించడం చర్చంనీయాంశంగా మారింది. దీంతో సీసీబీ అధికారులు ఆయనను పిలిచి స్టేట్మెంట్ తీసుకున్నారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ సందీప్ పటేల్ మాట్లాడుతూ.. లంకేశ్‌కు తాము మరోసారి అవకాశం ఇస్తామన్నారు. డ్రగ్స్ కేసులో మరిన్ని వివరాలు అందిస్తే దానికనుగుణంగా సాక్ష్యాలను సేకరిస్తామని తెలిపారు. ఇప్పటికే కొంత మంది పేర్లను కూడా ఆయన బయటపెట్టినట్లు పేర్కొన్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని మరికొద్దిమంది నటులకు కూడా నోటీసులు అందించేందుకు సీసీబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై బుధవారం సమావేశమైన కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ కేసులో దోషులుగా తేలిన నటులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. (చదవండి: తనను వ్యభిచారిగా చిత్రీకరించి..) -
సీసీబీలో సిబ్బంది కొరత
నత్తనడకన కేసుల దర్యాప్తు బెంగళూరు : అసాంఘిక శక్తుల ఆట కట్టించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్న సెంట్రల్ క్రైం బ్రాంచ్(సీసీబీ)ని సిబ్బంది కొరత వెన్నాడుతోంది. దీంతో నత్తనడకన కేసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఫలితంగా అసాంఘిక శక్తులకు శిక్ష వేయించడం తలకు మించిన భారమవుతోంది. 1994లో బెంగళూరులో అప్పటి జనాభా, క్రైం రేట్‌ను అనుసరించి సీసీబీకు ఐదుగురు ఏసీపీలతో సహా 125 పోస్టులను కేటాయించారు. ఈ పాతికేళ్లలో నగర జనాభాతో పాటు క్రైం రేటు ఎన్నో రెట్లు పెరిగింది. అయినా సీసీబీలో పనిచేస్తున్న వారి సంఖ్య మాత్రం పెరగలేదు. ఇందులోనూ ప్రస్తుతం 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 85 పోస్టుల్లో డ్రైవర్లు, అటెండర్లు తదితర కిందిస్థాయి ఉద్యోగులు 25 మంది వరకు ఉన్నారు. ఈ లెక్కన సీసీబీలో 60 మంది మాత్రమే కేసుల దర్యాప్తులో పాల్గొంటున్నట్లు స్పష్టమవుతోంది. సిబ్బంది కొరత వల్ల ఐఎస్ఐఎస్ మద్దతుదారు మెహ్దీ, చర్చ్‌స్ట్రీట్ బాంబ్‌బ్లాస్ట్ వంటి దాదాపు 125 కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోందని హోంశాఖ అధికారులే పేర్కొంటున్నారు. సైకిల్ దొంగలను పట్టుకోవడం కోసం... 1970లో బెంగళూరులో సైకిల్ దొంగతనాలు ఎక్కువగా జరుగుతుండేవి. దీంతో సైకిల్ దొంగలను పట్టుకోవడం కోసం 16.7.1971నుంచి అధికారికంగా సీసీబీను ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో ప్రస్తుతం మహిళల రవాణా, మాదకద్రవ్యాల మారక నిరోధక దళం, ఆర్గనైజ్డ్ క్రైమ్ వింగ్‌తో సహా ఐదు విభాగాలు సీసీబీలో ఏర్పాటయ్యాయి. ప్రతి విభాగానికి అదనపు కమిషనర్ స్థాయి అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. కాగా, ప్రస్తుతం మూడు అదనపు కమిషనర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో మిగిలిన ఇద్దరు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తూ సీసీబీను నడిపిస్తున్నారు.