సాధారణంగా కష్టాలు తొలగించి మంచి జీవితాన్ని అందించమని దేవుడిని ప్రార్థిస్తుంటారు. దైవానుగ్రహం కోసం తరచుగా పుణ్యక్షేత్రాలను సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. దేవుడిని స్మరిస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే భగవంతుడి ఆశీస్సులు ఉండాలని గుడికి వెళ్లిన ఓ వ్యక్తికి దేవాలయంలోనే ఓ వింత కష్టం ఎదురైంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
ఆలయంలో ఓ ఏనుగు విగ్రహం ఉండగా.. ఆచారంలో భాగంగాఆ విగ్రహం కింద నుంచి పడుకొని బయటకు వస్తే మంచి జరుగుతుందని అక్కడి భక్తులు నమ్ముతుంటారు. ఆ వ్యక్తి కూడా అలాగే నమ్మి ఏనుగు విగ్రహం కిందకు వెళ్లాడు. కానీ ముందుకు వెనక్కి రాలేక విగ్రహం మధ్యలో చిక్కుకుపోయాడు. కొంత సేపటి వరకు అలాగే ఇరుక్కుపోయి నానా అవస్థలు పడ్డాడు. శరీరాన్ని ఇటు ఇటు తిప్పుతూ ఉక్కిరిబిక్కిరైపోయాడు. బయటకు రావడానికి చాలా ప్రయత్నించినా వీలు పడలేదు. అతని బాధలు చూసిన తోటి భక్తులు, పూజారి సలహాలు సూచనలు కూడా చేశారు. కానీ ప్రయోజనం లేదు.
Any kind of excessive bhakti is injurious to health 😮 pic.twitter.com/mqQ7IQwcij
— ηᎥ†Ꭵղ (@nkk_123) December 4, 2022
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో సదరు వ్యక్తి విగ్రహం నుంచి బయట పడేందుకు పడుతున్న కష్టం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చివరికి ఆ వ్యక్తి మరి విగ్రహం నుంచి బయటకు వచ్చాడా అనేది తెలియరాలేదు. వీడియో అక్కడికే ముగియడంతో సస్పెన్స్‌గా మిగిలిపోయింది. కాగా 2019లో అదే విగ్రహం కింద ఓ మహిళ ఇరుక్కుపోయింది. విగ్రహం నుంచి బయటకు వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరికి పలువురు ఆమెకు సాయం చేయడం ద్వారా సురక్షితంగా బయటపడింది. ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయ్యింది.
చదవండి: ఒకే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడిన కవలలు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్
Comments
Please login to add a commentAdd a comment