తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి దర్శనం కోసం భక్తులు నాలుగు కంపార్టుమెంట్లలో వేచియున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక ప్రవేశదర్శనానికి 2 గంటలు, కాలినడన వచ్చిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.