ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు | devotee heavy rush in indrakeeladri in vijayawada | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

Published Sat, Oct 8 2016 6:19 AM | Last Updated on Mon, Sep 4 2017 4:40 PM

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

విజయవాడ:  దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు... ఆపై అమ్మవారి జన్మనక్షత్రం మూల. ఈ నేపథ్యంలో శనివారం ఇంద్రకీలాద్రిపై కోలువైన శ్రీకనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఈ రోజు తెల్లవారుజాము 2.00 గంటల నుంచే భక్తులు సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు.

భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో ప్రత్యేక దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల మధ్య వీఐపీ దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఈ రోజు సాయంత్రం దుర్గమ్మకు సీఎం చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలు సమర్శించనున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement