పాదయాత్ర చేస్తూ గట్టుకు చేరుకున్న బోరమ్మ
సాక్షి (గద్వాల)మహబూబ్‌నగర్: పర్వత మల్లన్న దంపతుల దర్శనం కోసం వయస్సును సైతం లెక్క చేయక పాదయాత్ర చేస్తోంది కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీశైల మల్లన్న భక్తురాలు బోరమ్మ. పాదయాత్రలో భాగంగా గురువారం మండల కేంద్రానికి చేరుకుంది. 44 ఏళ్లుగా పాదయాత్రగా వెళ్తున్నట్లు వృద్ధురాలు తెలిపింది. స్వగ్రామం కర్ణాటకలోని జవరిగి ప్రాంతానికి చెందిన 89 ఏళ్ల బోరమ్మ ఇప్పటికి పాదయాత్ర కొనసాగిస్తోంది. కరోనా కారణంగా మధ్యలో రెండేళ్లు విరామం తర్వాత ఇప్పుడు తిరిగి కొనసాగిస్తున్నట్లు చెప్పింది.
ఈ ప్రాంత వాసులతో అందరిని ఆప్యాయంగా పలుకరించుకుంటూ ముందుకు సాగిపోతుంది. ఇళ్ల వారి నుంచి తీపి (చక్కెర) తీసుకుని శ్రీశైల మల్లన్నకు నైవేద్యంగా సమర్పిస్తుంది. ఉగాది పండుగ రోజున మల్లన్నను దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతున్నట్లు తెలిపింది. ప్రాణం ఉన్నంత వరకు పాదయాత్ర చేస్తూనే ఉంటానని, తనను మల్లన్ననే నడిపిస్తున్నారని చెప్పారు. కర్ణాటకకు చెందిన మరో భక్తుడు కాళ్లకు కర్రలను కట్టుకుని పాదయాత్ర చేస్తూ, శ్రీశైలంకు గట్టు మీదుగా వెళ్లాడు.
చదవండి: ‘సిటీ’జనులకు షాక్..! బస్ పాస్ చార్జీలు భారీగా పెంపు
Comments
Please login to add a commentAdd a comment