తిరుపతి : తిరుమలలో కొలువు తీరని శ్రీవారిని శనివారం పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి కె.మృణాళిని, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, ఢిల్లీలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు తదితరులు శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వారిని టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారని తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇది ఇలా ఉంటే.. తిరుమలలో శనివారం భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీనివాసుడుని 56,197 మంది భక్తులు దర్శించుకున్నారని... 27,503 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు
Published Sat, Sep 3 2016 9:24 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
Advertisement
Advertisement