forrest office
-
అడవిలో అవినీతి మొక్క
కొల్లాపూర్: విధినిర్వహణలో అవకతవకలు, మొక్కల పెంపకం పేరుతో అక్రమాల కారణంగా కొల్లాపూర్ ఫారెస్టు రేంజర్ తాండ్ర కృష్ణ సస్పెన్షన్‌కు గురయ్యారు. మూడు రోజుల క్రితమే కృష్ణ సస్పెన్షన్‌కు గురైనప్పటికీ విషయం బయటకు పొక్కకుండా సిబ్బంది జాగ్రత్తపడ్డారు. మరోదిక్కు సస్పెన్షన్ల ఎత్తివేత కోసం రేంజర్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మండలంలోని ఎర్రగట్టు బొల్లారంలో గతేడాది చేపట్టిన ప్లాంటేషన్‌లో అవకతవకలకు పాల్పడ్డారని తేలడంతో ఆయనపై సస్పెన్షన్ వేటుపడింది. మొక్కల పెంపకంలో.. గత జూన్‌లో అటవీశాఖ ప్లాంటేషన్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా నార్లాపూర్‌లో 20 హెక్టార్లు, ఎర్రగట్టు బొల్లారంలో 30 హెక్టార్లు, గేమ్యానాయక్‌తండా సమీపంలో 20 హెక్టార్లలో మొక్కలు నాటారు. వీటిపై విజిలెన్స్ బృందం విచారణ జరిపింది. ఎర్రగట్టు బొల్లారంలో ప్లాంటేషన్ కేవలం 12 హెక్టార్లలోనే జరిగిందని, మిగతా భూమిలో ప్లాంటేషన్ చేయకున్నా బిల్లులు చేశారని పేర్కొంటూ ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. జిల్లా అటవీ శాఖాధికారి నేతృత్వంలో మరో బృందం కూడా వచ్చి అక్రమాలు నిజమేనని తేల్చడంతో రేంజర్‌పై వేటుపడింది. ఆయనతోపాటు సెక్షన్ ఆఫీసర్ గాలెన్న, బీట్ ఆఫీసర్ లక్ష్మణ్‌లను సైతం సస్పెన్షన్ చేసినట్లు డీఎఫ్ఓ జోజీ తెలిపారు. రద్దు కోసం పైరవీలు.. సస్పెన్షన్ వేటును రద్దు చేయించుకునేందు కోసం రేంజర్‌తోపాటు సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు పైరవీలు చేపట్టినట్లు తెలిపారు. మంగళవారం వారు హైదరాబాద్‌లో అటవీశాఖ మంత్రి జోగు రామన్న, స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసినట్లు తెలిసింది. తమను ఉద్దేశపూర్వకంగానే బలి చేశారని మొరపెట్టుకున్నట్లు సమాచారం. కొల్లాపూర్ రేంజర్‌గా ఇప్పటికే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందంలో విధులు నిర్వహిస్తున్న వీరేంద్రబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సస్పెన్షన్‌కు గురైన రేంజర్ కృష్ణ సస్పెన్షన్ ఉత్తర్వులు స్వీకరించకపోవడంతో అధికార బదిలీ ఇంకా జరగలేదు. నేతల ఒత్తిళ్ల కారణంగా సస్పెన్షన్లు రద్దవుతాయా లేక యథాతథంగా సస్పెన్షన్లు కొనసాగుతాయా అనేది వేచిచూడక తప్పదు. ఆది నుంచీ వివాదాలే.. కృష్ణ రేంజర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శాఖాపరమైన వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఆయనకు శాఖలో కొందరు ఉద్యోగులు సహకరించడంతో మామూళ్ల పర్వం కూడా పెరిగిందనే విమర్శలున్నాయి. నచ్చిన వారికో న్యాయం, నచ్చని వారికి మరో న్యాయం అనే రీతిలో కార్యాలయ విధులు కొనసాగుతున్నాయి. వెదురు బొంగు నరికివేత, కలప అక్రమ తరలింపు, అలవి వలల వినియోగం వంటి అంశాల్లో ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారనే ఆరోపణలు సైతం బహిరంగంగానే వినిపిస్తున్నాయి. -
అదిగో చిరుత..!
రామయాయంపేట ప్రాంతంలో చిరుతలు రైతుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి బారిన పడి ఇప్పటివరకు మండల పరిధిలోని పలు గ్రామాల్లో 30 వరకు దూడలతోపాటు మేకలు హతమయ్యాయి. మండల పరిధిలో దాదాపు ఏదోఒక చోట ప్రతిరోజూ చిరుత దాడి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. రామాయంపేట(మెదక్): జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో 13 వరకు చిరుతలున్నాయి. వీటిలో రామాయంపేట మండల పరిధిలోనే ఏడుకు పైగా ఉన్నట్లు తెలుస్తున్నా ఆ శాఖ అధికారులు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా బయట పెట్టడం లేదు. చిరుతల బెడదతో రాత్రివేళ రైతులు పంటచేను కాపలాకు వెళ్లడానికి జంకుతున్నారు. అక్కన్నపేట, తొనిగండ్ల, లక్ష్మాపూర్, ఝాన్సిలింగాపూర్, కాట్రియాల, ప్రగతిధర్మారం, పర్వతాపూర్, దంతేపల్లి పరి«ధిలో దట్టమైన అటవీప్రాంతం ఉంది. ఈ అడవిలో చిరుతులు, ఎలుగుబంట్లు, నీల్గాయిలు, రేసు కుక్కలతోపాటు వేల సంఖ్యలో వివిధ రకాల జీవరాశులున్నాయి. ఈ అటవీప్రాంతంలో 13 వరకు చిరుతలున్నట్లు ఇటీవల నిర్వహించిన జంతుగణనలో తేల్చారు. కాట్రియాల, దంతేపల్లి, పర్వతాపూర్, గ్రామాలను మెదక్ అటవీశాఖ పరిధిలో చేర్చగా, మిగతా గ్రామాలు మండల అటవీ రేంజీ పరిధిలోనే ఉన్నాయి. రెండు, మూడు నెలల కాలంగా చిరుతలు దాడిలో పదుల సంఖ్యలో దూడలతోపాటు మేకలు, పశువులు హతమవుతున్నాయి. తొనిగండ్ల గ్రామంలో అత్యధికంగా ఎనిమిది దూడలతోపాటు మూడు మేకలను చిరుతలు హతమార్చాయి. రాత్రి వేళ బయటకు వెళ్లొద్దని దండోరా.. కాగా ఇటీవల చిరుతల దాడులు పెరిగిపోవడంతో రైతులు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. రాత్రివేళ అడవి పందులు, దుప్పిలు పంట చేన్లను ధ్వంసం చేస్తుండటంతో రైతులు ప్రతిరోజూ రాత్రివేళ చేన్ల కాపలాకు వెళ్తుంటారు. రెండు మూడు నెలల కాలంగా చిరుతల దాడులతో రైతులు చేన్ల కాపలాకు కూడా వెళ్లడం మానుకున్నారు. దీంతో పంట చేన్లు అడవి పందులు, దుప్పులు ధ్వంసం చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు రాత్రివేళల్లో పంటచేను కాపలాకు వెళ్లవద్దని ఈమేరకు గ్రామాల్లో దండోరా వేయిస్తున్నారు. బోన్లకు చిక్కని చిరుతలు పశువులు, మేకలపై దాడులు చేస్తూ హతమారుస్తున్న చిరుతలను బంధించడానికిగాను అటవీశాఖ అధికారులు 15 రోజుల క్రితం ఝాన్సిలింగాపూర్, తొనిగండ్ల అటవీ ప్రాంతంలో రెండు బోన్లను ఏర్పాటు చేసి కుక్కలను ఎరగా పెట్టారు. అయినా చిరుతలు మాత్రం చిక్కలేదు. వాటిని బంధించడానికిగాను మరిన్ని బోన్లు అవసరం కాగా, ఆ దిశగా ఆశాఖ అ«ధికారులు నిర్ణయించారు. చిరుతదాడిలో చనిపోయిన లేగదూడ కుక్కను ఎరగా ఏర్పాటు చేసిన బోను కాగా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న వ్యవసాయ బోర్లవద్దకు తాగునీటికోసం వస్తున్న చిరుతలను చూస్తున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా చిరుతలను బందించి తమకు రక్షణ కల్పించాలని వారు పలుమార్లు అటవీశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. చిరుతల దాడిలో మృతిచెందిన అన్ని పశువులు, మేకలకు నష్టపరిహారం అందజేయాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. జీవాలను అడవికి తీసుకెళ్తలేం.. అడవిల పులి తిరుగుతుందనే భయంతో జీవాలను మేతకు అడవిలోకి తీసుకెళ్తలేం. ఇప్పటికే చాలా జీవాలను పులులు చంపినయి. మేతకోసం జీవాలను మన్నెం తరలించినం. ఇక్కడ ఉంచితే ఏం లాభం లేదు. 15 రోజుల కిందట అడవిలో మేతకు వెళ్లిన మందలోనుంచి ఒక మేకను పులి ఎత్తుకపోతుండగా, కాపరి పులిని వెంబడిస్తూ కిందపడి గాయాలపాలయ్యాడు. – భీరయ్య, మేకల కాపరి,తొనిగండ్ల బంధించడానికి ప్రయత్నిస్తున్నాం. తరచూ పశువులపై దాడులకు పాల్పడుతున్న చిరుతలను బంధించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ మేరకు రామాయంపేట పరిధిలో రెండు బోన్లను ఏర్పాటు చేసినా అవి చిక్కలేదు. మరిన్ని బోన్లను ఏర్పాటు చేస్తాం. బాధిత రైతులకు నష్టపరిహారం అందజేయడానికి కృషి చేస్తున్నాం. ఈమేరకు కొందరికి నష్టపరిహారం ఇప్పడికే అందించాం. రాత్రి వేళల్లో రైతులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. – పద్మాజారాణి, జిల్లా అటవీ అధికారి -
గుడిలో ఉరేసుకుని భక్తుడి ఆత్మహత్య
పెద్దదోర్నాల: నల్లమల అటవీ ప్రాంతంలోని ఓ గుడిలో గుర్తు తెలియని భక్తుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదివారం శ్రీశైలం ఘాట్‌రోడ్డులోని చిన్నారుట్ల సమీపంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో జరి గింది. స్టేషన్ రైటర్ సురేష్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి పరిశీలించారు. ఎస్ఐ రామకోటయ్య కథనం ప్రకారం.. శ్రీశైలం రోడ్డులో ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఉరేసుకున్న వ్యక్తికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. మృతుడికి 20 నుంచి 30 ఏళ్లు ఉం టాయి. కాషాయ వస్త్రాలు ధిరించి ఉన్నాడు. శరీరంపై జంధ్యం ఉంది. సంఘటన శనివారం అర్ధరాత్రి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9121102194 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. -
‘సీతారామ’కు తొలి దశ అనుమతి
సాక్షి, హైదరాబాద్ : సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు తొలి దశ (స్టేజ్–1) అటవీ అనుమతులు లభించాయి. ప్రాజెక్టు పరిధిలో 1,531 హెక్టార్ల (3,827.5 ఎకరాలు) అటవీ భూముల సేకరణకు సంబంధించిన అనుమతులను కేంద్ర అటవీ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయం మంజూరు చేసింది. శుక్రవారం చెన్నైలో జరిగిన అటవీ, పర్యావరణ సాధికార కమిటీ సమావేశంలో సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదనలపై ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సుధాకర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డాక్టర్ ఎం.ఆర్.జి.రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఈ కమిటీ.. సీతారామ ప్రాజెక్టు ప్రతిపాదనలను క్షుణ్నంగా పరిశీలించి కేంద్రానికి సానుకూలంగా సిఫారసు చేసింది. దీంతో అటవీ భూములను ఇరిగేషన్ శాఖకు బదిలీ చేయడానికి లైన్ క్లియర్ అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, కొత్తగూడెం అటవీ డివిజన్లలోని 1,201 హెక్టార్లు, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, ఖమ్మం అటవీ డివిజన్లలోని 330 హెక్టార్ల అటవీ భూమిని ఇరిగేషన్ శాఖకు బదలాయించేందుకు కేంద్రానికి అటవీ, పర్యావరణ ప్రాంతీయ కార్యాలయం సిఫార్సు చేస్తుంది. ప్రాజెక్టులోని పైపులైన్లు, గ్రావిటీ కాల్వలు, వాటిపై నిర్మాణాలు, విద్యుత్ లైన్లు, డిస్ట్రిబ్యూటరీలు, టన్నెళ్లు నిర్మించడానికి ఈ అటవీ భూములు అవసరమవు తున్నాయి. 175 ఎకరాలు తగ్గింపు.. సీతారామ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యత ప్రాజెక్టుగా పరిగణి స్తోంది. ఈ కాలువ నిర్మాణం కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో 114 కిలోమీటర్ల మేర అటవీ భూముల నుంచి వెళ్తోంది. ఇందుకోసం 1,602 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టుకు బదలాయిం చాలని సాగునీటి పారుదల శాఖ తొలుత కోరింది. దీనిపై అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి శోభతో పాటు అధికారుల బృందం ఇటీవల వారంపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించింది. 9 అటవీ డివిజన్ల పరిధిలో భూములు, ప్రాజెక్టు కాలువ అలైన్మెంట్, వన్య ప్రాణు లు సంచరించే ప్రాంతాలు, అటవీ సంపదపై ప్రభావాల్ని పరిశీలించింది. అలైన్మెంట్, టన్నెళ్ల ప్రకారం లెక్కలు వేసిన అధికారులు బదలాయించే అటవీ భూమిని 1,531 హెక్టార్లుగా నిర్ధారించారు. ఫలితంగా బదలాయించే అటవీ భూమి 71 హెక్టార్లు (175 ఎకరాలు) తగ్గింది. పనులు వేగిరం: హరీశ్ సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు లభించడంపై ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు. రెండో దశ అనుమ తుల ప్రక్రియకు కృషి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఎకో సెన్సి టివ్ జోన్‌లోని 275 హెక్టార్లకు (688 ఎకరాలు) కేంద్ర వన్యప్రాణి బోర్డు అనుమ తి కోసం కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు చెందిన భూసేకరణ, అటవీ, పర్యావరణ, వన్యప్రా ణి అనుమతులు, పంప్ హౌజ్‌లు, కెనాల్స్, ఇతర పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు ఇంకా వేగంగా జరగాలని సూచించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా 4,050 ఎకరాలను కొత్తగూడెం, ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో గుర్తించామని, ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిపారు. ప్రత్యామ్నాయ అటవీ భూముల్లో అడవులు పెంచేందుకు అవసరమయ్యే నిధులను అంచనా వేసి ఇరిగేషన్ శాఖకు వెంటనే సమర్పించాలని అటవీ శాఖను కోరారు. -
జాతీయజెండాకు అవమానం
లింగంపేట,న్యూస్‌లైన్ : లింగంపేట మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం వద్ద ఆది వారం ఉదయం జాతీయ జెండాకు అవమానం జరిగింది. డిప్యూటీ రేంజ్ అధికారి చంద్రకాంత్‌రెడ్డి జెండాను ఎగురవేయగా జెండా కు చివరకు ఉంచిన వైరుతీగ తెగిపోవడం తో జాతీయ పతాకం కింద పడిపోయింది. వెంటనే అటవీ అధికారులు జెండాను తిరిగి ఎగుర వేయడానికి ప్రయత్నించారు. అయితే అక్కడే ఉన్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు జాతీయ జెండాను అవమానిస్తారా అంటూ డిప్యూటీ రేంజర్‌తో వాగ్వాదానికి దిగారు. అటవీ అధికారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహిద్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తలకిందులుగా జెండాను ఎగరవేసిన తహశీల్దార్ కోటగిరి,న్యూస్‌లైన్: కోటగిరిలో అధికారులు,నాయకుల సమక్షంలోనే జాతీయ జెండాకు అవమానం జరిగింది. మండల తహశీల్ కా ర్యాలయం వద్ద తహశీ ల్దార్ మోహన్ జాతీయజెండాను తలకిందులు గా ఎగురవేశారు. జెం డాలో ఉన్న మూడురంగుల్లో కాషాయం పైభాగంలో మధ్యలో తెలుపు, పచ్చరంగు కిందకు ఉండేలా జాతీయజెండాను ఎగురవేస్తారు. కాని తహశీల్దార్ నిర్లక్ష్యం వల్ల జెండా తలకిందులుగా ఎగురుతున్న జెండాకు తహశీల్దార్‌తో సహా రెవెన్యూ, మండల,పోలీసు అధికారులు,పలువురు రాజకీయ ప్రముఖులు వందనం చేయడం గమనార్హం. ఇది గమనించిన కొందరు జనగణమన పూర్తిగాకుండానే జెండాను కిందికి దింపడం విశేషం.