ఆందోళనకరం
‘‘గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో చదువుతున్న 17 ఏళ్ల కశ్మీరీ యువకుడు బిలాల్ సూఫీ ఉగ్రవాద సంస్థలో చేరడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. కొన్నిసార్లు చిన్నచిన్న చర్యలకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. భారత్, అఫ్గాన్ విద్యార్థుల మధ్య ఘర్షణ అనంతరం సూఫీ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం విషాదకరం. మరో జీవితం ప్రమాదంలో పడుతుంది, మరో కుటుంబం సంక్షోభానికి లోనవుతుంది’’
– ఒమర్ అబ్దుల్లా, కశ్మీర్ మాజీ సీఎం
చేయందిస్తాం
‘‘విద్యార్థుల భవి ష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులను చితక బాదారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్నారు. 68,500 అసిస్టెంట్ టీచర్ల పోస్టుల భర్తీ కోరితే యోగి ప్రభుత్వం ఎలా స్పందించిందో చూశారుగా. రాష్ట్రంలోని అసిస్టెంట్ టీచర్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది’’ – రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధినేత
మాటకే సై
‘‘మహాత్మా గాంధీ ఆత్మకథా రచయితగా నేను మాటలతోనే తలపడతాను. ఆయుధాలతో కాదు. నేను ఎవరితోనైనా మాట్లాడటానికీ, చర్చించడానికి సిద్ధం. ఎవరికీ భయపడను. దీన్ని ఆచరణ సాధ్యం చేయాల్సినది అహ్మదాబాద్ యూనివర్సిటీ బోర్డులోని వారే’’
– రామచంద్ర గుహ, చరిత్రకారుడు
మరో సంస్థ నాశనం
‘‘నెహ్రూ స్వభావాలైన ఉదారవాదం, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, కలుపుకుపోయే తత్వంకు అర్నాబ్ గోస్వామి వ్యతిరేకి. నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ సొసైటీలో అతడిని సభ్యుడిగా నియమించడంతో ఆ సంస్థ నాశనం కాకతప్పదు. అతడు నిర్వహించే టీవీ చానల్ అన్నా నాకు ఇష్టం ఉండదు’’ – సంజయ్ ఝా, కాంగ్రెస్ ప్రతినిధి
తండ్రి పోలిక
‘‘కెమెరా ముందు శత్రువులం, కెమెరా వెనుక అన్నదమ్ములం. సినిమా చివరి రోజు షూటింగ్‌లో పాల్గొనడం మంచి అనుభవం. ప్రతి క్షణం ఆనందించా. తమ్ముడు రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయడం బావుంది. అతడు చూపిన ప్రేమ, గౌరవం, ఆతిథ్యానికి కృతజ్ఞతలు. తండ్రికి వున్న గొప్ప లక్షణాలన్నీ అతడికి ఉన్నాయి’’ – వివేక్ ఆనంద్ ఒబెరాయ్, బాలీవుడ్ నటుడు
Comments
Please login to add a commentAdd a comment