సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అయిదుగురు అనుమానిత టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం వీరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిని జునైద్, సోహైల్, ముదాసిర్, ఉమర్, జాహిద్‌గా గుర్తించారు.
వీరి నుంచి సెల్ ఫోన్లతోపాటు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు ఇతర వస్తులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై తదుపరి విచారణ జరుగుతోందని సీసీబీ పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో మరో అయిదుగురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం జల్లెడపడుతున్నారు.
కాగా అరెస్ట్ అయిన నిందితులు 2017లో జరిగిన ఓ హత్య కేసుతో సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. కొంతకాలం బెంగుళూరు సెంట్రల్ జైలులో శిక్షననుభవించారని చెప్పారు. ఆ సమయంలో కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడి పేలుడు పదార్థాలను నిర్వహించడంలో శిక్షణ పొందినట్లు వెల్లడించారు.
చదవండి: ఐఏఎస్ ఆకాశ్‌పై భార్య వందన ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment