Constable Beaten to Death in Land Dispute in Bihar - Sakshi
Sakshi News home page

6 అంగుళాల భూమి కోసం దారుణ హత్య.. కాల్‌ చేసినా స్పందించని పోలీసులు!

Published Sun, Jul 30 2023 11:57 AM | Last Updated on Sun, Jul 30 2023 5:31 PM

constable beaten to death in land dispute - Sakshi

బీహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌లో పక్కింటివారితో 6 అంగుళాల భూమి విషయంలో జరిగిన వివాదంలో ఒక జవాను దారుణ హత్యకు గురయ్యాడు. మూడు రోజుల క్రితమే బాధిత కుటుంబ సభ్యులు ఈ  భూవివాదం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో ఇంతటి ఘోరం చోటుచేసుకుంది. 

ముజప్ఫర్‌పూర్‌ జిల్లాలోని కాంటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. యాదూ ఛాప్రా గ్రామ నివాసి దీపేంద్ర కుమార్‌ సింగ్‌(53) బీహార్‌ స్పెషల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌(బీఎస్‌ఏపీ)లో హవల్డార్‌గా పనిచేస్తున్నాడు. పట్నాలో పనిచేస్తున్న దీపేంద్ర సెలవులో తన గ్రామానికి వచ్చాడు. ఇక్కడ పక్కింటివారితో 6 అంగుళాల భూమి విషయంలో వివాదం చోటుచేసుకుంది. 

ఈ విషయమై దీపేంద్ర గత మూడు రోజులుగా పోలీసులకు ఫోసు చేసి చెబుతూనే ఉన్నాడు. అయితే పోలీసులు కనీసంగానైనా స్పందించలేదు. ఇదే తగిన సమయంగా భావించిన పక్కింటివారు దీపేంద్రపై దాడిచేసి హత్య చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే మృతుని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా రహదారిపై ధర్నాకు దిగి ఈ హత్యకు కారకులైనవారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. 

మృతుని బంధువు సంజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ తమ పక్కింటివారైన రాహుల్‌, రాకేష్‌, శివంలు ఆరు అంగుళాల భూమి విషయమై దీపేంద్రతో గొడవపడ్డారన్నారు. దీపేంద్రకు చెందిన 6 అంగుళాల భూమిలో పక్కింటివారు ఏదో నిర్మాణం చేపట్టాలనుకున్నారని, ఈ విషయంలో గొడవ జరగడంతో వారు దీపేంద్రను హత్య చేశారన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి:  విద్యుత్‌ షాక్‌ నుంచి అమ్మాయిని కాపాడిన ఆర్టిఫిషియల్‌ గోళ్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement