బెంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో 6వ నిందితుడైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య అల్వాను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్య నాలుగు నెలలుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆదిత్య కోసం గాలిస్తున్న సీసీబీ అతడిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ మీడియాతో మాట్లాడుతూ.. శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య అల్వా నాలుగు నెలలుగా పరారీ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడిని సోమవారం రాత్రి చెన్నైలో అరెస్టు చేశాం. అతడు చెన్నైలోని ఓ రిసార్టులో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో మా బృందం అతడు ఉంటున్న రిసార్టుపై దాడి చేసి అరెస్టు చేసింది’ అని ఆయన పేర్కొన్నారు. ఆదిత్య మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు, బాలీవుడ్ నటుడు వివేక్ బెరాయ్ భార్య ప్రియాంక అల్వా సోదరుడు. కాగా ఆదిత్య పరారీలో ఉండటంతో అతడి బావ అయిన వివేక్ ఒబెరాయ్ ఇంటిలో సీసీబీ సెప్టెంబర్‌లో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. (చదవండి: వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు)
కాగా ప్రస్తుతం పోలీసులు ఆదిత్యను బెంగళూరులోని చమరాజ్‌పేటలోని సీసీబీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఎన్‌డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కేసుల్లో అతన్ని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. క్‌డౌన్ సమయంలో ఆదిత్య బెంగళూరు హెబ్బాల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన పార్టీల్లో డ్రగ్స్ సరఫరా చేయడమే కాక అతడు డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పార్టీలో డ్రగ్స్ సేకరించి, సరఫరా చేయడంలో ఆదిత్య ప్రధాన పాత్ర పోషించాడని ఇప్పటికే ఎన్‌సీబీ విచారిస్తున్న నిందితుడు రవిశంకర్ అంగీకరించాడు. ఆదిత్య అల్వా పేరు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్ 4 నుంచి పరారీలోకి వెళ్లిపోయాడు. అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంతవరకు ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేదు. క్రైమ్ బ్రాంచ్ అతనికి లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. ఆదిత్యను అరెస్టు చేయడానికి సిద్ధమంది. కాగా ఈ కేసులో శాండల్‌వుడ్‌కు సంబంధించిన ప్రముఖులు ఇప్పటికే అరెస్టైయిన విషయం తెలిసిందే. (చదవండి: మాజీ మంత్రి తనయుడి ఇంట్లో డ్రగ్స్)
Comments
Please login to add a commentAdd a comment