బ్రేకప్ బాధ నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదంటున్నాడు ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi). అయితే మనసు ముక్కలైనప్పుడే స్థిరంగా ఉండాలని చెప్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఒబెరాయ్ మాట్లాడుతూ.. బ్రేకప్ అవగానే అబ్బాయిలు మోసపోయామని బాధపడుతుంటారు. ఫ్రెండ్స్‌తో కలిసి మందు తాగుతారు. మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను నోటికొచ్చినట్లు తిడుతుంటారు. దీనివల్ల వారి మనసు కాస్త కుదుటపడుతుందని భావిస్తారు.
ఈ మూడూ తప్పే!
మరికొందరేమో ఇక జీవితంలో ఎవర్నీ నమ్మకూడదనుకుంటారు. ఎప్పటికీ సింగిల్‌గానే ఉండిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇంకొందరు విచిత్రంగా ఉంటారు. కనిపించిన ప్రతి అమ్మాయితో డేటింగ్ చేస్తారు, వదిలేస్తారు తప్ప ఎవ్వరితోనూ ఎక్కువ కనెక్షన్ పెట్టుకోరు. నా దృష్టిలో ఈ మూడూ తప్పే! ఒకమ్మాయి నిన్ను కాదనుకున్నంత మాత్రాన నిన్ను నువ్వు ఎందుకు తక్కువ చేసుకుంటావ్? నీపై నువ్వు ఫోకస్ చేయ్.. నీవైపు ఏమైనా పొరపాట్లు జరిగాయా? అన్నది పరిశీలించు.
ఆ అమ్మాయి నిన్ను బకరా చేసి..
నీ తప్పు లేదంటే మాత్రం ఆ అమ్మాయి నిన్ను అమాయకుడిని చేసి వాడుకుందనో, వేధించిందనో అర్థం. కాబట్టి ముందు నీకోసం నువ్వు ఆలోచించు. అవతలి వ్యక్తికి మరీ ఎక్కువ దాసోహమైపోకు. బ్రేకప్ అవగానే దాన్నుంచి ఎలా బయటపడాలన్నదానికి బదులుగా దాన్నే తల్చుకుని కుమిలిపోతుంటాం. ఇది అందరూ చేసే తప్పు. గతంలో నాకు బ్రేకప్ జరిగినప్పుడు కూడా 4-5 ఏళ్లపాటు మానసికంగా కుంగిపోయాను. అన్నీ నెగెటివ్‌గా ఆలోచించేవాడిని.
భార్య ప్రియాంకతో వివేక్ ఒబెరాయ్
ఒంటరిగానే ఉండిపోవాలనుకున్నా..
జీవితాంతం ఒంటరిగానే ఉండిపోవాలనుకున్నాను. నన్ను నేనే మర్చిపోయాను. కానీ ఎప్పుడైతే ప్రియాంకను కలిశానో అప్పటి నుంచి నాలో నెమ్మదిగా మార్పు మొదలైంది. నన్ను నేను మార్చుకునేందుకు ప్రయత్నించాను అని చెప్పుకొచ్చాడు. కాగా వివేక్- ప్రియాంక 2010లో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలతో వీరు దుబాయ్‌లోనే ఎక్కువగా నివసిస్తున్నారు. ఇకపోతే వివేక్.. లూసిఫర్, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా, కంపెనీ, ఓంకార, క్రిష్ 3, సాతియా, యువ, పీఎమ్ నరేంద్రమోదీ, వివేగం(తమిళం), వినయ విధేయ రామ(తెలుగు) వంటి చిత్రాలతో అలరించాడు.
చదవండి: కోహ్లి నన్ను బ్లాక్ చేశాడు, ఎందుకో ఇప్పటికీ అర్థం కావట్లేదు: సింగర్
Comments
Please login to add a commentAdd a comment