vivek oberai
-
అమ్మాయిలు మిమ్మల్ని బకరాలను చేసి వాడుకుంటారు!: నటుడు
బ్రేకప్ బాధ నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదంటున్నాడు ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi). అయితే మనసు ముక్కలైనప్పుడే స్థిరంగా ఉండాలని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. బ్రేకప్ అవగానే అబ్బాయిలు మోసపోయామని బాధపడుతుంటారు. ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగుతారు. మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను నోటికొచ్చినట్లు తిడుతుంటారు. దీనివల్ల వారి మనసు కాస్త కుదుటపడుతుందని భావిస్తారు. ఈ మూడూ తప్పే!మరికొందరేమో ఇక జీవితంలో ఎవర్నీ నమ్మకూడదనుకుంటారు. ఎప్పటికీ సింగిల్‌గానే ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇంకొందరు విచిత్రంగా ఉంటారు. కనిపించిన ప్రతి అమ్మాయితో డేటింగ్ చేస్తారు, వదిలేస్తారు తప్ప ఎవ్వరితోనూ ఎక్కువ కనెక్షన్ పెట్టుకోరు. నా దృష్టిలో ఈ మూడూ తప్పే! ఒకమ్మాయి నిన్ను కాదనుకున్నంత మాత్రాన నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటావ్? నీపై నువ్వు ఫోకస్ చేయ్.. నీవైపు ఏమైనా పొరపాట్లు జరిగాయా? అన్నది పరిశీలించు.ఆ అమ్మాయి నిన్ను బకరా చేసి..నీ తప్పు లేదంటే మాత్రం ఆ అమ్మాయి నిన్ను అమాయకుడిని చేసి వాడుకుందనో, వేధించిందనో అర్థం. కాబట్టి ముందు నీకోసం నువ్వు ఆలోచించు. అవతలి వ్యక్తికి మరీ ఎక్కువ దాసోహమైపోకు. బ్రేకప్ అవగానే దాన్నుంచి ఎలా బయటపడాలన్నదానికి బదులుగా దాన్నే తల్చుకుని కుమిలిపోతుంటాం. ఇది అందరూ చేసే తప్పు. గతంలో నాకు బ్రేకప్ జరిగినప్పుడు కూడా 4-5 ఏళ్లపాటు మానసికంగా కుంగిపోయాను. అన్నీ నెగెటివ్‌గా ఆలోచించేవాడిని. భార్య ప్రియాంకతో వివేక్ ఒబెరాయ్ఒంటరిగానే ఉండిపోవాలనుకున్నా..జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాలనుకున్నాను. నన్ను నేనే మర్చిపోయాను. కానీ ఎప్పుడైతే ప్రియాంకను కలిశానో అప్పటి నుంచి నాలో నెమ్మదిగా మార్పు మొదలైంది. నన్ను నేను మార్చుకునేందుకు ప్రయత్నించాను అని చెప్పుకొచ్చాడు. కాగా వివేక్- ప్రియాంక 2010లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో వీరు దుబాయ్‌లోనే ఎక్కువగా నివసిస్తున్నారు. ఇకపోతే వివేక్.. లూసిఫర్, షూటౌట్ ఎట్ లోఖండ్వాలా, కంపెనీ, ఓంకార, క్రిష్ 3, సాతియా, యువ, పీఎమ్ నరేంద్రమోదీ, వివేగం(తమిళం), వినయ విధేయ రామ(తెలుగు) వంటి చిత్రాలతో అలరించాడు.చదవండి: కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు, ఎందుకో ఇప్పటికీ అర్థం కావట్లేదు: సింగర్ -
డ్రగ్ కేసు: వివేక్ ఒబెరాయ్ బావమరిది అరెస్టు
బెంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో 6వ నిందితుడైన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ బావమరిది ఆదిత్య అల్వాను సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్య నాలుగు నెలలుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆదిత్య కోసం గాలిస్తున్న సీసీబీ అతడిని సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా బెంగళూరు జాయింట్ పోలీస్ కమిషనర్ సందీప్ మీడియాతో మాట్లాడుతూ.. శాండల్‌వుడ్ డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆదిత్య అల్వా నాలుగు నెలలుగా పరారీ ఉన్నాడు. ఈ నేపథ్యంలో అతడిని సోమవారం రాత్రి చెన్నైలో అరెస్టు చేశాం. అతడు చెన్నైలోని ఓ రిసార్టులో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో మా బృందం అతడు ఉంటున్న రిసార్టుపై దాడి చేసి అరెస్టు చేసింది’ అని ఆయన పేర్కొన్నారు. ఆదిత్య మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు, బాలీవుడ్ నటుడు వివేక్ బెరాయ్ భార్య ప్రియాంక అల్వా సోదరుడు. కాగా ఆదిత్య పరారీలో ఉండటంతో అతడి బావ అయిన వివేక్ ఒబెరాయ్ ఇంటిలో సీసీబీ సెప్టెంబర్‌లో దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. (చదవండి: వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు) కాగా ప్రస్తుతం పోలీసులు ఆదిత్యను బెంగళూరులోని చమరాజ్పేటలోని సీసీబీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఎన్డీపీఎస్ (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్) కేసుల్లో అతన్ని ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుస్తామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. క్‌డౌన్ సమయంలో ఆదిత్య బెంగళూరు హెబ్బాల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన పార్టీల్లో డ్రగ్స్ సరఫరా చేయడమే కాక అతడు డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. పార్టీలో డ్రగ్స్ సేకరించి, సరఫరా చేయడంలో ఆదిత్య ప్రధాన పాత్ర పోషించాడని ఇప్పటికే ఎన్సీబీ విచారిస్తున్న నిందితుడు రవిశంకర్ అంగీకరించాడు. ఆదిత్య అల్వా పేరు వెలుగులోకి రావడంతో సెప్టెంబర్ 4 నుంచి పరారీలోకి వెళ్లిపోయాడు. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు అవడంపై ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంతవరకు ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేదు. క్రైమ్ బ్రాంచ్ అతనికి లుక్అవుట్ నోటీసు జారీ చేసింది. ఆదిత్యను అరెస్టు చేయడానికి సిద్ధమంది. కాగా ఈ కేసులో శాండల్‌వుడ్‌కు సంబంధించిన ప్రముఖులు ఇప్పటికే అరెస్టైయిన విషయం తెలిసిందే. (చదవండి: మాజీ మంత్రి తనయుడి ఇంట్లో డ్రగ్స్) -
సుశాంత్ చితికి నిప్పు పెడుతుంటే చూడలేకపోయా
ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలు సోమవారం ముంబైలో పూర్తయ్యాయి. నటుడు వివేక్ ఒబెరాయ్‌తో పాటు కృతి సనన్, ముఖేశ్ చబ్రా సహా పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వివేక్ ఒబెరాయ్ సోషల్ మీడియాలో తన మనసులోని భావాలను వెల్లడిస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "సుశాంత్ అంత్యక్రియల్లో పాల్గొనడం ఎంతో బాధాకరం. అతని బాధలను నేను పంచుకుంటే బాగుండేది అనిపిస్తోంది. కానీ కష్టాలకు చావే పరిష్కారం కాదు. ఆత్మహత్య సమస్యలను నయం చేయలేదు. అతడు తన కుటుంబం, స్నేహితులు, లక్షలాది అభిమానుల గురించి ఒక్కసారి ఆలోచించినా ఇలా జరిగేది కాదు. సుశాంత్ చితికి అతడి తండ్రి నిప్పు పెడుతుంటే ఆయన కళ్లలో బాధ చూడలేకపోయాను. (సుశాంత్‌సింగ్ ఆత్మహత్య) సుశాంత్ సోదరి అతడిని తిరిగి వచ్చేయమంటూ గుండెలు పగిలేలా రోదించింది. ఈ బాధను మాటల్లో వర్ణించలేను. ఇండస్ట్రీని పేరుకు మాత్రమే ఫ్యామిలీ అని పిలుస్తుంటారు. కానీ ఎక్కడైతే ప్రతిభను అణిచివేయరో, ఎక్కడైతే నటుడికి గుర్తింపు ఉంటుందో అలాంటి కుటుంబంగా ఇండస్ట్రీ పరివర్తనం చెందాలి. ప్రస్తుత పరిస్థితిలో మార్పు రావాలి. అహంకారాలు పక్కన పెట్టి ప్రతిభ ఉన్నవారికి ప్రోత్సాహం అందించాలి. ఇది అందరికీ మేల్కొలుపు కావాలి. నవ్వులు చిందించే సుశాంత్‌ను నేను ఎప్పటికీ మిస్సవుతాను. ఆ దేవుడు నీ కుటుంబానికి శక్తినివ్వాలని కోరుకుంటున్నాను" అని లేఖలో తెలిపారు. (‘సుశాంత్ మరణం నాకు పెద్ద మేల్కొలుపు’) -
మోదీ బయోపిక్‌పై సల్మాన్ తీవ్ర అసంతృప్తి
ముంబై : ఇటీవలి కాలంలో ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌లో వివేక్ ఒబేరాయ్ లీడ్ రోల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు విమర్శలను ఎదుర్కొంది. చిత్రం విడుదల కూడా వాయిదా పడి.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ సినిమాలో పాటలు రాసినట్టు ప్రముఖ పాటల రచయితలు జావేద్ అక్తర్ , సమీర్ల పేర్లను టైటిల్స్‌లో వేసి క్రెడిట్స్ ఇచ్చారు. తమకు తెలియకుండా ఇలా చేయడంపై వారు ఒకింత షాక్ గురయ్యారు. ‘ఈశ్వర్ అల్లాహ్’ పాటను ‘1947: ఎర్త్’ చిత్రం నుంచి.. ‘సునో గౌర్ సే దునియా వాలో’ పాటను ‘దస్’ మూవీ నుంచి తీసుకున్నట్లు ఈ చిత్ర నిర్మాత సందీప్ సింగ్ వెల్లడించారు. ‘సునో గౌర్ సే దునియా వలో’ పాటను నరేంద్రమోదీ బయోపిక్‌లో చేర్చడం పట్ల సల్మాన్ ఖాన్ తీవ్రంగా స్పందిచారు. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రవీనా టండన్, శిల్పాశెట్టీలు కలిసి నటించిన ‘దస్’ సినిమాలో ఆ పాట ఉంది. అయితే, ఈ చిత్ర దర్శకుడు ముకుల్ ఆనంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ‘దస్’ మువీ నిర్మాణం అసంపూర్తిగా జరిగి విడుదలకు నోచుకోలేదు. ఈ క్రమంలో సల్మాన్ తీవ్రంగా స్పందించారు. నిజానికి సల్మాన్‌కు, వివేక్ ఒబేరాయ్‌కి మధ్య చాలాకాలంగా సఖ్యత లేదు. అప్పట్లో ఐశ్వర్యా రాయ్‌తో తాను సన్నిహితంగా వ్యవహరిస్తుండటంతో తనను చంపేస్తానని సల్మాన్ తాగి బెదిరించాడని వివేక్ మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించాడు. దీంతో 15 ఏళ్లుగా వీరి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వివేక్ నటించిన సినిమాలో తన సినిమా పాటను వాడుకోవడంపై సల్మాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు భావిస్తున్నారు. -
సోషల్ మీడియా
ఆందోళనకరం ‘‘గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో చదువుతున్న 17 ఏళ్ల కశ్మీరీ యువకుడు బిలాల్ సూఫీ ఉగ్రవాద సంస్థలో చేరడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. కొన్నిసార్లు చిన్నచిన్న చర్యలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. భారత్, అఫ్గాన్ విద్యార్థుల మధ్య ఘర్షణ అనంతరం సూఫీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం విషాదకరం. మరో జీవితం ప్రమాదంలో పడుతుంది, మరో కుటుంబం సంక్షోభానికి లోనవుతుంది’’ – ఒమర్ అబ్దుల్లా, కశ్మీర్ మాజీ సీఎం చేయందిస్తాం ‘‘విద్యార్థుల భవి ష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులను చితక బాదారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు. 68,500 అసిస్టెంట్ టీచర్ల పోస్టుల భర్తీ కోరితే యోగి ప్రభుత్వం ఎలా స్పందించిందో చూశారుగా. రాష్ట్రంలోని అసిస్టెంట్ టీచర్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధినేత మాటకే సై ‘‘మహాత్మా గాంధీ ఆత్మకథా రచయితగా నేను మాటలతోనే తలపడతాను. ఆయుధాలతో కాదు. నేను ఎవరితోనైనా మాట్లాడటానికీ, చర్చించడానికి సిద్ధం. ఎవరికీ భయపడను. దీన్ని ఆచరణ సాధ్యం చేయాల్సినది అహ్మదాబాద్ యూనివర్సిటీ బోర్డులోని వారే’’ – రామచంద్ర గుహ, చరిత్రకారుడు మరో సంస్థ నాశనం ‘‘నెహ్రూ స్వభావాలైన ఉదారవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, కలుపుకుపోయే తత్వంకు అర్నాబ్ గోస్వామి వ్యతిరేకి. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీలో అతడిని సభ్యుడిగా నియమించడంతో ఆ సంస్థ నాశనం కాకతప్పదు. అతడు నిర్వహించే టీవీ చానల్ అన్నా నాకు ఇష్టం ఉండదు’’ – సంజయ్ ఝా, కాంగ్రెస్ ప్రతినిధి తండ్రి పోలిక ‘‘కెమెరా ముందు శత్రువులం, కెమెరా వెనుక అన్నదమ్ములం. సినిమా చివరి రోజు షూటింగ్లో పాల్గొనడం మంచి అనుభవం. ప్రతి క్షణం ఆనందించా. తమ్ముడు రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయడం బావుంది. అతడు చూపిన ప్రేమ, గౌరవం, ఆతిథ్యానికి కృతజ్ఞతలు. తండ్రికి వున్న గొప్ప లక్షణాలన్నీ అతడికి ఉన్నాయి’’ – వివేక్ ఆనంద్ ఒబెరాయ్, బాలీవుడ్ నటుడు -
చెర్రీ అఫీషియల్ అనౌన్స్మెంట్
టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బోయపాటి శీను డైరెక్షన్లో ఓ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. చెర్రీ కెరీర్లో ఇది 12వ చిత్రం కాగా.. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి మేజర్ అనౌన్స్మెంట్ చేసేశారు. 2019 సంక్రాంతి పండగకి ఈ చిత్రం విడుదల కాబోతుందని ప్రకటించారు. కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో వివేక ఒబేరాయ్ విలన్ రోల్లో నటిస్తుండగా, తమిళ నటుడు ప్రశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ దాకా చిత్రం షూటింగ్ కొనసాగనుంది. తొలుత ఈ చిత్రం దసరాకే రిలీజ్ అవుతుందని అంతా భావించారు. కానీ, ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది. బాలకృష్ణ లీడ్ రోల్లో నటిస్తున్న ఎన్టీఆర్ చిత్రం కూడా సంక్రాంతి సమయంలోనే విడుదల కానుంది. దీంతో చెర్రీ-బాలయ్య చిత్రాలతో ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా మారనుంది. We are delighted to announce that our upcoming film with Mega Powerstar Ram Charan & Boyapati Srinu's #RC12 will hit cinemas for Sankranthi 2019. #RC12ForSankranthi2019 pic.twitter.com/HKU0KaxoY0 — DVV Entertainment (@DVVEnts) 16 June 2018 -
'ముత్తప్ప ముందు దావూద్ ఎంత!'
'గాడ్ ఫాదర్ ఆఫ్ బెంగళూరు' గా పేరుపొందిన ముత్తప్ప రాయ్ నేరజీవితంలోని నాటకీయతతో పోల్చుకుంటే ప్రపంచ ప్రఖ్యాత డాన్లు పాబ్లో ఎస్కోబర్, దావూద్ ఇబ్రహీమ్, అత్ కపొనే లాంటి వాళ్ల జీవితాల్లోని నాటకీయత ఎందుకూ పనికిరానిది' అంటూ తన తాజా చిత్రం 'రాయ్' ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. బెంగళూరు కేంద్రంగా కర్ణాటకలోనే కాక దుబాయ్ కేంద్రంగా పలు దేశాల్లో దందాలు చేసి, క్రైమ్ హిస్టరీలో తనకంటూ కొన్ని పేజీలు సృష్టించుకున్న ముత్తప్పరాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ్, హిందీల్లో రూపొందించనున్నట్లు వర్మ తెలిపారు. ముత్తప్ప రాయ్ పుట్టిన రోజు సందర్భంగా మే 1న 'రాయ్' ఫస్ట్ లుక్ విడుదల చేస్తామని, స్వయంగా ముత్తప్పరాయే దాన్ని విడుదల చేస్తారని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు. మొదట 'అప్ప'గా అనుకున్న ఈ సినిమాలో ప్రధాన పాత్రకు సుదీప్ ను ఎంపికచేశారు. అయితే అనివార్యకారణాలవల్ల సుదీప్ స్థానంలో వివేక్ ఒబెరాయ్ ని రాయ్ పాత్రకోసం ఫైనలైజ్ చేశామని, బెంగళూరు, మంగళూరు, ముంబై, దుబాయ్, లండన్ తదితర దేశాల్లో షూటింగ్ చేస్తామని వర్మ తెలిపారు. సీఆర్ మనోహర్ ఈ సినిమాకు నిర్మాత. బెంగళూరుకు చెందిన ముత్తప్ప రాయ్ యువకుడిగా ఉన్నప్పుడు నేర సామ్రాజ్యంలోకి ప్రవేశించి, డాన్ గా ఎదిగాడు. తనపై హత్యాయత్నం జరగటంతో దుబాయ్ పారిపోయిన రాయ్.. అక్కడ దావూద్ తో కలిసి నేరాలు కొనసాగించారు. 2002లో అనూహ్యంగా ఇండియాకు వచ్చి పోలీసులకు లొంగిపోయిన ముత్తప్ప 2008లో జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రజాసేవకు అంకితమయ్యాడు! 'జయ కర్ణాటక' ఫౌండేషన్ ద్వారా సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. అటు హోటల్ వ్యాపారాల్లోనూ రాణిస్తూ ఉత్తమ వ్యాపారవేత్తగా పేరుతెచ్చుకున్నాడు. ఆయన జీవితం ఆధారంగా రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్ చిత్రమే 'రాయ్'.