
ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలు సోమవారం ముంబైలో పూర్తయ్యాయి. నటుడు వివేక్ ఒబెరాయ్‌తో పాటు కృతి సనన్, ముఖేశ్ చబ్రా సహా పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వివేక్ ఒబెరాయ్ సోషల్ మీడియాలో తన మనసులోని భావాలను వెల్లడిస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "సుశాంత్ అంత్యక్రియల్లో పాల్గొనడం ఎంతో బాధాకరం. అతని బాధలను నేను పంచుకుంటే బాగుండేది అనిపిస్తోంది. కానీ కష్టాలకు చావే పరిష్కారం కాదు. ఆత్మహత్య సమస్యలను నయం చేయలేదు. అతడు తన కుటుంబం, స్నేహితులు, లక్షలాది అభిమానుల గురించి ఒక్కసారి ఆలోచించినా ఇలా జరిగేది కాదు. సుశాంత్ చితికి అతడి తండ్రి నిప్పు పెడుతుంటే ఆయన కళ్లలో బాధ చూడలేకపోయాను. (సుశాంత్‌సింగ్ ఆత్మహత్య)
సుశాంత్ సోదరి అతడిని తిరిగి వచ్చేయమంటూ గుండెలు పగిలేలా రోదించింది. ఈ బాధను మాటల్లో వర్ణించలేను. ఇండస్ట్రీని పేరుకు మాత్రమే ఫ్యామిలీ అని పిలుస్తుంటారు. కానీ ఎక్కడైతే ప్రతిభను అణిచివేయరో, ఎక్కడైతే నటుడికి గుర్తింపు ఉంటుందో అలాంటి కుటుంబంగా ఇండస్ట్రీ పరివర్తనం చెందాలి. ప్రస్తుత పరిస్థితిలో మార్పు రావాలి. అహంకారాలు పక్కన పెట్టి ప్రతిభ ఉన్నవారికి ప్రోత్సాహం అందించాలి. ఇది అందరికీ మేల్కొలుపు కావాలి. నవ్వులు చిందించే సుశాంత్‌ను నేను ఎప్పటికీ మిస్సవుతాను. ఆ దేవుడు నీ కుటుంబానికి శక్తినివ్వాలని కోరుకుంటున్నాను" అని లేఖలో తెలిపారు. (‘సుశాంత్ మరణం నాకు పెద్ద మేల్కొలుపు’)
Comments
Please login to add a commentAdd a comment