బీహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు మృతిచెందారు. 35మందికిగాపై గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల్ని రక్షించేందుకు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. అయితే ఈ దుర్ఘటన ఆలయంలో భక్తుల్ని అదుపు చేసే ప్రయత్నం కారణంగా జరిగినట్లు తెలుస్తోంది.
ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో బరావర్ కొండలపై ఉన్న బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయం వద్ద ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలకు భక్తులు భారీ ఎత్తున తరలి వస్తుంటారు. ఎప్పటిలాగే బాబా సిద్ధేశ్వర్ నాథ్ దర్శనార్థం భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు దేవాలయం నిర్వహణ సభ్యులు ఎన్‌సీసీ క్యాడెట్లకు బాధ్యతలు అప్పగించారు.
అయితే పూల విక్రయదారుడితో ఘర్షణ చెలరేగడంతో వాలంటీర్లు లాఠీచార్జి చేశారని ఆలయం వద్ద ఉన్న ఒక భక్తుడు తెలిపారు. ఇది తొక్కిసలాటకు దారితీసిందని, ఆ సమయంలో పోలీసులు ఎవరూ లేరని పేర్కొన్నారు. పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటు చేసుకుందని ఆరోపించారు.
మరోవైపు జనాన్ని నియంత్రించడానికి ఎన్‌సీసీ క్యాడెట్లు లాఠీలను ఉపయోగించడాన్ని జెహనాబాద్ సబ్ డివిజనల్ ఆఫీసర్ (ఎస్‌డిఓ) వికాష్ కుమార్ ఖండించారు. ‘అలాంటిదేమీ జరగలేదు. ఇది దురదృష్టకర సంఘటన. కట్టుదిట్టమైన నిఘా ఉంది. ఎన్‌సీసీ క్యాడెట్లు,సివిల్ డిప్యూటేషన్‌లు మెడికల్ టీమ్‌లతో సహా తగిన ఏర్పాట్లు చేయబడ్డాయి. పోస్ట్‌మార్టం తర్వాత మరిన్ని వివరాలను అందిస్తాని చెప్పారు.
#WATCH | Bihar: Divakar Kumar Vishwakarma, SHO Jehanabad says, "DM and SP visited the spot and they are taking stock of the situation...A total of seven people have died...We are meeting and inquiring the family members (of the people dead and injured)...We are trying to identify… https://t.co/yw6e4wzRiY pic.twitter.com/lYzaoSzVPH
— ANI (@ANI) August 12, 2024
ఘటన జరిగిన మఖ్దూంపూర్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయ ప్రాంతాన్ని జెహనాబాద్ జిల్లా కలెక్టర్ అలంకృత పాండే సందర్శించారు. బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. అలంకృత పాండే పీటీఐతో మాట్లాడుతూ,తొక్కిసలాటకు కన్వారియాల మధ్య జరిగిన వివాదం గొడవకు దారితీసిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment