తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం కూడా కొనసాగుతుంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో 27 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సర్వదర్శనానికి 10 గంటలు, నడక దారిన వచ్చిన భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది.