సాక్షి, యశవంతపుర(కర్ణాటక): బెళగావి జిల్లా కాగవాడ తాలూకా ఐనాపురలో అమ్మవారు కన్ను తెరిచారని ప్రచారం జరగడంతో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. కొన్ని స్థానిక టీవీ చానెళ్లలో కూడా ప్రచారం సాగడంతో జిల్లా అంతటా చర్చనీయాంశమైంది.
ఆశ్చర్యపోయిన కాగవాడ తహశీల్దార్ ప్రమీళా దేశ్‌పాండే ఈ కాలంలో దేవి కన్ను తెరవడం ఏమిటని ఐనాపురకు సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. పూజారి విగ్రహంపై అంటించిన కన్ను రూపాన్ని తహసీల్దార్ తీసేయించారు. దేవుని పేరుతో ప్రజలను మభ్యపెట్టవద్దని పూజారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment