
హ్యాపీ బర్త్‌డే సుశాంత్, ఇతరులను నవ్వించడమంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. పై నుంచి మమ్మల్ని చూస్తున్న నీ ముఖంలో మేమంతా కలిసి చిరునవ్వు తెప్పించామని భావిస్తున్నాం.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని విడిచి మూడేళ్లపైనే అవుతున్నా అభిమానుల గుండెల్లో మాత్రం సజీవంగానే ఉన్నాడు. సోషల్ మీడియాలో తరచూ అతడి పేరు వినిపిస్తూనే ఉంది. శనివారం (జనవరి 21న) ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని హీరోయిన్ సారా అలీ ఖాన్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసింది. ఎన్జీవోలోని చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసిన సారా పిల్లలతో కలిసి చప్పట్లు కొట్టింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్‌డే సుశాంత్, ఇతరులను నవ్వించడమంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. పై నుంచి మమ్మల్ని చూస్తున్న నీ ముఖంలో మేమంతా కలిసి చిరునవ్వు తెప్పించామని భావిస్తున్నాం. ఈ రోజును ఇంత స్పెషల్‌గా మార్చినందుకు సునీల్ అరోరాకు ప్రత్యేక ధన్యవాదాలు. మీలాంటివాళ్లు ఈ ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా, సురక్షితంగా, సంతోషకరంగా మార్చుతారు. మీరు కూడా ఇతరులకు సంతోషాన్ని పంచండి' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా సారా చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్లు. అదే సమయంలో కొందరు మాత్రం ఇదంతా వట్టి డ్రామా అని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా సుశాంత్, సారా.. కేదార్‌నాథ్ (2018) సినిమాలో కలిసి పని చేశారు. ఈ చిత్రంతోనే సారా ఇండస్ట్రీకి పరిచయమైంది.
చదవండి: ఈ ఏడాది ఏ హీరోయిన్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా?