
ఉరికి వేలాడుతోన్న భక్తుడు, కిందికి దించిన అనంతరం భక్తుడి మృతదేహం
పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ గుడిలో గుర్తు తెలియని భక్తుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని చిన్నారుట్ల సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో జరి గింది. స్టేషన్ రైటర్ సురేష్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి పరిశీలించారు. ఎస్‌ఐ రామకోటయ్య కథనం ప్రకారం.. శ్రీశైలం రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఉరేసుకున్న వ్యక్తికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదన్నారు.
మృతుడికి 20 నుంచి 30 ఏళ్లు ఉం టాయి. కాషాయ వస్త్రాలు ధిరించి ఉన్నాడు. శరీరంపై జంధ్యం ఉంది. సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9121102194 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment