
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు బాలీవుడ్‌లో తెలియనివారు ఉండరు. ఎంఎస్ ధోని చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఊహించని విధంగా 2020లో ముంబయిలోని తన నివాసంతో సూసైడ్ చేసుకున్నారు. ఇవాళ అతని నాలుగో వర్ధంతి సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్‌కు నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
సుశాంత్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి సుశాంత్ సన్నిహితురాలు, సహనటి క్రిస్సన్ బారెట్టో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుశాంత్‌ను తలుచుకుని బోరున విలపించారు. అతనికి ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ వెక్కివెక్కి ఏడ్చారు. సుశాంత్ తనతో ప్రతి చిన్న విషయంలోనూ ఎప్పుడు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉండేవాడని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సుశాంత్.. ఎంఎస్ ధోని మూవీతో పాటు డ్రైవ్, చిచోరే, కేదార్‌నాథ్, దిల్ బేచారా లాంటి సినిమాల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment