పట్నా: బీహార్‌లో డెంగ్యూ వ్యాధి విస్తరిస్తూ, అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పట్నా జిల్లాలో గత 10 రోజుల్లో డెంగ్యూ కారణంగా మొత్తం ఏడుగురు మృతిచెందారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం తాజాగా మృతి చెందిన యువకుని వివరాలిలా ఉన్నాయి.
పాలిగంజ్‌లోని సిగౌరి పోలీస్ స్టేషన్ పరిధిలోని 17 ఏళ్ల సంజీత్ కుమార్ కొన్ని రోజుల క్రితం డెంగ్యూ బారిన పడ్డాడు. దీంతో పీఎంసీహెచ్‌లోని డెంగ్యూ వార్డులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా గత 24 గంటల్లో ఒక్క పట్నా జిల్లాలోనే కొత్తగా 18 మంది డెంగ్యూ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. పట్నా జిల్లాలో ఇప్పటివరకు 538 మంది డెంగ్యూతో బాధపడుతున్న రోగులను గురించారు. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఈ సంఖ్య వెయ్యి దాటింది. బీహార్‌లోని 11 జిల్లాలు డెంగ్యూ బారిన పడ్డాయి. డెంగ్యూ బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పట్నా తర్వాత గయలో అత్యధికంగా 70 డెంగ్యూ కేసులు నమోదయ్యయి.
Comments
Please login to add a commentAdd a comment